Brahmamudi October 16th Episode: రుద్రాణి ట్రాప్‌లో రాజ్... కావ్యకి విడాకులతో బ్లాక్‌మెయిల్
Photo Courtesy: JioHotstar
కావ్య ఇంటికి వెళ్లిన మీడియా వాళ్లు రాజ్‌ని నానామాటలు అనడంతో రుద్రాణి ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. ఆ కావ్య వల్ల మన ఇంటి పరువు పోయిందని, ఆమెను వదిలేయ్.. నువ్వు ఊ అంటే అమ్మాయిలంతా నీ ముందు క్యూ కడతారని అనడంతో ఇందిర రగిలిపోతుంది. నీకు కాపురాలు కూల్చడం అంటే ఎంతో సరదా అని అంటుంది. మన ఇంటి పరువు నడిరోడ్డు మీదకి రావడానికి వీడు తీసుకున్న నిర్ణయాలే కారణమని క్లాస్ పీకుతుంది. ఇంత పెద్ద ప్లాన్ చేసినా ఆ కావ్యని ఇంటిల్లిపాది సపోర్ట్ చేయడంతో రాహుల్- రుద్రాణిలు షాక్ అవుతారు.
రుద్రాణికి కావ్య కాల్ చేసి.. మా ఇంటి మీదకి మీడియాను ఎందుకు పంపించారని ప్రశ్నిస్తుంది. ఇలాంటి ప్లాన్లు చేసేది మీరేనని, నేను బతికున్నంత వరకు ఆ ఇంటిని కాపాడుకుంటానని ... దీని వెనుక మీరు ఉన్నారని తెలిస్తే ట్రీట్‌మెంట్ వేరేలా ఉంటుందని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది. కావ్య మాటలతో రగిలిపోయిన రుద్రాణి.. ఈసారి మహిళా సంఘాలకు ఫోన్ చేసి ఇంటికి రప్పిస్తుంది. వాళ్లు రాజ్‌ని నానా మాటలు అంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 16వ తేదీ ఎపిసోడ్ 853లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఓ నలుగురిని ఇంటి మీదకి తీసుకొచ్చి గోల చేస్తున్నారు? అసలు మీరేం చేయగలరని మహిళా సంఘాలపై రుద్రాణి మండిపడుతుంది. మీ మేనల్లుడి గురించి మేం అనుకోవాల్సిన పని లేదు... మీ వాడు ఓ ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నాడని, బలవంతంగా బిడ్డను చంపుకోవాలని చెబుతున్నాడని మేం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టామంటే చాలు మీ అందరూ వెళ్లి జైళ్లో కూర్చొంటారని వార్నింగ్ ఇవ్వడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. రాజ్ చేస్తున్న పని తప్పు... దానిని సరిదిద్దుకోమని చెప్పడానికే మేం ఇక్కడికి వచ్చాం, కానీ ఇక్కడ మీరు మాట్లాడుతున్న మాటలు చూశాకా, మీ అందరినీ చట్టపరంగా శిక్షించడమే కరెక్ట్ అని మాకు అనిపిస్తోందని మహిళా సంఘాల నేతలు హెచ్చరిస్తారు.
మీరు పోలీస్ స్టేషన్‌కి వెళితే... మేం కూడా పోలీస్ స్టేషన్‌కి వెళ్తామని చట్టాలేమీ మాకు కొత్త కాదని మండిపడుతుంది రుద్రాణి. వాళ్లు ఆవేశంగా మాట్లాడుతుంటే నువ్వింకా రెచ్చగొడుతున్నావని అపర్ణ ఫైర్ అవుతుంది. తనకి కొంచెం ఆవేశం ఎక్కువని, మీరు అనుకుంటున్నట్లుగా మా అబ్బాయి మా కోడలిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని, తనని మేం కూతురిలా చూసుకుంటున్నామని చెబుతుంది అపర్ణ. మీరు ఇలా అబద్ధాలు మాట్లాడితే మేం నమ్మం.. చేయాల్సిన తప్పు చేశారు, సరిదిద్దడానికి వచ్చిన మాతోనే అమర్యాదగా ప్రవర్తించారు... మీకు డబ్బు, పేరు, పలుకుబడి ఉండొచ్చు.. కానీ మా వైపు న్యాయం ఉందని మహిళా సంఘాలు నేతలు చెబుతారు. మీ కొడుకు చేసిన తప్పుకి సరైన శిక్ష విధిస్తామని వార్నింగ్ ఇస్తారు.
ఇంతలో కావ్య దుగ్గిరాల వారింటికి రావడంతో అంతా షాక్ అవుతారు. మహిళా సంఘాలపై నాకెంతో గౌరవం ఉందని, మీ వాళ్ల ఎంతో మంది ఆడవాళ్లు వాళ్ల సమస్యల నుంచి బయటపడ్డారు? వారికి కొత్త జీవితం కూడా ఇచ్చారు? నాకు నా దగ్గరికి వచ్చేసరికి మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అంటుంది కావ్య. నా భర్త నేను ప్రేమగా చూసుకుంటున్నారు? నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ చేయలేదని అంటుంది కావ్య. మరి మీరు పుట్టింటికి అలిగి ఎందుకు వెళ్లిపోయారని మహిళా సంఘాల వాళ్లు ప్రశ్నిస్తారు. భార్యాభర్తలు అన్నాక ఏవో చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి.. మళ్లీ తిరిగి కలిసిపోతామని చెబుతుంది కావ్య. ఆయన నాకు అన్యాయం చేసుంటే నేను ఇక్కడికి ఎందుకొస్తానని ప్రశ్నిస్తుంది.
మీరంతా నా కోసం వచ్చి మాట్లాడినందుకు చాలా సంతోషం... నా ప్రాబ్లమ్స్ నేను చూసుకుంటానని అంటుంది కావ్య. మీరే వచ్చి చెప్పారు కాబట్టి... మిమ్మల్ని నమ్మి వెళ్తున్నాం, రేపు ఏదైనా ప్రాబ్లమ్ అంటే చాలు ఒక్క ఫోన్ కాల్ చేస్తే మేమంతా మీ వెంటేనని చెప్పి వెళ్లిపోతారు మహిళా సంఘాల నేతలు. వాళ్లు వెళ్లిపోగానే రుద్రాణి చప్పట్లు కొడుతుంది. ఎంత బాగా నాటకాలు ఆడుతున్నావ్? నీ పర్ఫార్మెన్స్‌కి క్లాప్స్ కొట్టకుండా ఉండలేకపోతున్నానని అంటుంది. వాళ్లకి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ గొడవ జరిగేలా చేసి, రాజ్‌తో పాటు మమ్మల్ని భయపెట్టి నీ దారికి తెచ్చుకోవాలని అనుకున్నావా? అని నిలదీస్తుంది రుద్రాణి. అలా చేయాలని అనుకుంటే దాని కోసం నేను పుట్టింటి వరకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఇక్కడే ఉండి చేయగలనని అంటుంది కావ్య.
నేను ఇక్కడి వరకు వచ్చి మీ తరపున నిలబడి మాట్లాడినంత మాత్రాన మీ నిర్ణయాన్ని అంగీకరించినట్లు కాదని రాజ్‌తో అంటుంది కావ్య. అభిప్రాయ భేదాలు వచ్చింది మీకు, నాకు మాత్రమే.. ఈ ఇల్లు ఎప్పటికీ నా అత్తారిల్లేనని అంటుంది కావ్య. ఈ ఇంటి పరువు వరకు వస్తే నేను ఎప్పుడైనా ఇలాగే మాట్లాడతానని చెబుతుంది. కావ్య వెళ్లిపోతుండగా... ఇంటికి సమస్య వచ్చిందని తెలియగానే క్షణం కూడా ఆలోచించకుండా వచ్చేశావు? మా మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు వెళ్లిపోవడం ఎందుకు అని స్వప్న ప్రశ్నిస్తుంది. ఒకే ఇంట్లో రెండు వేర్వేరు నిర్ణయాలతో భార్యాభర్తలు కలిసి ఉండలేరని అంటుంది కావ్య. ఆయన నా దారికి రారు... నేను ఆయన దారికి వెళ్లలేను.. అలాంటప్పుడు కలిసి ఉండటంలో అర్ధం ఏముందని చెబుతుంది.
తన ప్లాన్ ఫెయిల్ కావడంతో రుద్రాణిపై రాహుల్ సెటైర్లు వేస్తాడు. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ఆ కావ్య వాటిని ఫ్లాప్ చేస్తూనే ఉంటుందని... మనం హ్యాపీగా ఉండాలంటే రాజ్‌ని, కావ్యని విడగొట్టక తప్పదని అంటుంది రుద్రాణి. నా దగ్గర ఇంకో ప్లాన్ రెడీగా ఉందని చెప్పి.. విడాకుల పేపర్స్ చూపిస్తుంది. ఈ పేపర్స్ రాజ్‌కి ఇచ్చి... ఆ కావ్య చేత ఒక్క సంతకం చేయించగలిగితే ఇక వారిద్దరూ శాశ్వతంగా దూరమైపోతారని అంటుంది. అది విన్న రాహుల్ గట్టిగా నవ్వుతాడు. కావ్య కోసం అంతగా ఆరాటపడే రాజ్... తనకి విడాకులు ఎందుకు ఇస్తాడని అడుగుతాడు. కావ్య తన మాట వినడం లేదని చాలా అగ్రెసివ్‌గా ఉన్నాడు... పైగా బిడ్డ కోసం రాజ్‌ని వదిలేయడానికి కావ్య రెడీగా ఉందని చెబుతుంది రుద్రాణి. ఇలాంటి టైంలో కావ్యని రెచ్చగొట్టడానికి విడాకులు ఇస్తానని బెదిరించమని రాజ్‌తో చెబుతానని అంటుంది. ఇదంతా నాటకమని భ్రమపడి కావ్యని ఫోర్స్ చేస్తాడు.. దాంతో కావ్య సంతకం చేసేస్తుంది. ఆ ఛాన్స్‌ని వాడుకుని మనం విడాకులు వచ్చేలా చేసి ఇద్దరినీ విడగొడతామని చెబుతుంది రుద్రాణి.
ఒంటరిగా ఉన్న రాజ్ దగ్గరికి సీతారామయ్య వచ్చి... నా కుటుంబం నా కళ్ల ముందే ముక్కలైపోతుండటంతో తట్టుకోలేకపోతున్నానని అంటాడు. జీవితం గాజు బొమ్మలాంటిదని, ఒక్కసారి జారిపోతే తర్వాత చేయగలిగింది ఏం ఉండదని అంటాడు. మీ నానమ్మని నేను పెళ్లి చేసుకున్నప్పుడు మేం ఇద్దరమే... కానీ ఈరోజున ఇంత మందిమి అయ్యామని చెబుతాడు సీతారామయ్య. మా మధ్య కూడా గొడవలు వచ్చాయని, కానీ కలిసే ఉన్నామని ... కానీ మీరు ఓ చిన్న సమస్యతో మొత్తం కుటుంబం ముక్కలయ్యేలా చేస్తున్నారని మండిపడతాడు. నువ్వు కావ్య కడుపులోని బిడ్డను అబార్షన్ చేయించడానికి కారణం చెప్పకపోవడం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయని అంటాడు సీతారామయ్య. కావ్యని ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా నీదేనని.. లేదంటే నా నిర్ణయం తీసుకుంటానని వార్నింగ్ ఇస్తాడు.
కావ్యని నీ దారిలోకి తెచ్చుకోవడానికి విడాకులు ఇస్తున్నట్లు డ్రామా ఆడమని రాజ్‌తో అంటుంది రుద్రాణి. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. కావ్యకి నువ్వంటే ప్రాణం.. నిన్ను వదిలి ఉండలేదు కదా? ఒకసారి ట్రై చేసి చూడమని అంటుంది. తనకి నా కన్నా తన కడుపులోని బిడ్డే ముఖ్యమని .. నన్ను వదిలేస్తుందని అంటాడు రాజ్. నేను చెప్పినట్లు చేయ్.. ఆ కావ్య ఖచ్చితంగా వస్తుందని డైవర్స్ పేపర్స్ చేతిలో పెడుతుంది రుద్రాణి. దుగ్గిరాల వారింటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని కావ్యపై మండిపడుతుంది కనకం. ఆ ఇంటి పరువు నా కారణంగా పోతుందని తెలిస్తే కుటుంబాన్ని కాపాడుకోవాలని చెబుతుంది. ఇంతలో కృష్ణమూర్తి వచ్చి కూతురిని మెచ్చుకుంటాడు.
ఆయన్ని నా ప్రేమతోనే మార్చుకుంటానని కావ్య అంటుంది. అల్లుడు నిన్ను వెతుక్కుంటూ రావాలంటే పరిస్ధితులు ఎంత కష్టంగా ఉన్నా నువ్వు గడప దాటొద్దని వార్నింగ్ ఇస్తుంది కనకం. ఇంతలో రాజ్ అక్కడికి వస్తాడు. మా ఇంటికి ఎందుకొచ్చారు? నా కూతురికి ఏం చెప్పి బలవంతంగా అబార్షన్ చేయించాలని అనుకుంటున్నారని మండిపడుతుంది. తోడుగా నిలబడాల్సిన భర్తే ఇలా చేస్తే ఎలా అని అంటుంది. శత్రువుని కూడా ఓడించాలని అనుకుంటారే తప్పించి హాని చేయాలని అనుకోరని... అలాంటిది మీరు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు? అని కృష్ణమూర్తి అడుగుతాడు. తన తల్లితనాన్ని ఎందుకు దూరం చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నిస్తాడు. నా కారణాలు నాకున్నాయ్.. నేనేం చెప్పలేనని అంటాడు రాజ్. కావ్య లోపలికి వెళ్లిపోతుండగా.. విడాకుల పేపర్స్ తీసి సంతకం పెట్టమని రాజ్ అడగటంతో కావ్య, కనకం, కృష్ణమూర్తి షాక్ అవుతారు. నాతో కలిసుండటం కంటే నీకు నీ బిడ్డే ముఖ్యమైతే ఇందులో సంతకం చేయమని అంటాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










