Brahmamudi November 1st Episode: రాజ్, కావ్యల ట్రాప్‌లో పడ్డ కోయిలి... రాహుల్‌ బడితపూజకి స్వప్న ఏర్పాట్లు

Photo Courtesy: JioHotstar

రాహుల్‌ని పూర్తిగా నా వైపుకు తిప్పుకుని వాడి ఇంట్లో అడుగుపెట్టి ఆస్తి మొత్తం కొట్టేస్తానని తన భర్త రంజిత్‌తో చెబుతుంది కోయిలి. ఇంతలో రాహుల్ అక్కడికి లగేజ్‌తో సహా వచ్చేస్తాడు. స్వప్నని, వాళ్లని వదిలేసి నీ కోసం వచ్చేశానని రాహుల్ చెప్పడంతో కోయిలి షాక్ అవుతుంది. నేను నిన్ను ప్రేమించిందే నీ కుటుంబం చూసి అప్పుడు నాకు అందరూ ఉంటారని చెబుతుంది కోయిలి. అవేవీ పట్టించుకోని రాహుల్.. ఇకపై నేను ఇక్కడే ఉంటానని చెప్పడంతో భార్యాభర్తలిద్దరికీ ఏం చేయాలో అర్ధం కాదు.

రాహుల్‌ని కన్విన్స్ చేసి ఎలాగైనా తిరిగి వాళ్లింటికి పంపించాలని అనుకుంటారు కోయిలి - రంజిత్. ఉదయాన్నే రాహుల్ దగ్గరికి వచ్చి.. నువ్వు ఇక్కడికి వచ్చేశావని మీ వాళ్లు చూస్తూ ఊరుకుంటారా? అని ప్రశ్నిస్తుంది కొయిలి. నా కోసం ఎవ్వరూ రారని రాహుల్ చెప్పగా.. ఇంతలో రాజ్- కావ్యలు ముసలివాళ్ల గెటప్‌ వస్తారు. మా మీద అలిగి ఇక్కడికి వచ్చేశావా? నువ్వు పెళ్లి చేసుకుంటే మా ఆస్తి మొత్తం నీకే ఇచ్చేస్తామని చెబుతారు. వారి మాటలు విన్న కోయిలి సంబరపడిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 1వ తేదీ ఎపిసోడ్ 867లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial November 1st 2025 Episode 867 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఈ ఆస్తిని మీ ఇద్దరికి ఇచ్చేద్దామని అనుకుంటున్నామని కానీ మమ్మల్ని వెళ్లిపోమంటావా అని బామ్మ తాతయ్యల వేషంలో వచ్చిన కావ్య, రాజ్‌లు చెబుతారు. మీరు వెంటనే వెళ్లిపోవాలని రాహుల్ తేల్చేస్తాడు. వాళ్లు ఎక్కడికి వెళ్తారు, వాళ్లకు మనం తప్ప ఎవరున్నారు? అని కోయిలి ప్రశ్నిస్తుంది. మీ బామ్మ తాతయ్యలు నిన్ను వెతుక్కుంటే వస్తే నువ్వు ఇలాగేనా మాట్లాడేది అని మండిపడుతుంది కోయిలి. మంచో చెడో నా మనవడు ఈ వయ్యారి వలలో పడ్డాడు బతకని, మనం వెళ్లిపోదాం, మనం వీళ్లకి అడ్డుగా ఉండొద్దు, మన ఆస్తినంతా ఏ అనాథ శరణాలయానికో రాసేద్దామని అంటుంది కావ్య. ఆ మాటలతో కోయిలి వాళ్లని ఆపుతుంది. మీరు ఎక్కడికి వెళ్లొద్దు, ఇక్కడే మాతో పాటే ఉండాలని చెబుతుంది.

మన ఆస్తిని దీని చేతిలో పెడితే ఇంకెంత బాగా చూసుకుంటుందో అని అంటుంది కావ్య. ఆస్తి లేదు, ఏం లేదు.. నేను రాను మీరు వెళ్లిపోండి అని చెబుతాడు రాహుల్. వాళ్లకి కావాల్సినన్ని రోజులు మనతోనే ఉంటారని అంటుంది కోయిలి. మీరిద్దరూ లోపలికి వెళ్లండి, నేను వీళ్లతో మాట్లాడతానని అంటాడు రాహుల్. ఈ నాటకం ఏంటీ? ఇక్కడికి ఎందుకొచ్చారు అని రాజ్, కావ్యలను నిలదీస్తాడు రాహుల్. బంగారం లాంటి భార్యను కాదని ఇలాంటి దాని కోసమా నువ్వు వచ్చిందని మండిపడతాడు రాజ్. ఇలాంటి దారిద్య్రాన్ని వెతుక్కుంటూ వచ్చి మా అక్క జీవితాన్ని ఏం చేద్దావని అనుకుంటున్నావని కావ్య నిలదీస్తుంది. కోయిలి దరిద్ర్యం కాదు, నా అదృష్టమని.. తనతో ఉంటే సంతోషంగా ఉంటుందని అంటాడు రాహుల్.

నాకు ఆ ఇంట్లో విలువ లేదు, మనుషుల మధ్య గౌరవం లేదని, నేను ఆ ఇంటికి పనికిరానని చెబుతాడు రాహుల్. గౌరవ మర్యాదలు అనేవి అడుక్కుంటేనో, కొనుక్కుంటేనో రావని చెబుతుంది కావ్య. పర్ణశాల లాంటి ఇంటిని వదిలేసి ఈ పంజరం లాంటి ఇంటికి వచ్చి పడ్డావని, అది నీకు అర్ధం కావడం లేదని అంటుంది కావ్య. నేను చేసేది తప్పో ఒప్పో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను నచ్చిన చోటే ఉంటానని చెబుతాడు రాహుల్. నీకు భార్య, పాప ఉన్నారు.. నీ సరదా, సంతోషాల కోసం వాళ్లకు అన్యాయం చేస్తే ఊరుకోమని రాజ్ వార్నింగ్ ఇస్తాడు. నువ్వు నాతో రావాల్సిందే, నీ బుద్ధి మార్చుకోవాల్సిందేనని అంటాడు రాజ్. నా ప్రాణం పోయినా అది జరగదని, మీరు ఏం చేసినా సరే ఎప్పటికీ నన్ను తీసుకెళ్లలేరని అంటాడు రాహుల్. మీరు నా బామ్మ తాతయ్యలు కాదని చెబితే చాలు కోయిలి వాళ్లే గెంటేస్తారని చెబుతాడు.

ఇతను రిచెస్ట్ కాదు, జేబులో చిల్లిగవ్వ లేదని మీ కోయిలి ముందు కూశామనుకో... ఏం జరుగుతుందో తెలుసా అని కావ్య బెదిరిస్తుంది. అప్పుడు ఎగిరి తంతుంది, ఎగిరి ఇక్కడే పడతాడని అంటాడు రాహుల్. అంత పని చేయొద్దని రాహుల్ బతిమలాడతాడు. అయినా మీరు చెప్పగానే కోయిలి నమ్మేస్తుందా? అని ప్రశ్నిస్తాడు. నీ వెనుక ఆస్తి ఉందని నమ్మించావు, డబ్బు ఉన్నవాడివని కలర్ ఇచ్చావు, నీకు అవేవీ లేవని తెలిస్తే నీ బతుకు బస్టాంటే అంటుంది కావ్య. నా డబ్బుతో దానికేం పని కోయిలి దగ్గర బోల్డెంత ఆస్తి ఉందని చెబుతాడు రాహుల్. కానీ నువ్వు డబ్బు ఉందనే పడేశావు కదా అని అంటాడు రాజ్.

ఇంతలో కోయిలి వచ్చి నా గురించే మాట్లాడుకుంటున్నారా? అని ప్రశ్నిస్తుంది. వీడికి పెళ్లయి, పిల్లలు ఉన్నారని తెలిసి కూడా మా వెదవని ఎలా బుట్టలో వేసుకున్నావని అడుగుతాడు రాజ్. ప్రేమకు వయసుతో, వేరే వాటితో సంబంధం లేదని అంటుంది కోయిలి. నువ్వు నన్ను సీరియస్‌గా ఇష్టపడుతున్నావా? అని రాహుల్ నిలదీస్తాడు. కోయిలి ఇచ్చిన కాఫీ తాగిన రాజ్, కావ్యలు చెండాలంగా ఉందని అంటారు. కాఫీ చేయడం రానిది కాపురం ఎలా చేస్తుందని ప్రశ్నిస్తాడు రాజ్. మీకు కావాల్సినవన్నీ హోటల్ నుంచి తెప్పిస్తానని అంటుంది కోయిలి. ఫైవ్ స్టార్ హోటల్ తప్పించి చిన్నా చితకా హోటల్ తిండి మేం తినమని చెబుతుంది కావ్య. దాంతో సరేనని అంటుంది కోయిలి. వాళ్లు చెప్పిన లిస్ట్ చూసి షాక్ అవుతుంది కోయిలి. వాళ్లను మెయింటైన్ చేయాలంటే రోజుకు లక్షన్నర అవుతుందని కోయిలితో అంటాడు రంజిత్.

మన కోసం ఆ రాహుల్ గాడి కోసం చేసిన అప్పులన్నీ వడ్డీతో కలిపి పెద్ద కొండై కూర్చొన్నాయని చెబుతాడు. ఆ సేటు అప్పు తీర్చకపోతే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడని.. ఎక్కడని తీసుకురానని అడుగుతాడు రంజిత్. వాళ్ల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయికి వెయ్యి రెట్లు తిరిగి సంపాదించాలని అంటుంది కోయిలి. ఆ రాహుల్ గాడి ఆస్తితో పాటు ఈ ముసలివాళ్ల ఆస్తుల్ని కూడా కొట్టేయాలని అంటుంది కోయిలి. కోట్ల ఆస్తిని సంపాదించాలంటే కొంచెం కష్టపడాల్సిందేనని అంటుంది. ఇంతలో కావ్య, రాజ్‌లు తమ గెటప్ తీసేస్తారు. రాహుల్ కళ్లు తెరిచి మా అక్క జీవితం బాగుపడే వరకు మనకి ఈ కష్టాలు తప్పవని అంటుంది కావ్య. ఆ రంజిత్ .. కోయిలి మావయ్య కాదు, మొగుడేమోనని నాకు డౌట్‌గా ఉందని చెబుతుంది. రాజ్, కావ్యలు గెటప్‌లు వేసినట్లు రంజిత్‌కు అనుమానం రావడంతో తొంగిచూడగా రాజ్ అలర్ట్ అవుతాడు.

రాహుల్ గురించి బాధపడుతున్న స్వప్నని ఓదారుస్తుంది అప్పూ. ఒకరు చెబితే వినడం కాదు, తనకు బుద్దిలేదా అని రాహుల్‌పై స్వప్న మండిపడుతుంది. రాహుల్ తిరిగొచ్చాక కంట్రో‌ల్‌లో పెట్టమని అంటుంది స్వప్న. మీ రాహుల్ ఆ అమ్మాయి దగ్గర కోటీశ్వరుడని కలరింగ్ ఇచ్చాడట, ఇప్పుడు అక్కాబావ ఆ నిజం బయటపెడితే తనని అలాగే చూసుకుంటుందని అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తుంది అప్పూ. దానికి డబ్బు ఉంది అనడం కూడా డౌటేనని అక్క నాతో చెప్పిందని అంటుంది. దాని దగ్గర డబ్బు లేదని తెలిస్తే రాహులే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడని చెబుతుంది అప్పూ.

హోటల్ నుంచి భోజనం తెప్పించడానికి పాతిక వేలు అయ్యిందని రంజిత్ చెప్పడంతో రాహుల్, కోయిలిలు షాక్ అవుతారు. నిన్న ఆఫీసులో 50 కోట్ల రూపాయల డీల్ చేస్తుంటే వాచ్ ఎక్కడో జారిపోయిందని అంటుంది, దాని వాల్యూ 2 లక్షల రూపాయలు ఉంటుందని అంటాడు. ఇప్పుడు మీరు రిచ్.. కోయిలిని పెళ్లి చేసుకున్నాక నేను కూడా రిచ్ అవుతానని అనుకుంటాడు రాహుల్. ఇంతలో రాజ్, కావ్యలు వచ్చి భోజనాలు ఎలా ఉన్నాయోనని చూస్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X