Bigg Telugu 5th Week Voting: ఓటింగ్‌లో భారీ ట్విస్ట్‌లు.. డబుల్ ఎలిమినేషన్.. ఎవరు సేఫ్? ఎవరు అవుట్?

Bigg Telugu 5th Week Voting: బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ చూడని మార్పులు ఈ సీజన్ లో చోటు చేసుకుంటున్నాయి. ఈ సారి ఎంటర్టైన్మెంట్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా బిగ్ బాస్ టీం ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే నాలుగు వారాలు విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ షో ఐదో వారం ఎలిమినేషన్స్ చేరువైంది. కొంత మంది కంటెస్టెంట్లను బయటకు పంపిస్తూ.. వైల్డ్ కార్డు ద్వారా కొత్త కంటెస్టెంట్లను హౌస్ లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీం మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఎవరు ఊహించిన విధంగా ఈ వారం పదిమంది నామినేషన్ లో నిలువడంతో ఐదో వారం నామినేషన్స్, ఓటింగ్ సరళి అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, టాప్ ప్లేస్ లో ఎవరున్నారు? డేంజర్ జోన్లో ఎవరు నిలిచారు? ఏ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ కు గుడ్ బై చెప్పబోతున్నారు? ఇంతకీ డబుల్ కన్ఫామ్ అయిందా? అనే విషయాలు మీకోసం..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఐదో వారం నామినేషన్ ప్రక్రియ కాస్త కొత్తగా జరిగింది. ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ టీం కంటెస్టెంట్లందరినీ నామినేషన్లలో దించారు. అయితే కెప్టెన్ రాము రాథోడ్‌కు మినహాయింపు ఇవ్వడంతో ఆయన సేఫ్ జోన్‌లో నిలిచారు. మరోవైపు ఇమ్మాన్యుయేల్ కి ఇమ్యూనిటీ పవర్ రావడంతో అతడు కూడా నామినేషన్ నుండి తప్పించుకున్నాడు. దీంతో మొత్తం పది మంది హౌస్‌మేట్స్‌ నామినేషన్లలో నిలిచారు. దీంతో పవన్ కళ్యాణ్, డిమోన్ పవన్, తనూజ పుట్టస్వామి, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రానీ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి, దమ్ము శ్రీజ, దివ్య నిఖిత ఇలా పదిమంది కంటెస్టెంట్లు నామినేషన్ లో నిలిచారు.

Bigg Telugu 5th Week Voting 5 Top Contestants Danger Zone Double Elimination amp amp Wild Card Buzz

వీరిలో ఎవరు సేఫ్, ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారనే దానిపై సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. సోషల్ మీడియాలో అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం.. ఈ వారం టాప్‌లో పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు. గత వారాల కంటే ఈసారి అతని పర్ఫార్మెన్స్ గణనీయంగా మెరుగైంది. బిగ్ బాస్ హౌస్‌లో ఎమోషనల్ మూమెంట్స్, టాస్క్‌లలో యాక్టివ్‌గా పాల్గొనడం, రీతును దూరం పెట్టడం ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ పాజిటివ్ ఇంపాక్ట్ వల్ల పవన్ 18.41 శాతం ఓటింగ్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.

రెండవ స్థానంలో 'ముద్దమందారం' సీరియల్ ఫేమ్ తనుజ పుట్ట స్వామి (17.7 శాతం) ఉన్నారు. మొదట ఓటింగ్ ప్రారంభ దశలో ఆమె టాప్‌లో ఉన్నా, భరణి చుట్టూ తిరుగుతూ "డాడీ డాడీ" అంటూ సెంటిమెంట్ కార్డు ప్లే చేయడం వల్ల కాస్త వెనుకబడ్డారని అభిమానులు భావిస్తున్నారు. అయినా ఆమెకు ఉన్న ఫ్యాన్ బేస్ భారీగా ఉండటంతో రెండో స్థానాన్ని కాపాడుకోగలిగింది. ఇక మూడవ స్థానంలో సంజన గర్లాని నిలిచారు. ఈ వారం ఫిజికల్ టాస్కుల్లో సంజన దూకుడు చూపించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. సాండ్ టాస్క్‌లో మేల్ కంటెస్టెంట్లకు సైతం తలపడుతూ తన ఫిట్‌నెస్‌ను నిరూపించింది. ఇమ్మాన్యుయేల్ ఈ వారం నామినేషన్‌లో లేనందున, అతని ఫ్యాన్స్ ఓట్లు సంజనాకు వెళ్తున్నాయని అనేక ఓటింగ్ పేజీలు చెబుతున్నాయి.

నాలుగవ స్థానంలో సుమన్ శెట్టి నిలిచారు. తన కామెడీ టైమింగ్‌తో పాటు సీరియస్ టాస్కుల్లోనూ ఆకట్టుకుంటున్నారు. ఆయనకు ఉన్న పాన్ ఫాలోయింగ్ ఓటింగ్‌లో పెద్ద పాత్ర పోషిస్తోంది. ఐదవ స్థానంలో శ్రీజ దమ్ము దూసుకెళ్తోంది. 11 శాతం ఓటింగ్‌తో ఆమె సేఫ్ జోన్‌ చివర భాగంలో ఉన్నా, అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకుంది.

మిగిలిన కంటెస్టెంట్లు కేవలం 1 లేదా 2 శాతం తేడాతో ఓటింగ్‌లో నిలుస్తుండటంతో సస్పెన్స్ మరింత పెరిగింది. డేంజర్ జోన్‌లో ఉన్న వారిలో భరణి 6.8% ఓటింగ్‌తో ఆరవ స్థానంలో ఉన్నారు. ఫ్లోరా షైనీ 5.8 శాతం, దివ్య 5.7 శాతం, రీతు చౌదరి, డిమాండ్ పవన్ ఇద్దరూ 5.6 శాతం ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇక మరో ఆసక్తికర ట్విస్ట్ ఏమిటంటే - బిగ్ బాస్ టీం ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సన్నాహాలు చేస్తోంది. దాదాపు ఆరుగురు కొత్త సెలబ్రిటీలు హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. దీంతో హౌస్‌లో కొత్త అలజడి తప్పదని అంచనా. అంతేకాకుండా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగబోతుందన్న బజ్ హౌస్‌లో హీట్ పెంచుతోంది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు సేఫ్‌గా ఉన్నా, మిగిలిన ఐదుగురు మాత్రం ప్రతి టాస్క్‌లో తమ సత్తా నిరూపించుకోవాల్సిందే. బిగ్ బాస్ హౌస్‌లో ఒక్క రోజు పర్ఫార్మెన్స్ కూడా గేమ్‌ మార్చేసే అవకాశం ఉంది. రాబోయే ఎపిసోడ్లలో ఎవరు సేఫ్ జోన్‌లో నిలుస్తారు, ఎవరు హౌస్‌కు గుడ్‌బై చెబుతారు అనే ఉత్కంఠతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X