For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam నిరుపమ్‌తో బ్రేకప్.. శౌర్య కోసం హిమ ప్రేమ త్యాగం

  |

  అమ్మాయిలు ఆటో నడపడం చాలా తక్కువగా కనిపిస్తుంటారు. పెళ్లి చేసుకొంటే ఆటో డ్రైవర్‌ను చేసుకో. ఇద్దరు ఆటో నడుపుకొంటూ హ్యాపీగా ఉండవచ్చు అని ప్యాసింజర్ అనడంతో జ్వాలా అలియాస్ శౌర్యకు చిర్రెత్తుకొచ్చింది. దాంతో ఆటో వాళ్లంటే నీకు చిన్నచూపా? నేను చేసుకోబోయేది డాక్టర్‌ను, చాలా అందంగా ఉంటాడు అని ఫోన్‌లో నిరుపమ్ ఫోటోను చూపించింది. ఇంకోసారి ఏది పడితే అది మాట్లాడకు అంటూ అక్కడే ప్యాసింజర్‌ను వదిలేసింది. ఫోన్‌లో నిరుపమ్ ఫోటో చూస్తూ.. ఆటో నడుపుతే తప్పా? శౌర్య మొగుడు డాక్టర్ సాబ్ అని అనుకొంటుండగా.. గుడి వరకు ఆటో వస్తావా అంటే.. ఎందుకు రాను.. గుడికి వచ్చి నీతోపాటు దండం పెట్టుకొంటాను అని అక్కడి నుంచి జ్వాలా బయలు దేరింది. కార్తీకదీపం సీరియల్‌ తాజా ఎపిసోడ్ 1351లో ఏం జరిగిందంటే...

  హిమ, నిరుపమ్ ఎంగేజ్‌మెంట్

  హిమ, నిరుపమ్ ఎంగేజ్‌మెంట్

  గుడిలో హిమ, నిరుపమ్ నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. పూజా పీటలపై హిమ, నిరుపమ్ కూర్చొన్నారు. అయితే ప్రేమ్ రాలేదని సత్యం అంటే.. వచ్చి ఏం చేస్తాడు అని స్వప్న అంది. ఈ నిశ్చితార్థం జరుగుతుందని అనుకొంటున్నారా? నీ తెలివితేటలు నీవు చూపిస్తే.. నా తెలివి తేటలు నేను చూపిస్తా. ఈ నిశ్చితార్థం జరుగకుండా చూస్తా అని సౌందర్యకు స్వప్న మనసులో సవాల్ విసిరింది. ఈ నష్ట జాతకురాలిని కోడలుగా తీసుకెళ్తానని అందరూ అనుకొంటున్నారేమో. కానీ స్వప్న అంటే ఏమిటో ఈ రోజే చూపిస్తా అని స్వప్న సవాల్ విసిరింది.

  డాక్టర్ సాబ్ ఎక్కడున్నావు అంటూ

  డాక్టర్ సాబ్ ఎక్కడున్నావు అంటూ


  ఇక డాక్టర్ నిరుపమ్ ఫోన్ చేయకపోవడంతో.. ఏంటి డాక్టర్ సాబ్ ఉదయం నుంచి ఫోన్ చేయలేదు. నాకు ఆటో గిఫ్టుగా ఇచ్చాడు. ఇప్పుడు పెద్ద ఫోన్ కూడా గిఫ్టుగా ఇచ్చాడు. నాకు ప్రేమగా ఎందుకు బహుమతులు ఇచ్చాడో.. నేనంటే డాక్టర్ సాబ్‌కు మనసులో చాలా ప్రేమ ఉంది. తన మనసులో ఉన్న మాట చెబుతానని అన్నాడు. కానీ కుదర్లేదు అంటూ నిరుపమ్‌కు ఫోన్ చేసింది. అయితే ఫోన్ కలవకపోవడంతో ప్రేమ్ వద్దకు వెళితే తెలుస్తుంది. ఫోన్ కొనిచ్చావు.. కానీ ఫోన్ చేయవు. ఫోన్ చేస్తే కలువదు అని శౌర్య తనలో తాను మాట్లాడుకొన్నది.

  హిమ ఎంగేజ్‌మెంట్‌తో ప్రేమ్ ఎమోషనల్

  హిమ ఎంగేజ్‌మెంట్‌తో ప్రేమ్ ఎమోషనల్

  హిమకు నిశ్చితార్థం జరుగుతుంటే.. తనను తాను నిందించుకొన్నాడు. నీ పేరులో ప్రేమ ఉంది కానీ.. నీ జీవితంలో ప్రేమ లేదు. హిమపై ప్రేమను ముందే చెప్పి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదు. అంతా నాదే తప్పు అంటూ హిమ కోసం కొన్న ఉంగరాన్ని విసిరికొట్టాడు. ఆ తర్వాత చేతిలోకి తీసుకొని.. నిరుపమ్, హిమ ఎంగేజ్‌మెంట్‌కు వెళ్లకపోతే బాగుండదు. నేనే ఫోటోలు తీస్తానని చెప్పాను. వెళ్లకపోతే బాగుండదు. భగవంతుడా ఎందుకీ పరీక్ష నాకు అని ప్రేమ్ నిశ్చితార్థానికి బయలు దేరాడు. అయితే ప్రేమ్‌ను కలువడానికి వెళ్తే ఇంటికి తాళం వేసి ఉండటంతో మళ్లీ అక్కడి నుంచి బయలు దేరింది. నీరసంగా నిరుపమ్, హిమ ఎంగేజ్‌మెంట్ జరిగే ప్రదేశానికి ప్రేమ చేరుకొని ఫోటోలు తీయడం మొదలుపెట్టాడు.

  ఎంగేజ్‌మెంట్ రింగ్స్ కొట్టేసిన స్వప్న

  ఎంగేజ్‌మెంట్ రింగ్స్ కొట్టేసిన స్వప్న

  అయితే స్వప్న చాలా కూల్‌గా ఉండటంతో సౌందర్యలో అనుమానాలు తలెత్తాయి. ఇంత కూల్‌గా ఉందంటే ఏదో జరుగబోతుందా అని సౌందర్య అంటే.. నేను కూల్‌గా ఉన్నానని ఆలోచిస్తున్నావా? కాసేపట్లో ఏం జరుగబోతుందో చూడు అని స్వప్న మనసులో అనుకొన్నది. అంతలోనే ఉంగరాలు మార్చుకోండి అని పూజారి అంటే.. సత్యం అంటూ సౌందర్య పిలిస్తే.. జేబులో నుంచి రింగ్స్ బాక్స్ తీస్తే అందులో రింగ్స్ లేకపోవడంతో సత్యం కంగారు పడిపోయాడు. అత్తయ్య ఉంగరాలు కనిపించడం లేదు అని సత్యం అంటే.. ఉంగరాలు నేనే తీసేశాను. ఇప్పుడు నిశ్చితార్థం ఎలా జరుగుతందో చూద్దా అని స్వప్న మనసులో అనుకొన్నది. ఉంగరాలు మార్చుకోకపోతే నిశ్చితార్థం జరుగదా? అని స్వప్న అంటే.. తన బ్యాగులో నుంచి ఉంగరాలు తీసి.. ముందు జాగ్రత్త చర్యగా నేను తెచ్చాను. దీనిని ముందు చూపు అంటారు అని స్వప్నకు సౌందర్య షాకిచ్చింది.

  డాక్టర్ సాబ్.. పెళ్లికావాలని దండం పెట్టుకో

  డాక్టర్ సాబ్.. పెళ్లికావాలని దండం పెట్టుకో

  అంతలోనే నిరుపమ్, హిమ నిశ్చితార్థం జరిగే ఆలయానికి జ్వాలా వచ్చింది. నిరుపమ్ గురించి ఆలోచిస్తూ.. ఎక్కడికి వెళ్లావు డాక్టర్ సాబ్.. ఎక్కడని వెతకను. ఏ ఆపరేషన్‌లో ఉంటావో.. నిన్ను డిస్ట్రబ్ చేయను. నువ్వు ఎప్పుడు నా మనసులోను ఉంటావు. డాక్టర్ సాబ్ ఎక్కడ ఉన్నావు.. ఏం చేస్తున్నావు. డాక్టర్ సాబ్ మనిద్దరికి పెళ్లి కావాలని దేవుడికి దండం పెట్టుకొంటాను. మీరు ఎక్కడ ఉన్నా దేవుడికి దండం పెట్టుకో. డాక్టర్ సాబ్ నీతో పెళ్లి అయ్యాక నేను నిన్ను రాజులా చూసుకొంటాను అని జ్వాలా అంది. ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళగా.. అక్కడ జ్వాలాను హిమ చూసింది.

  శౌర్య కోసం నా ప్రేమను అడ్డేసా

  శౌర్య కోసం నా ప్రేమను అడ్డేసా

  కార్తీకదీపం తాజా ప్రోమోలో మరో ట్విస్టు ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించేలా ఉంది. నిరుపమ్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. సారీ బావా అంటూ పీటలపై నుంచి హిమ లేచింది. దాంతో గుడిలో ప్రదక్షిణాలు చేస్తున్న జ్వాలాతో భక్తురాలు మాట్లాడుతూ.. ఎవరో ఒక అమ్మాయి ఎంగేజ్‌మెంట్ జరుగుతుండగా.. ఇష్టం లేదని వెళ్లిపోయిందట అంటే.. అప్పటి వరకు ఆ అమ్మాయి మైండ్ ఏమైంది అంటూ జ్వాలా అంది. అయితే హిమ తన తల్లిదండ్రుల ఫోటో వద్ద నిలబడి.. మీరు చెప్పినట్టే.. నేను శౌర్య ప్రాణాలకు అడ్డువేస్తానని చెప్పాను. కానీ ఇప్పడు శౌర్య ప్రేమ కోసం నా ప్రేమను త్యాగం చేశా. శౌర్య మనసులో ఉన్నది నాకు తెలిసింది అని హిమ అనడం కనిపించింది.

  కార్తీకదీపం 18వ వారం రేటింగ్

  కార్తీకదీపం 18వ వారం రేటింగ్

  ఇక కార్తీకదీపం సీరియల్ రేటింగ్ 17వ వారంలో 11.42 రేటింగ్ నమోదు చేసుకొన్నది. అలాగే తాజా వారం 18వ వారంలో 11.48 రేటింగ్‌తో సరిపెట్టుకొన్నది. కంటెంట్‌లో ఏదైనా భారీగా, ఇంట్రెస్టింగా మార్పులు జరిగితే తప్ప.. రేటింగ్ మళ్లీ పూర్వస్థితికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  English summary
  Karthika Deepam May 13th Episode number 1351. Hima breaks her engagement with Nirupam for sister Shourya
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion