Brahmamudi August 21st Episode: రాజ్‌కి నిజం చెప్పబోతున్న కావ్య ... రుద్రాణితో యామిని మాస్టర్ ప్లాన్

Photo Courtesy: JioHotstar

కావ్య ప్రెగ్నెంట్ అని తెలియక నానామాటలు అని ఆమెను బాధపెట్టిన ధాన్యలక్ష్మీ క్షమాపణలు చెబుతుంది. అప్పూపై చూపించే ప్రేమలో కాస్త తనపై చూపించాలని అడుగుతుంది కావ్య. ఆ మాటలతో ధాన్యలక్ష్మీ కంటతడి పెడుతుంది. మరోవైపు.. ఏదో బలమైన కారణం వల్లే కళావతి తన ప్రేమను అంగీకరించడం లేదని భావించిన రాజ్ కొత్త ప్లాన్ వేస్తాడు. అమెరికాకు వెళ్లిపోతున్నట్లుగా నాటకమాడతాడు. ఈ విషయం తెలుసుకున్న రుద్రాణి దానిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటుంది.

కావ్య వల్ల రాజ్ అమెరికాకు వెళ్లిపోతున్నాడని రుద్రాణి చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఏదో ఒకటి చేసి వాడిని ఆపమని కావ్యని అందరూ బతిమలాడతారు. ఆయనను ఆపాలంటే నిజం చెప్పాలని, దాని కంటే ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలని అంటుంది కావ్య. దాంతో రాజ్‌ను ఆపడానికి ఇందిర, అపర్ణలు బయల్దేరతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఆగస్ట్ 21వ తేదీ ఎపిసోడ్ 806లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial August 21st 2025 Episode 806 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

అమెరికాకు బయల్దేరుతున్న రాజ్‌తో మీకు ఈ మధ్యే యాక్సిడెంట్ అయ్యిందని, గతం కూడా గుర్తులేదని ఈ సమయంలో అంతదూరం వెళ్లడం మంచిది కాదని అంటుంది వైదేహి. బావ అక్కడ కొన్నాళ్లయినా తన బాధని మరిచిపోతాడని అంటుంది యామిని. నువ్వొక్కదానివే నన్ను బాగా అర్ధం చేసుకున్నావని చెబుతాడు రాజ్. ఇంతలో ఇందిర, అపర్ణలు వచ్చి మండిపడతారు. మీరు నన్ను దత్తత తీసుకోండి నేను మీ మనవడిగా తోడుంటానని అన్నావని ఫైర్ అవుతుంది ఇందిర. కళావతి ఏదో అన్నదని ఊరు వదిలి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యావ్.. మరి మా గురించి ఒక్కసారైనా ఆలోచించావా అని ప్రశ్నిస్తుంది అపర్ణ. మా కళావతిని పెళ్లి చేసుకునే వరకు వదిలిపెట్టనని శపథం చేశావ్ అని మండిపడుతుంది.

ఆ కళావతి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అవమానిస్తుంటే మా బావ మాత్రం పట్టించుకోకుండా వెంట తిరగాలా? అని యామిని ప్రశ్నిస్తుంది. మీ మనవరాలికి ఆఫీస్‌లో ప్రాబ్లం అంటే ఎలా తిరిగింది? ఆఫీస్ బాస్‌గా నటించడానికి మా బావ ఎంత రిస్క్ తీసుకున్నాడో గుర్తులేదా అని నిలదీస్తుంది యామిని. అప్పూ అరెస్ట్ అయినప్పుడు ప్రాణాలకు తెగించి సాక్ష్యాన్ని తీసుకొచ్చాడని చెబుతుంది. ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో మా కోడలికి బాగా తెలుసని, నువ్వు మా విషయంలో కలగజేసుకోవద్దని వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. నేను అమెరికా వెళ్లిపోతున్నానని తెలిసి కూడా కళావతి గారు మిమ్మల్ని పంపించారా? అని అడుగుతాడు రాజ్.

నిజంగా తనకి నా మీద అభిమానం ఉంటే తన వల్ల నేను బాధపడుతున్నానని గుర్తించి ఉంటే నన్ను ఆపడానికి వచ్చేదని అంటాడు రాజ్. నేను ఇష్టపడుతున్నట్లుగా తను ఇష్టపడితే నన్ను ఆపడానికి వచ్చేదని, నేను తన జీవితంలో ఉన్నా లేకపోయినా తను సంతోషంగా ఉంటుందని అనుకుంటే నేను ఇక్కడే ఉండి ప్రయోజనం ఏంటీ అని ప్రశ్నిస్తాడు రాజ్. నన్ను పెళ్లి చేసుకోవడానికి తనకొచ్చిన అడ్డేమిటీ అని అంటాడు. అది మమ్మల్ని కాదు.. కళావతిని అడగమంటుంది ఇందిర. నువ్వు అమెరికాకు వెళ్లిపోతే ప్రయోజనం ఉందా అని అడుగుతుంది అపర్ణ.
తనని బాధపెట్టడం కంటే తనకి దూరంగా వెళ్లిపోతే కనీసం తనైనా సంతోషంగా ఉంటుందని అంటాడు రాజ్.

నిన్ను వదిలి వెళ్లడం తనకి సంతోషాన్ని ఇస్తుందని నువ్వెలా అనుకుంటున్నావ్ అని నిలదీస్తుంది ఇందిర. నా మనవరాలు మాకంటే నిన్నే ఎక్కువగా ప్రేమించిందని అంటుంది. కళావతిని వదిలి వెళ్లిపోవడమనే నీ నిర్ణయం మంచిది కాదని, భవిష్యత్తులో చాలా బాధపడతావని హెచ్చరిస్తుంది. తనను వదిలి వెళ్లడం నాకూ ఇష్టం లేదని, నా మనసుని చంపుకుని వెళ్లిపోతున్నానని అంటాడు రాజ్. అపర్ణ, ఇందిరలు ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా కారు ఎక్కేస్తాడు. కన్విన్స్ చేయాలనుకుంటే కళావతిని చేయమని అంటాడు రాజ్.

రాజ్ ఫోటో చూస్తూ కావ్య బాధపడుతుంది. ఆనందంగా ఉండాల్సిన ఈ టైంలో నా చేత ఎందుకిలా కన్నీళ్లు పెట్టిస్తున్నారని అంటుంది. మీ పంతం మీదే కానీ, నా పరిస్ధితి అర్ధం చేసుకోరా.. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోనని చెప్పింది మీరంటే ఇష్టం లేక కాదని అంటుంది. మీ బిడ్డ నా కడుపులో పెరుగుతోందని, మీరంటే నాకు ప్రాణమని చెబుతుంది. మిమ్మల్ని నేనెందుకు వదులుకుంటాను, నిజం చెబితే మీ ప్రాణాలకు ప్రమాదమనే నేను దూరంగా ఉంటున్నానని అంటుంది. అనవసరంగా బయల్దేరి ఓవరాక్షన్ చేశానేమో, ఇప్పుడు కళావతి రాకపోతే నా పరిస్థితి ఏంటీ అని అనుకుంటాడు రాజ్. పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్న యామినిని చూసిన వైదేహి.. రాజ్ అమెరికాకు వెళ్లిపోతుంటే బాధపడుతున్నావ్ అనుకుంటే, నువ్వు ఇంత హ్యాపీగా ఎందుకున్నావ్ అని అడుగుతుంది.

బావని కావ్యే నాకు దగ్గర చేస్తోందని అందుకే ఆనందంగా ఉందని కావ్యకి కాల్ చేస్తుంది యామిని. బావ నిన్ను వదిలేస్తున్నాడని బాధగా ఉందా? ఇప్పుడే కన్నీళ్లన్నీ ఖర్చు చేసుకుంటే ఎలా? అని ప్రశ్నిస్తుంది. ఈసారి నీ కారణంగా నాకు మంచి జరగబోతుందని, బావని అమెరికా వెళ్లేలా చేసినందుకు థ్యాంక్స్ అని అంటుంది యామిని. రెండ్రోజులు అవ్వగానే నేను కూడా బావ దగ్గరికి వెళ్లిపోతానని, నీ కారణంగానే బావకి దగ్గర అవుతానని చెబుతుంది యామిని. నీ వల్ల బాధపడుతున్న బావని లాలించి, బుజ్జగించి నెమ్మదిగా నా వాడిని చేసుకుంటానని అంటుంది. బావని నా వైపు తిప్పుకుని నిన్ను శాశ్వతంగా మరిచిపోయేలా చేసి మంచి ముహూర్తం చూసుకుని బావని పెళ్లి చేసుకుని, పిల్లల్ని కూడా కనేస్తానని చెబుతుంది. యామిని మాటలతో కావ్య షాక్ అవుతుంది.

కావ్యని ఎందుకు రెచ్చగొట్టావ్.. అది ఏడుస్తూ సైలెంట్‌గా ఎందుకుంటుందని యామినిపై మండిపడుతుంది వైదేహి. నాకు ఆ కావ్యని రెచ్చగొట్టడం తెలుసు, దాని ప్లాన్స్‌కి అడ్డుకట్ట వేయడం కూడా తెలుసని వెంటనే రుద్రాణికి ఫోన్ చేసి ప్లాన్ చెబుతుంది. రాజ్ దృష్టిలో కావ్యను బ్యాడ్ చేయడానికి వెళ్తున్నానని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. రాజ్ తనను వదిలి వెళ్లిపోతుండటం, యామిని మాటలతో టెన్షన్ పడుతున్న కావ్య.. దేవుడి దగ్గర తన బాధలు చెప్పుకుని బాధపడుతుంది. ఆయనికి నిజం చెప్పాల్సిందేనని నిర్ణయించుకుని ఫోన్ చేస్తుంది. కానీ రాజ్ ఫోన్ కట్ చేస్తాడు. కారు ఆపి ఫోన్ మాట్లాడుతున్న రాజ్‌ని రుద్రాణి కలుస్తుంది. కళావతి గారు వచ్చారని అనుకున్నా.. మీరు వచ్చారేంటీ అని అడుగుతాడు రాజ్. తను రాదు కాబట్టే నేనొచ్చానని అంటుంది రుద్రాణి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X