Brahmamudi August 23rd Episode: రాజ్‌కి దగ్గరవుతోన్న యామిని.. దేవదాసులా రోడ్డునపడ్డ రామ్
Photo Courtesy: JioHotstar
కావ్య ప్రెగ్నెంట్ అని రుద్రాణి చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. ఈ విషయాన్ని నీకు ఎలా చెప్పాలో తెలియక, కళావతి తనలో తానే కుమిలిపోయిందని అంటుంది. ఇంతలో కళావతి రావడంతో నువ్వు ప్రెగ్నెంటా అని నిలదీస్తాడు రాజ్.. తను ఔనని సమాధానం చెప్పడంతో షాక్ అవుతాడు. ఆ తర్వాత నవ్వుకుంటూ నన్ను అమెరికాకు వెళ్లకుండా ఆపడానికి మీరిద్దరూ జోక్ చేస్తున్నారని అంటాడు. నేను చెబుతున్నది నిజమని కావ్య అనడంతో రాజ్ ఉలిక్కిపడతాడు.
వెంటనే అపర్ణ, ఇందిరలను కలిసి ఏం జరిగిందని అడగటంతో వారిద్దరూ కావ్య ప్రెగ్నెంట్ అని చెప్పడంతో రాజ్ మండిపడతాడు. మీరు నన్ను మోసం చేశారంటూ అలిగి వెళ్లిపోతాడు. కావ్య ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పావని రుద్రాణిపై దుగ్గిరాల ఫ్యామిలీ మండిపడుతుంది. అటు రాజ్‌ను తన దారికి తెచ్చుకోవడానికి తల్లిదండ్రుల చేత అతనిని బుజ్జగిస్తుంది యామిని. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని, లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతానని అంటాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఆగస్ట్ 23వ తేదీ ఎపిసోడ్ 808లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కావ్య ప్రెగ్నెంట్ అని తెలియడంతో రాజ్ బాధపడతాడు. అటు కావ్య కూడా భర్తతో గడిపిన జ్ఞాపకాలను తలచుకుంటూ ఏడుస్తుంది. ఇంట్లో అందరూ నిన్ను కార్నర్ చేస్తూ తిట్టారని రుద్రాణితో బాధపడతాడు రాహుల్. ఆ మాత్రం దానికే ఫీల్ అవ్వొద్దని, మనలాంటి వాళ్లు కొన్ని విషయాల్లో చాలా ప్రాక్టీకల్‌గా ఉండాలని అంటుంది రుద్రాణి. దున్నపోతు మీద వాన పడితే ఎలా దులిపేసుకుంటుందో? అలాగే ఉండాలని.. లేదంటే బతకలేమని చెబుతుంది. ఇన్ని రోజులు ఆ రాజ్‌ని ఎలా ఇంటి నుంచి బయటికి పంపించాలా? మన ఆస్తి మనం ఎలా దక్కించుకోవాలా? అని టెన్షన్ పడ్డానని అంటుంది రుద్రాణి. మొత్తానికి దేవుడి దయ వల్ల వాడంతట వాడే ఈ ఇంటికి దూరంగా వెళ్లిపోతున్నాడని, వాడు ఎట్టి పరిస్ధితుల్లోనూ ఈ ఇంటికి తిరిగి రాడని చెబుతుంది.
వాడు గతం మరిచిపోతేనే ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడని, అలాంటిది ఆ కావ్య మీద కోపంతో ఉన్నవాడు మళ్లీ తిరిగిరాడా? అని రాహుల్ ప్రశ్నిస్తాడు. కోపంతో వెళ్లుంటే తిరిగి వచ్చాడని, కానీ రాజ్ మోసపోయాడని చెబుతుంది రుద్రాణి. రాజ్ ఇంటికి రావాలంటే కావ్య ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో చెప్పాలని, అలా చెప్పాలంటే రాజ్‌కి గతం మొత్తం గుర్తుచేయాలని.. కానీ గతం గుర్తుచేస్తే రాజ్‌కి ప్రాబ్లం కాబట్టి చచ్చినా చెప్పదని అంటుంది. ఇక రాజ్ ఈ ఇంటికి రాడని, ఇక మన ఆస్తి మనకి దక్కినట్లే అని చెబుతుంది రుద్రాణి.
కావ్యకి టిఫిన్ తీసుకుని వస్తారు ఇందిర, అపర్ణ. నాకు ఆకలిగా లేదని, తినాలని లేదని అంటుంది కావ్య. నా మనవడు ఏదో తప్పుడు కూతలు కూశాడని, వాటినే తలచుకుంటూ బాధపడొద్దని చెబుతుంది ఇందిర. జరిగినదాంట్లో నా తప్పేం ఉంది? ఆయన చేత తాళి కట్టించుకోవడం నేను చేసిన తప్పా? ఆయన నన్ను ఎంత దూరం పెట్టినా భరిస్తూ, నవ్వుతూ ఆయన చుట్టూనే తిరగడం నా తప్పా అని బాధపడుతుంది కావ్య. ఆయన ఆరోగ్యం గురించే ఆలోచించానని, గతం గుర్తులేని ఆయనకి నేనే మీ భార్యనని చెబితే ఏం జరుగుతుందోనని భయపడ్డానని అంటుంది. ఆయనంటే నాకు ఎంత ఇష్టమున్నా, నేను తల్లిని కాబోతున్నాననే నిజం చెప్పలేక నాలో నేనే బాధపడుతున్నానని చెబుతుంది కావ్య.
నీ కోసం కాకపోయినా, నీ కడుపులో పెరుగుతున్న ఈ ఇంటి వారసుడి కోసమైనా తినమని అపర్ణ, ఇందిరలు చెబుతారు. దాంతో కావ్య సరేనని చెబుతుంది. ఆ దేవుడు నాకు అన్యాయం చేసి ఉండొచ్చు, ఆయన నన్ను అవమానించొచ్చు, కానీ ఒక తల్లిగా నా బిడ్డకు అన్యాయం చేయలేనని అంటుంది కావ్య. దాంతో వారిద్దరూ సంతోషిస్తారు. టిఫిన్ చేస్తుండగా రాజ్‌ని పిలుస్తారు యామిని పేరెంట్స్. తనకు ఆకలిగా లేదని, తర్వాత తింటానని రాజ్ చెబుతాడు. ఆ వెంటనే రాజ్ దగ్గరికి యామిని వెళ్తుంది. కళ్లు తెరిచినా, కళ్లు మూసినా కళావతే గుర్తుకొస్తుందని.. వాటి నుంచి ఎలా బయటపడాలో? వాటి నుంచి దూరంగా ఎలా వెళ్లాలో? అస్సలు అర్ధం కావడం లేదని అంటాడు రాజ్.
నీ బాధను ఎలా పొగొట్టాలో నాకు అర్ధమైందని, అందుకే నీకోసం ఒకటి తీసుకొచ్చానని టేబుల్ మీద మందు బాటిల్ పెడుతుంది యామిని. నాకు మందు అలవాటు లేదని నీకు తెలుసు కదా అని అంటాడు రాజ్. నీ బాధ పోవడానికి ఇప్పుడు ఇదే మంచిదని రాజ్‌ని రెచ్చగొడుతుంది యామిని. కావ్యని తలచుకుని మందు కొట్టేస్తాడు రాజ్.. దాంతో యామిని తన ప్లాన్ వర్కవుట్ అయినందుకు సంతోషిస్తుంది. నేనేం తప్పుచేశాను? కళావతి ఎందుకలా మోసం చేసింది? అని యామినిని నిలదీస్తాడు రాజ్. ఆడవాళ్లకి అన్యాయం జరిగితే అందరూ ఓదార్చి అండగా నిలుస్తారని, కానీ మగాళ్లకి మనసు ఉండదా? వాళ్లకి బాధ ఉండదని ఏడుస్తాడు రాజ్. తాగి తాగి యామిని భుజంపై వాలిపోతాడు రాజ్. దాంతో యామిని ఎంతో సంతోషిస్తుంది.
రాజ్ తాగి తాగి రోడ్డుపై పడిపోతాడు. ఇంతలో కావ్య కారు అటు వెళ్తుండగా ఎవరో తాగేసి రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడని డ్రైవర్ బ్రేక్ వేస్తాడు. దాంతో కావ్య కారు దిగి.. నేనే బుద్ధి చెబుతానని అంటుంది. ఆమె వెళ్లి చూసేసరికి అక్కడ రాజ్ ఉండటంతో కావ్య షాక్ అవుతుంది. కళావతి గారు నన్ను ఇలా కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా? కారుతో గుద్ది చంపేద్దామని ప్లాన్ చేశారా? గుద్దేయండి ఒకేసారి చచ్చిపోతానని అంటాడు రాజ్. ఆ మాటలేంటీ? అసలు మీకు ఏమైంది అని కావ్య ప్రశ్నిస్తుంది. కళావతి గారు మనసు ముక్కలైందని, కాదు కాదు తమరే ముక్కలు చేశారని అంటాడు రాజ్. నేను మీకు ఏం అన్యాయం చేశాను కళావతి గారు.. నేను మీకు ఏం ద్రోహం చేశాను, ఎందుకని నా మనసుతో మీరు ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారని నిలదీస్తాడు రాజ్.
ఏ తప్పు చేయని నన్ను, ఇంతలా బాధపెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? అని రాజ్ అడుగుతాడు. ఇవన్నీ తర్వాత చెబుతానని, మనం ముందు ఇంటికి వెళ్దామని కావ్య అడుగుతుంది. నేను ఇంటికి రాను.. నాకు ఇక్కడే నచ్చింది? ఇక్కడే ఉంటానని రాజ్ తేల్చిచెబుతాడు. మీరు నన్ను మోసం చేస్తే, మీరు నన్ను చీట్ చేస్తే నేనేం బతకలేనని అనుకున్నారా? అని నిలదీస్తాడు రాజ్. మీరు నాకు తోడుగా లేకపోయినా మందు తోడుగా ఉందని అంటాడు రాజ్. కావ్య ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా రోడ్డుపై పడిపోతాడు రాజ్. వెంటనే డ్రైవర్‌తో కలిసి రాజ్‌ని కారులో ఎక్కించి ఇంటికి తీసుకెళ్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











