Brahmamudi August 19th Episode: కావ్యని గొడ్రాలన్న ధాన్యలక్ష్మీ.. నిజం బయటపెట్టిన కనకం
Photo Courtesy: JioHotstar
కావ్య ప్రెగ్నెంట్ అని ఎలాగైనా బయటపెట్టాలని ప్లాన్ చేసిన రుద్రాణి.. వెంటనే స్వరాజ్ దగ్గరికి వెళ్లి కావ్య ప్రెగ్నెంట్ అని ఆమెకు కంగ్రాట్స్ చెప్పమని అంటుంది. పిల్లాడు వెంటనే కావ్య దగ్గరికి వెళ్లి నువ్వు ప్రెగ్నెంట్ అంట కదా అని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ, రాజ్ షాక్ అవుతారు. కావ్య ప్రెగ్నెంట్ అని నీకు ఎవరు చెప్పారని స్వరాజ్‌ను కనకం అడగ్గా.. రుద్రాణి అని చెబుతాడు. దాంతో నేను అప్పూ గురించి చెబితే బాబు కావ్యకి కంగ్రాట్స్ చెప్పాడని తప్పించుకుంటుంది రుద్రాణి.
వరలక్ష్మీ వ్రతం ముగిసిన తర్వాత స్వప్న, అప్పూలు వారి భర్తల నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు. రాజ్ చేతుల మీదుగా కావ్యపై అక్షింతలు పడేలా కనకం మాయ చేస్తుంది. దీంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆనందిస్తారు. టాబ్లెట్స్ మార్చినా అప్పూకి ఏం కాకపోవడంతో రుద్రాణి, రాహుల్‌లు టెన్షన్ పడతారు. వ్రతం తర్వాత కావ్యను గార్డెన్‌లోకి తీసుకెళ్లి తనను పెళ్లి చేసుకోమని అడుగుతాడు రాజ్. భర్త తనపై చూపిస్తున్న ప్రేమకు పొంగిపోతున్నప్పటికీ.. అతనికి ఎక్కడ గతం గుర్తొస్తుందోనని కావ్య బాధపడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఆగస్ట్ 19వ తేదీ ఎపిసోడ్ 804లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాజ్ మరోసారి తన మనసులోని మాటను చెప్పగా.. కావ్య మండిపడుతుంది. రామ్ గారు మీకేమైనా పిచ్చా.. మీరంటే నాకు ఇష్టం లేదు, మిమ్మల్ని ఓ ఫ్రెండ్‌లాగానే చూశాను తప్పించి వేరే ఉద్దేశం లేదు.. అయినప్పటికీ వినిపించుకోకుండా పెళ్లి పెళ్లి అని చంపుతున్నారేంటీ అని మండిపడుతుంది. మీకు ఈ ఇంటికి రావాలని ఉంటే రావొచ్చు, వెళ్లొచ్చు అంతేకానీ నాతో ప్రేమ, పెళ్లి అని అంటే మాత్రం మీకు మర్యాదగా ఉండదని కావ్య వార్నింగ్ ఇస్తుంది. మరోసారి ఈ టాపిక్ గురించి మాట్లాడాలనిపిస్తే ఈ ఇంటికి రావొద్దు.. లేదు నేను ఇలాగే ఉంటాను, నన్ను పెళ్లి చేసుకునే వరకు వదలను అనుకుంటే మీ కంటికి కనిపించనంత దూరంగా వెళ్లిపోతానని చెబుతుంది కావ్య. ఆ మాటలతో రాజ్ మనసు ముక్కలు అవుతుంది. నా కారణంగా మీరు ఎక్కడికి వెళ్లొద్దని.. నేనే మీకు దూరంగా వెళ్లిపోతానని చెబుతాడు రాజ్.
మనం అనుకున్నట్లే వరలక్ష్మీ వ్రతాన్ని సక్సెస్ చేశామని కనకం, ఇందిర, అపర్ణలు సంతోషిస్తారు. టాబ్లెట్స్ మార్చినా అప్పూకి ఏం కాకపోవడంతో రాహుల్‌పై మండిపడుతుంది రుద్రాణి. అప్పూ ప్రసాదం తీసుకోబోతుండగా కళ్లు తిరిగి పడిపోతుంది. వ్రతం అంతా అయిపోయాక ఇప్పుడు టాబ్లెట్ పనిచేసిందని రుద్రాణి నిరాశ పడుతుంది. అది రాజ్ ఉన్నప్పుడు పడిపోయుంటే మనకి ఉపయోగం, ఇప్పుడు ఏ యూజ్ లేదని చెబుతుంది రుద్రాణి. కావ్య వచ్చి అప్పూ ఎందుకు పడిపోయిందని అడుగుతుంది. ఇంతలో ఫ్యామిలీ అంతా డాక్టర్‌కు ఫోన్ చేయగా ఆమె వచ్చి టెస్టులు చేస్తుంది.
నేనెందుకు పడిపోయానని డాక్టర్‌ను అప్పూ అడుగుతుంది. ఫుడ్ ఇన్‌ఫెక్షన్ అయ్యిందని డాక్టర్ చెబుతుంది. ఉదయం నుంచి ఏం తిన్నావని అడగ్గా టాబ్లెట్ వేసుకుని టిఫిన్ చేశానని అంటుంది అప్పూ. డాక్టర్ ఆ టాబ్లెట్ చూసి నువ్వు పడిపోయింది ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల కాదని, ఈ టాబ్లెట్ వల్ల అని చెబుతుంది. డాక్టర్ మాటలతో అప్పూ బాధపడుతుంది. బయటికొచ్చాక అప్పూకి ఏం జరిగిందని డాక్టర్‌ను అడుగుతుంది ధాన్యలక్ష్మీ. ఈ టాబ్లెట్ వల్లే అప్పూ పడిపోయిందని చెబుతుంది డాక్టర్. మీరు రాసిచ్చిన టాబ్లెట్ ఇదేనని, దీనినే వేసుకుంటుందని అంటుంది ధాన్యలక్ష్మీ. ఇది నేను రాసిచ్చినదేనని, కానీ ఎక్స్‌పైర్ అయిపోయిందని చెబుతుంది డాక్టర్. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. తనకు 3 నెలలు వచ్చిందని, జాగ్రత్తగా ఉండండి అని చెబుతుంది.
ఏంటీ కావ్య ఇది చూసుకోవాలి కదా అని అంటుంది రుద్రాణి. టాబ్లెట్ వేసుకుంది అప్పూ అయితే కావ్యని ఎందుకు నిలదీస్తున్నావని మండిపడుతుంది అపర్ణ. ఎందుకంటే ఆ టాబ్లెట్ ఇచ్చింది కావ్య కాబట్టి అని చెబుతుంది రుద్రాణి. మార్నింగ్ అప్పూకి టాబ్లెట్ ఇచ్చింది నేనే అని అంగీకరిస్తుంది కావ్య. ఆ మాటలతో ధాన్యలక్ష్మీ పూనకం వచ్చినట్లు ఊగిపోతుంది. నీ కోడల్ని జాగ్రత్తగా చూసుకోమని ముందు నుంచి నేను చెబుతూనే ఉన్నానని చెబుతుంది రుద్రాణి. ఈ ఇంట్లో ఎవరిని నమ్మినా, నమ్మకపోయినా నిన్ను నమ్మానని.. కానీ నీ మనసులో ఇంత కుట్ర పెట్టుకుని నా కోడలి కడుపు పోగొడతావని అనుకోలేదని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ.
కావ్య అలా చేస్తుందని ఎలా అనుకుంటుంది.. కావ్య గురించి నీకు తెలియదా అని మండిపడుతుంది అపర్ణ. తను తల్లి కాలేకపోయింది కాబట్టి.. తనే మొదటి వారసుడిని ఇవ్వాలని అనుకుందని, అది జరగకపోయేసరికి ఇలా చేసిందని ధాన్యలక్ష్మీ ఆరోపిస్తుంది. తనకు దక్కని అదృష్టం తన చెల్లెలికి దక్కేసరికి చూసి తట్టుకోలేకపోయిందని నానామాటలు అంటుంది ధాన్యలక్ష్మీ. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడొద్దని అపర్ణ నిజం చెప్పబోతుండగా కావ్య అడ్డుపడుతుంది. ఈ ఇంట్లో కావ్య అనేసరికి ప్రతి ఒక్కరికి నోరు వచ్చేస్తుందని ధాన్యలక్ష్మీకి ఇందిర వార్నింగ్ ఇస్తుంది.
టాబ్లెట్ ఎలా మారిందో నాకు అర్ధం కావడం లేదని.. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని కావ్య చెబుతుంది. పొరపాటు కాదని, కావాలనే ప్లాన్ చేసి ఇలా చేశావని ఆరోపిస్తుంది ధాన్యలక్ష్మీ. పైకి మంచిగా కనిపిస్తూ కడుపులో ఇంత విషం దాచుకున్నావా? నువ్వు తల్లివి కావాలని ఆ దేవుడే నీ నుదిటిన రాయనప్పుడు ఎలా అవుతావని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మీ. రాజ్ నీతో బాగానే ఉన్నప్పుడు తల్లివి ఎందుకు కాలేకపోయావని నానామాటలు అనడంతో కావ్య బాధపడుతుంది. నా కోడలి కడుపు పొగొట్టాలని చూసిన దీనిని వదలనని వార్నింగ్ ఇస్తుంది ధాన్యలక్ష్మీ. దాంతో కళ్యాణ్ మండిపడతాడు. మెడికల్ షాపు వాడే ఆ టాబ్లెట్ ఇచ్చి ఉండొచ్చు కదా అని అంటాడు.
చెల్లెలి మీద ప్రేమ ఉంటే కావ్య మెడికల్ షాపు వద్దే చెక్ చేసుకోవాలి కదా అని చెబుతుంది ధాన్యలక్ష్మీ. ఇందాక మీ అమ్మతో నువ్వు ఏం మాట్లాడావ్.. రాజ్‌కి యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే నాకు కూడా అప్పూ లాంటి అదృష్టం దక్కేదని అన్నావా లేదా అని నిలదీస్తుంది. దానికి కావ్య అంగీకరిస్తుంది. అప్పూపై ఈర్ష్యతో కావ్య ఇదంతా చేసిందని, నువ్వు గొడ్రాలు కాబట్టి నా కోడల్ని కూడా గొడ్రాలిని చూశావ్ కదా అని మండిపడుతుంది. ధాన్యలక్ష్మీ మాటలతో కావ్య ఏడుస్తూ వెళ్లిపోతుంది. కడుపులో విషం పెట్టుకున్నది అది కాదు నువ్వు, నా కోడలు ప్రెగ్నెంట్ అని నిజం చెబుతుంది కనకం. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. అప్పూ నెల తప్పడానికి ముందే కావ్య గర్భవతి అయ్యిందని చెబుతుంది కనకం.
నువ్వు అన్నది నిజమే అయితే కావ్య తన చెల్లెలి మీద ఎందుకు ద్వేషం పెంచుకుంటుందని ధాన్యలక్ష్మీని నిలదీస్తుంది కనకం. కడుపు పొగొట్టాలని కావ్య ఎందుకు అనుకుంటుందని ప్రశ్నిస్తుంది. మా అమ్మ చెప్పింది నిజమని.. నా కన్నా ముందే మా అక్క నెల తప్పిందని చెబుతుంది అప్పూ. కానీ ఆ విషయం బయటపడితే బావగారికి ఏమైనా అవుతుందని ఆ నిజాన్ని దాచి పెట్టిందని చెబుతుంది అప్పూ. తన భర్త ప్రాణాలను కాపాడటానికి ఈ నిజాన్ని తనలోనే దాచుకుందని, తల్లిని అయ్యానన్న సంతోషాన్ని ఎవరితోనూ పంచుకోలేక తనలో తానే కుమిలిపోయిందని అంటుంది కనకం. మీ కుటుంబం కోసమే బతుకుతున్న నా కూతురిని మాటలతో బాధపెట్టొద్దని దండం పెడుతుంది.
నా కూతురిని అన్ని మాటలు అనేసరికి దాని తల్లిగా తట్టుకోలేకపోయానని క్షమించమని అపర్ణని అడుగుతుంది కనకం. ఇప్పుడైనా నీకు అర్ధమైందా? ఒక మంచి మనిషిని బాధపెట్టావ్.. ఈ ఇంటి కోడలి చేత కన్నీళ్లు పెట్టించావని ధాన్యలక్ష్మీపై మండిపడతాడు ప్రకాశం. నేను చేసింది తప్పేనని, నేను కూడా ఆడదాన్నే అని ఆలోచించకుండా నానామాటలు అన్నానని బాధపడుతుంది. ఈ ఇంటి గురించి ఆలోచిస్తూ కావ్య మౌనంగా వెళ్లిపోయిందని అంటుంది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఉందని రాహుల్‌తో రుద్రాణి చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











