వాళ్లకి లొంగలేదని ఆఫర్లు రానివ్వకుండా... రక్తం అమ్ముకుని భోంచేశా.. బ్రహ్మముడి అప్పూ ఎమోషనల్

భారతీయ వినోద రంగంలో వెండితెరది అగ్రస్థానం. ఎన్ని రకాల వినోద మాధ్యమాలు వచ్చినా సినిమా ఎవర్ గ్రీన్. అయితే ఇటీవలి కాలంలో బుల్లితెర కూడా అంతే దూకుడుగా విస్తరిస్తోంది. ఓటీటీల యుగంలోనూ తనదైన మార్క్‌ను చూపెడుతోంది. సీరియల్స్, ప్రోగ్రామ్స్, రియాలిటీ షోలతో భారతీయ బుల్లితెర వెలిగిపోతోంది. ముఖ్యంగా సీరియల్స్ మేకింగ్‌ పూర్తిగా మారిపోయింది. ఇక్కడ కూడా అందమైన ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇచ్చి గ్లామర్ షో చేస్తున్నారు. సీరియల్స్ అంటే ఏడుపుగొట్టు అన్న భావనను తొలగించి అందాల జాతరకు కేరాఫ్‌గా మారింది. టాలీవుడ్ టూ బాలీవుడ్ అన్ని భాషల్లోనూ సీరియల్స్ రూపుదిద్దుకుంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి.

బ్రహ్మముడి అప్పూ కష్టాలు
ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇందులో లీడ్ రోల్స్ పోషిస్తున్న దీపిక రంగరాజు, మానస్ నాగులపల్లితో సమానంగా క్రేజ్ దక్కించుకుంటున్నారు అప్పూ క్యారెక్టర్ చేసిన నైనిష రాయ్. టామ్ బాయ్‌గా, పోలీస్‌గా, అక్కకి కష్టమొస్తే చూడలేని చెల్లిగా పవర్ ఫుల్ రోల్‌ను పోషించారు నైనిష. ఈమె అసలు పేరును మరిచిపోయిన ప్రేక్షకులు అప్పూగానే ఎక్కువగా గుర్తు పెట్టుకుంటున్నారు. బ్రహ్మముడితో పాటు తెలుగు బుల్లితెరపై మరిన్ని సీరియల్స్‌లో ఆమె నటిస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కష్టాలను పంచుకున్నా నైనిష.

Brahmamudi serial fame Nainisha Rai shocking comments on casting couch

బెంగాల్ నుంచి హైదరాబాద్‌కి
పశ్చిమ బెంగాల్‌కు చెందిన నైనిష రాయ్ నటి కావడం కోసం ఎన్నో కష్టాలు పడింది. మంచి నటనతో పాటు తెలుగును అనర్గళంగా మాట్లాడటం ఈమెకు ప్లస్ పాయింట్. బ్రహ్మముడికి ముందు పలు ఛానెల్స్‌లో శ్రీమంతుడు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఇంటి గుట్టు, హంస గీత, భాగ్యరేఖ వంటి సీరియల్స్‌తో పాటు ప్లాన్ బి, కిడ్నాప్ వంటి సినిమాల్లోనూ నటించింది. నైనిష రాయ్ తండ్రి లెక్చరర్, ఆమె అమ్మగారు సాధారణ గృహిణి. ఇంటర్ చదువుతున్న సమయంలోనే నటనపై ఇష్టంతో ఇంట్లోనుంచి బయటకు వచ్చేసి అవకాశాల కోసం ప్రయత్నించింది. తెలియని ప్రాంతం, తెలియని భాష అయినప్పటికీ తెగువ, ధైర్యం, ప్రతిభతో ఆమె ఈ స్థాయికి చేరుకుంది. అయితే ఇవేవి ఊరికే తనకు రాలేదని ఎన్నో కష్టాలు పడ్డానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

తల్లిదండ్రులతో గ్యాప్
నేను యాక్టర్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. చదువుకోవడానికి హైదరాబాద్‌లో ఉన్నాను, మా ఫ్రెండ్ ద్వారా ఒక ప్రొడ్యూసర్ నన్ను చూసి కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్‌లో విలన్‌గా ఛాన్స్ ఇచ్చారు. తిరిగి చదువుకోవడానికి ఢిల్లీ వెళ్లిపోయాను, ఈ మధ్యలో మూడు సినిమాలలో ఆఫర్లు వస్తే నటించా. కోవిడ్ టైంలో శ్రీమంతుడు అనే ప్రాజెక్ట్‌లో చాలా సాఫ్ట్ రోల్‌ కోసం గ్లిజరిన్ బాటిల్స్ అయిపోయేది. ఎవరో ఏది చెబితే మా నాన్న వాటిని నమ్మడంతో తట్టుకోలేకపోయా. కోల్‌కతా నుంచి హైదరాబాద్ వచ్చి రెండ్రోజులు రైల్వే స్టేషన్‌లోనే ఉన్నా, నా దగ్గర ఉన్న గోల్డ్ రింగ్ అమ్మితే ఐదు వేలో, ఆరు వేలో వచ్చాయి. హాస్టల్‌కి ఫీజు కట్టేసి జర్నీ స్టార్ట్ చేశానని నైనిషా రాయ్ అన్నారు.

ఆ రోడ్డు చూస్తే గర్వంగా
నా లైఫ్ చాలా బాగుందని చాలామంది అనుకుంటారు. నాకు ఫీజుకు మాత్రమే నగలు అమ్మిన డబ్బు సరిపోయింది. నేనుండేది అమీర్‌పేట్.. జాబ్ చేసేది సికింద్రాబాద్. 20 రోజుల పాటు నడుచుకుంటూనే ఆఫీస్‌కి వెళ్లాను. తెల్లవారుజామున 5 గంటలకు స్టార్ట్ అయితే 9.30 గంటలకు షిఫ్ట్‌కి చేరుకునే దానిని. కారులో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు చూసి ఎంతో గర్వపడతా. 15 రోజులు తిండి లేకపోవడంతో లేవడానికి కష్టంగా ఉంది.. ఆ సమయంలో నా బ్లడ్‌ని అమ్ముకుని ఫుడ్ తిన్నా, ఎన్నోసార్లు చనిపోవాలని అనుకున్నాను. షూటింగ్స్ జరిగేటప్పుడు బాగా ఫుడ్ పెట్టమని మాత్రమే అడిగేదానిని.. అన్నింటికి అడ్జెస్ట్ అవుతున్నానను కదా అని ప్రొడక్షన్ వాళ్లకి చీప్‌గా కనిపిస్తామని నైనిష పేర్కొన్నారు

కమిట్‌మెంట్ అంటే వేరే అర్ధం చేసుకున్నా
నాకు ఎన్నోసార్లు పెళ్లి అయిపోయిందని రాసేశారు, అది వాళ్ల ఖర్మ. అమ్మాయిల్ని అమ్మాయిలే మోసం చేస్తారని తెలుసుకున్నా. అవకాశాల పేరుతో వేరే ఉద్దేశ్యాలతో కాంటాక్ట్ అయ్యేవారు.. శ్రీరెడ్డిని చూసి నేను కూడా నాకు జరిగింది మీడియాకు చెబుదామనుకున్నా. వేధింపులు భరించలేక హైదరాబాద్ వదిలి వెళ్లిపోయా. కమిట్‌మెంట్ అనే పదం విన్నప్పుడు ఆ వయసులో చదువు, దేనినైనా సాధించడం కమిట్‌మెంట్ అనుకున్నా. ఇండస్ట్రీ కమిట్‌మెంట్ వేరని నాకు తెలియదు. దాంతో కమిట్‌మెంట్‌కి ఓకే అని చెప్పడంతో నన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. దాంతో నేను సీరియస్ అయి.. లాగిపెట్టి పీకడంతో వాళ్లు నాకు అవకాశాలు దక్కకుండా చేశారు. దాంతో 6 నెలలు ఒకే రూమ్‌లో కూర్చొని ఏడ్చా.. కానీ వాటిని అధిగమించి నవ్వులోనే నా పెయిన్ దాచుకున్నానని నైనిషా రాయ్ ఎమోషనల్ అయ్యారు.

More from Filmibeat

Read more about: brahmamudi nainisha rai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X