Brahmamudi August 25th Episode: కావ్య క్యారెక్టర్‌ను అనుమానించిన రాజ్.. లాగి కొట్టిన అపర్ణ
Photo Courtesy: JioHotstar
రాజ్‌ని తన తల్లిదండ్రులతో బుజ్జగించేలా చేసి పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తుంది యామిని. అయితే మీ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదని రాజ్ తేల్చిచెబుతాడు. కావ్య చేసిన మోసంతో రాజ్ ఎప్పటికీ ఇంటికి తిరిగి రాడని రాహుల్, రుద్రాణిలు సంతోషిస్తారు. రాజ్ తనను నానామాటలు అనడంతో కావ్య బాధపడుతుంటుంది.. కనీసం కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తినమని అపర్ణ, ఇందిరలు ఆమెను బుజ్జగిస్తారు. ఒంటరిగా బాధపడుతున్న రాజ్‌కి మందు బాటిల్ ఇచ్చి తాగమని చెబుతుంది యామిని. రాజ్ తాగుతూ రోడ్డుపై పడిపోతాడు. ఉదయాన్ని కారులో వెళ్తూ రాజ్‌ని చూసిన కావ్య అతనిని ఇంటి దగ్గర వదిలిపెడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఆగస్ట్ 23వ తేదీ ఎపిసోడ్ 808లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాజ్‌ని ఎందుకు తాగుడికి బానిసని చేశావని యామినిపై ఆమె తల్లిదండ్రులు మండిపడతారు. కావ్య దగ్గర దొరకని ఫ్రీడమ్ నా దగ్గర దొరుకుతుందని చెప్పడానికే ఇలా చేస్తున్నానని అంటుంది యామిని. ఆ కావ్య కంటే నేనే బెటర్ అని అనుకుంటాడని చెబుతుంది. కానీ అలా తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటాడోనని నాకు భయంగ ఉందని వైదేహి కంగారు పడుతుంది. అలా జరిగినా మంచిదేనని, పాడైన తన ఆరోగ్యాన్ని బాగు చేసే బాధ్యత తీసుకుని ఇంకా దగ్గరై నేనే నీ భార్యనీ అనిపించుకునే అవకాశం వస్తుందని అంటుంది యామిని. నువ్వు చేస్తున్నది తప్పని, ఒక మనిషి ప్రేమను గెలుచుకోవాలంటే మనలో నిజాయితీ ఉండాలని, అంతే నిజాయితీగా ప్రేమించాలని మండిపడతాడు రఘునాథ్. ఇన్నాళ్లు అదే చేశానని.. కానీ నాకు దక్కింది ఏంటీ ఒంటరితనం తప్పా అని చెబుతుంది యామిని.
మోసం చేసినా రాజ్ ప్రేమను దక్కించుకోవాలని అనుకుంటున్నాని అంటుంది. ఇంతలో తాగి పడిపోయిన రాజ్‌ని తీసుకుని యామిని ఇంటికి తీసుకొస్తుంది కావ్య. అది చూసి యామిని ఫ్యామిలీ షాక్ అవుతుంది. నువ్వు అల్లుడుగారికి ఫ్రీడమ్ ఇవ్వాలని అనుకుంటున్నావ్? కానీ ఆ ఫ్రీడమ్‌తో తిరిగి కావ్య దగ్గరికి వెళ్లాడని అంటుంది వైదేహి. ఇప్పటి వరకు మా బావ మనసుతో ఆడుకున్నావ్? ఇప్పుడు ఇలా తాగించి నాశనం చేయాలని అనుకుంటున్నావా? అని కావ్యపై మండిపడుతుంది యామిని. మందులో ఉన్నప్పటికీ కావ్య మీద ప్రేమను బయటపెడతాడు రాజ్. భర్త మాటలతో కావ్య కంటతడి పెడుతుంది.
నీ మొగుడు తాగి రోడ్డు మీద దేవదాసులా పడిపోయేసరికి చూసి తట్టుకోలేకపోయావా? అని ప్రశ్నిస్తుంది యామిని. ఏమైపోతాడోనని ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టావా? అని అడుగుతుంది. రాజ్‌ని నువ్వెంత ప్రేమిస్తున్నావో? అంతకు 100 రెట్లు నేను కూడా ప్రేమిస్తున్నానని చెబుతుంది. నీ భర్తకు మందు అలవాటు చేసింది కూడా నేనే అని యామిని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. నువ్వు కడుపుతో ఉన్నావని తెలియగానే రాజ్ మనసులో చాలా కోపం పెరిగిందని, కానీ అదే సమయంలో ఎక్కడో చిన్న కన్‌ఫ్యూజన్ కూడా ఉందని అంటుంది. దానిని అలాగే కంటిన్యూ చేసి నీ మీద అసహ్యం కలిగించాలని మందుకు బానిసను చేస్తున్నానని యామిని చెప్పడంతో కావ్య రగిలిపోతుంది.
నిన్ను పూర్తిగా అసహ్యించుకుని, నీకు దూరమయ్యాక మళ్లీ రాజ్‌ని నా వాడిని చేసుకుంటానని అంటుంది యామిని. ఆ మాటలతో యామిని చెంప పగులగొడుతుంది కావ్య. ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నన్నే కొడతావ్ అని రగిలిపోతుండగా వైదేహి అడ్డుకుంటుంది. ఈ ఆపడం ఏదో మొదట్లోనే ఆపుంటే నీ కూతురి జీవితం ఎప్పుడో బాగుపడేదని చెబుతుంది కావ్య. నా మొగుడిని దక్కించుకోవాలని అన్న రోజే దీని చెంప పగులగొట్టి ఉంటే ఈరోజు నేను కొట్టాల్సిన పరిస్థితి వచ్చేది కాదని అంటుంది. నీ కూతురి మొండితనానికి, స్వార్ధానికి లొంగిపోయి తను సంతోషంగా చాలు అనుకున్నారని, దానికి ప్రతి ఫలం ఈరోజు ఒక కుటుంబం మొత్తం బాధపడుతోంది. ఆ ఇంటి వారసుడు ఇలా కుమిలిపోయే పరిస్ధితి తీసుకొచ్చారని, కానీ ఇప్పటికైనా మనుషులుగా మారాలని వార్నింగ్ ఇస్తుంది కావ్య.
రాజ్ నీకు మొగుడు కావడానికి ముందే నేను వాడిని ప్రేమించానని అంటుంది యామిని. రాతలో లేని రాముడిని కోరుకోవడం వల్లే ఆ శూర్పణక రామ, రావణ యుద్ధానికి కారణమై.. అన్నయ్య చావుని కళ్లారా చూసిందని అంటుంది కావ్య. నీ జీవితం కూడా అలాగే అవుతుంది, వెయిట్ చేయమని చెబుతుంది. నన్నెందుకు ఆపావని వైదేహిపై మండిపడుతుంది యామిని. నువ్వు ఏ తప్పుడు పని చేసినా అది కావ్య అడ్వాంటేజ్ అవుతుంది, రాజ్ నీకు పూర్తిగా దూరమైపోతాడని వార్నింగ్ ఇస్తుంది వైదేహి. నువ్వేం చేసినా కావ్య మీద గెలవలేవని, ఎందుకంటే నీది స్వార్ధం.. తనది బంధం.. నువ్వు ఎదుటివాళ్లని నాశనం చేసైనా గెలవాలని అనుకుంటున్నావ్, తను ప్రేమతో గెలవాలని అనుకుంటుందని అంటాడు రఘునాథ్. ధర్మం మీద అధర్మం గెలిచినట్లు ఇప్పటి వరకు ఏ పుస్తకాల్లోనూ, చరిత్రలోనూ రాయలేదని వార్నింగ్ ఇస్తాడు
ఏడుస్తూ ఇంటికి వచ్చిన కావ్యని చూసి ఇందిర, అపర్ణలు ఏమైందని అడుగుతారు. నా జీవితంలో జరగాల్సిన చెడంతా జరుగుతూనే ఉందని, ఆ దేవుడు నాకు జీవితాంతం ఇలా కన్నీళ్లే మిగిల్చాడని బాధపడుతుంది కావ్య. అసలు విషయం చెప్పకుండా ఇలా డొంక తిరుగుడిగా మాట్లాడతావేంటీ? అని ఇందిర అడుగుతుంది. ఇన్నాళ్లూ నేను ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగిందని, మనం మోసం చేశామన్న బాధలో ఆయన మందుకి అలవాటు అయ్యారని కావ్య చెప్పడంతో ఇందిర, అపర్ణ షాక్ అవుతారు. తాగేసి రోడ్డు మీద పడుకుంటూ వచ్చిపోయేవాళ్లతో గొడవలు పెట్టుకుంటూ నానా హంగామా చేశారని.. తాగేసి రోడ్డు మీద పడిపోతే నేనే ఇంటి దిగ్గర దించి వచ్చానని చెబుతుంది కావ్య.
నా కొడుకు మందు తాగడం ఏంటీ? వాడికి మందు అలవాటే లేదు కదా అని అంటుంది అపర్ణ. ఆయనకి మందు అలవాటు చేసేందే యామిని అని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఆయన ఉన్న పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని యామిని చూస్తోందని, ఆయనను ఓదారుస్తున్నట్లు నటిస్తూ ఆయనని తన వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారని అంటుంది కావ్య. ఏం చేయాలో నాకేం అర్ధం కావడం లేదని, ఏడుస్తూ వెళ్లిపోతుంది. మందు తాగి మెట్లపై పడిపోతాడు రాజ్.. బాటిల్‌లో మందు అయిపోయిందని ఇంకో బాటిల్ ఇవ్వమని అడుగుతాడు యామిని. మందు అయిపోయింది కానీ బాధపోవడం లేదని అంటాడు రాజ్.
ఇప్పటికే ఎక్కువ అయ్యిందని, ఇంక వద్దని యామిని ఎంత చెబుతున్నా రాజ్ వినిపించుకోడు. బాటిల్ ఇస్తావా? నేనే బయటికెళ్లి తాగమంటావా? అని అడుగుతాడు. ఇంతలో అపర్ణ, ఇందిరలు వస్తారు. బార్‌లో ఎందుకు బయటికెళ్లి రోడ్డు మీదే తాగమని అంటూ మండిపడతారు. నువ్వు అర్జెంట్‌గా వెళ్లి టేప్ రికార్డర్ తీసుకురా.. ఇద్దరు పెద్దరాయుళ్లు నీతి వాక్యాలు చెబుతారు వాటిని రికార్డ్ చేసుకుని మళ్లీమళ్లీ వినొచ్చని అంటాడు. మీరిద్దరూ నాకు మోసగాళ్లలా కనిపిస్తున్నారు, నమ్మించి గొంతు కోసే లేడ గ్యాంగ్ అంటూ మండిపడతాడు రాజ్. అమ్మ, నానమ్మలు తోడు దొంగల్లా మారి ఈరోజు నన్నిలా చేశారని అంటాడు. మీరే వచ్చారా? ఆ కళావతి ప్లాన్ చేసి పంపించిందా అని అడుగుతాడు.
మీ మాటలు నేను వినను, మీరు నా మిత్రులు కాదు.. శత్రువులని అంటాడు రాజ్. కళావతి గురించి నువ్వు అనుకుంటున్నది తప్పని, అది నిన్ను ఎప్పటికీ మోసం చేయదని అంటారు. కళావతి నీకోసం ప్రాణాలైనా ఇస్తుందని, బాధపెట్టదని అంటారు. దేవుడు నీకు గతంతో పాటు జ్ఞాపకాలు అన్ని తీసుకెళ్లిపోయాడని, నరకం అనుభవిస్తున్నది నా కోడలని అంటుంది అపర్ణ.


Click it and Unblock the Notifications










