Brahmamudi August 18th Episode: మరోసారి పెళ్లికి నో.. రాజ్ మనసు ముక్కలు చేసిన కావ్య
Photo Courtesy: JioHotstar
ఇందిర చెప్పినట్లే స్వరాజ్‌ను తీసుకుని దుగ్గిరాల వారింటికి వస్తాడు రాజ్. బాబును చూడగానే అపర్ణ చాలా సంతోషిస్తుంది.. కానీ పిల్లాడిని తీసుకురావాలన్న ప్లాన్ తనదేనని తెలియనట్లుగా నటిస్తుంది. వరలక్ష్మీ వ్రతానికి చీర కట్టుకుని అందంగా రెడీ అయిన కావ్యకి కాంప్లిమెంట్ ఇస్తాడు రాజ్. కావ్య చేత వ్రతం చేయించి రాజ్ చేత అక్షింతలు వేయించాలని అనుకున్న అపర్ణ ప్లాన్‌ను చెడగొట్టాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఈరోజే బయటపెట్టి రాజ్ మనసు విరగ్గొడతానని అనుకుంటుంది.
తన దగ్గర టాబ్లెట్స్ అయిపోయాయని నీ దగ్గర ఉంటే ఇవ్వమని తీసుకుంటుంది అప్పూ. అది గమనించిన రుద్రాణి.. అప్పూ టాబ్లెట్స్ ప్లేస్‌లో మరో టాబ్లెట్ మార్చమని కొడుకుతో చెబుతుంది. అప్పూని కళ్యాణ్ బాగా చూసుకుంటున్నాడని నాకు ఆ అదృష్టం లేదని కనకంతో చెప్పుకుని కావ్య బాధపడుతుండగా ఆ మాటలను ధాన్యలక్ష్మీకి వినిపిస్తుంది రుద్రాణి. అప్పూకి ధాన్యలక్ష్మీ టిఫిన్ పెట్టి టాబ్లెట్స్ వేస్తుంది. తమ ప్లాన్ వర్కవుట్ కావడంతో రాహుల్- రుద్రాణి సంబరపడిపోతారు. వ్రతం కోసం పట్టుబట్టలు కట్టుకున్న రాజ్‌ను చూసి సంతోషించి పెళ్లయిన కొత్తలో భర్తతో కలిసి వరలక్ష్మీ వ్రతం చేసుకున్న రోజును గుర్తు చేసుకుంటుంది కావ్య. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆగస్ట్ 18వ తేదీ ఎపిసోడ్ 803లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కావ్య, స్వప్న, అప్పూలు హ్యాపీగా ఉండటం చూసి రుద్రాణి తట్టుకోలేకపోతుంది. వెంటనే వాళ్ల ఆనందం చెడగొట్టాలని.. కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని బయటపెట్టాలని అనుకుంటుంది. ఇందుకు రేవతి కొడుకును వాడుకోవాలని అనుకుంటుంది. నీకు చాక్లెట్ ఎవరిచ్చారు అని స్వరాజ్‌ని అడుగుతుంది రుద్రాణి. ఆంటీ ఇచ్చిందని పిల్లాడు చెప్పగా మరి తనకి కంగ్రాట్స్ చెప్పావా అని ప్రశ్నిస్తుంది. చాక్లెట్ ఇస్తే ఎవరైనా థ్యాంక్స్ చెబుతారు కానీ కంగ్రాట్స్ చెబుతారా అని అడుగుతాడు స్వరాజ్. కానీ నీకు చాక్లెట్ ఇచ్చిన ఆంటీ త్వరలోనే నీతో ఆడుకోవడానికి ఒక బుల్లి ఫ్రెండ్‌ని కూడా ఇవ్వబోతోంది కదా అందుకే కంగ్రాట్స్ చెప్పాలని అంటుంది రుద్రాణి. అయితే వెంటనే తనకి కంగ్రాట్స్ ఆంటీ అని చెప్పమనడంతో స్వరాజ్ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తాడు.
పూలు కడుతున్న కావ్యతో కంగ్రాట్స్ అని చెబుతాడు స్వరాజ్. దాంతో నాకెందుకు రా కంగ్రాట్స్ చెబుతున్నావ్ అని ప్రశ్నిస్తుంది కావ్య. నువ్వు కడుపుతో ఉన్నావ్ కదా అని పిల్లాడు అనడంతో కావ్య సహా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. త్వరలోనే నువ్వు నాకు ఫ్రెండ్‌ని ఇస్తున్నావ్ కదా అందుకే చెబుతున్నానని అంటాడు. నీకు కంగ్రాట్స్ చెబితే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా అని అడుగుతాడు స్వరాజ్. పిల్లాడి మాటలతో కావ్యకు ఏం చెప్పాలో తెలియదు. నా కూతురు కడుపుతో ఉందని నీకెలా తెలుసని కనకం పిల్లాడిని అడుగుతుంది. దాంతో ఆ ఆంటీ చెప్పిందని రుద్రాణి వంక చూపిస్తాడు స్వరాజ్.
ఆ మాటలతో రుద్రాణిపై మండిపడుతుంది ఇందిర. ఆ వెంటనే రాజ్ వచ్చి కళావతి కడుపుతో ఉందని ఎందుకు చెప్పాల్సి వచ్చిందని నిలదీస్తాడు. దాంతో కడుపుతో ఉందని చెప్పిన మాట నిజమేనని రుద్రాణి అంగీకరిస్తుంది. నేను వాడికి చూపించింది అప్పూని అని మాట మార్చేస్తుంది. ఒక్క క్షణం నా గుండె ఆగిపోయిందని రాజ్ అంటాడు. ఎందుకని కనకం అడగ్గా.. పెళ్లి కాకుండా కళావతి గారికి కడుపు అంటే టెన్షన్ పడరా అని మండిపడతాడు రాజ్. ఆ దేవుడు నీకు నోరు ఇచ్చాడు కదా అప్పూ కడుపుతో ఉందని చెప్పలేవా? అని రుద్రాణిపై ఫైర్ అవుతుంది ఇందిర. మీరెందుకు సైలెంట్ అయ్యారని కళావతిని రాజ్ ప్రశ్నించగా పాపం టెన్షన్‌లో కన్‌ఫ్యూజ్ అయ్యుంటుందని చెబుతుంది కనకం.
ఈ గొడవ సద్దుమణిగిన తర్వాత కనకాన్ని ఇందిర, అపర్ణలు బయటికి తీసుకెళ్లి రాజ్ చేత కావ్యపై అక్షింతలు ఎలా వేయించాలో ఆలోచించావా అని అడుగుతారు. ఆ యామిని పెళ్లిలో వాళ్లకి తెలియకుండా ఉంగరాలే మార్చేశా.. ఇక ఈ పూజలో అల్లుడుగారి చేత అక్షింతలు వేయించలేనా అని ప్రశ్నిస్తుంది. వరలక్ష్మీ వ్రతం పూజ చేస్తుండగా అప్పూకి ఇంకా ఏం కాలేదని రుద్రాణి, రాహుల్‌లు వెయిట్ చేస్తుంటారు. నిజంగానే అప్పూ టాబ్లెట్స్ మార్చేశావా అని రాహుల్‌ని అడుగుతుంది రుద్రాణి.
తర్వాత రాహుల్, కళ్యాణ్‌లు స్వప్న, అప్పూలను ఆశీర్వదిస్తారు. నా కోరిక నెరవేరాలనే దీవించావ్ కాబట్టి మగపిల్లాడే పుడతాడని అంటుంది అప్పూ. లేదు ఆడపిల్లేనని ఇద్దరూ గొడవ పడతారు. ఇంతలో అప్పూకి కళ్లు తిరిగి పడిపోబోతుంది.. నేను పెట్టిన టిఫిన్ పూర్తిగా తినలేదని, అందుకే నీరసం వచ్చిందని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. అప్పూకి ఏం కాకపోవడంతో రుద్రాణికి అనుమానం వస్తుంది. మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని కావ్యకి చెబుతుంది అపర్ణ. దాంతో కావ్య వచ్చి ఆశీర్వాదం తీసుకోబోతుండగా రాజ్ చేతిలోని ప్లేట్‌ని లాగేస్తుంది కనకం. దాంతో కావ్య సహా దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది.
నేనేం కావాలని వేయలేదని, మీ అమ్మగారి చేయి తగిలి అక్షింతలు మీ మీద పడ్డాయని అంటాడు రాజ్. నీ చేతుల మీదుగా మా కళావతి మీద అక్షింతలు పడాలని ఆ అమ్మవారే నిర్ణయించుకున్నట్లుగా ఉన్నారని అంటుంది కనకం. అనుకున్న ప్లాన్ అంతా ఫెయిల్ అయ్యిందని, రాజ్ ఎదుట అప్పూకి ఏమైనా జరుగుతుందేమో.. అంతా కావ్య వల్లే జరిగిందని ధాన్యలక్ష్మీ గొడవ చేస్తే కావ్య కడుపుతో ఉందన్న నిజం బయటపడుతుందని ఆశపడ్డానని అంటుంది రుద్రాణి.
పూజ ముగిసిన తర్వాత కావ్యని గార్డెన్‌లోకి తీసుకొచ్చి నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించారని అడుగుతాడు రాజ్. నేను మీ ఇంట్లోనే ఉండిపోవాలని అనుకుంటుంది.. ఈ ఇంట్లో మనిషిగా కాదు, మీ మెడలో తాళి కట్టి, మీ భర్తగా ఉండాలని అనుకుంటున్నానని చెబుతాడు. ఆ మాటలతో కావ్య కోప్పడుతుంది. ఇందాక వ్రతం జరుగుతుండగా అనుకోకుండా నా చేతుల మీద నుంచి మీ మీద అక్షింతలు పడితేనే ఇంట్లో అందరూ ఎంతో సంతోషించారని అంటాడు రాజ్. మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తిగా, మీ భర్తగా జీవితాంతం మీ పక్కనే ఉంటే వాళ్లు ఇంకెంత హ్యాపీగా ఫీలవుతారో అని అంటాడు.
గత జన్మ కర్మ ఫలితమే ఈ జన్మ రుణబంధం అంటారని.. ఏ జన్మలో ఏ రుణం మిగిలిపోయిందో మళ్లీ ఈ జన్మలో మిమ్మల్ని కోరుకుంటున్నానని అంటాడు. నా మనసుకి మీరు తప్పించి ఇంకెవ్వరూ నచ్చడం లేదని చెబుతాడు. ఆ రోజు ఎందుకు వద్దు అనుకున్నారో కారణం నాకు చెప్పాల్సిన అవసరం లేదు.. మిమ్మల్ని ఎందుకు కావాలని అనుకుంటున్నానో వంద కారణాలు చెబుతానని అంటాడు. ఆ మాటలతో కావ్య బాధపడుతుంది. మీరు ప్రపోజ్ చేసే సమయంలోనే నేను ప్రెగ్నెంట్ అని తెలిసిందని.. మీకు గతం గుర్తొచ్చే వరకు నేను వెయిట్ చేస్తానని అనుకుంటుంది కావ్య.


Click it and Unblock the Notifications











