Brahmamudi October 14th Episode: దుగ్గిరాల ఫ్యామిలీని బజారుకీడ్చిన రుద్రాణి... రాజ్ ముందు దోషిలా కావ్య

Photo Courtesy: JioHotstar

తన అనుమతి లేకుండా తన ఫోన్ మాట్లాడిన రుద్రాణికి స్వప్న చీవాట్లు పెడుతుంది. రాజ్- కావ్యల మధ్య ఏం జరిగిందో తెలియక కంగారు పడుతున్న కనకం - కృష్ణమూర్తిల దగ్గరికి ఇందిర, అపర్ణ వస్తారు. నువ్వు వేసిన ప్లాన్ సూపర్ అని .. నువ్వు ఇల్లు వదిలి వచ్చేయడంతో రాజ్ కంగారు పడుతున్నాడని చెబుతుంది అపర్ణ. ఇది నాటకం కాదని నేను నిజంగానే వచ్చేశానని కావ్య చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. కావ్యను అబార్షన్ చేయించుకోమ్మని రాజ్ చెప్పాడని, దాంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని అపర్ణ అసలు విషయం చెప్పడంతో కనకం, కృష్ణమూర్తి బాధపడతారు. కావ్యని ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని ప్లాన్ చేసిన రాజ్ తన భార్యకి ఫోన్ చేసి అమ్మకి, నానమ్మకి బాలేదని డ్రామా ఆడటంతో వారిద్దరితో వీడియో కాల్ మాట్లాడిస్తుంది కావ్య. దుగ్గిరాల ఫ్యామిలీ పరువు తీసి రాజ్ - కావ్యలను శాశ్వతంగా విడదీయాలని కొడుకుతో కలిసి ప్లాన్ చేస్తుంది రుద్రాణి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 14వ తేదీ ఎపిసోడ్ 851లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial October 14th 2025 Episode 851 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఒంటరిగా బాధపడుతున్న కావ్యని కృష్ణమూర్తి ఓదారుస్తాడు. నేను వెళ్తున్న దారి కరెక్టో కాదో అర్ధం కావడం లేదని చెబుతుంది కావ్య. నువ్వు నీ అమ్మతనం కోసం యుద్ధం చేస్తున్నావని, అది తప్పు కాదని చెబుతాడు కృష్ణమూర్తి. నా భర్తతోనే యుద్ధం చేయాల్సి వస్తోందని బాధపడుతుంది కావ్య. మనం తప్పు చేయనప్పుడు ధర్మం మన వైపు ఉన్న్పపుడు ఆ దేవుడినైనా ఎదిరించవచ్చని అంటాడు కృష్ణమూర్తి. ఆయనే నన్ను వెతుక్కుంటూ వచ్చినా కూడా నేను మొండిగా మాట్లాడానా? ఆయన మనసుని గాయపరిచి తప్పు చేశానా? అని అనుమానంగా ఉంది అంటుంది. నీ పెళ్లి జరిగినప్పుడు ఈ ఇంటి పరువు కాపాడమని నేను అక్కడికి పంపించేశానని, ఆ సమయంలో నేను స్వార్ధంగా ఆలోచించానా? అనిపించింది? కానీ ఒక మధ్యతరగతి తండ్రిగా ఇంత గొడవ జరిగిన తర్వాత నా కూతురికి ఎక్కడ మళ్లీ పెళ్లి చేయలేనేమోనన్న భయమే నన్ను అలా చేయించింది అని చెబుతాడు కృష్ణమూర్తి.

అలాంటి శ్రీమంతుల ఇంటిలో నీకేమైనా సమస్య వస్తే ఎదిరించి నిలబడే శక్తి కూడా నాకు లేదు. నీకు కష్టం వస్తే నిన్ను ఎలా కాపాడుకోవాలా? అని ప్రతిరోజూ ఏడ్చానని అంటాడు. కానీ నీ సహనంతో, నీ ఓర్పుతో, నీ ప్రేమతో వాళ్లందరి మనసులు గెలుచుకున్నావ్? దుగ్గిరాల వారింటి కోడలంటే నువ్వు మాత్రమేనని వాళ్ల నోటితోనే అనిపించుకున్నావ్? ఆ ఇంటి కోడలిగానే కాదు, నా కూతురిగానూ నువ్వెప్పుడో గెలిచావని అంటాడు కృష్ణమూర్తి. ఇప్పుడు నీ జీవితంలో మొదలైంది రెండో అధ్యాయం.. కానీ నువ్వు నా కూతురిగానో, ఆ ఇంటి కోడలిగానో చేస్తున్న పోరాటం కాదు... నీ బిడ్డ ప్రాణం కాపాడం కోసం నువ్వు చేస్తున్న యుద్ధమని దాని కోసం నువ్వేం చేసినా తప్పు లేదని అంటాడు.

నిన్ను అంతగా ప్రేమించిన మనిషి, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను మాత్రం ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నిస్తాడు కృష్ణమూర్తి. మాకు కష్టం వస్తేనే తట్టుకోలేకపోయాడని, అలాంటిది తన బిడ్డను ఎందుకు వద్దు అనుకుంటున్నాడు అని అడుగుతాడు. ఆ కారణం తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశానని.. అలిసిపోయాను అందుకే ఇక్కడికి వచ్చేశానని అంటుంది కావ్య. నువ్వు ఇక్కడికి రావడం వల్ల అల్లుడుగారు మారతారన్న నమ్మకం నీకుందా అని అడుగుతాడు కృష్ణమూర్తి. నేను లేకుండా ఆయన ఉండలేరని, నా కోసమైనా వస్తారన్న చిన్న ఆశ అని అంటుంది కావ్య. నీ సంకల్పం ఎప్పటికీ ఓడిపోదని చెబుతాడు కృష్ణమూర్తి.

ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మీటింగ్ అవుతుంది. మేమంతా నిరాహార దీక్షలు చేస్తున్నామని అపర్ణ చెప్పగా.. అందరూ బాగా తేన్పుతారు. దాంతో రాజ్‌కి అనుమానం వస్తుంది.. ఇవి బాగా తినడం వల్ల వచ్చినవి కావని ఆకలి తేన్పులని అంటారు. మా కోడలు కావ్య ఇంటికి వచ్చే వరకు మేమంతా నిరాహారదీక్షలు చేస్తున్నామని చెబుతుంది అపర్ణ. మీరంతా ఇలాగే కంటిన్యూ చేయండి.. నేను మాత్రం హాయిగా తినేస్తానని అంటాడు రాజ్. కావ్యను ఒప్పించి ఇంటికి తీసుకొస్తాడని అనుకుంటే ఇలా టిఫిన్ చేయడానికి వెళ్తున్నాడని ఇందిర బాధపడుతుంది. కావ్యని తీసుకొచ్చేందుకు వెళ్లేలా ఇరిటేట్ చేద్దామని అంటాడు ప్రకాశం. రాజ్ టిఫిన్ చేస్తుండగా అందరూ వచ్చి ఇబ్బందిపెడతారు.

దాంతో రాజ్ తినకుండా చేయి కడిగేస్తాడు. అంటే కావ్యను తీసుకొస్తున్నావా? అని ప్రకాశం అడగ్గా.. మీరంతా పస్తులు ఉండటం చూసి చేయి కడిగేశానని అంటాడు రాజ్. మీరు ఎన్ని రోజులు తినకుండా ఉంటారో నేను కూడా చూస్తానని అంటాడు. ఆకలికి తట్టుకోలేక వాడే అమ్మాయిని తీసుకొస్తాడని అంటుంది ఇందిర. ఇదంతా చూసిన రుద్రాణి... నిరాహారదీక్ష చేస్తారా? హాయిగా నవ్వుకుంటున్నారు కదా? చెబుతానని అనుకుంటుంది. ఉదయాన్నే కనకం వాకిలి ఊడుస్తుండగా... మీడియా వాళ్లు వస్తారు. వాళ్లని చూసిన కనకం... మీడియా వాళ్లంతా వచ్చారని కావ్యకి చెబుతుంది. అల్లుడుగారు అబార్షన్ చేయించుకోమన్నారన్న విషయం అందరికీ తెలిసిపోయిందా? అని కనకం భయపడుతుంది. వాళ్ల ముందు ఇలాంటివి వాగోద్దని నేను చూసుకుంటానని చెబుతుంది కావ్య.

మీరు మీ హజ్బెండ్ మీద కోపంతో పుట్టింటికి వచ్చారని మాకు తెలిసింది నిజమేనా? మీరు ప్రెగ్నెంట్ అంట నిజమేనా? మీ ఇద్దరి మధ్య గొడవలు రావడానికి కారణం మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ అని అందరూ మాట్లాడుకుంటున్నారు అది నిజమేనా? రాజ్ గారికి ఇప్పుడే పిల్లలు వద్దని మిమ్మల్ని బలవంతం చేయడం వల్లే మీరు పుట్టింటికి వచ్చేశారని అంటున్నారు నిజమేనా? నిజంగానే ఆయన బిడ్డ వద్దు అనుకుంటున్నారా? అని అడుగుతారు. ఆ మాటలతో కావ్య, కృష్ణమూర్తి, కనకం షాక్ అవుతారు. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని, అలాంటిదేమీ జరగలేదని చెబుతుంది కావ్య. దుగ్గిరాల ఫ్యామిలీని ఎదిరించి మీరు నిలబడగలుగుతారా? అలాంటిదేమైనా ఉంటే మీడియా మీకు సపోర్ట్‌గా ఉంటుందని అంటారు.

నాకు సాయం కావాలని నేనేమీ అడగలేదని, మీరే మా ఇంటి దాకా వచ్చారని అంటుంది కావ్య. నేను కడుపుతో ఉన్న మాట నిజమేనని, కానీ గొడవలు పడి నేను ఇక్కడికి రాలేదని చెబుతుంది. అత్తారింటిలో ఉండాల్సిన మీరు ఇక్కడెందుకు ఉన్నారని అడుగుతారు మీడియా వాళ్లు. ఆడపిల్ల పుట్టింటికి రాకూడదా? అని కావ్య ప్రశ్నిస్తుంది. మీ మాటలు నమ్మేలా లేవని, మీరు ఏదో విషయాన్ని దాస్తున్నారని అంటారు. నాకు, నా భర్తకు ఎలాంటి గొడవలు లేవని... మీరంతా లేనిపోని సమస్యలు సృష్టించవద్దని అంటుంది కావ్య. దాంతో కనకంను రెచ్చగొడుతారు మీడియా వాళ్లు. దాంతో రాజ్‌గారిని అడగమని కోపంగా వెళ్లిపోతుంది కనకం. తన బిడ్డను కాపాడుకోవడం కోసం భర్తతో గొడవపడి కావ్య పుట్టింటికి వచ్చేసిందని, ఆమె తల్లిదండ్రులు కూతురి కోసం బాధపడుతున్నారని మీడియా వాళ్లు ఏదేదో మాట్లాడతారు. రాజ్ లాంటి మూర్ఖపు భర్తపై పోరాటంలో కావ్యకు మీడియా అండగా ఉంటుందని అంటారు. ఇదంతా టీవీలో చూసిన దుగ్గిరాల ఫ్యామిలీ రగిలిపోతుంది.

ఆ కావ్యని నా కోడలు నా కోడలు అంటూ నెత్తిన పెట్టుకున్నారు? ఇప్పుడేం చేసిందో చూశారుగా ఈ ఇంటి పరువుని తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టేసిందని అంటుంది రుద్రాణి. ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న దుగ్గిరాల ఇంటి ప్రతిష్ట ఆ కావ్య కారణంగా గంగలో కలిసిపోయిందని రెచ్చగొడుతుంది. రేపటి నుంచి రోడ్డు మీదకి వెళ్లలేమని, ఇన్ని రోజులు గుట్టుగా ఉన్న మన ఇంటి పరువు ప్రతిష్టల్ని బజారుకు ఈడ్చిందని అంటుంది. ఇక్కడే ఉంటే మనం అలాంటి పనులు చేయనివ్వమని, తెలివిగా పుట్టింటికి వెళ్లి మీడియా వాళ్లని పిలిపించి రచ్చ చేసిందని చెబుతుంది రుద్రాణి. ఈ సిటీలోనే నువ్వు గొప్పవాడివి... అలాంటి నిన్ను చీప్‌గా తిట్టించిందని రాజ్‌ని రెచ్చగొడుతుంది రుద్రాణి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X