»   » ముమైత్‌ మూతికి ప్లాస్టర్.. ప్రిన్స్‌కు వింత శిక్ష.. కొత్త కెప్టెన్ ఆదర్శ్

ముమైత్‌ మూతికి ప్లాస్టర్.. ప్రిన్స్‌కు వింత శిక్ష.. కొత్త కెప్టెన్ ఆదర్శ్

Written By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షో 20వ ఎపిసోడ్‌లో ఇంటి వ్యవహారాలను చక్కగా చూసుకొనేందుకు కొత్త కెప్టెన్‌గా ఆదర్శ్ బాలకృష్ణను సభ్యులు ఎన్నుకొన్నారు. తెలుగు మాట్లాడటం లేదనే కారణంతో ముమైత్‌కు, పరభాషలో మాట్లాడటాన్ని ఆపడంలో కెప్టెన్‌గా విఫలమయ్యాడనే నెపంతో ప్రిన్స్‌‌కు బిగ్‌బాస్ శిక్ష విధించాడు. కొత్త కెప్టెన్‌ ఎన్నికల్లో ఓటు వేయలేదన్న కారణంతో ముమైత్ ఇంటి సభ్యులపై ఆలిగి కంటతడి పెట్టుకొన్నది. ఇంకా ఇంటిలో ఏమి జరిగిందంటే..

  సభ్యులపై బిగ్‌బాస్ కొరడా

  సభ్యులపై బిగ్‌బాస్ కొరడా

  తెలుగు రియాలిటీ షోలో పరభాషలో మాట్లాడుతున్న ఇంటి సభ్యులపై బిగ్‌బాస్ కొరడా ఝలిపించారు. ఇది పక్కాగా తెలుగు ప్రేక్షకుల కోసం రూపొందించిన కార్యక్రమం. అందువలన మీరు తెలుగులోనే మాట్లాడాలి. ఇతర భాషలు మాట్లాడకూడదనే నియమాన్ని ఉల్లంఘిస్తున్నారు. చాలా సార్లు చెప్పినా ఖాతరు చేయడం లేదు. ఇంటి సభ్యులు కూడా తెలుగు నేర్పించకుండా వారు కూడా ఇతర భాషలోనే మాట్లాడుతున్నారు. అందువలన ప్రిన్స్, ముమైత్‌కు శిక్ష విధిస్తున్నాను అని బిగ్‌బాస్ తెలిపారు.

  ముమైత్ మూతికి ప్లాస్టర్

  ముమైత్ మూతికి ప్లాస్టర్

  బిగ్‌బాస్ ఇంటిలో ముమైత్‌ తెలుగులో మాట్లాడటం లేదన్న కారణంతో ఆమె మూతికి ప్లాస్టర్ అంటించి శిక్షించదలచుకొన్నానని బిగ్‌బాస్ అన్నారు. పలుమార్లు ఆదేశించిన ఇంటి సభ్యులు రూల్స్ అతిక్రమిస్తున్నారు. అందుచేత తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూతికి ప్లాస్టర్ తీయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టర్ తీయకూడదు.

  ప్రిన్స్‌ను వదలని బిగ్‌బాస్

  ప్రిన్స్‌ను వదలని బిగ్‌బాస్

  ఇంటి సభ్యులను తెలుగులో మాట్లాడించడంలో విఫలమైన కెప్టెన్ ప్రిన్స్‌ను బిగ్‌బాస్ శిక్షించాడు. బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైన ప్రిన్స్.. స్విమ్మింగ్ పూల్‌లో 50 సార్లు మునక వేయాలి. మునక వేసిన ప్రతీసారి కెమెరా ముందుకు వచ్చి ‘ఇక నుంచి అందరం తెలుగులోనే మాట్లాడుతాం. మమ్మల్ని క్షమించండి' అని 50 సార్లు చెప్పాలి అనే శిక్ష‌ను బిగ్‌బాస్ విధించాడు.

  కొత్త కెప్టెన్ ఎంపిక కోసం ఎన్నిక

  కొత్త కెప్టెన్ ఎంపిక కోసం ఎన్నిక

  ఇంటికి కొత్త కెప్టెన్ ఎంపిక చేయాలని బిగ్‌బాస్ నిర్ణయించాడు. కెప్టెన్‌ పదవికి ముమైత్, ఆదర్శ్, కార్తీక కత్తి పేర్లను నామినేట్ చేశారు. కెప్టెన్ ఎన్నికకు ముందు అభ్యర్థులు సభ్యులను తనకు ఓటు వేయాలని అభ్యర్థించాలి. అందుకు ప్రచారం చేసుకోవచ్చని బిగ్‌బాస్ ఆదేశించారు.

  కెప్టెన్‌గా ఆదర్శ్ విజయం

  కెప్టెన్‌గా ఆదర్శ్ విజయం

  బిగ్‌బాస్ ఇంటిలో సభ్యులందరూ కెప్టెన్ ఎన్నికలో పాల్గొన్నారు. ముగ్గురు అభ్యర్థుల్లో తమకు నచ్చిన ఒకరికి ఓటు వేశారు. కార్తీకకు మూడు ఓట్లు, ముమైత్ నాలుగు ఓట్లు, ఆదర్శ్ ఐదు ఓట్లు వచ్చాయి. అత్యధికంగా ఓట్లు వచ్చిన ఆదర్శ్‌ను కెప్టెన్‌గా బిగ్‌బాస్ నియమించారు. దాంతో సభ్యులందరూ ఆదర్శ్‌కు అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికలో అభ్యర్థి కార్తీక. తన పోటీదారుడు ఆదర్శ్‌కు ఓటు వేయడం గమనార్హం.

  ఓటమిపై ముమైత్ మనస్తాపం

  ఓటమిపై ముమైత్ మనస్తాపం

  కెప్టెన్ ఎన్నికకు ముందు తనను ఎన్నుకోవాలి అని ముమైత్ అందరిని కోరింది. తాను ఎలిమినేషన్ రౌండ్‌లో ఉన్నాను. హౌస్ నుంచి బయటకు వెళ్లే లోపు ఒక్కసారి కెప్టెన్‌గా వ్యవహరించాలని ఉంది. అందుచేత తనకు ఓటు వేయాలని అభ్యర్థించింది. అయితే తనకు ఓటు వేయకపోవడంతో ముమైత్ మనస్తాపానికి గురైంది.

  ముమైత్ కంటతడి

  ముమైత్ కంటతడి

  తాను అభిమానించే ధన్‌రాజ్ కూడా నాకు ఓటు వేయకపోవడంపై ముమైత్ కంటతడి పెట్టింది. నాతో అందరూ బాగానే ఉంటారు కానీ ఓటు వేయలేదు అలిగింది. అర్చన, ధన్‌రాజ్‌తో వాగ్వాదానికి దిగింది. తాను ఎందుకు ఓటు వేయలేదో అనే విషయంపై ధన్ రాజ్ క్లారిటీ ఇచ్చినా ముమైత్ శాంతించలేదు.

  ఓపెన్‌గా మాట్లాడుతాను.

  ఓపెన్‌గా మాట్లాడుతాను.

  తాను అందరితో ఓపెన్‌గా మాట్లాడుతాను. నాకు 32 ఏళ్లు. నాకు అన్నీ తెలుసు. నేను దిల్ సే మాట్లాడుతాను. గేమ్స్ ఆడను అని కంటతడి పెట్టింది. ముమైత్‌కు కెప్టెన్ పదవి ఇప్పుడు అవసరం లేదు. తాను ఇంకా కొన్ని రోజులు హౌస్‌లో ఉంటుంది అని ధన్‌రాజ్ చెప్పాడు.

  పుస్తకం రాస్తా.. కత్తి మహేశ్

  పుస్తకం రాస్తా.. కత్తి మహేశ్

  బిగ్‌బాస్‌లో విజేతగా నిలుస్తాననే భరోసా నాకు ఉంది అని ధన్ రాజ్ చెప్పాడు. ధన్ రాజ్‌తో మాట్లాడుతూ.. ఇంటిలో జరిగి అన్ని విషయాలను వెల్లడిస్తూ ఓ పుస్తకం రాస్తాను అని కత్తి మహేశ్ అన్నారు. తాను కూడా ఓ పుస్తకం రాస్తానని ధన్ రాజ్ చెప్పడం గమనార్హం.

  English summary
  Biggboss Telugu reality show reached to 20th episode. Biggboss punished Mumaith Khan, Prince for not following the rules. As part of the game, Aadarsh elected as new captain. Mahesh katti said that after Biggboss he is going to write a book.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more