twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కౌశల్ నిజ స్వరూపం తెలిస్తే షాకే.. బిగ్‌బాస్ విజేత కంటే ముందు..!

    |

    Recommended Video

    Bigg Boss Winner Kaushal Speaks About His Journey

    బిగ్‌బాస్ విజేత కౌశల్‌ గురించి అంతకుముందు పెద్దగా తెలిసిన వారు చాలా తక్కువే. కేవలం చిన్న చిన్న పాత్రలు వేసే నటుడిగానే చాలా మందికి తెలుసు. కాకపోతే కౌశల్ బిగ్‌బాస్ ఇంట్లోకి రావడానికి ముందు కెరీర్‌లో ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. వాటన్నిటిలో జయం సాధించినా.. లో ప్రొఫైల్‌లోనే మెయింటెన్ చేశారు. బిగ్‌బాస్‌లోకి వచ్చిన తర్వాత ఆయన బిహేవియర్, యాటిట్యూడ్ అన్నీ ప్రేక్షకులను ఆకర్షించాయి. కౌశల్ గురించి.. ఆయన చేసిన ఈవెంట్ల గురించి తెలిస్తే షాక్ అవాల్సిందే.

    నేను ఎలా ఉంటానో అలానే ఉన్నా

    నేను ఎలా ఉంటానో అలానే ఉన్నా

    బిగ్‌బాస్ హౌస్‌లో నా బిహేవియర్‌ను, యాటిట్యూడ్‌ను మార్చుకోలేదు. బయట ఎలా ఉంటానో ఇంట్లో కూడా అలానే ఉన్నాను. కెమెరాలు ఉన్నాయన్నా సంగతే పట్టించుకోలేదు. బిగ్‌బాస్ కోసం నేను పత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు, వ్యూహాన్ని అమలు చేయలేదు. పరిస్థితులను బట్టి బిహేవ్ చేసుకొంటూ వెళ్లాను అని కౌశల్ చెప్పారు.

     బాడ్మింటన్‌లో నేషనల్ చాంఫియన్‌ను

    బాడ్మింటన్‌లో నేషనల్ చాంఫియన్‌ను

    చిన్నప్పటి నుంచి స్కూల్ గేమ్స్‌లో నేనే చాంఫియన్. షటిల్ బాడ్మింటన్‌లో నేషనల్ ఛాంపియన్. లాల్ బహద్దూర్ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గ్యాలరీలో ఉంటూ కోచ్ ఆరీఫ్ వద్ద కోచింగ్ తీసుకొన్నాను. బాల్యం నుంచే నేను కల్చరల్, స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో విన్నర్‌ని.

    కౌశల్‌కు వచ్చిన అవార్డులు ఇవే

    కౌశల్‌కు వచ్చిన అవార్డులు ఇవే

    మల్టీ టాస్కర్‌గా నాకు ఇండివుడ్ అవార్డు వచ్చింది. ఇండియాలోని మల్టీ టాస్కర్స్‌లో నాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దక్షిణాదిలో 82 రెండు చిత్రాలు. 1003 కమర్షియల్ యాడ్ ఫిల్మ్స్. 520 ర్యాంప్ షోలు, ఫ్యాషన్ కోరియోగ్రాఫర్‌గా 250 షో నిర్వహించాను.

    యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్‌గా

    యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్‌గా

    నాకు ఇన్సిపిరేషన్ మోడల్ మిలింద్ సోమన్‌తో కలిసి ఫ్యాషన్ కోరియోగ్రఫి చేయడం నా జీవితంలో నా అచీవ్‌మెంట్. యాడ్ ఫిల్మ్ మేకర్‌గా 240 యాడ్ ఫిల్మ్స్‌కు డైరెక్ట్ చేశాను. తెలుగులో డ్యాన్స్ బేబి డ్యాన్స్ షోకు యాంకర్‌గా వ్యవహరించాను. నా మోడలింగ్ ఏజెన్సీ ద్వారా 5 వేలకు పైగా మోడల్స్‌కు ప్రమోట్ చేశాను.

    కాన్సెప్ట్ డైరెక్టర్‌గా కూడా

    కాన్సెప్ట్ డైరెక్టర్‌గా కూడా

    దియా మిర్జా నుంచి రితూ వర్మ వరకు నా మోడల్ ఏజెన్సీ నుంచి వారికి సహకారం అందించాను. తెలుగులో వచ్చిన తొలి కాన్సెప్ట్ షో అందమైన భామలకు నేను డైరెక్టర్‌గా వ్యవహరించాను. ఇలా యాక్టర్, యాంకర్, యాడ్ ఫిలిం డైరెక్టర్‌గా ఎన్నో పాత్రలు పోషించాను అని కౌశల్ చెప్పారు.

    రాజమౌళి యాడ్‌ ఫిలింలో

    రాజమౌళి యాడ్‌ ఫిలింలో

    కెరీర్ ఆరంభంలో ఎస్ఎస్ రాజమౌళి, ఏలేటి చంద్రశేఖర్‌ కూడా నాకు హెల్ప్ చేశారు. రాజమౌళి, చంద్రశేఖర్ చేసిన యాడ్ ఫిలింలో నేను మోడల్‌ను కావడం గర్వకారణం. ఇలాంటి గొప్ప డైరెక్టర్ కాల్ చేసి నా సినిమాలో నటిస్తున్నావని ఆఫర్ ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నాను.

    English summary
    Bigg Boss winner Kaushal speaks about his journey. He told that Mahesh Babu, Pawan Kalyan are behind my bigg boss entry. He said that he was the model for Rajamouli first Advt film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X