For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss 5 Promo: హమీదాతో శ్రీరామ్ రొమాంటిక్‌గా.. నీకు ఆ ఫీలింగ్స్ లేవా అని ఆమె అడగ్గానే!

  |

  తెలుగులో బిగ్ బాస్ షోకు దక్కినంత ఆదరణ మరే కార్యక్రమానికి రావడం లేదు. అందుకే ఈ రియాలిటీ షో సూపర్ డూపర్ హిట్‌ అవుతూ సీజన్ల మీద సీజన్లు పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే తెలుగు నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుందీ షో. ఈ క్రమంలోనే ఎంతో మందిని జంటలుగా మార్చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఐదో సీజన్ కూడా ప్రారంభం అయిపోయింది. ఇక, ఇందులో ఎవరు ప్రేమలో పడతారన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా బిగ్ బాస్ నిర్వహకులు హమీదా, సింగర్ శ్రీరామ చంద్ర మధ్య జరిగిన ఓ రొమాంటిక్ సన్నివేశాన్ని హైలైట్ చేశారు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీకోసం!

  అన్నింటినీ మించేలా ఐదో సీజన్

  అన్నింటినీ మించేలా ఐదో సీజన్

  ఏమాత్రం పరిచయం లేని కాన్సెప్టుతో నడిచేదే అయినా.. తెలుగులో బిగ్ బాస్ షో నాలుగు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. అది కూడా నేషనల్ లెవెల్ భారీ రేటింగ్‌తో. అందుకే మన షోకు దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో దాన్ని కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన ఐదో సీజన్‌లో సరికొత్త ప్రయోగాలు చేయబోతున్నారు.

  సుమ షోలో సంచలన సంఘటన: నిజంగా తిట్టుకున్న జబర్ధస్త్ భామలు.. కెమెరాలు ఉన్నా కిందపడి మరీ!

  మొదటిరోజే గొడవలు జరగడంతో

  మొదటిరోజే గొడవలు జరగడంతో

  బిగ్ బాస్ షోకు ఆదరణ పెరగడానికి అందులో కనిపించే సన్నివేశాలే కారణం. మరీ ముఖ్యంగా షోలో జరిగే గొడవలను ప్రేక్షకుల ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభ ఎపిసోడ్‌లోనే జరిగిన నామినేషన్స్ టాస్క్ గొడవలతో సాగింది. ఆ తర్వాత అంటే మంగళవారం జరిగిన ఎపిసోడ్‌ సైతం పలువురి వాగ్వాదాలతో హాట్ హాట్‌గా సాగిపోయింది. దీంతో షోపై ఆసక్తి పెరిగిపోయింది.

  లవ్ ట్రాకులపై అందరిలో ఆసక్తి

  లవ్ ట్రాకులపై అందరిలో ఆసక్తి

  తెలుగులోనే కాదు.. అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ షోకు ఆదరణ దక్కుతుందంటే అందులో కనిపించే లవ్ ట్రాకులు కూడా ప్రధాన కారణం అనే చెప్పాలి. అందుకే నిర్వహకులు ప్రతి సీజన్‌లోనూ కొందరిని జంటలుగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు. దీంతో ప్రేక్షకులకు ఇవి బాగా నచ్చుతున్నాయి. ఇప్పటికే ఇలా ఎంతో మంది బిగ్ బాస్ జోడీలు అనిపించుకున్నారు. తద్వారా భారీ స్థాయిలో పాపులర్ కూడా అయ్యారు.

  Bigg Boss Telugu 5: ఆమెను టార్గెట్ చేసిన అభిజీత్ ఫ్యాన్స్.. ఆ వీడియోలు షేర్ చేసి మరీ దారుణంగా!

  ఐదో సీజన్‌లో ఎవరిని కలుపుతారు

  ఐదో సీజన్‌లో ఎవరిని కలుపుతారు

  తెలుగులో ఇప్పటి వరకూ జరిగిన ప్రతి సీజన్‌లోనూ కనీసం ఒక్క జంట అయినా ఫేమస్ అయింది. దీంతో బిగ్ బాస్ నిర్వహకులు తాజాగా మొదలైన ఐదో సీజన్‌లో ఎవరిని జోడీగా చేయబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చ కూడా బిగ్ బాస్ హౌస్‌లో కనిపించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ అంశం మీద ఎక్కువగా పడిందని చెప్పొచ్చు.

  ఎలాంటి అమ్మాయి కావాలంటూ

  ఎలాంటి అమ్మాయి కావాలంటూ

  బిగ్ బాస్ షోలో బుధవారం రాత్రి ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా తాజాగా విడుదల చేసింది. ఇందులో సింగర్ శ్రీరామ చంద్రను ఆర్జే కాజల్ నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటూ ప్రశ్నించడాన్ని చూపించారు. ఆమె అడిగిన ప్రశ్నకు సదరు కుర్రాడు ‘నాకు జోవియల్‌గా, బబ్లీగా ఉన్న అమ్మాయి ఇష్టం' అని బదులిచ్చాడు. దీంతో వెంటనే హమీదాను చూపించారు.

  Bigg Boss Telugu 5: బిగ్ బాస్‌లో వింత ట్రాక్.. అతడిపై మనసు పడ్డ ప్రియాంక.. అందరి ముందే ఆ మాట!

  హమీదాతో శ్రీరామ్ రొమాంటిక్‌గానే

  శ్రీరామ చంద్ర తనకు నచ్చే క్వాలిటీల గురించి చెప్పగానే.. ప్రోమోలో అతడు హమీదాతో రొమాంటిక్‌గా మాట్లాడుతున్న సన్నివేశాన్ని చూపించారు. ఇక, ఇందులో హమీదా తన బాధలను చెప్పుకుంటూ ఉండగా.. శ్రీరామ్ ఆమెకు విలువైన సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో ఇద్దరూ పలుమార్లు రొమాంటిక్‌గా చూసుకుంటారు. ఆ సమయంలో ఓ లవ్‌లీ సాంగ్‌ను ప్లే చేశారు షో నిర్వహకులు.

  Maha Samudram Movie Team On 'Cheppake Cheppake' Song
  నీకు ఆ ఫీలింగ్స్ లేవా అని అడగ్గా

  నీకు ఆ ఫీలింగ్స్ లేవా అని అడగ్గా

  ఈ వీడియోలో శ్రీరామ్‌తో ‘నా ఫ్రెండ్స్ నీకు ఫీలింగ్స్ లేవా అని నన్ను అంటారు. ఇక్కడ మాత్రం ఎవరూ మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం లేదు' అని చెబుతుంది. అప్పుడతను ‘ఇక్కడ నీకు ఎవరూ లేరు కాబట్టి.. ఫీలింగ్స్ బయటకు రావడం లేదు. అందుకే లోపలే ఉండిపోతున్నాయి. ఎవరికి చెప్పాలో తెలుసుకుని త్వరగా చెప్పుకో. ఎందుకంటే అప్పుడు 10 జీబీ ఉంటే.. ఇప్పుడు 100 జీబీ ఫీలింగ్స్ ఉంటాయి' అని బదులిచ్చాడు.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Upcoming Episode.. Hamida Romantic Chat with Sreerama Chandra.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X