»   » ‘బిగ్ బాస్’ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఎన్టీఆర్, ఆ ముగ్గురూ సేఫ్!

‘బిగ్ బాస్’ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఎన్టీఆర్, ఆ ముగ్గురూ సేఫ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'బిగ్ బాస్' తెలుగు రియాల్టీ షో విజయవంతంగా మూడో వారంలోకి అడుగు పెట్టింది. బిగ్ బాస్ ఇస్తున్న ఊహించని టాస్క్‌లతో షో విభిన్నంగా సాగుతోంది. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న వీకెండ్ షోలకు వీక్ డే షోల కంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది.

శనివారం(ఆగస్టు 5)న 'బిగ్ బాస్' తెలుగు షో మరో కొత్త లెవల్‌కి చేరుకుంది. ఈ రోజు ఎన్టీఆర్ అతి ముఖ్యమైన ప్రకటన చేశారు. ఈ ప్రకటన ద్వారా ఇటు ఆడియన్స్‌లో ఆసక్తి పెంచడంతో పాటు అటు షోలో పాల్గొన్న పోటీ దారుల్లో గేమ్ మరింత కసిగా ఆడాలనే ఉత్సాహాన్ని నింపారు.

ప్రైజ్‌మనీ ప్రకటించిన ఎన్టీఆర్

ప్రైజ్‌మనీ ప్రకటించిన ఎన్టీఆర్

‘బిగ్ బాస్' షో అలా సాగిపోతోంది..., చివరకు ఎవరో ఒకరు విజేతగా నిలుస్తారనే విషయం తెలుసు కానీ, విజేతలకు ఏం గిఫ్టు ఇస్తారు? ఎంత అమౌంట్ ప్రైజ్ మనీగా ఇస్తారు? అనే విషయాలు మాత్రం ఇప్పటి వరకు అఫీషియల్‌గా వెల్లడించలేదు. ఎట్టకేలకు ఇందుకు సంబంధించన వివరాలు ప్రకటించారు ఎన్టీఆర్. విజేతలకు రూ. 50 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

పోటీదారుల్లో ఉత్సాహం

పోటీదారుల్లో ఉత్సాహం

‘బిగ్ బాగ్' షో ప్రైజ్ మనీ వివరాలు ప్రకటించగానే పోటీ దారుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ డబ్బు గెలిస్తే ఏం చేస్తారు? అనే ప్రశ్నకు పోటీ దారుల నుండి సమాధానాలు రాబట్టారు ఎన్టీఆర్. సొంతిల్లు కొనుక్కుంటామని కొందరు, అమ్మ చేతిలో పెడతామని మరికొ కొందరు, ఇన్వెస్ట్ చేస్తామని కొందరు ఇలా రకరకాలుగా సమాధానం చెప్పారు.

రాఖీ సెలబ్రేషన్స్, ఏడ్చేసిన కార్తీక

రాఖీ సెలబ్రేషన్స్, ఏడ్చేసిన కార్తీక

బిగ్ బాస్ పోటీ దారు కత్తి కార్తీక ‘బిగ్ బాస్' ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ నిర్వహించింది. అందరికీ రాఖీ కట్టి వారి దీవెనలు అందుకుంది. అదే సమయంలో ప్రతి ఏటా తన ఇంటి వద్ద జరిగే రాఖీ సెలబ్రేషన్స్ తలుచుకుని, ఇపుడు తన అన్నలకు, తమ్ముళ్లకు దూరంగా ఉండటం బాధా ఉందంటూ కాస్త ఎమోషన్ అయి ఏడ్చేశారు.

ఫన్నీ గేమ్

ఫన్నీ గేమ్

ఈ సందర్భంగా ఎన్టీఆర్ బిగ్ బాస్ ఇంటి సభ్యులతో ఓ ఫన్నీ గేమ్ ఆడించారు. మనిషి‌లోని అవ లక్షణాలైనా అహకారం, కోపం, చాడీలు చెప్పడం, కన్నింగ్... ఇలాంటి 20 రకాల లక్షణాలు ఎవరిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి అనే విషయాలను హౌస్ మేట్స్ ద్వారానే చెప్పించేలా చీటీల గేమ్ ఆడించారు. ఈ గేమ్ సరదాగా, ఇంట్రెస్టింగ్‌గా సాగింది.

ఎలిమినేషన్లో

ఎలిమినేషన్లో

ఈ వారం మొత్తం సిక్స్ మెంబర్స్ ఎలిమినేషన్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వారిలో ధనరాజ్, మహేష్ కత్తి, శివా బాలాజీ, కల్పన, సమీర్, ముమైత్ ఖాన్ ఉన్నారు.

సాదా సీదాగా సాగిన షో

సాదా సీదాగా సాగిన షో

బిగ్ బాస్ తెలుగు షో శనివారం ఎపిసోడ్ ఎలాంటి ట్విస్టులు, థ్రిల్లింగ్ అంశాలు లేకుండా సాదా సీదాగా సాగింది. ఈ ఎపిసోడ్లో హైలెట్ అయిన అంశం ఎన్టీఆర్ ప్రకటించిన రూ. 50 లక్షల ప్రైజ్ మనీకి సంబంధించిన విషయాలే.

ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ముగ్గురు సేఫ్

ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ముగ్గురు సేఫ్

ధనరాజ్, మహేష్ కత్తి, శివ బాలాజీ ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా సేఫ్ జోన్లోకి వెళ్లినట్లు ఎన్టీఆర్ ప్రకటించారు. మిగిలిన ముగ్గురు సభ్యులైన కల్పన, సమీర్, ముమైత్ ఖాన్‌లలో ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అనేది ఆదివారం జరిగే షోలో తెలియజేస్తాం అంటూ బిగ్ బాస్ ఇంటి సభ్యులతో పాటు, ఇటు ప్రేక్షకులను టెన్షన్లో పడేసి షో ముగించారు.

English summary
Bigg Boss Telugu Prize Money announced. NTR said Winner Will Get 50 Lakh. NTR ended this Saturday’s episode without revealing the name of the contestant who will be eliminated among Sameer, Kalpana and Mumaith Khan and not getting that Rs. 50 lakh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu