»   » నా కోసం అపుడు పవన్ కళ్యాణ్ గారు, ఇపుడు పవన్ ఫ్యాన్స్: బిగ్ బాస్ విన్నర్ శివ బాలాజీ

నా కోసం అపుడు పవన్ కళ్యాణ్ గారు, ఇపుడు పవన్ ఫ్యాన్స్: బిగ్ బాస్ విన్నర్ శివ బాలాజీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిగ్ బాస్ సీజన్ 1 టైటిల్ శివ బాలాజీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా 11 కోట్ల పై చిలుకు ఓట్లు రాగా..... అందులో అత్యధికంగా 3 కోట్ల 34 లక్షల పైచిలుకు ఓట్లు శివ బాలాజీ దక్కించుకున్నారు. శివ బాలాజీకి ఇన్ని ఓట్లు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అభిమానుల సపోర్టు ఉండటమే అనే ఓ వాదన కూడా ఉంది.

బిగ్ బాస్ ఇంటి నుండి వచ్చిన అనంతరం రెండ్రోజులు ఫ్యామిలీతో గడిపిన అనంతరం మీడియా ఇంటర్వ్యూల్లో బిజీ అయిపోయారు యాంగ్రీ శివ బాలాజీ. మొదట బిగ్ బాస్ ప్రపోజల్ వచ్చినపుడు వద్దనుకున్నాను. ఎందుకంటే ఇందులో చాలా కాంట్రవర్సీలు ఉంటాయి. అలాంటివి హ్యాండిల్ చేయడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ అవి ఫేస్ చేయడం అవసరమా అనుకుని వద్దనుకున్నాను. కానీ చాలా మంది వెల్ విషర్స్ నీ కెరీర్ కు ప్లస్సవుతుంది, నీ రియల్ క్యారెక్టర్ బయట పడుతుందని చెప్పడంతో వెళదామని డిసైడ్ అయ్యాను అని శివ బాలాజీ తెలిపారు.

నేను కొడతానేమో అనుకున్నారట

నేను కొడతానేమో అనుకున్నారట

కోపం అనేది ఒక ఎమోషన్. అక్కడ జరిగే పరిస్థితులను బట్టే నేను కొన్ని సార్లు అలా రియాక్ట్ అయ్యాను. నా కోపం చూసి కొందరు ఇంటి సభ్యులు మొదట్లో నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తానేమో అని భయపడ్డారట. కానీ నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే రకం కాదు. కాక పోతే కోపం అనేది కొన్ని సందర్భాల్లో పరిస్థితులను బట్టి అలా వచ్చేస్తుంది అన్నారు శివ బాలాజీ.

Bigg Boss Winner : Shiva Balaji Won because of Pawan Kalyan
కల్పన చాలా స్వీట్ లేడీ

కల్పన చాలా స్వీట్ లేడీ

కల్పన చాలా స్వీట్ లేడీ. బిగ్ బాస్ ఇంట్లో అలా ఎందుకు ఉందో తెలియదు. ఫస్ట్ వీక్ ఒకలా ఉంది, కెప్టెన్సీ వీక్ ఒకలా ఉంది, థర్డ్ వీక్ ఎలా ఉండాలో తెలియక చాలా కన్ ఫ్యూజ్ అయిపోయిందని శివ బాలాజీ తెలిపారు.

నేను మారలేదు

నేను మారలేదు

బిగ్ బాస్ ఇంట్లో రోజులు గడిచే కొద్ది నేను మారాను మారాను అన్నారు. కానీ నేను మారలేదు. నాకు కోపం తెప్పించే ఇన్సిడెంట్స్ జరుగలేదు. నేను మారిపోవడం లాంటిదేమీ జరుగలేదు అన్నారు.

నన్ను ఇరిటేట్ చేయాలని కావాలనే

నన్ను ఇరిటేట్ చేయాలని కావాలనే

నేను కెప్టెన్ అయిన తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఒక టాస్క్ ఇచ్చారు. వారు నన్నుఇరిటేట్ చేయడానికి ఏమైనా చేయవచ్చు. నేను కొప్పడకూడదనే టాస్క్ ఇచ్చారు. అపుడు వాళ్లు రెచ్చిపోయారు. ఊరికే నా దగ్గరకు వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అపుడు నాకు చాలా ఇరిటేషన్ అనిపించింది.. అని శివ బాలాజీ తెలిపారు.

ఒకరోజు భరించా, రెండో రోజు చెప్పేశా

ఒకరోజు భరించా, రెండో రోజు చెప్పేశా

వారు నన్ను ఇరిటేట్ చేస్తుంటే ఫస్ట్ డే నేను ఈజీగా తీసుకున్నాను. సెకండ్ డే లేచిన వెంటనే ఇరిటేషన్ మొదలు పెట్టడంతో పిచ్చోళ్లలాగ చేస్తున్నారు అని చెప్పేశాను. ఎవరైనా కోపం కంట్రోల్ చేయడానికి అట్మాస్పియర్ క్రియేట్ చేస్తారు. మీరు ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు సెన్సబుల్ గా ఉండాలని అందరికీ అప్పుడే చెప్పేశాను... అని బిగ్ బాస్ తెలిపారు.

పవన్ కళ్యాణ్‌తో పరిచయం

పవన్ కళ్యాణ్‌తో పరిచయం

పవన్ కళ్యాన్ అంటే తనకు చాలా ఇష్టమని, ఏడేళ్ల క్రిందట అన్నవరం సినిమా సందర్భంగా అతడితో పరిచయం ఏర్పడిందని తెలిపారు. అప్పటి నుంచి తమ అనుబంధం కొనసాగుతోందన్నారు.

పవన్ అలా చేయడం ఆనందాన్ని ఇచ్చింది

పవన్ అలా చేయడం ఆనందాన్ని ఇచ్చింది

సాధారణంగా తన పుట్టినరోజు జరుపుకునేందుకు పవన్ కళ్యాణ్ ఇష్టపడరు. అలాంటి వ్యక్తి నా పుట్టినరోజును యూనిట్ సభ్యులందరి మధ్య, తన కుటుంబ సభ్యులందరి సమక్షంలో చేశారు. అది నాకు చాలా ఆనందాన్నిచ్చింది అన్నారు శివబాలాజీ.

కత్తి ప్రజంట్ చేశాను

కత్తి ప్రజంట్ చేశాను

నా జీవితంలో గుర్తిండిపోయేలా పుట్టినరోజు చేసిన పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదైనా ఇవ్వాలని అనుకున్నాను. ప్రజానాయకుడు కావడంతో ఏదైనా స్పెషల్‌గా ఇవ్వాలని ఆయనకు కత్తిని బహూకరించానని శివ బాలాజీ తెలిపారు.

పవన్ ఫ్యాన్స్ ఓటు చేయడం హ్యాపీగా ఉంది

పవన్ ఫ్యాన్స్ ఓటు చేయడం హ్యాపీగా ఉంది

నన్ను గెలిపించేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఓట్లు వేశారని విన్నాను. చాలా సంతోషం వేసింది. వారందరికీ థాంక్స్ చెబుతున్నాను అని శివ బాలాజీ తెలిపారు.

నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్.... అంటూ పవన్ కళ్యాణ్

నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్.... అంటూ పవన్ కళ్యాణ్

కాటమరాయుడు షూటింగ్ సమయంలో శివ బాలాజీ పుట్టినరోజు నిర్వహించిన.....పవన్ కళ్యాణ్.

ఫోటోస్ కోసం క్లిక్ చేయండి

English summary
Bigg Boss Winner Siva Balaji says he likes Pawan Kalyan so much from the time he acted for Annavaram movie with him. He said Pawan Kalyan gifted him Sword on his birthday while celebrating on sets. He felt happy to know that Pawan Kalyan fans from US voted for him to win the Bigg Boss show for which he thanked them.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu