Brahmamudi August 20th Episode: రాజ్ కఠిన నిర్ణయం.. కావ్య జీవితంలో పెను తుఫాను

Photo Courtesy: JioHotstar

తనను పెళ్లి చేసుకోమ్మని కావ్యని రాజ్ అడుగుతాడు.. భర్త ప్రాణాల గురించి ఆలోచించిన కావ్య తన మనసు చంపుకుని రాజ్ ప్రేమను తిరస్కరిస్తుంది. ఆ మాటలతో రాజ్ మౌనంగా వెళ్లిపోతాడు. రుద్రాణి మార్చిన టాబ్లెట్ వేసుకున్న అప్పూ కళ్లు తిరిగి పడిపోతుంది. దీంతో కంగారుపడిన దుగ్గిరాల ఫ్యామిలీ వెంటనే డాక్టర్‌ను పిలిపిస్తుంది. అప్పూని పరీక్షించిన డాక్టర్.. ఎక్స్‌పైర్ అయిన టాబ్లెట్ వేసుకోవడం వల్లే అప్పూ పడిపోయిందని చెప్పడంతో ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది.

ఆ టాబ్లెట్‌ను కావ్యే ఇచ్చిందని రుద్రాణి చెప్పడంతో ధాన్యలక్ష్మీ పూనకం వచ్చినట్లు ఊగిపోతూ కావ్యను గొడ్రాలని అంటుంది. ఆ మాటలతో రగిలిపోయిన కనకం.. నా కూతురు గొడ్రాలు కాదని, అది 3 నెలలు కడుపుతో ఉందని చెబుతుంది. ఈ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీకి షాక్‌తో పాటు ఆనందం కలుగుతుంది. మీరు దాచిన నిజాన్ని చెప్పకతప్పలేదని అపర్ణ, ఇందిరలకు కనకం క్షమాపణలు చెబుతుంది. నిజం తెలుసుకోకుండా కావ్యను నానామాటలు అన్నందుకు ధాన్యలక్ష్మీ కుమిలిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఆగస్ట్ 20వ తేదీ ఎపిసోడ్ 805లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial August 20th 2025 Episode 805 Here is Today s full story
Photo Courtesy: JioHotstar

గదిలో బాధపడుతున్న కావ్య దగ్గరికి వచ్చిన ధాన్యలక్ష్మీ.. నేను తప్పు చేశానని, క్షమించమని అడుగుతుంది. మీరు పెద్దవారు ఆవేశంతో రెండు మాటలు అన్నంత మాత్రాన అది తప్పెలా అవుతుందని అంటుంది కావ్య. నీ అంత గొప్ప మనసు నాకు లేదని, నీ స్థానంలో నేనుంటే.. అలాంటి మాటలు ఎవరైనా అనుంటే నేను జీవితంలో వాళ్లని క్షమించే దానిని కాదని చెబుతుంది ధాన్యలక్ష్మీ. నీలాంటి మంచి మనిషిని బాధపెట్టాను.. చెప్పుడు మాటలు విని ఆవేశంలో ఒక ఆడది ఎప్పటికీ భరించలేని మాట అనేశానని అంటుంది. ఇంత చేసినా నన్ను ఎందుకు క్షమించావని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. అందరూ మీ కోపాన్నే చూశారు కానీ.. అప్పూ మీద ప్రేమను నేను చూశానని, ఒకప్పుడు కోడలిగా కూడా ఒప్పుకోని మీరు తన కోసం అంతలా ప్రేమను చూపిస్తుంటే ఆనందంగా ఉందని అంటుంది కావ్య.

ఒక ఆత్తగారిగా నా చెల్లెలి కడుపులో పెరుగుతున్న మీ వారసుడిని కాపాడుకోవడం కోసం మీరు పడుతున్న తాపత్రయం ముందు ఆ కోపం ఎంత? అని అడుగుతుంది కావ్య. నువ్వు కూడా తల్లివి కాబోతున్నావని, ఒక బిడ్డను కడుపులో మోస్తున్నావని కానీ అప్పూలాగా నువ్వు ఎవ్వరితోనూ చెప్పుకోలేని పరిస్ధితుల్లో ఉన్నావని అంటుంది ధాన్యలక్ష్మీ. ఏ ఆడదైనా తను తల్లిని కాబోతున్న శుభవార్తను ముందు తన భర్తకు చెప్పుకోవాలని అనుకుంటుందని చెబుతుంది. తన అత్తగారితో అందరికీ చెప్పుకుని పండగ చేసుకోవాలని భావిస్తుందని.. నువ్వు మాత్రం ఏదో తప్పు చేసిన దానిలా ఆ నిజాన్ని నీ గుండెల్లోనే మోస్తున్నావని అంటుంది ధాన్యలక్ష్మీ. ఇవేవీ తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడి నీ కన్నీళ్లకు కారణమయ్యానని.. ఈ పాపం నన్ను వదిలిపెట్టదని చెబుతుంది.

తెలిసి చేస్తే పాపం అవుతుందని, ఇందులో మీ తప్పేం లేదని అంటుంది కావ్య. నా మనసు ఒప్పుకోవడం లేదని నాకు శిక్ష పడాల్సిందేనని అడుగుతుంది ధాన్యలక్ష్మీ. సరే మీరు కోరుకున్నట్లుగానే మీకు శిక్ష వేస్తానని చెబుతుంది కావ్య. అప్పూని చూసుకున్నట్లుగానే నన్ను కూడా చూసుకుంటారా అని అడుగుతుంది కావ్య. ఆ మాటలతో ధాన్యలక్ష్మీ ఏడుస్తూ కావ్యను హత్తుకుంటుంది. వీరిద్దరి మాటలను విన్న రుద్రాణి.. వీళ్ల ఓవరాక్షన్ భరించలేకపోతున్నానని రాహుల్‌తో అంటుంది. రాజ్‌కు నిజం తెలిసేలా చేసి వాడిని దూరం చేద్దామని అనుకున్నాం.. ఇప్పుడు ఆ విషయం ఇంట్లో వాళ్లకి తెలిసి కావ్యను నెత్తిన పెట్టుకుంటున్నారని అంటాడు రాహుల్.

నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా, ఎన్ని ప్రమాదాలు సృష్టించినా కావ్యకే మంచి జరుగుతోందని మండిపడతాడు రాహుల్. ఇకపై అలా జరగదని, యామినితో అసలు కథ నడిపిస్తానని.. రాజ్‌కి నిజం తెలిసేలా చేస్తానని అంటుంది రుద్రాణి. తన ప్రేమను కావ్య కాదనడంతో రాజ్ బాధపడతాడు. కళావతి మనసులో ఏముందో తెలుసుకోవాలంటే డోస్ పెంచాల్సిందేనని, మనకి ఇష్టమైన వ్యక్తి మనకి దూరంగా ఉంటే తట్టుకోలేమని కాబట్టి నేను కూడా దూరమవుతున్నట్లు నాటకమాడాలని అనుకుంటాడు రాజ్. నేను అమెరికాకి వెళ్లిపోతున్నట్లు డ్రామా ప్లే చేస్తానని, నేను అనుకున్నట్లు కళావతి గారికి నా మీద ప్రేమ ఉంటే నన్ను ఆపుతుందని ప్లాన్ చేస్తాడు.

తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి అర్జెంట్‌గా ఫ్లైట్ టికెట్ కావాలని అడుగుతాడు రాజ్. ఇంట్లో జరుగుతున్నదంతా యామినికి చెబుతుంది రుద్రాణి. కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెంటనే రాజ్‌కి చెప్పేయమని అంటుంది రుద్రాణి. రాజ్ దగ్గరికి వెళ్లబోతుండగా అతని ఫోన్‌కి వచ్చిన మెసేజ్ చదువుతుంది యామిని. అందులో రాజ్ అమెరికాకు వెళ్తున్న టికెట్ ఉండటంతో ఎందుకు యూఎస్ వెళ్తున్నావని నిలదీస్తుంది యామిని. తన డ్రామా ఎక్కడ తెలిసిపోతుందోనని జాగ్రత్తపడ్డ రాజ్.. ఇక్కడే ఉండి ఏం చేయమంటావ్, నేను ప్రాణానికి ప్రాణం అనుకున్న కళావతి నా ప్రేను తిరస్కరించిందని చెబుతాడు. ఆమె లేకపోతే ఏంటీ? నీకు మేమంతా ఉన్నాం కదా అని అంటారు యామిని పేరెంట్స్. ఇక్కడే ఉంటే నాకు కళావతి జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయని అందుకే వెళ్లిపోతున్నానని చెబుతాడు. నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావని, నిన్ను నేను దక్కించుకుంటానని మనసులో అనుకున్న యామిని ఈ విషయాన్ని రుద్రాణికి చెబుతుంది.

నీ కోడలి వల్ల రాజ్ మనల్ని వదిలి అమెరికా వెళ్లిపోతున్నాడని దుగ్గిరాల ఫ్యామిలీకి చెబుతుంది రుద్రాణి. ఆ మాటలతో కుటుంబమంతా షాక్ అవుతుంది. రుద్రాణి మాటలతో బాధపడ్డ కావ్య.. రాజ్‌తో జరిగిన సంభాషణని గుర్తుచేసుకుంటుంది. కుటుంబం అంతా ఏం జరిగిందని అడగటంతో కావ్య మొత్తం చెబుతుంది. అన్నయ్యని ఎలాగైనా ఆపాలని కళ్యాణ్ అనగా.. ఇప్పుడున్న పరిస్ధితుల్లో నువ్వు ఒక్క దానివే ఆపగలవని కావ్యని దుగ్గిరాల ఫ్యామిలీ బ్రతిమలాడుతుంది. వెళ్లి ఎలా ఆపమంటారు.. ఏం చెప్పి ఒప్పించమంటారు? ఆపడానికి నా దగ్గర ఏ కారణం ఉంది అని కావ్య మండిపడుతుంది. మీ కోసం వెళ్తానని, కావాలంటే కాళ్లు కడా పట్టుకుంటానని కానీ ఆయన ఆగుతారా? అని అడుగుతుంది.

నేను ఇండియాలోనే ఉంటాను.. నువ్వు పెళ్లెందుకు చేసుకోవో కారణం చెప్పమని అడుగుతారని అంటుంది కావ్య. నేను కడుపుతో ఉన్నాను.. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదని చెప్పమంటారా? తన గతాన్ని గుర్తుచేయమంటారా? అని కావ్య ప్రశ్నిస్తుంది. నిజం చెప్పిన మరుక్షణం, ఆయన ప్రాణాలకు ఎంత ప్రమాదమో ఆలోచించారో అని నిలదీస్తుంది. నువ్వు చెప్పిందంతా నిజమే కానీ వాడు దేశం వదిలి వెళ్లిపోతుంటే తట్టుకోగలవా అని అడుగుతుంది ఇందిర. దూరంగా ఉన్నా ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉంటే చాలని కావ్య అంటుంది.

కావ్య వల్ల కాదు.. మనిద్దరం వెళ్లి రాజ్‌ని ఒప్పించి తీసుకొద్దామని అపర్ణతో అంటుంది ఇందిర. వీళ్లు వెళ్లినంత మాత్రాన రాజ్ వింటాడా? ఆగుతాడా? అని మనసులో అనుకుంటుంది రుద్రాణి. మనం ఏం చేయకుండానే ఆ రాజ్ దేశం వదిలి వెళ్లిపోతుంటే వాడిని కెలకడం ఎందుకని రాహుల్‌తో అంటుంది. ఒక్కసారి వాడు దేశం వదిలి వెళ్లిపోతే.. ఆ యామినిని కూడా వాడి దగ్గరికే పంపిస్తే దరిద్రం వదిలిపోతుందని చెబుతుంది రుద్రాణి. రాజ్ అమెరికా వెళ్లిపోతుండటంతో యామిని తల్లిదండ్రులు బాధపడుతుంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X