For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: ప్రియాంకకు రామ్ చరణ్ బంపర్ ఆఫర్.. నిహారిక పేరు చెప్పగానే ప్రామిస్.. హమీదాకు కూడా!

  |

  తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో ఛానెళ్లు అన్నీ పంథాను మార్చుకుని సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఎన్నో ప్రోగ్రామ్‌లను పరిచయం చేస్తున్నాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్ ఒకటి. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా దీనికి మన ప్రేక్షకుల మంచి స్పందనను అందించారు. ఫలితంగా ఇది నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది.

  ఇక, ఇటీవలే మొదలైన ఐదో సీజన్ కూడా అదిరిపోయే రెస్పాన్స్‌తో సాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్టుగా వచ్చాడు. ఈ క్రమంలోనే ప్రియాంక సింగ్ అతడి ముందు ఓ కోరికను ఉంచగా.. వెంటనే ఆమెకు ఆఫర్ ఇచ్చేశాడు. ఆ వివరాలు మీకోసం!

  అంచనాలతో ఐదో సీజన్.. అదుర్స్

  అంచనాలతో ఐదో సీజన్.. అదుర్స్

  ఇండియాలోని మిగిలిన భాషలతో పోల్చితే తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్‌కు మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. సామాన్యులే కాదు.. దీనికి సెలెబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయారు. ఫలితంగా ఈ షోపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఐదో సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. దీన్ని కూడా కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ సీజన్ అంచనాలకు తగ్గట్లుగానే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. అందుకే ఐదో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ కూడా వచ్చింది.

  Bigg Boss: షోలో శృతి మించిన రొమాన్స్.. పక్క పక్కన పడుకుని ఆ భాగాలను తాకుతూ దారుణంగా!

  ఈ సీజన్‌లో స్పెషల్ కంటెస్టెంట్‌గా

  ఈ సీజన్‌లో స్పెషల్ కంటెస్టెంట్‌గా

  బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఈ సారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో ప్రియాంక సింగ్ స్పెషల్ అట్రాక్షన్ అయిన విషయం తెలిసిందే. జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ మంచి గుర్తింపును అందుకున్న సాయితేజ.. జెండర్‌ను మార్చుకోవాలన్న కోరికతో ఆ తర్వాత సర్జరీ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు. ఆ సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. ఇలాంటి సమయంలో ప్రియాంక సింగ్‌కు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. హౌస్‌లోకి ఆటతో పాటు వ్యవహార శైలితో ఆకట్టుకుంటూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

  ప్రియాంకకు నాగబాబు మద్దతుగా

  ప్రియాంకకు నాగబాబు మద్దతుగా

  బిగ్ బాస్ షోపై సామాన్య ప్రేక్షకుల్లోనే కాకుండా.. సెలెబ్రిటీల్లోనూ ఆసక్తి బాగా ఉంటోంది. అలా ఈ షోను ఫాలో అయ్యే వారిలో మెగా బ్రదర్ నాగబాబు ఒకరు. ప్రతి సీజన్‌నూ చూసిన ఆయన.. పలువురు కంటెస్టెంట్లకు మద్దతు కూడా ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతోన్న ఐదో సీజన్‌లో ప్రియాంక సింగ్‌కు నాగబాబు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేసి పలు విషయాలు వెల్లడించారు. అంతేకాదు, జబర్ధస్త్ సాయి తన బిడ్డలాంటి వాడని చెప్పారు. గెలిపించకపోయినా.. హౌస్‌లో ఉండేలా చూడమని ప్రేక్షకులను కోరారు.

  బూతులతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి: ఆ శృంగారం ఎలా చేస్తారో వివరిస్తూ వీడియో.. అక్కలు, ఆంటీల కోసమే అంటూ!

  బిగ్ బాస్ స్టేజ్‌పై రామ్ చరణ్ రచ్చ

  బిగ్ బాస్ స్టేజ్‌పై రామ్ చరణ్ రచ్చ

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు అంబాసీడర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున శనివారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌లో స్వయంగా ప్రకటించారు. అంతేకాదు, ఓ ప్రోమో వీడియోను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత చరణ్‌ను బిగ్ బాస్ స్టేజ్‌పైకి ఆహ్వానించారు. అప్పటి నుంచి తనదైన శైలి స్టైల్స్‌తో ఈ మెగా హీరో ఆకట్టుకున్నాడు. అలాగే, నాగార్జునతో కలిసి ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ గురించి పలు రకాల కొత్త అంశాలను అందరికీ తెలియజేశాడు.

  హౌస్‌మేట్స్‌తో చిట్ చాట్.. అందరి

  హౌస్‌మేట్స్‌తో చిట్ చాట్.. అందరి

  బిగ్ బాస్ స్టేజ్‌పైకి వెళ్లిన తర్వాత రామ్ చరణ్ ఎంతో జోష్‌తో కనిపించాడు. ఈ క్రమంలోనే నాగార్జున హౌస్‌మేట్స్ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ అతడిని తీసుకొచ్చాడు. ఆ తర్వాత హౌస్‌లో ఉన్న ప్రతి కంటెస్టెంట్‌ను నాగార్జున అతడికి పరిచయం చేశాడు. ఆ సమయంలో ఒక్కొక్కరి గురించి చెర్రీ చక్కగా మాట్లాడాడు. ఈ క్రమంలోనే అతడితో ఉన్న అనుబంధాన్ని కూడా పలువురు వెల్లడించారు. అదే సమయంలో చరణ్ కూడా తనకు పరిచయం ఉన్న కంటెస్టెంట్ల గురించి చెప్పాడు. అదే సమయంలో అందరికీ ఆల్‌ ది బెస్ట్ అని కూడా చెప్పి ఉత్సాహాన్ని పెంచేశాడు.

  Bigg Boss: రెండో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. ఆమె మాత్రం పైపైకి!

  ప్రియాంకకు రామ్ చరణ్ ప్రామిస్

  ప్రియాంకకు రామ్ చరణ్ ప్రామిస్

  శనివారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ మన టీవీ ద్వారా కంటెస్టెంట్లతో మాట్లాడుతోన్న సమయంలో ప్రియాంక సింగ్ 'రామ్ చరణ్ గారూ.. మీకు నేను పెద్ద అభిమానిని. గతంలో నాగబాబు సార్‌ను, నిహారిక అక్కను మిమ్మల్ని కలవడానికి సహాయం చేయమని అడిగాను. కానీ కుదరలేదు' అని అంది. అప్పుడు మెగా పవర్ స్టార్.. 'ఏం పర్లేదు. మీరు బయటకు వస్తారు కదా. అప్పుడు కలుద్దాం. ఫొటో దిగుదాం' అంటూ అందరి ముందే ఆమెకు ప్రామిస్ చేశాడు. దీంతో ప్రియాంక ఎంతగానో సంతోషించింది. చెర్రీ తీరుకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

  హమీదాతో కూడా అలాంటి మాటే

  హమీదాతో కూడా అలాంటి మాటే

  కంటెస్టెంట్లతో మాట్లాడుతోన్న సమయంలోనే హమీదా 'నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో మిమ్మల్ని షూటింగ్ స్పాట్‌లో చూశాను. అప్పుడు మిమ్మల్ని కలవాలని, మీతో ఫొటో దిగాలని అనుకున్నాను. కానీ, ఇప్పటి వరకూ అలాంటి అవకాశమే రాలేదు' అని అతడితో చెప్పింది. అప్పుడు రామ్ చరణ్ 'సరే సరే.. మీరు ముందు బిగ్ బాస్ షోను సక్సెస్‌ఫుల్‌గా చేసుకోండి. బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని కచ్చితంగా కలుస్తాను. అప్పుడు మీరు నాతో ఫొటో దిగడం కాదు.. నేనే మీతో దిగుతాను' అంటూ చెప్పాడు. దీంతో హమీదా ఆనందానికి అవధులు లేవు.

  English summary
  Bigg Boss is the Telugu Top Rreality TV Series Recently Started 5th Season. In Recent Episode.. Ram Charan Gave Bumper Offer to Priyanka Singh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X