చావు బతుకుల్లో తల్లి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ పోటీకి హాజరు.. నవదీప్ ఫైర్

బుల్లితెర ప్రేక్షకుల్లో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 9 ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా? అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సీజన్ 9కి సంబంధించిన కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అగ్నిపరీక్ష పేరుతో కంటెస్టెంట్స్ ను ఆడిషన్ చేస్తున్నారు. ఈ క్రమంలో స్పెషల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోస్ ను బ్యాక్ టు బ్యాక్ విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆగస్టు 22న మొదటి ఎపిసోడ్ ను ప్రసారం చేశారు.

ఈ క్రమంలో బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఎంతో పోటీని దాటుకొని వచ్చిన వారి జీవిత గాధలను బిగ్ బాస్ తెలుగు అగ్రి పరీక్ష జడ్జీలు వింటున్నారు. కాగా, ఒక లేడీ కంటెస్టెంట్ చెప్పిన మాటలు అందరినీ కంటనీరు పెట్టిస్తున్నాయి. ఒక్కొక్కరి కథ ఒక్కోలా ఉండటం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది. ఇక లేడీ కంటెస్టెంట్ తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతూ జడ్జీలను భాగోద్వేగానికి గురి చేసింది. మరో కంటెస్టెంట్ కూడా తన తల్లి గురించి చెప్పుకుంటూ బాధపడటం అందరినీ కలిచి వేస్తోంది.

Bigg Boss Telugu Season 9 Agnipariksha

లేటెస్ట్ ఎపిసోడ్ లోని వివరాల్లోకి వెళితే.. యూట్యూబర్ ఒకరు మాట్లాడుతూ జీవితంలో నయం లేని ఒక వ్యాధి మా అక్కకు వచ్చింది. ఆ వ్యాధి పేరు ఎస్ఎల్ఏ. ఆ వ్యాధితో మా అక్క జీవితం చిన్నాభిన్నం అయ్యింది. ఆమెను కాపాడటానికి ఎన్నో పనులు చేస్తూ వచ్చాను అని చెప్పారు. ఇక మరో యూట్యూబర్ మాట్లాడుతూ మా అమ్మ ప్రపంచంలోనే అద్భుతమైన అమ్మ అని నేను నమ్ముతున్నాను. మా డాడీ చనిపోయిన తర్వాత మాకు ఎలాంటి ఎమోషనల్ సపోర్ట్ లేదు. మా జీవితాలను నిలబెట్టడం కోసం మా అమ్మ 9 టు 5 ఉద్యోగం చేసి, మళ్లీ సాయంత్రం 6 టు 11 బండి వద్ద పనిచేస్తారని అతను చెప్పడంతో జడ్జీలు ఎమోషనల్ అయ్యారు. వాళ్ల అమ్మకు ప్రత్యేకంగా బిగ్ బాస్ తరుఫున సెల్యూట్ చేశారు.

ఇక మరో లేడీ కంటెస్టెంట్ మాట్లాడుతూ.. కొందరు మగవాళ్లు ఉన్నారు. వాళ్లు నన్ను వేధించారు. అమ్మాయిలు ఎమోషనల్ గా ఎంత స్ట్రాంగో, మెంటల్ గా ఎంత స్ట్రాంగో, ఫిజికల్ గా కూడా అంత స్ట్రాంగ్ గా ఉండాలి. లేకపోతే ఎవరూ మనల్ని కాపడటానికి రానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఒక మరో లేడీ కంటెస్టెంట్ మాట్లాడుతూ మా అమ్మ ప్రస్తుతం క్యాన్సర్ పేషెంట్. ఇప్పుడు మూడోసారి ఆమె ఆ వ్యాధికి గురయ్యారు. ఇప్పటికీ ఆమె డెడ్ బెడ్ పైనే ఉంది.

నా తల్లి చావు బతుకుల్లో ఉందంటూ లేడీ కంటెస్టెంట్ తన తల్లి గురించి చెప్పుకొచ్చింది. దీంతో జడ్జీలు అందరూ షాక్ అయ్యారు. మీ తల్లి చావు బతుకుల్లో ఉండగా మీ అమ్మ పక్కన ఉండటం కంటే కూడా బిగ్ బాస్ హౌజ్ లోకి రావడానికి పోటీలో పాల్గొనడం ముఖ్యమా? అని జడ్జీ నవదీప్ ఆమెను ప్రశ్నించారు. ఇక ఆమె ఎలాంటి సమాధానం ఇచ్చిందనేది అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2లో ప్రసారం కానుంది. ఇలా ఒక్కొక్కరి కథ ఒక్కోలా ఉండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X