బిగ్‌బాస్ 9 హౌజ్‌లో సెలెబ్రెటీ కంటెస్టెంట్స్ కుట్ర.. గుట్టు విప్పిన మర్యాద మనీష్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రియాలిటీ గేమ్ షో ప్రస్తుతం ఆసక్తికరంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ షో ప్రస్తుతం 3 వారాలను పూర్తి చేసుకుంది. 9 మంది సెలబ్రెటీలు, 6గురు కామనర్స్ కలిపి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్‌గా హౌజ్ లోకి అడుగుపెట్టారు. తనూజా పుట్టస్వామి, సంజన గల్రానీ, ఆశా షైనీ, రీతూ చౌదరి, భరణి శంకర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి, శ్రష్టీ వర్మ సెలబ్రెటీ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. హరిత హరీష్, మర్యాద మనీష్, డిమోన్ పవన్, పడాల పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి, దమ్ము శ్రీజలు కామనర్స్‌గా అవకాశం దక్కించుకున్నారు. వీరిలో శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, సంజనా గల్రానీలు ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వత మర్యాద మనీష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌజ్ లో కామనర్స్ మధ్య పెద్దగా యూనిట్ లేదు. నాకు గేమ్ బిర్యానీ విషయంలో సుమన్ అన్నతో గొడవ అయ్యింది. అసలు కారణం అది కాదు. బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒకేసారి మమల్ని ఓనర్లు చేశారు. ఇక సెలెబ్రెటీలను టెనెంట్స్ ను చేశారు. వారికి ఎలాంటి ఫుడ్, లగ్జరీస్ ఇవ్వలేదు. దీంతో వాళ్ల ఫీలింగ్స్ బాయిల్డ్ అయ్యాయి. అందుకే ఏదోక విషయంలో గొడవ పెట్టుకోవాలని ప్రయత్నించారు. ఆ విషయంలో ఎగ్ బిర్యానీ విషయంలో గొడవ జరిగింది. ఇక ముఖ్యంగా కామనర్స్ లో యూనిటీ అస్సలు లేదు. నేను వచ్చే వరకు ఇది గమనించాను.

Bigg Boss Telugu Season 9 Commenor Maryada Manish Ravealed Big Secret about Celebrity contestants

సెలెబ్రెటీ కంటెంట్స్ మాత్రం చాలా ప్లాన్డ్ గా ఉన్నారు. వాళ్లు చేయాలనుకున్న పనులు, ప్లాన్స్ ను సరిగ్గా అమలు చేస్తున్నారు. ఈ విషయం తెలియని కామర్స్ గా ఉన్న మేము వాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం. అడ్డుకోవాల్సింది పోయి చేయనిస్తున్నాం. ఇక సెలబ్రెటీల మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. కానీ అవి బయటికి రాకుండా వాళ్లు చాలా జాగ్రత్త పడుతున్నారు. ఆ విషయం మాకు అస్సలు తెలియదు. హౌజ్ లో రెండు విషయాలు జరుగుతున్నాయి. రూల్స్ విరుద్ధంగా గేమ్స్ ఆడుతున్నారు. అసలు టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ గా గేమ్ ఆడాలని అందరూ మర్చిపోయారు.

ఇక కొందరు సెలెబ్రెటీలు, కామనర్స్ టీమ్ లుగా మారారు. మరోవైపు సెలబ్రెటీలలోనూ టీమ్ లు ఉన్నాయి. టాస్క్ లు ఓనర్స్ గా, టెనెంట్స్ గా వచ్చినప్పుడు టీమ్ గేమ్ ఆడండి, వేరే వాటిలో ఇండివిజువల్ గా ఆడండి. అంతే కానీ టీమ్ కు వ్యతిరేకంగా వెళ్లద్దు అనేది నా అభిప్రాయం. ఇదే విషయాన్ని నేను అందరితోను చెప్పాను. ఒక్క బట్టర్ ఫ్లై మూమెంట్ తప్ప మరే టాస్క్ జరిగా ఆడటం లేదు. నేను ఎవ్వరి వ్యతిగత విషయాలను మాట్లాడలేదు. ఇక హౌజ్ లో చాలా కంటెస్టెంట్స్ వెన్నుపోట్లు కూడా పొడుతున్నారు.

బయటికి కనిపిస్తున్నది ఒకటి లోపల జరిగేది ఒకటి. ఆ విషయంలోనే నేను ఎఫెక్ట్ అయ్యాను. అక్కడ ప్రతి ఒక్కరికీ స్ట్రాటజీలు ఉన్నాయి. అందరూ మున్ముందు బయట పడుతారు. ఇక నా వల్ల మాత్రం ఎవ్వరికీ హానీ జరగలేదు. నేను ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదు. ఇక కామన్స్ లో ప్రస్తుతం యూనిటీ బ్రేక్ అయ్యింది. రీతూ చౌదరి వల్లనే మాకు చాలా గొడవలు అయ్యాయి. ఫూడ్ వద్ద ఆమె నుంచే ఘర్షణలు వస్తున్నాయని మర్యాద మనీష్ హౌజ్ లోని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X