అతడితో ఎన్నోసార్లు పెళ్లైంది.. ఆయనతోనే మానసిక బంధం.. బ్రహ్మముడి కావ్య షాకింగ్‌గా
స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్‌లో కావ్యగా లీడ్ రోల్ పోషిస్తున్నారు దీపిక రంగరాజు. భర్త, అత్తగారి చేతిలో తొలుత అవమానాలు అనుభవించి.. ఆ తర్వాత భర్తకు సర్వస్వంగా మారే ఇల్లాలి పాత్రలో దీపిక అద్భుతంగా నటిస్తున్నారు. పుట్టినింటికీ, మెట్టినింటికీ వారధిలా రెండు కుటుంబాల గౌరవం కాపాడే బరువైన రోల్ ఆమెను కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసింది. దీపిక నటనను తెలుగు ప్రేక్షకులు కూడా మెచ్చుకుంటూ తెలుగింటి ఆడపడచుగా గౌరవిస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
న్యూస్ రీడర్ నుంచి నటిగా
తమిళనాడులోని పన్‌రుతికి చెందిన దీపిక రంగరాజు... స్థానికంగానే చదువుకున్నారు. మామండూరులోని దివంగత విజయకాంత్‌కు చెందిన శ్రీ ఆండాల్ అలగర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేశారు. ఆ తర్వాత విజయకాంత్‌కే చెందిన కెప్టెన్ టీవీలో సాధారణ న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ. 2019లో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన దీపిక..... ఆరడి అనే సినిమాలో నటించారు. తొలి చిత్రంతోనే అమెరికన్ గోల్డెన్ పిక్చర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి పురస్కారం పొందారు. 2021లో తమిళ బుల్లితెరపై అడుగుపెట్టిన దీపికా రంగరాజు... చిత్తిరం పెసుతాడి సీరియల్‌లో నటించారు. ఈ క్రమంలో 2022లో తెలుగులో బ్రహ్మముడి సీరియల్‌లో దీపికకు అవకాశం వచ్చింది.

మానస్ దొరకడం నా అదృష్టం
బ్రహ్మముడి సీరియల్‌లో కావ్యగా దీపిక రంగరాజు.. రాజ్‌గా బిగ్‌బాస్ ఫేమ్ మానస్‌లు లీడ్ రోల్ పోషించారు. తన సహనటుడు మానస్ గురించి ఎన్నోసార్లు గొప్పగా చెప్పుకొచ్చారు దీపిక. బ్రహ్మముడిలో ఛాన్స్ దొరకడం ఒక అదృష్టమైతే, రాజ్ దొరకడం మరొక అదృష్టమని దీపిక చెప్పారు. మానస్ చాలా సపోర్టివ్‌గా ఉంటారని.. సీరియల్‌తో పాటు పలు ఈవెంట్స్ కోసం ఖచ్చితంగా డ్యాన్స్ వేయాల్సిందేనని తెలిపింది. ఈ సమయంలో మానస్ సాయం చేసేవాడని దీపిక గుర్తుచేసుకుంది. తాజాగా కొద్దిరోజుల క్రితం స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకు బ్రహ్మముడి టీం మొత్తం హాజరైంది. ఈ సందర్భంగా దీపిక అల్లరి చేస్తూ మానస్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు.
నాకు ఎన్నోసార్లు పెళ్లయ్యింది
నేను నీతో ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అని చెప్పడంతో యాంకర్ శ్రీముఖి షాక్ అయ్యింది. ఏ రోజైతే మా రాజ్ పెళ్లి చేసేసుకున్నాడో, ఈ అమ్మాయి కూడా అతి త్వరలో పెళ్లి చేసేసుకుంటుందని చెబుతుంది. దాంతో ఎన్నోసార్లు పెళ్లి అయ్యిందిలేండి అని పంచ్ విసిరింది దీపిక. కాసేపటికీ నా రాజ్ ఎక్కడంటూ దీపిక అడగ్గా... ఆ రాజ్ ఎప్పుడూ ఓ ప్లేస్‌లో ఉండడని ముక్కు అవినాష్ సెటైర్లు వేయగా... కానీ ఎప్పుడూ నా మనసులోనే ఉంటాడని దీపిక చెప్పింది. ఆ వెంటనే రాజ్... తన ఫ్రెండ్‌ని తీసుకుని స్టేజ్ మీదకి ఎంట్రీ ఇవ్వడంతో అంతా షాక్ అయ్యారు.
పండగ పూట కూడా పాత పెళ్లామేనా?
ఎవరీ కొత్త వయ్యారీ అని శ్రీముఖి అడగ్గా.. బ్రహ్మముడి వన్ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నారు కదా? పండగ రోజు కూడా పాత పెళ్లాం ఎందుకని మా ఫ్రెండ్‌తో వచ్చానని మానస్ సెటైర్లు వేశాడు. ఆ మాటలకు దీపిక షాకై.... నువ్వు కట్టిన తాళి నా మెడలో ఉందని అంటుంది. దాంతో ఏది అని రాజ్ ప్రశ్నించడంతో దీపిక అవాక్కయ్యింది. ఈ షోలో మానస్‌తో కలిసి ఆమె చేసిన అల్లరి ఇంతా కాదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీపిక రంగరాజు పెళ్లి గురించి పలుమార్లు సోషల్ మీడియాలో గాసిప్స్ వచ్చాయి. ఆమె ఓ నటుడితో రిలేషన్‌లో ఉందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని పుకార్లు చక్కర్లు కొట్టాయి. చివరికి అవి గాలి వార్తలుగా మిగిలిపోయాయి.


Click it and Unblock the Notifications










