Brahmamudi November 4th Episode: గోల్డ్ బాబు ట్రాప్‌లో కోయిలి.... రాజ్- కావ్యలపై రుద్రాణి కుట్ర

Photo Courtesy: JioHotstar

హోటల్‌ నుంచి తెప్పించి వంటకాలను చూసిన రాజ్- కావ్యలు.. వడ్డించేందుకు ఇంట్లో పనివాళ్లు లేరా అని అడుగుతారు. ఆ మాటలతో షాకైన కోయిలి - రంజిత్‌లు పనివాళ్లను మేమే తీసేశామని చెబుతారు. మరి మాకు ఎవరు వడ్డిస్తారని కావ్య అడగ్గా.. నేను వడ్డిస్తానని చెబుతుంది కోయిలి. మాకు ఈ హోటల్ ఫుడ్ వద్దని, నువ్వే వండాలని కావ్య- రాజ్‌లు చెప్పడంతో కోయిలి షాక్ అవుతుంది. నాకు వంట రాదని అనడంతో నీకు నేను నేర్పిస్తానని చెబుతుంది కావ్య.

ముసలివాళ్లుని ఒక్క పూట మేపడానికే మనకి 30 వేలు ఖర్చయ్యిందని నాలుగు రోజులు ఇక్కడే ఉంటే మన జీవితాలు నాశనమని కోయిలితో అంటాడు రంజిత్. ఇంకో పది లక్షలు అప్పు చేసైనా సరే వాళ్లని భరించాల్సిందే.. రాహుల్‌తో పెళ్లయ్యాక, వాడి ఆస్తితో పాటు ఈ ముసలొళ్ల ఆస్తి కూడా కొట్టేసి వాళ్లని బయటికి గెంటేస్తానని చెబుతుంది. వారి మాటలను విన్న కావ్య- రాజ్‌లు షాక్ అవుతారు. మనం అనుకున్నట్లు వీళ్లిద్దరూ దొంగలని ఇక రాహుల్ కళ్లు తెరిపించే పని మొదలు పెట్టాలని చెప్పి కోయిలిని పనిమనిషిగా మార్చేసి పనులు చేయిస్తుంది కావ్య. అది చూసిన రాహుల్ షాక్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక నవంబర్ 4వ తేదీ ఎపిసోడ్ 869లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial November 4th 2025 Episode 869 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కోయిలితో దగ్గరుండి వంట చేయిస్తుంది కావ్య. ఆమె దెబ్బలు, మొట్టికాయలు భరించలేక ఏడుస్తుంది కోయిలి. నువ్వు ప్రతిసారి మనవడా అని పిలుస్తుంటే చీరాకుగా ఉందని రాజ్‌తో అంటాడు రాహుల్. తాత మనబడిని మనవడు అని పిలవకూడదా అంటుంది కావ్య. నీ కజిన్ గోల్డ్ బాబు వస్తున్నాడని రాజ్ చెప్పడంతో వాడెవడు అని అడుగుతాడు రాహుల్. చిన్నప్పుడు ఇద్దరూ కలిసి ఆడుకున్నారు.. ఇప్పుడు వాడు నీతో ఆడుకోవడానికి ఇక్కడికి వస్తున్నాడని రాజ్ చెబుతాడు. ఇంకో కొత్త క్యారెక్టర్‌ని తీసుకొస్తున్నారా అని మండిపడతాడు.

ఇంతలో వంటగదిలో నుంచి వచ్చిన కోయిలిని చూసి రాహుల్ షాక్ అవుతాడు. ప్రేమించిన దాని అందం చూస్తావా? ఆస్తి చూడాలి కానీ అని అంటాడు రాజ్. ఇది ఇష్టం లేకపోతే చెప్పు ఇప్పుడే వెళ్లిపోదామని అంటుంది కావ్య. ఆ మాటలతో టెన్షన్ పడ్డ కోయిలి.. అప్పుడే అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెబుతుంది. నేను వెళ్లి స్నానం చేసి ముస్తాబైతే అప్సరసలా ఉంటానని కోయిలి చెప్పగా..నువ్వు రెడీ అవ్వమని చెబుతాడు రాహుల్. అసలే మా గోల్డ్ బాబు వస్తున్నాడని, నువ్విలా ఉంటే వాడికి అస్సలు నచ్చదని చెబుతాడు రాజ్.

ఆ వెంటనే గోల్డ్ బాబు వచ్చి రాహుల్‌ను పలకరిస్తాడు. నా మైండ్ బ్లాక్ అయ్యింది, ఏం గుర్తుండటం లేదని అంటాడు రాహుల్. చిన్ననాటి మిత్రుడివి, నా కజిన్‌‌వి నిన్ను చూడాలనే ఆత్రంతో వచ్చేశానని చెబుతాడు గోల్డ్ బాబు. కోయిలి అదిరిపోయిందని.. నేను రాహుల్‌కి అన్నయ్యనని, ఏళ్ల తరబడి దుబాయ్‌లో ఉండి కోట్లకి పడగలెత్తి వచ్చానని అంటాడు గోల్డ్ బాబు. మీ ఒంటి మీద ఉన్నదంతా బంగారమేనా? అని అడుగుతుంది కోయిలి. దుబాయ్‌లో అందరికీ పెట్రోల్ బావులు ఉన్నట్లు నాకు బంగారు బావులు ఉన్నాయని చెబుతాడు గోల్డ్ బాబు. ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తే ఏం లాభంరా, మన ఇండియాకి దూరమైపోయావు కదా అంటాడు రాజ్.

నేను సంపాదించిన వజ్రాలు, బంగారం అన్ని తెచ్చేశా.. ఇకపై ఇండియాలోనే కంపెనీ పెడతానని అందుకు పార్ట్‌నర్స్‌ను వెతుకుతున్నానని చెబుతాడు. మీరు బయట వెతకాల్సిన పని లేదని.. మా కంపెనీలో మీరు పెట్టుబడి పెట్టండి అని చెబుతుంది కోయిలి. మీ స్టైల్, మీ ఫిగర్ అదిరిపోయిందని గోల్డ్ బాబు చెప్పడంతో కోయిలి సిగ్గుపడుతుంది. అది చూసిన రాహుల్ ఉలిక్కిపడతాడు. ఆ వెంటనే నా గిఫ్ట్ కింద ఉంగరం ఉంచుకోమని గోల్డ్ బాబు చెప్పడంతో కోయిలి మురిసిపోతుంది. మీకేం కావాలన్నా మావయ్య చూసుకుంటాడు, మీకెంత పెట్టుబడి పెట్టాలన్నా మా కంపెనీలోనే పెట్టండి అంటుంది కోయిలి.

వాడు సంపాదించింది వెయ్యి కోట్లు.. మీ కంపెనీలో పెట్టుబడి పెట్టేది 5 వందల కోట్లని కావ్య, రాహుల్ చెప్పడంతో కోయిలి, రంజిత్‌లకు కళ్లు తిరుగుతాయి. నేను మీకు గదిని చూపిస్తానని తీసుకెళ్తుంది కోయిలి. బంగారం మొత్తం నీకు ఇచ్చేసి వరల్డ్ టూర్‌కి వెళ్దామని గోల్డ్ బాబు చెప్పడంతో కోయిలి మురిసిపోతుంది. ఇంతలో ఛార్జర్ కోసం వెతుకుతున్న గోల్డ్ బాబు.. తన సూట్‌ కేసుని ఓపెన్ చేయగా అందులో గోల్డ్ బిస్కెట్స్ చూసి అవాక్కవుతుంది కోయిలి. ఒక్క బిస్కెట్ నాకు ఇవ్వగా అని కోయిలి అడగ్గా.. నీకు బిస్కెట్ ఫ్యాక్టరీయే రాసిస్తానని చెబుతాడు గోల్డ్ బాబు.

రాజ్, కావ్యలు తాతయ్య - బామ్మ అంటూ నా దగ్గరికి వచ్చి పెంట పెంట చేస్తున్నారని రుద్రాణితో చెబుతాడు రాహుల్. నేను కోటీశ్వరుడిని అని నా గర్ల్ ఫ్రెండ్ ముందు కలరింగ్ ఇచ్చి దానికి దగ్గరయ్యానని, వాళ్లు నిజం చెప్పేస్తానని నన్ను బెదిరిస్తున్నారని చెబుతాడు. కోయిలి ఇంటి నుంచి రాజ్- కావ్యలు వచ్చేసేలా ప్లాన్ చేయమని అడుగుతాడు రాహుల్. రాజ్ లాప్‌టాప్‌లో ఉన్న ఫైల్‌ని డిలీట్ చేయిస్తే వాడు పరిగెత్తుకుంటూ కంపెనీకి బయల్దేరతాడని చెబుతుంది రుద్రాణి.. దాంతో ఆ పని వెంటనే మొదలుపెడతానని అంటుంది.

రాహుల్‌ని వాళ్లిద్దరూ ట్రాప్ చేశారని ఎలాగైనా రాహుల్ కళ్లు తెరిపించాలని గోల్డ్ బాబుతో చెబుతారు రాజ్ - కావ్య. ఆ కోయిలిని నేను ట్రాప్ చేస్తున్నానని.. టాటా బిస్కెట్లు చూసి గోల్డ్ బిస్కెట్లని నమ్మేసిందని అంటాడు గోల్డ్ బాబు. అంది ఎలాంటి ఊసరవెళ్లి అనేది రాహుల్ గాడికి మనం కళ్లారా చూపించాలని అంటుంది కావ్య. రాహుల్‌ని కోయిలి ట్రాప్ చేసిందని మనం రుజువు చేయాలని చెబుతుంది కావ్య. అదంతా నేను చూసుకుంటానని, బంగారపు బావులు ఉన్నాయంటే నమ్మేసిందని నవ్వుకుంటాడు గోల్డ్ బాబు. దానిని రాహుల్ గాడు ఎలా నమ్మాడో నాకు ఇప్పటికీ అర్ధం కావడం లేదని అంటాడు గోల్డ్ బాబు.

రుద్రాణి మనుషులు రాజ్ పెయిన్ డ్రైవ్‌లోని ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని డిలీట్ చేయడంతో శృతి కంగారు పడుతుంది. 2 గంటల్లో మీటింగ్ స్టార్ట్ అవుతుందని, ఫైల్స్ లేకపోతే క్లైయింట్స్ వెళ్లిపోతారని టెన్షన్ పడుతుంది. వెంటనే రాజ్‌కి ఫోన్ చేసి విషయం చెప్పాలని అనుకున్నా ఫోన్ కలవకపోవడంతో ఇంకా కంగారుపడుతుంది. రాజ్ - కావ్యలు కోయిలి ఇంటికి వెళ్లడంపై సుభాష్ మండిపడతాడు. నాకెందుకో నచ్చడం లేదు.. వెంటనే రాజ్, కావ్యలను వచ్చేయమనండి అని చెబుతుంది రుద్రాణి. నీ కొడుకు వెదవ పని చేస్తే.. నా కొడుకు, కోడలు ఈ ఇంటి పరువు కాపాడటానికి, స్వప్న జీవితం బాగు చేయాలని బాధ్యత చూపిస్తున్నారని అంటాడు. అన్నింటి కంటే స్వప్న జీవితమే ముఖ్యమని తేల్చేస్తుంది అపర్ణ. ఇంతలో శృతి ఫోన్ చేసి పెయిన్ డ్రైవ్‌లో ఉన్న ఫైల్ డిలీట్ అయినట్లు చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X