Bigg Boss Telugu 7th Week Voting: ఈ వారం షాకింగ్ ఓటింగ్.. డేంజర్ జోన్‌లో ఆ నలుగురు..

Bigg Boss Telugu Season 9 Week 7 Voting Results: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రియాలిటీ షో ప్రస్తుతం ఏడో వారంలోకి దూసుకెళ్లింది. ఈ రియాలిటీ గేమ్ షో మొదట్లో నత్తనడకగా సాగినా, ఆరో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రావడంతో హౌజ్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ కొత్త ఎంట్రీలతో హౌస్‌లో ఎనర్జీ లెవల్స్ ఒక్కసారిగా పెరిగాయి. టాస్కులు మరింత ఆసక్తికరంగా మారాయి. కంటెస్టెంట్ల మధ్య విభేదాలు, ఆప్యాయతలు, స్నేహం, ప్రేమ, అహంకారం అన్నీ కలగలిసి రియాలిటీ షోని నిజమైన "రణరంగం"గా మార్చేశాయి. ఈ నేపథ్యంలో 7వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. అయితే ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు? వారికి నమోదైన ఓటింగ్ వివరాలు ఏమిటనే విషయంలోకి వెళితే..

బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఇప్పటి వరకు ఏడు మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, శ్రీజ దమ్ము, ఫ్లోరా సైనీ, చివరగా టాప్ కంటెస్టెంట్‌గా భావించబడిన భరణి శంకర్ ఎలిమినేట్ కావడం అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. భరణి గేమ్‌లో స్ట్రాంగ్ ప్లేయర్‌గా నిలిచినా, అతని ఎలిమినేషన్ షో మీద కొత్త చర్చలు రేపింది. ఇక ఏడో వారంలో నామినేషన్ ప్రక్రియ ఘాటుగా సాగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలైన అయేషా, రీతూ చౌదరీ, సంజన గల్రానీ వంటి వారు గేమ్‌ను మరింత హీట్ చేశారు. బిగ్‌బాస్ ఇచ్చిన పవర్ అస్త్రాలను ఉపయోగిస్తూ, కంటెస్టెంట్లు తమ వ్యూహాలను అమలు చేశారు.

Bigg Boss Telugu Season 9 Week 7 Voting Results Kalyan Leads Sai and Ramu in Danger Zone

ముఖ్యంగా అయేషాకు లభించిన ప్రత్యేక పవర్ ద్వారా ఆమె రీతూ చౌదరీని నామినేట్ చేయడం హౌస్‌లో పెద్ద వాగ్వాదానికి దారితీసింది. ముఖానికి ఫోమ్ పూసి ఒకరిని ఒకరు నామినేట్ చేసే టాస్క్‌లో తలెత్తిన మాటల తూటాలు హౌస్‌లో ఉద్రిక్తతను పెంచాయి. తర్వాత దివ్య తన నామినేషన్లలో అయేషా, సాయి పేర్లు ప్రకటించగా, రీతూ తన రెండో నామినేషన్‌గా రామును ఎంపిక చేసింది. చివరికి కళ్యాణ్, సంజన, దివ్య, రాము, రీతూ, తనూజ, రమ్య, సాయి, అయేషా మొత్తం తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. అయితే చివరిలో కెప్టెన్ గౌరవ్ తనకు లభించిన "సేవ్ సమ్ వన్" పవర్‌ను ఉపయోగించి అయేషాను నామినేషన్‌ నుంచి సేవ్ చేశారు. చివరికి ఏడో వారం ఎలిమినేషన్ లో కళ్యాణ్, సంజన, దివ్య, రాము, రీతూ, తనూజ, రమ్య, సాయి ఇలా 8 మంది నిలిచారు.

ఇక ఓటింగ్ విషయానికొస్తే.. వారం బిగ్‌బాస్ ఓటింగ్ అసాధారణ పరిణామాలు, అన్యూహ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లకు మద్దతుగా పోస్టులు చేస్తూ.. ఓటింగ్ లో పాల్గొంటున్నారు. బిగ్‌బాస్ సీజన్ 9 ను ట్రెండింగ్ టాపిక్‌గా మార్చేశారు. సోషల్ మీడియా, అనధికారిక సర్వేల ప్రకారం.. ఈ వారం ఓటింగ్‌లో సోల్జర్ కల్యాణ్ టాప్ పొజిషన్‌లో నిలిచారు. అతను 33.72 శాతం ఓట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. గేమ్‌లో అతని స్ట్రైట్‌ఫార్వర్డ్ యాటిట్యూడ్, స్మార్ట్ మైండ్‌సెట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సీజన్‌లో "స్ట్రాంగ్ కంటెస్టెంట్"గా పేరు తెచ్చుకున్నాడు.

ఆ తరువాత స్థానంలో తనుజా పుట్టస్వామి నిలిచింది. ఆమె 25.13 శాతం ఓట్లు సాధించింది. బిగ్‌బాస్ హౌస్‌లో తనుజా ఆడిన గేమ్‌లో స్మార్ట్ మూవ్స్, మాట్లాడే తీరు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. దీంతో ఆమెకు బలమైన ఫ్యాన్ బేస్‌ని ఏర్పరిచింది. ప్రస్తుత ఓటింగ్ చూస్తే.. కల్యాణ్-తనుజా మధ్య టాప్ ఫైట్ నడుస్తోంది. ఇక మూడో స్థానంలో సంజన గల్రానీ నిలిచింది. ఆమెకు 11.08 శాతం ఓట్లు వచ్చాయి. సంజన ఇటీవల టాస్క్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ కొందరు ఆమెను "కంట్రోవర్సీ క్వీన్"గా అభివర్ణిస్తున్నారు. పై ముగ్గురు మంచి ఓటింగ్ తో సేఫ్ జోన్ లో నిలిచారనే చెప్పాలి.

ఇక రౌడీ పిల్ల రీతూ చౌదరీ 8.27 శాతం ఓటింగ్‌తో నాలుగో స్థానంలో ఉంది. రీతూ తన అభిప్రాయాలను ధైర్యంగా చెప్పడం, ఇతర కంటెస్టెంట్లతో భయపడకుండా వాదించడం ఆమె స్టైల్. "తగ్గేదేలే" అనే జోష్‌తో గేమ్ ఆడుతున్న రీతూ అభిమానుల్లో చురుకుగా సపోర్ట్ పొందుతోంది. అయితే ఆమెకు మరింత స్క్రీన్ టైమ్ ఇవ్వాలని ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇక ఐదవ స్థానంలో రమ్య మోక్ష 7.32 శాతం ఓట్లు సాధించింది. ఆరవ స్థానంలో దివ్య నిఖిత 6.72 శాతం ఓట్లు సాధించగా, రాము యాదవ్ 4.85 శాతం, సాయి శ్రీనివాస్ 3.35 శాతం ఓట్లు మాత్రమే సంపాదించారు.

ఇలా ఓటింగ్ ర్యాంకింగ్స్ ప్రకారం సాయి శ్రీనివాస్ , రాము రాథోడ్, దివ్య నిఖిత, రమ్య మోక్ష, రీతూ చౌదరి డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సాయి శ్రీనివాస్ గేమ్‌లో అంతగా కనబడకపోవడం, టాస్క్‌లలో వెనకబడిపోవడం వల్ల ఓట్లు తక్కువగా రావడం గమనార్హం. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ వారం ఎలిమినేషన్ కోసం ప్రధానంగా సాయి, రాము మధ్య పోటీ నెలకొంది. మొత్తంగా చూస్తే.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఏడో వారం నామినేషన్లు, ఓటింగ్ ప్యాటర్న్ రసవత్తరంగా మారాయి. కల్యాణ్-తనుజా టాప్‌లో రేస్ చేస్తుండగా, సాయి, రాము, దివ్య, రమ్య ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొంటున్నారు. ఇక వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఏ కంటెస్టెంట్‌ను హౌస్‌ నుంచి పంపిస్తారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఇంకా ఎన్నో మలుపులు చోటుచేసుకుంటాయో.. వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X