Brahmamudi August 16th Episode: రుద్రాణి క్రూరమైన పథకం.. ప్రమాదంలో అప్పూ ప్రెగ్నెన్సీ

Photo Courtesy: JioHotstar

కావ్యతో వరలక్ష్మీ వ్రతం చేయించి రాజ్ చేతుల మీదుగా అక్షింతలు వేయించాలని ఇందిర, అపర్ణ ప్లాన్ చేస్తారు. ఇందుకు స్వరాజ్‌ను పావుగా వాడుకుంటారు. కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని యామినికి చేరవేస్తుంది రుద్రాణి. కావ్య నోటితోనే తాను ప్రెగ్నెంట్ అన్న మాటను చెప్పించి.. రాజ్‌కు దూరం చేయాలని ప్లాన్ చేస్తారు. కుటుంబాన్ని వదులుకోలేక నీ ప్రేమను కావ్య రిజెక్ట్ చేసిందని రాజ్‌ మనసును మార్చాలని చూస్తుంది యామిని.

కావ్య కిచెన్‌లో వంట చేస్తుండగా అపర్ణ, ఇందిరలు మండిపడి వరలక్ష్మీ వ్రతం కోసం సిద్ధం కావాల్సిందిగా చెబుతారు. అప్పూ వంట చేస్తుండగా ధాన్యలక్ష్మీని తీసుకుని వెళ్లి చూపించి ఆ కావ్య కావాలనే అప్పూ చేత వంట చేయిస్తోందని చెబుతుంది. ఇదివరకటిలా నీ బుట్టలో పడటానికి నేను రెడీగా లేనని ధాన్యలక్ష్మీ చెప్పడంతో రుద్రాణి అవాక్కవుతుంది. స్వరాజ్‌ను తీసుకుని దుగ్గిరాల వారింటికి వస్తాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆగస్ట్ 16వ తేదీ ఎపిసోడ్ 802లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial August 16th 2025 Episode 802 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

వరలక్ష్మీ వ్రతానికి అందంగా రెడీ అయిన కావ్యని అందరి ముందు మెచ్చుకుంటాడు రాజ్. నన్ను వెళ్లిపోమంటావా? ఉండమంటావా? అని కావ్యను స్వరాజ్ బెదిరిస్తాడు. ఆరోజు గుడిలో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్లమని చాక్లెట్ ఇచ్చావని మా ఫ్రెండ్‌కి చెప్పేస్తానని అంటాడు. ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది. పిల్లాడి ప్లాన్‌కి రాజ్ మురిసిపోతాడు. వారిద్దరిని చూసిన రుద్రాణి.. కావ్య చేత వ్రతం చేయించి, వాడి చేత అక్షింతలు వేయించి వ్రతం పూర్తి చేద్దామని చూస్తోందని రాహుల్‌తో అంటుంది. కావ్య కడుపుతో ఉన్న విషయాన్ని రాజ్‌కి తెలిసేలా చేస్తానని చెబుతుంది రుద్రాణి. వీళ్లంతా కలిసి మోసం చేశారని, ఆ కావ్యని ఛీకొట్టి వెళ్లిపోయేలా చేస్తానని అంటుంది.

వ్రతం హడావుడిలో ఉన్న కావ్య దగ్గరికి అప్పూ వచ్చి నా దగ్గర ఆ టాబ్లెట్స్ అయిపోయాయి.. నీ దగ్గర ఉంటే ఇస్తావా? అని గట్టిగా అరుస్తుంది. ఈ విషయం అందరూ విన్నారంటూ నేను కడుపుతో ఉన్నానని తెలిసిపోతుందని కావ్య కోప్పడుతుంది. ఇంతలో కనకం వచ్చి.. నిన్ను చూస్తుంటే ఆనందపడాలో? బాధపడాలో అర్ధం కావడం లేదని అంటుంది. ఆ దేవుడు అందరి తలరాతలు ఒకేలా రాయడు కదా.. అప్పూకి కళ్యాణ్ లాంటి మంచి భర్తను ఇవ్వడంతో పాటు ఎప్పుడూ తన పక్కనే ఉండే అదృష్టాన్ని ఇచ్చాడని అంటుంది కావ్య. నాకు భర్త మంచోడే అయినా అన్ని కష్టాలే, కన్నీళ్లేనని చెబుతుంది. కనీసం మీరు నా భర్త అని చెప్పుకునే అదృష్టం కూడా లేదని.. ఆయన పక్కన కూర్చొని పూజలు, వ్రతాలు చేసుకునే సౌభాగ్యం కూడా లేదని అంటుంది.

కానీ కవిగారు అప్పూకి ఆనందాన్ని ఇచ్చారని, నా భర్త అని చెప్పుకునే అదృష్టాన్ని ఇచ్చారని.. తనతో పాటు సంతోషంగా వ్రతం చేసుకునే సౌభాగ్యాన్ని ఇచ్చారని చెబుతుంది కావ్య. వాటితో పాటు ఇప్పుడు కూడా అప్పూని తల్లిని కూడా చేయబోతున్నారని, మన అప్పూ చాలా అదృష్టవంతురాలని అంటుంది. కానీ నేనే చాలా దురదృష్టవంతురాలినని.. అందుకే నాకు కష్టాలు, ఇవన్నీ అని కావ్య బాధపడుతుంది. వారి మాటలను విన్న రుద్రాణి వెంటనే ధాన్యలక్ష్మీని తీసుకొచ్చి కావ్య- కనకం ఏ మాట్లాడుకుంటున్నారో చూపిస్తుంది.

అప్పూకి ఉన్న సంతోషం, అదృష్టం నాకు లేవని కావ్య ఎలా బాధపడుతుందో చూస్తున్నావా? అని ధాన్యంతో అంటుంది రుద్రాణి. నేను చెబితే కావ్య అలాంటిది కాదు, మా ఇద్దరి మధ్య తగవులు పెట్టొద్దని అన్నావని మండిపడుతుంది. అప్పూ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది. రాజ్, స్వరాజ్‌లు ఇద్దరికీ పట్టుబట్టలు కట్టుకోమని ఇస్తాడు కళ్యాణ్. మాకెందుకు మేం వరలక్ష్మీ వ్రతంలో కూర్చోం కదా అని చెబుతాడు రాజ్. నువ్వు అప్పూ పక్కన కూర్చుంటావ్.. నేను ఎవరి పక్కన కూర్చోను అని అడగ్గా.. నువ్వు ఆంటీ పక్కన కూర్చో అని పిల్లాడు అంటాడు.

అప్పూకి కావ్య టాబ్లెట్ ఇవ్వడం చూసిన రుద్రాణి కొడుకుతో కలిసి కొత్త కుట్ర చేస్తుంది. అదే కంపెనీతో ఉన్న మరో టాబ్లెట్‌తో అప్పూ టాబ్లెట్స్‌ని మార్చేయాలని రాహుల్‌కు చెబుతుంది. నేను ఆల్రెడీ ధాన్యలక్ష్మీని కావ్యకి వ్యతిరేకంగా తయారు చేస్తున్నానని, ఈర్ష్యతో తన కోడలు కడుపు పోగొట్టాలని చూసిందని ధాన్యం నిలదీస్తుంది. దీంతో కావ్య తట్టుకోలేక తను కూడా ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని బయటపెడుతుందని అంటుంది. రేవతి కొడుకు బాగా ముస్తాబై ఎలా ఉన్నానని ఇందిరను అడుగుతాడు. నీకెంటీ పిల్ల జామీందార్‌లా ఉన్నావని చెబుతుంది ఇందిర.

అయితే నాకు చాక్లెట్ ఇవ్వమని ఇందిరను అడుగుతాడు స్వరాజ్. నా దగ్గర లేవని ఆమె చెప్పడంతో చాక్లెట్ ఇవ్వకపోతే నువ్వు మా ఇంటికి వస్తున్నావని మా ఫ్రెండ్‌కి చెప్పేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తాడు పిల్లాడు. దాంతో భయపడిన ఇందిర.. ఇంట్లో చాక్లెట్స్ లేవని ఎలాగోలా తెప్పిస్తానని అంటుంది. చాక్లెట్ తెప్పించమని సుభాష్, ప్రకాశంలను ఇందిర అడగ్గా వాళ్లిద్దరూ విసుక్కుంటారు. దీంతో ఏం చేయాలో తెలియక ఇందిర టెన్షన్ పడుతుంది. ఈలోగా అపర్ణ.. తన మనవడికి చాక్లెట్ ఇవ్వడంతో పెద్దావిడ ఊపిరి పీల్చుకుంటుంది.

అప్పూకి ధాన్యలక్ష్మీ టిఫిన్ పెడుతుంది.. టాబ్లెట్ తీసుకొచ్చేందుకు ఆమె పైకి పెళ్లేలోగా ట్యాబ్లెట్స్ మార్చేస్తాడు రాహుల్. టాబ్లెట్ తీసుకొచ్చి అప్పూ చేత వేయిస్తుంది ధాన్యలక్ష్మీ. తమ ప్లాన్ సక్సెస్‌ఫుల్‌గా వర్కవుట్ అయినందుకు రాహుల్, రుద్రాణిలు సంతోషిస్తారు. వ్రతం కోసం అందంగా ముస్తాబైన రాజ్‌ను చూసి కావ్య ఎంతో సంతోషిస్తుంది. పట్టుబట్టల్లో నేను బాగున్నానా అని అడుగుతాడు.. సూపర్‌గా ఉన్నారని చెబుతుంది కావ్య. రోజూ ఇక్కడికి రావడం, తిరిగి మా ఇంటికి వెళ్లిపోవడం నాకెం నచ్చడం లేదని అంటాడు రాజ్.

మీ పక్కనే మీతోనే ఉండిపోవాలని ఉందని చెబుతాడు రాజ్. అయితే ఉండిపోండి అని కావ్య అనడంతో రాజ్ సంతోషిస్తాడు. మిమ్మల్ని మా వాళ్లు దత్తత తీసుకుంటామని చెబుతున్నారు కదా అని కావ్య చెబుతుంది. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. వ్రతం మొదలు కాబోతుండటంతో పనులు ఇంకా పూర్తి కాలేదా? అని అప్పూ, స్వప్నలపై మండిపడుతుంది కావ్య. పిల్లల తల్లి కష్టాలు నీకు తెలియవని, నీకు కూడా పిల్లలు పుడితే అప్పుడు తెలుస్తుందని చెబుతుంది స్వప్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X