Brahmamudi October 13th Episode: కావ్య కోసం రాజ్ నాటకాలు... కళావతిపై రుద్రాణి క్రూరమైన ప్లాన్

Photo Courtesy: JioHotstar

వెంట అల్లుడు లేకుండా కావ్య హఠాత్తుగా ఇంటికి రావడంతో కనకం, కృష్ణమూర్తిలు షాక్ అవుతారు. అత్తారింటిలో ఏం జరిగింది? కూతురు ఎందుకు వచ్చేసింది? తెలుసుకోవడానికి అపర్ణకి ఫోన్ చేస్తుండగా కనకం దగ్గరి నుంచి ఫోన్ లాగేస్తుంది కావ్య. నా కోడలు ఎక్కడున్నా సరే వెతికి తీసుకురమ్మని రాజ్‌కి ఆర్డర్స్ వేస్తుంది అపర్ణ. తను ఎక్కడుందో నాకు బాగా తెలుసని నేను వెళ్లి తీసుకొస్తానని మాట ఇస్తాడు రాజ్. కావ్య టిఫిన్ చేస్తుండగా రాజ్ తన అత్తగారింటికి వచ్చి మండిపడతాడు. చెప్పాపెట్టకుండ వచ్చేస్తే ఇంట్లో వాళ్లు ఎంత టెన్షన్ పడుతున్నారని అంటాడు.

మీరు నిజం చెబితేనే మీ వెంట వస్తానని, లేదంటే లేదని కావ్య తేల్చేస్తుంది. దాంతో నీకే అంత ఉంటే... నాకెంత ఉండాలంటూ రాజ్ కోపంగా తిరిగి వెళ్లిపోతాడు. రాజ్ - కావ్యల రాక కోసం దుగ్గిరాల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుండగా రాజ్ ఒక్కడే అక్కడకి వస్తాడు. అసలు కావ్య - రాజ్ మధ్య ఏం జరిగిందో తెలియక కృష్ణ మూర్తి, కనకంలు టెన్షన్ పడతారు. అప్పూకి ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయదు. దీంతో స్వప్నకి కాల్ చేయగా రుద్రాణి ఫోన్ ఎత్తుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 13వ తేదీ ఎపిసోడ్ 850లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial October 13th 2025 Episode 850 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కావ్య పుట్టింటికి ఎందుకు తిరిగొచ్చేసింది అనేది తెలుసుకోవడానికి స్వప్నకి ఫోన్ చేస్తుంది కనకం. స్వప్న లేకపోవడంతో రుద్రాణి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మీ అమ్మాయి బాత్ ‌రూమ్‌లో ఉంది విషయం చెప్పండి అని అంటుంది రుద్రాణి. మా కావ్యకి అల్లుడుగారికి గొడవ ఏంటీ అని ప్రశ్నిస్తుంది కనకం. తప్పు చేసి పుట్టింటికి వచ్చిన మీ అమ్మాయి చెప్పలేదా? అని నిలదీస్తుంది రుద్రాణి అంటే నా కూతురు తప్పు చేసే మనిషి కాదని అంటుంది కనకం. అంటే మా రాజ్ తప్పు చేసే మనిషా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. ఆ మాట నేను అనలేదు కదా అని మండిపడుతుంది కనకం.

కాలికి వేస్తే మెడకు వేస్తారు, మెడకి వేస్తే కాలికి వేస్తారు. అసలు విషయం తెలుసుకోవడానికి మీకు ఫోన్ చేశాను, నాది బుద్ధి తక్కువ అని ఫోన్ పెట్టేస్తుంది కనకం. ఇంతలో బాత్‌రూమ్‌కి వెళ్లిన స్వప్న వచ్చి... నా ఫోన్ పట్టుకున్నావని మండిపడుతుంది. ఈ దేశానికి సంబంధించిన రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని తెలుసుకుందామని అంటుంది రుద్రాణి. ఇంట్లో పెట్టే పుల్లలు చాలదా? ఇప్పుడు ఏకంగా దేశానికే పుల్లలు పెడతావా? అని ఫైర్ అవుతుంది స్వప్న. మీ అమ్మ ఫోన్ చేస్తే నువ్వు వాష్ రూమ్‌లో ఉన్నావని చెప్పానని అంటుంది రుద్రాణి.

ఇక్కడి గొడవలన్నీ చెప్పేశావా? పక్కవాళ్ల ఫోన్ ముట్టుకోకూడదన్న కామన్‌సెన్స్ లేదా? అని చీవాట్లు పెడుతుంది స్వప్న. ఇంతకీ రాహుల్ ఎక్కడ? అని అడుగుతుంది రుద్రాణి. నీ కొడుకు గురించి నీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుందని మండిపడుతుంది. ఇంకోసారి నా ఫోన్ ముట్టుకుంటే బాగోదని వార్నింగ్ ఇస్తుంది స్వప్న. ఇంతలో కనకం ఇంటికి ఇందిర, అపర్ణలు వస్తారు. నీ కూతురు నీకెం చెప్పలేదా? అని కనకంని అడగ్గా... అయితే మాకు కూడా చెప్పలేదని అంటారు ఇందిర, అపర్ణ. కావ్య దగ్గరికి వెళ్లి నువ్వు సూపర్ కంగ్రాట్స్ అని అంటుంది అపర్ణ. కావ్యకి ఏం అర్ధం కాక నాకు కంగ్రాట్స్ ఎందుకు చెప్పారు అని అడుగుతుంది అపర్ణ. నువ్వు వేసిన ప్లాన్‌కి నా మనవడి గుండె జారిపోయిందని ఇందిర అంటుంది.

వాడికి ఇది నాటకమని తెలియక, నువ్వు నిజంగానే ఇక్కడికి వచ్చేశావని తెగ టెన్షన్ పడిపోతున్నాడని అంటుంది అపర్ణ. ఇది నాటకం కాదని నిజమేనని కావ్య చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నేనే నిజంగానే ఆ ఇంటి నుంచి వచ్చేశానని చెబుతుంది కావ్య. ఉన్నపళంగా ఇప్పుడు ఆ ఇంటి నుంచి వచ్చేసేంత కష్టం నీకు ఏమొచ్చిందని ప్రశ్నిస్తుంది ఇందిర. నా కారణంగా ఆ ఇంట్లో ఎవ్వరూ బాధపడకూడదని, మా ఇద్దరి గొడవల కారణంగా అప్పూ నలిగిపోవడం నాకు ఇష్టం లేదని చెబుతుంది కావ్య. మాకేం అర్ధం కావడం లేదని కనకం అంటుంది.

నా కొడుకు కావ్యని అబార్షన్ చేయించుకోమ్మని అంటున్నాడని అపర్ణ చెప్పడంతో కృష్ణమూర్తి, కనకం షాక్ అవుతారు. ఇదేమో బిడ్డ కావాలని పట్టుబట్టడంతో దాని గురించే రోజూ గొడవలు జరుగుతున్నాయని అపర్ణ చెబుతుంది. విడాకుల డ్రామా ఆడి వాడి నుంచి నిజం తెలుసుకోవాలని అనుకుందని, ఇప్పుడు ఇది కూడా నాటకమని అనుకున్నామని.. కానీ ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందని అనుకోలేదని బాధపడుతుంది అపర్ణ. అబార్షన్ చేయించుకోవడానికి నా కూతురే కాదు... మేం కూడా ఒప్పుకోమని, ఇప్పుడే వెళ్లి అల్లుడుగారిని అడిగేస్తానని చెబుతుంది కనకం. ఇన్నిరోజుల నుంచి అడుగుతున్న మాకే వాడు ఏం చెప్పడం లేదని, అలాంటిది నువ్వెళ్లి అడగ్గానే చెప్పేస్తాడా? అని ప్రశ్నిస్తుంది ఇందిర.

మీరెవ్వరూ ఏం చేయొద్దని, మళ్లీ ఆయనే వచ్చి నన్ను తీసుకెళ్తారని నాకు నమ్మకం ఉందని అంటుంది కావ్య. ఇంతలో నాకు బాగా ఆకలిగా ఉందని అన్నం పెట్టమని కనకాన్ని అడుగుతుంది ఇందిర. కావ్యను ఎలా తీసుకురావాలని ఓ పక్క రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మమ్మకి, అమ్మకి హెల్త్ బాలేదని చెబితే కళావతి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుందని అనుకుని ఆమెకు కాల్ చేస్తాడు. ఇంట్లో పరిస్థితులు బాలేదని నీ మీద బెంగ పెట్టుకుని మా అమ్మ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోవడం లేదని అంటాడు. నాయనమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని గంటలు లెక్క పెట్టుకుంటుందని చెబుతాడు. ఇదంతా విన్న అపర్ణ, ఇందిరలు నవ్వుకుంటారు. అయితే వాళ్లని చూస్తాను ఒకసారి వీడియో కాల్ చేయమంటుంది కావ్య. మనింట్లో సిగ్నల్ సరిగా లేదని చెబుతాడు రాజ్. వీడియో కాల్‌లో ఇందిర, అపర్ణలు కనిపించడంతో రాజ్ షాక్ అవుతాడు.

అల్లుడుగారు అమ్మాయి కోసం ఇంతలా ఆరాటపడుతున్నారని, మరి బిడ్డను ఎందుకు వద్దు అంటున్నారని అడుగుతుంది కనకం. అది అర్ధమైతే మాకు ఇన్ని కష్టాలు ఎందుకు అని అపర్ణ చెబుతుంది. మరోవైపు.. కావ్య- రాజ్‌ల మధ్య గొడవల్ని మరింత పెంచితే వారిద్దరూ శాశ్వతంగా విడిపోతారు. అప్పుడు మనం ఈ ఆస్తిని ప్రశాంతంగా అనుభవించొచ్చు, మనకి అడ్డొచ్చే వాళ్లే ఉండరని కొడుకుతో అంటుంది రుద్రాణి. అలా జరగాలంటే ఏం చేయాలని అడుగుతాడు రాహుల్. ఆ కావ్య చేత ఈ ఇంటిని పరువుని తీసుకెళ్లి రోడ్డున పడేలా చేస్తే చాలని, ఇక మిగతాదంతా రాజ్ చూసుకుంటాడని చెబుతుంది రుద్రాణి. ఆ కావ్య ఈ ఇంటి కోసం ప్రాణాలైనా వదిలేస్తుంది? అలాంటి పరువు పోతుంటే చూస్తూ ఊరుకుంటుందా అని ప్రశ్నిస్తాడు రాహుల్.

కావ్య పొగొట్టదని, మనం పొగొట్టేలా చేద్దామని అంటుంది రుద్రాణి. ఎలా అని రాహుల్ అడగ్గా... మీడియా ద్వారా అని చెబుతుంది రుద్రాణి. మంచి కోసం వాడితే ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలదు, చెడు కోసం వాడితే ప్రాబ్లమ్ క్రియేట్ చేయగలదు.. ఆ పవర్ కేవలం మీడియాకు మాత్రమే ఉందని చెబుతుంది రుద్రాణి. ఇప్పుడు జరుగుతున్న గొడవలకి కారణం కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డ అని.. ఇన్నిరోజులు గొడవలు గుమ్మం లోపలే జరిగాయి కాబట్టి అందరూ సైలెంట్‌గా ఉన్నారు, ధాన్యలక్ష్మీని రెచ్చగొట్టడం వల్ల పెద్ద గొడవ జరిగి ఆ కావ్య పుట్టింటి వరకు వెళ్లాయని అంటుంది రుద్రాణి. రాజ్ వెళ్లి బతిమలాడినా కావ్య ఇంటికి తిరిగిరాదని, అబార్షన్ గురించి చెప్పి మీడియాను వాళ్ల మధ్యలోకి పంపించామంటే... వాళ్లు అడిగే ప్రశ్నలకు ఆ కావ్యకి కోపం వస్తుందని చెబుతుంది రుద్రాణి.

ఏదో ఒక టైంలో టంగ్ స్లిప్ అయి మీడియాను తిట్టేస్తుందని అంటుంది. దాంతో వాళ్లకి కోపం వచ్చి ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేసి రచ్చ రచ్చ చేస్తారని అంటాడు రాహుల్. పరువే ప్రాణంగా బతుకుతున్న రాజ్... ఈ ఇంటి పరువు పోవడానికి కారణం కావ్యేనని నమ్ముతాడని... తనకి శాశ్వతంగా దూరమైపోతాడని అంటుంది రుద్రాణి. ముందు మీడియా వాళ్లకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు... అందులో ఒక ఇద్దరినీ నీకు తెలిసినవాళ్లని పంపించి రెచ్చగొట్టించు అని చెబుతుంది రుద్రాణి. రాజ్ గురించి ఆలోచిస్తున్న కూతురిని కృష్ణమూర్తి ఓదారుస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X