Brahmamudi August 28th Episode: కావ్య జీవితం కోసం అపర్ణ సాహసం.. చావు బతుకుల్లో రాజ్

Photo Courtesy: JioHotstar

రాజ్‌ని తన దారిలోకి తెచ్చుకునేందుకు నాటకాలు మొదలుపెట్టిన యామిని.. అతనిని తాగుడికి మరింత బానిసను చేస్తుంది. కావ్యను రాజ్ నుంచి శాశ్వతంగా దూరం చేసే ప్లాన్ వేస్తుంది. కావ్యకి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటే ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి కావాలని యామిని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. నువ్వు పెళ్లి చేసుకుంటానని మాటిస్తే ఖచ్చితంగా నిజం చెబుతుందని అంటుంది. ఆ మాటలు నమ్మిన రాజ్.. పీకలదాకా తాగి దుగ్గిరాల వారింటికి వెళ్లి కావ్యను నానామాటలు అంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఆగస్ట్ 28వ తేదీ ఎపిసోడ్ 811లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial August 28th 2025 Episode 811 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

నేను అడిగే రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పు చాలు.. కళ్లు మూసుకుని నీ మెడలో తాళి కట్టి, జీవితాంతం నీకు తోడుగా నిలబడతాను.. ఇక జీవితంలో నిన్ను ఏ ప్రశ్న వేయను, నీ మాటకు ఎదురు కూడా చెప్పను అంటాడు రాజ్. ఇంతలో యామిని రావడంతో అంతా షాక్ అవుతారు. మా బావ లాంటి గొప్ప ప్రేమికుడు చరిత్రలోనే కాదు, భవిష్యత్‌లోనూ ఎక్కడా దొరకడని అంటుంది యామిని. నువ్వు మోసం చేసిన తర్వాత కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడంటే తనకి ఎంత గొప్ప మనసు ఉండాలని ప్రశ్నిస్తుంది. ఆ దేవుడే ప్రత్యక్షమై వరం ఇస్తున్నట్లుగా మా బావ నీకు వరం ఇస్తున్నాడని చెబుతుంది.

ఆ కడుపుకు కారణం ఎవరు? ఇన్ని రోజులు ఆ నిజాన్ని ఎందుకు దాచిపెట్టావో? మా బావకి నిజం చెప్పమని అంటుంది యామిని. నీ కోసం ఇంత త్యాగం చేస్తున్న మా బావకి ఆ నిజం కూడా చెప్పలేవా? అని మండిపడుతుంది యామిని. అంటే నువ్వు తప్పు చేశావనే కదా అర్ధం అని అనడంతో అంతా షాక్ అవుతారు. మా బావ నీ వెంట తిరిగేలా చేసుకుని, ప్రేమలో పడేసి ఇలా తాగుబోతులా మార్చాలనేది కదా నీ లక్ష్యం అని అంటుంది. అసలు మా బావ నీకు ఏం అన్యాయం చేశాడు? ఎందుకు తన మనసుని ఇంతలా గాయపరిచావని రెచ్చగొడుతుంది.

ఆ మాటలతో రగిలిపోయిన కావ్య.. హద్దుమీరి మాట్లాడుతున్నావని అంటుంది. ఇప్పటి వరకు నా హద్దుల్లో నేను ఉన్నానని, ఎందుకంటే నా బావ నిన్ను ప్రేమించాడు కాబట్టి, తనని ఇంకా ఇంకా వేధిస్తే మాత్రం నేను ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. ఇంకా ఎందుకు కళావతిని నమ్ముతున్నావ్? ఎవరితోనో కడుపు తెచ్చుకున్నాసరే నువ్వు ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని అవుతానని చెప్పినా ఆ తర్వాత కూడా ఇంకా నిజం చెప్పడానికి నోరు తెరవడం లేదంటే ఈ మనిషి ఎలాంటిదో నీకు అర్ధం కావడం లేదా అని రాజ్‌ని ప్రశ్నిస్తుంది. ఇలాంటి మోసగత్తెని నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని, నిన్ను జీవితాంతం నెత్తిన పెట్టుకుని నేను చూసుకుంటానని అంటుంది యామిని.

నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత కూడా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు? అనేది చెప్పలేవా? అని ప్రశ్నిస్తాడు రాజ్. ఎలా చెబుతుంది బావా? చెబితే తన క్యారెక్టర్ ఏంటో నీ ముందు బయటపడిపోతుంది కదా? అందుకే నోరు విప్పడం లేదని అంటుంది యామిని. ఎవరినైనా ప్రేమించి వాడు మోసం చేసి వదిలేస్తే కారణంగా చెప్పేదని, కానీ ఆ మనిషి ఎవరో తనకు తెలియదనుకుంటా.. పద్ధతిగా సంసారం చేసే ఆడవాళ్లు తప్పు జరిగిందని కాళ్ల మీద పడైనా ఒప్పుకుంటారని, కానీ ఇలాంటి బజారు మనుషులు ఎవరితోనో పడుకుని అనే లోగా యామిని చెంప పగులగొడుతుంది అపర్ణ.

ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా కోడలి క్యారెక్టర్‌ని తక్కువ చేసి మాట్లాడతావ్? అసలు నువ్వెంత? నీ బ్రతుకెంత? నువ్వు నా కోడలి గురించి మాట్లాడుతున్నావా? అని మండిపడుతుంది అపర్ణ. పరాయి మగాడిని సొంతం చేసుకోవాలని చూసే నువ్వు చిల్లర మనిషివి, ఒక కుటుంబాన్ని బాధపెట్టాలని చూస్తున్న నీకే క్యారెక్టర్ లేనిది, అసలు నీలాంటి మనిషి నా ఇంటి గడప తొక్కడానికి కూడా వీల్లేదని వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. తను కాదు నేను అదే ప్రశ్న అడుగుతున్నాను? నాకు సమాధానం చెప్పగలవా? అని అంటాడు రాజ్. తను ఏ తప్పు చేయకపోతే నిజం ఎందుకు చెప్పడం లేదు? ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే అంటాడు. నీ కొడుకుకి అన్యాయం జరుగుతున్నా నువ్వు తనకే సపోర్ట్ చేస్తావా? అని ప్రశ్నిస్తాడు రాజ్. నిజంగానే తన తప్పు చేసుంటే క్షమాపణలు అడిగేదని, లేదా ఆ నిజమైనా చెప్పేదని, కానీ అలా చెప్పలేదంటే యామిని అన్నట్లు నిజంగానే తను ఎవరితోనో అనేలోగా రాజ్ చెంప పగులగొడుతుంది అపర్ణ.

ఈ కళావతి ఎవరనుకుంటున్నావ్? ఈమె నువ్వు తాళికట్టిన నీ భార్య అని నిజం చెబుతుంది అపర్ణ. దాంతో అంతా షాక్ అవుతారు. కావ్య నిజం చెప్పబోతుండగా అపర్ణ అడ్డుకుని.. ఇప్పటికే ఆలస్యం చేశానని, అది నన్ను నానామాటలు అంటున్నా కడుపు తీపితో కొడుకుకు ఏం కాకూడదని ఇన్ని రోజులు ఓపిక పట్టానని చెబుతుంది అపర్ణ. నా కొడుకే ఇలా దిగజారి మాట్లాడుతుంటే ఇక నిజం దాచడంలో ప్రయోజనం లేదని అంటుంది. నువ్వు నా కొడుకు లాంటి వాడివి కాదు.. నా పేగు తెంచుకుని పుట్టిన నా కన్న కొడుకువి అంటుంది అపర్ణ. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. ఈ కుటుంబం నీది నువ్వు పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడేనని చెబుతుంది అపర్ణ. నీ పేరు రామ్ కాదు.. రాజ్, స్వరాజ్.. నువ్వు కళావతి కళావతి అని పిలుచుకుంటున్న నీ భార్య పేరు కావ్య అని అంటుంది.

కావ్య నెల తప్పడానికి కారణం నువ్వు.. తన కడుపులో బిడ్డకి కారణం నువ్వు, ఈ దుగ్గిరాల వారింటికే వారసుడివి రా నువ్వు అని అపర్ణ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. శ్రీశైలానికి వెళ్లిన మీ ఇద్దరికీ యాక్సిడెంట్ అయితే నువ్వు చనిపోయావనుకున్నామని అంటుంది అపర్ణ. ఈ యామిని కాలేజీలో నీకు పరిచయమై, నువ్వు తన ప్రేమను రిజెక్ట్ చేస్తే నీకు జరిగిన యాక్సిడెంట్‌లో నువ్వు గతాన్ని మరిచిపోవడంతో ఆ అవకాశాన్ని వాడుకుని బావ అంటూ నిన్ను పెళ్లి చేసుకోవాలని చూసిందని చెబుతుంది అపర్ణ. కావ్యను చూడగానే పదే పదే తనతో గడపాలని ఎందుకు అనిపించింది? ఈ ఇంటి అడ్రస్ తెలియకపోయినా వెతుక్కుంటూ ఎలా వచ్చావ్? అని ప్రశ్నిస్తుంది.

మీ ఇద్దరి మధ్య ఉన్నది ఆ దేవుడు వేసిన బ్రహ్మముడి అని అంటుంది అపర్ణ. యామినిని పరాయి మనిషిలా ఎందుకు చూశావ్? నిన్ను మోసం చేసింది ఆ యామిని, దాని ఫ్యామిలీ అని చెబుతుంది. నీకు పుట్టబోయే బిడ్డను కూడా నీ కన్నబిడ్డ కాదని.. నీ నుంచి నీ భార్యను శాశ్వతంగా విడగొట్టాలని వచ్చిందని చెబుతుంది అపర్ణ. నీ గతాన్ని గుర్తుచేయడానికి ప్రయత్నిస్తే నువ్వు చనిపోతావని చెప్పడంతో నీకు ఏం జరుగుతుందోనని భయపడి కావ్య అన్ని భరించిందని అంటుంది. తన మీద నింద పడుతున్నా ఎందుకు భరించింది? కేవలం నీ కోసమేనని అంటుంది. దాంతో గతం గుర్తుచేసుకున్న రాజ్.. కళ్లు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్తారు. రాజ్ పరిస్ధితి విషమంగానే ఉందని డాక్టర్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ ఏడుస్తుంటారు.

ఇదంతా నా వల్లే జరిగిందని, నా ఆవేశం వల్లే వాడు ఇలాంటి పరిస్ధితికి వచ్చాడని బాధపడుతుంది అపర్ణ. ఒక్కసారి కూడా ఆలోచించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడానని అంటుంది. వాడికి గతాన్ని గుర్తుచేసే ప్రయత్నం చేయొద్దని, అది వాడి ప్రాణానికే ప్రమాదమని డాక్టర్ ముందు నుంచి చెబుతూనే ఉన్నాడని.. కానీ నేను వాడి ప్రాణం మీదకి తీసుకొచ్చానని బాధపడుతుంది. దాంతో అపర్ణని ఇందిర, ధాన్యలక్ష్మీ ఓదారుస్తారు. నీకు మొదటి నుంచి అన్యాయం చేస్తూనే ఉన్నానని నన్ను క్షమించాలని అడుగుతుంది అపర్ణ. ఇలాంటివి జరగకూడదని మా అందరికీ ఎంత నచ్చబెబుతున్నా మేం వినకుండా క్షణికావేశంలో నేను చేసిన తప్పు వాడిని చావు అంచులదాకా తీసుకెళ్లిపోయిందని బాధపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X