Brahmamudi October 1st Episode: కావ్య ప్లాన్‌ని తిప్పికొట్టిన రాజ్.. రాహుల్- రుద్రాణిల ట్రాప్‌లో స్వప్న
Photo Courtesy: JioHotstar
కళ్యాణ్, రాజ్‌లు అబార్షన్ టాబ్లెట్స్ తీసుకుని వచ్చేసరికి కావ్య ఇంటి నిండా బాబు ఫోటోలు అంటిస్తూ కనిపిస్తుంది. ఇది చూసిన రాజ్, కళ్యాణ్‌లు మరింత ఎమోషనల్ అవుతారు. ఇంతలో పనిమనిషి రత్తాలుని పిలిచి నాకు జ్యూస్ ఇచ్చే టైం అవుతుందని చెబుతుంది కావ్య. అది విన్న రాజ్.. కావ్యకి నేను జ్యూస్ ఇస్తానని పనిమనిషితో అంటాడు. జ్యూస్‌లో అబార్షన్ ట్యాబ్లెట్స్ కలిపి ఇస్తుండగా కళ్యాణ్ చూసి.. నువ్వు చేస్తున్నది చాలా తప్పు అన్నయ్య అంటాడు. కానీ ఇప్పుడున్న పరిస్ధితుల్లో మీ వదినను కాపాడుకోవడానికి ఇంతకీ మించి మరో మార్గం లేదని రాజ్ బాధపడతాడు.
కావ్య దగ్గరికి వెళ్లి రాజ్ జ్యూస్ ఇవ్వగా ఆమెకు డౌట్ వస్తుంది. నీకు అనుమానంగా ఉంటే తాగొద్దు నేనే తాగుతానని అంటాడు రాజ్. వదిన జ్యూస్ తాగకుండా ఆపాలని అనుకుంటాడు కళ్యాణ్. వెంటనే రాజ్, కావ్యల దగ్గరికి పరిగెత్తుకుంటూ రాగా.. అప్పటికే కావ్య జ్యూస్ తాగేయడంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. ఆ వెంటనే రాజ్‌ని బయటికి తీసుకెళ్లగా.. మీ వదినకి టాబ్లెట్స్ కలిపిన జ్యూస్ ఇవ్వలేదని, గ్లాస్ మార్చేశానని చెబుతాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. అక్టోబర్ 1వ తేదీ ఎపిసోడ్ 840లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
జ్యూస్ గ్లాస్‌ని రాజ్ మార్చిన విషయాన్ని కావ్య గుర్తించి తన భర్త ఎందుకిలా చేశాడని డౌట్ పడుతుంది. ఈ జ్యూస్‌లో ఏముందో ఎలా తెలుసుకోవాలో అర్ధం కావడం లేదని అనుకుంటుంది. వెంటన తన ఫ్రెండ్ సందీప్‌కు ఫోన్ చేసి నీకు ఓ జ్యూస్ పార్శిల్ పంపిస్తాను అందులో ఏముందో చెక్ చేసి వెంటనే చెప్పమని తనకు చెబుతుంది కావ్య. సందీప్ ఇంకా ఫోన్ చేయకపోవడంతో దాని గురించే ఆలోచిస్తుంటుంది. ఇంతలో ఇందిర వచ్చి అంతలా ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది. ఆయన ఎందుకలా వింతగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవడానికే ఇక అవకాశం దొరికిందని అంటుంది. నా అనుమానం నిజమైతే కనుక ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతుందని చెబుతుంది కావ్య.
ఇంతలో సందీప్ నుంచి కాల్ రావడంతో మాట్లాడుతుంది. ఆ జ్యూస్ ఎవరు ఇచ్చారు? అని అతను కోపంగా అడుగుతాడు. ఆ జ్యూస్‌లో అబార్షన్ టాబ్లెట్స్ కలిపారని సందీప్ చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. ఆ జ్యూస్‌లో ఎవరో కావాలనే అబార్షన్ టాబ్లెట్స్ కలిపారని మీరు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు సందీప్. దాంతో ఖచ్చితంగా ఆ టాబ్లెట్స్ కలిపింది రాజేనని కావ్యకి క్లారిటీ వచ్చేస్తుంది. నేను జ్యూస్ కావాలని పనిమనిషిని అడిగితే తను తీసుకొచ్చాడు.. పైగా నన్ను తాగమని బలవంతం చేశారు, నిజంగా బిడ్డ వద్దు అనుకుంటే ఆ జ్యూస్ నాకు ఇచ్చి అబార్షన్ అయ్యేలా చేసి ఉండాలి.. కానీ ఎందుకు ఆగిపోయారు? చివరి నిమిషంలో అబార్షన్ చేస్తే నాకేమైనా ప్రాబ్లమ్ అవుతుందని ఆగిపోయారా? అని కావ్య ఆలోచిస్తుంటుంది.
ఆ రోజు హాస్పిటల్‌లో డాక్టర్‌ను ఏదో రిక్వెస్ట్ చేశారని, ఆయన నా కడుపులో బిడ్డను వద్దు అనడానికి కారణం ఆ డాక్టర్‌కి కూడా తెలుసని కావ్యకి డౌట్ వస్తుంది. ఆ డాక్టర్‌ని అడిగితే నిజం తెలిసే అవకాశం ఉందని, రేపు హాస్పిటల్‌కి వెళ్లి అబార్షన్ ఎందుకు చేయించుకోవాలని అనుకుంటున్నాడో తెలుసుకోవాలని అనుకుంటుంది కావ్య. ఆయన ఇంట్లో ఉంటే నేను కూడా హాస్పిటల్‌కి వెళితే నేను కూడా వస్తానని అంటారు, అదే గనుక జరిగితే నిజం తెలుసుకోవడం కష్టమైపోతుందని భయపడుతుంది కావ్య. ఆయన జాగ్రత్త పడేలోపు నేను నిజం తెలుసుకోవాలని, రేపు రాజ్‌ని వీలైనంత దూరం పంపించాలని ప్లాన్ చేస్తుంది కావ్య.
కావ్య టెన్షన్ చూసిన ఇందిర ఆ ఫోన్‌లో ఎవరు? ఏదైనా గుడ్‌న్యూసా? వాడెందుకు టెన్షన్ పడుతున్నాడో తెలిసిందా? అని అడుగుతుంది. కానీ తెలుసుకోవడానికి ఓ ఛాన్స్ దొరికిందని ఇందిరతో అంటుంది కావ్య. రేపు ఆయనని మన ఫాంహౌస్‌కి పంపిస్తారా అని ఇందిరని హెల్ప్ అడుగుతుంది కళావతి. ఆయన ఎందుకలా బిహేవ్ చేస్తున్నారో తెలుసుకునే అవకాశం దొరికిందని అంటుంది. ఆయన ఇంట్లో ఉంటే మన ప్లాన్‌కి అడ్డొచ్చే అవకాశం ఉందని, అందుకే రేపు ఉదయం ఆయనని మన ఫాంహౌస్ దగ్గరున్న ఆయుర్వేదిక్ షాపులో తైలం కావాలని అడగమని అంటుంది కావ్య. కళావతి మాటలు విన్న ఇందిర సరేనని చెబుతుంది.
ఉదయాన్నే ప్లాన్ ప్రకారం రాజ్‌ని ఫాంహౌస్‌కి వెళ్లి తైలం తీసుకురమ్మని చెబుతుంది ఇందిర. నేను వెళ్లను, ఎవరినైనా పంపించి తెప్పించమని అంటాడు రాజ్. వేరే ఎవరైనా అయితే ఇక్కడే తీసుకొచ్చి ఫాంహౌస్ దగ్గర తీసుకొచ్చామని చెబుతారని అంటుంది. మన డ్రైవర్‌ని పంపించి, ఆ షాప్ బిల్ రశీదు తీసుకొస్తే సరిపోతుందని అంటాడు రాజ్. అయితే నువ్వు వెళ్లనని అంటావ్ అదే కదా? నేనే కారులో వెళ్లి మందు తెచ్చుకుంటానని ఇందిర చెప్పడంతో రాజ్ తప్పనిసరి పరిస్ధితుల్లో వెళ్తానని చెబుతాడు రాజ్. ఇది చూసిన కావ్య సంతోషిస్తుంది.
కిచెన్‌లో వంట చేస్తున్న స్వప్నని చూసిన రాహుల్, రుద్రాణిలు కొత్త పథకం వేస్తారు. స్వప్న దగ్గరికి వెళ్లి నువ్వు చెప్పిన పని చేశానని చెబుతాడు రాహుల్. ఇన్నిరోజులు నువ్వు ఏ పని పాటా లేకుండా తిరుగుతుంటే తిట్టుకునే దాన్నని.. కానీ నువ్వు ఇంత బాగా బాధ్యతలు తీసుకుని పనులు చేస్తుంటే ముచ్చటగా ఉందని అంటుంది స్వప్న. ఇంతలో రుద్రాణి వచ్చి నాకు మాత్రం చచ్చిపోవాలని అనిపిస్తుందని మండిపడుతుంది. వాడేం నీ బానిస అనుకున్నావా? వాడితో చేయకూడని పనులు చేయిస్తున్నావ్ అని ఫైర్ అవుతుంది. నీ పెళ్లాం లాగే నువ్వు కూడా రెండు గాజులు వేసుకుని ఇంట్లో పనులన్నీ చేయ్.. అప్పుడు నిన్ను చేతకాని వాడని అంటారని మండిపడుతుంది రుద్రాణి.
భార్యాభర్తలు కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని రాహుల్ చెప్పడంతో అలా గడ్డి పెట్టండి అంటుంది స్వప్న. ఏంటీ అండీనా అని రుద్రాణి షాక్ అవుతుంది. నా కొడుకు మీద ఈ రెస్పెక్ట్ ఎప్పటి నుంచి అని అడుగుతుంది. మా ఆయన మంచివాడిగా మారినప్పటి నుంచి అని చెబుతుంది స్వప్న. ఆ దేవుడి దయ వల్ల నీ కొడుకు మారిపోయాడు, అతనిలాగే నువ్వు కూడా మారిపోతే చాలా సంతోషిస్తామని అంటుంది స్వప్న. నాతో కూడా పనులు చేయిస్తావా? మీ చావు మీరు చావండి అని రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఉదయాన్నే కావ్య ఎక్కడికో వెళ్తుండగా చూసి ఆపుతుంది స్వప్న. హాస్పిటల్‌కి అని చెప్పడంతో జాగ్రత్తగా వెళ్లమని అంటుంది. ఇంతలో కళ్యాణ్ వచ్చి రాజ్ గురించి అడగ్గా.. అమ్మమ్మ గారు ఎక్కడికో పంపించారని చెబుతుంది స్వప్న. కావ్య హాస్పిటల్‌కి వెళ్లిందని చెప్పడంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. వదిన హాస్పిటల్‌కి వెళితే నిజం తెలిసిపోతుందని భయపడ్డ కళ్యాణ్.. రాజ్‌కి ఫోన్ చేసి విషయం చెప్పడంతో నువ్వు తైలం కోసం వెళ్లు, నేను హాస్పిటల్‌కి వెళ్తానని రాజ్ అంటాడు. ఆ డాక్టర్‌కే ఫోన్ చేసి హెల్ప్ చేయమని అడుగుతాడు రాజ్. కావ్య మిమ్మల్ని కలవడానికి హాస్పిటల్‌కి వస్తుందని మా వైఫ్‌కి నేనింకా నిజం చెప్పలేదని అనడంతో డాక్టర్ మండిపడుతుంది. తన ప్రాబ్లమ్ ఎంత పెద్దదో మీకు అంత వివరంగా చెప్పాక కూడా అంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారని అడుగుతుంది డాక్టర్.
నేను తనకి అబార్షన్ ఎందుకు చేయించాలని అనుకుంటున్నానో తెలుసుకోవాలని అనుకుంటుందని రాజ్ చెబుతాడు. మీరు దయ చేసి నిజం చెప్పొద్దని బతిమలాడతాడు రాజ్. కానీ డాక్టర్ ససేమిరా అంటుంది. కావ్య పరిస్ధితి చాలా దారుణంగా ఉందని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని.. కానీ ఓ పేషెంట్ నా దగ్గరికొచ్చి నిజం చెప్పమంటే మాత్రం జరిగినదంతా చెప్పేస్తానని ఫోన్ పెట్టేస్తుంది డాక్టర్. కావ్య హాస్పిటల్‌కి రాగానే అక్కడ ఓ నర్స్ ఆమెను చూసి రాజ్‌కి ఫోన్ చేసి చెబుతుంది. తనను ఎలాగోలా ఆపమని నర్స్‌ని రిక్వెస్ట్ చేస్తాడు రాజ్.
ఒకసారి అపాయింట్‌మెంట్ తీసుకున్నాక కావ్యని ఆపడం కష్టమని, అలా చేస్తే మా డాక్టర్‌కి అనుమానం వస్తుందని, నన్ను ఉద్యోగంలో నుంచే తీసేస్తారని భయపడుతుంది నర్స్. తన ప్రాణాల్ని కాపాడటానికి నేను ఇదంతా చేస్తున్నానని హెల్ప్ చేయమని రాజ్ అడగటంతో ఆ నర్స్ కరిగిపోతుంది. ఒక 30 నిమిషాలు ఆపగలనని, అంతకుమించి నా వల్ల కాదని అనడంతో రాజ్ థ్యాంక్స్ చెబుతాడు. కావ్య హాస్పిటల్‌కి వెళ్లబోతుండగా నర్స్ వచ్చి అలా నేరుగా వెళ్లొద్దని కావ్యని ఆపుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










