Just In
- 4 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 5 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 5 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 6 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
కూరగాయాలకు మద్దతు ధర, సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..?
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Bigg Boss Winner: ఓటింగ్‌లో భారీ ట్విస్టులు.. మారుతున్న స్థానాలు.. అసలేం జరుగుతోంది?
బిగ్ బాస్ నాలుగో సీజన్ చివరి దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఆరోజు టైటిల్ విన్నర్‌ను ప్రకటించబోతున్నారు. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి గెలవబోయే కంటెస్టెంట్ విషయంలో పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. దీనికి కారణం అభిజీత్‌కే ఎక్కువ విజయావకాశాలు ఉండడమే. అయితే, చివరి వారం ఓటింగ్‌లో భారీ ట్విస్టులు కనిపిస్తున్నాయని తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని వల్ల కంటెస్టెంట్ల స్థానాల్లో మార్పులు కనిపిస్తున్నాయట. ఓటింగ్‌లో అసలేం జరుగుతోంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

అఖిల్ సార్థక్‌తో పాటు ఆ నలుగురు
రేస్ టు ఫినాలే టాస్కులో విజయం సాధించడం ద్వారా రెండు వారాల ముందే ఫినాలేలో అడుగు పెట్టేశాడు అఖిల్ సార్థక్. ఆ తర్వాత వారం జరిగిన నామినేషన్స్‌లో మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అయిపోయింది. దీంతో సయ్యద్ సోహెల్ రియాన్, అభిజీత్, దేత్తడి హారిక, ఆరియానా గ్లోరీలు టాప్- 5కి చేరుకున్నారు. వీళ్లంతా నాలుగో సీజన్ టైటిల్ కోసం పాటుపడుతున్నారు.

అభిజీతే టైటిల్ విన్నర్ అంటున్నారు
బిగ్ బాస్ నాలుగో సీజన్ మధ్యలోనే ఈ సారి అభిజీత్ విన్నర్ అవుతాడని ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్లుగానే అతడు నామినేట్ అయిన ప్రతిసారీ ప్రేక్షకుల ఓట్ల ద్వారా సేఫ్ అవుతూ వచ్చాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 11 వారాలు ఎలిమినేషన్ తప్పించుకున్న అతడు.. బిగ్ బాస్ టైటిల్‌కు చేరువయ్యాడు. ఫినాలే వీక్‌లోనూ అతడే టాప్‌లో ఉన్నాడని సమాచారం.

రికార్డు క్రియేట్ చేయడం ఖాయమట
గత సీజన్లతో పోలిస్తే ఈ సారి ఎన్నో రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. రేటింగ్ పరంగా, ఓటింగ్ పరంగా సంచలనాలు నమోదవుతున్నాయి. ఇక, ఈ వారం కూడా అదే జరగబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం టాప్ -5లో ఉన్న కంటెస్టెంట్ల కోసం భారీ స్థాయిలో ఓట్లు పోలవుతున్నాయని అంటున్నారు. దీంతో ఈ వారం ఓటింగ్ రికార్డు క్రియేట్ చేయడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.

బిగ్ బాస్ ఓటింగ్‌లో భారీగా ట్విస్టులు
ఐదుగురు కంటెస్టెంట్ల కోసం వాళ్ల వాళ్ల ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు ప్రచారాన్ని ముమ్మరం చేసేశారు. మాజీ కంటెస్టెంట్లు, సెలెబ్రిటీలు సైతం టాప్ -5 సభ్యుల కోసం ఓటింగ్ చేస్తున్నారు. అలాగే, వాళ్ల వాళ్ల అభిమానులకు అండగా నిలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారిక ఓటింగ్‌లో భారీగా ట్విస్టులు కనిపిస్తున్నాయని తాజాగా ఓ న్యూస్ బుల్లితెర వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

కంటెస్టెంట్ల స్థానాల్లో చాలా మార్పులు
ప్రైవేటు సంస్థలు నిర్వహించే పోలింగ్స్‌లో అభిజీతే అందరి కంటే ముందున్నాడు. అతడికి సెకెండ్ ప్లేస్‌లో ఉన్న కంటెస్టెంట్‌కు దాదాపు 20 శాతం పైగానే తేడా కనిపిస్తోంది. ఇదే అధికారిక ఓటింగ్‌లో సైతం జరుగుతుందని తెలుస్తోంది. ఇక, చివరి స్థానంలో దేత్తడి హారిక ఉందని అంటున్నారు. రెండో స్థానం కోసం సోహెల్, అఖిల్, ఆరియానాల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉందని సమాచారం.

అసలేం జరగబోతుంది.. ఎవరుంటారు?
తాజా లెక్కల ప్రకారం.. అభిజీత్ గెలవడం ఖాయమన్న టాక్ వినిపిస్తుండగా, రెండో స్థానంలో మాత్రం ఎవరు ఉంటారన్నది సస్పెన్స్‌గా మారింది. ఓటింగ్ పొజిషన్స్ మారుతోన్న నేపథ్యంలో సోహెల్, అఖిల్, ఆరియానాలలో ఎవరైనా రన్నరప్ కావొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ముగ్గురిలో అమ్మాయినే టాప్ -2లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.