Bigg Boss Telugu: బిగ్ బాస్ షో స్క్రిప్టేనా? క్లారిటీ ఇచ్చిన మర్యాద మనీష్
Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతారనుకుంటున్న టాప్ కంటెస్టెంట్స్ అనూహ్యంగా ఎలిమినేట్ అయి బయటకు వస్తున్నారు. ఇటీవల టాప్ 10 లో నిలుస్తారని భావించిన మర్యాద మనీష్ కేవలం రెండు వారాల్లో ఇంటి నుండి బయటకు రావడమే ఇందుకు నిదర్శనం. ఆమె ఎలిమినేట్ అవుతుందని ప్రేక్షకులే కాదు, ఆమె కూడా అసలు ఊహించలేదు. దీంతో చాలా మందిలో బిగ్ బాస్ షో జరుగుతున్న తీరుపై అనుమానాలు రేకెత్తడం మొదలైంది. తాజాగా మర్యాద మనీష్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏం జరుగుతోంది? అనే వాస్తవాలు బయట పెట్టే ప్రయత్నం చేశారు. బిగ్ బాస్ షో స్క్రిప్టు ప్రకారం జరుగుతోందా? లేక రియాల్టీగా జరుగుతోందా? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. దీనిపై మర్యాద మనీష్ స్పందించారు.
బిగ్ బాస్ షో ప్రతి సీజన్ ప్రారంభమైనప్పుడల్లా సోషల్ మీడియాలో ఒకే ప్రశ్న గట్టిగా వినిపిస్తుంది "ఈ షో నిజంగానే రియాలిటీనా? లేక స్క్రిప్ట్ ప్రకారమా?" అని. ప్రతి సీజన్లలో కంటెస్టెంట్ల మధ్య జరిగే గొడవలు, డ్రమాటిక్ టాస్కులు, హౌస్‌లోని ఎమోషనల్ మోమెంట్స్ చూసి ప్రేక్షకులు చాలామంది ఇది స్క్రిప్టెడ్ షోనే అని అనుకుంటుంటారు. అయితే ఇప్పుడు ఆ అనుమానాలకు స్వయంగా క్లారిటీ ఇచ్చారు బిగ్ బాస్ ఫేమ్ మర్యాద మనీష్.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మర్యాద మనీష్ స్పష్టం చేశారు. "బిగ్ బాస్ అనేది అసలు స్క్రిప్టెడ్ షో కాదు. 100% జెన్యూన్ రియాలిటీ షో" అని. ఆయన మాట్లాడుతూ, "మాకు బయట ప్రపంచం నుండి ఏ ఇన్ఫర్మేషన్ కూడా లోపలికి రాదు. ఎలాంటి ప్లాన్ ప్రకారం గానీ, డైరెక్షన్ ప్రకారం గానీ మేము నడుచుకోము. షోలో కనిపించే ప్రతి రియాక్షన్, ప్రతి గొడవ, ప్రతి ఎమోషన్ కూడా సహజంగానే వస్తుంది. ఎవ్వరూ మాకు చెప్పరు. ఎవరి మీద గొడవ పడాలో, ఎవరికీ సపోర్ట్ ఇవ్వాలో ఎవరు చెప్పారు.
అలాగే మర్యాద మనీష్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు "స్టోర్ రూమ్ నుండి కొన్ని లెటర్స్ లేదా ఇన్‌స్ట్రక్షన్స్ వస్తాయి, అవి కూడా కేవలం టాస్క్ రూల్స్ లేదా బ్రేక్ లు సంబంధిత మెసేజ్‌లు మాత్రమే. ఉదాహరణకు, 'ఈరోజు టాస్క్ బ్రేక్ చేయొద్దు', లేదా 'రూల్స్ పాటించండి' వంటి మెసేజ్‌లు మాత్రమే ఉంటాయి. కానీ స్క్రిప్ట్ లాంటి విషయం అసలు ఉండదు" అని చెప్పారు. మరీ ముఖ్యంగా మర్యాద మనీష్ చెప్పిన మాట "బిగ్ బాస్ షోలో ఉన్నవాళ్లందరూ స్మార్ట్‌గా, తమ తాలూకు వ్యూహాలతో ఆడతారు. ఎవరు ఎవరితో కలుస్తారో, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటారో, ఇవన్నీ పూర్తిగా వారి మైండ్ గేమ్ పై ఆధారపడి ఉంటుంది. ఇది మేకర్స్ నిర్ణయం కాదు" అని క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం మర్యాద మనీష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ షో నిజంగా రియాలిటీనా? లేదా స్క్రిప్ట్ అనేది? అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఫ్యాన్స్‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రెండో వారం మర్యాద మనీష్ షో నుంచి బయటికెళ్లారు. సోషల్ మీడియాలో ఆయన రెమ్యునరేషన్ విషయమే హాట్ టాపిక్‌గా మారింది. బిగ్ బాస్ టీమ్ సమాచారం ప్రకారం, రెండు వారాలు హౌస్‌లో ఉన్న మనీష్ రూ.1.40 లక్షల పారితోషికం అందుకున్నారు. అంటే రోజుకి ₹10,000 చొప్పున, వారానికి ₹70,000 తీసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











