Brahmamudi October 21st Episode: బెడిసికొట్టిన రుద్రాణి ప్లాన్... పండగపూట అప్పూకి ప్రమాదం
Photo Courtesy: JioHotstar
ఆకలికి అల్లాడిపోతోన్న రాజ్‌కి కృష్ణమూర్తి చేత భోజనం పంపిస్తుంది కావ్య. రాజ్‌ను నిద్రలేపిన కృష్ణమూర్తి... అందరూ నిద్రపోతున్నారు, ఎవ్వరూ చూడటం లేదు భోజనం చేయమని చెబుతాడు. భోజనం చూడగానే చాలా ఆకలి మీదున్న రాజ్.. స్పీడ్‌గా తినేస్తాడు. నా కూతురి కోసం ఇంత చేస్తున్న మీరు ఆ నిజం ఎందుకు చెప్పడం లేదో తెలియడం లేదని అంటాడు కృష్ణమూర్తి. చెప్పేది అయితే ఎప్పుడో చెప్పేవాడినని రాజ్ ఆన్సర్ ఇస్తాడు. చలికి వణుకుతూ, దోమలు కుట్టుకుంటూ ఇబ్బందిపడుతున్న రాజ్‌కి దిండు, దుప్పటి తీసుకొచ్చి కప్పుతుంది కావ్య.
రాజ్ కోసం అపర్ణ కంగారు పడుతుండగా ఇందిర వచ్చి నీ కొడుకులో మార్పు రావాలంటే ఈ మాత్రం డోస్ పడాల్సిందేనని చెబుతుంది. కావ్య, రాజ్‌లను కలిపేందుకు కనకం ఓ ప్లాన్ వేసి దానికి మీ సాయం కావాలని అపర్ణకి చెబుతుంది. ఇది విన్న రుద్రాణి.. మనం కూడా కనకం ఇంటికి వెళ్లాలని అక్కడ రాజ్ చేత మరోసారి కావ్యకి అబార్షన్ చేయించేలా చేస్తానని రాహుల్‌తో చెబుతుంది. ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కనకం ఇంటికి రావడం చూసి రాజ్ షాక్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 21వ తేదీ ఎపిసోడ్ 857లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నేను అనుకుంటే ఏదైనా సాధించగలను, ఆఫ్టరాల్ ఈ కళావతిని ఒప్పించలేనా? అని అనుకుంటాడు రాజ్. ఇన్నిరోజులు ఈ విషయంలో మీరు కళావతికి సపోర్ట్ చేశారు కాదా? సడెన్‌గా నువ్వెందుకు ప్లేట్ తిప్పేసి నాకు సపోర్ట్ చేస్తున్నావని అడుగుతాడు రాజ్. నా మనవడు ఏది చేసినా బాగా ఆలోచించి చేస్తాడని నిన్న రాత్రే నాకు తెలిసిందని అంటుంది ఇందిర. ఇన్నిరోజులు నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నానని అర్ధమైంది, అందుకే నీకు సపోర్ట్ చేస్తున్నానని చెబుతుంది ఇందిర. ఎలాగైనా నా మనవరాలిని ఒప్పించి ఇంటికి తీసుకురమ్మని అంటుంది.
కావ్య కడుపులోని బిడ్డను చంపేందుకు ఓ ప్రత్యేకమైన కెమికల్ వాడి క్రాకర్స్ తయారు చేయిస్తుంది రుద్రాణి. ఈరోజు ఆ కావ్య చేత ఈ క్రాకర్స్ అన్ని కాల్పించాలని, కానీ ఎలా అని ఆలోచిస్తుంది. ఇంతలో స్వరాజ్ కనిపించడంతో పిల్లాడి దగ్గరికి వెళ్లి ఏం ఆట ఆడుతున్నావ్? అని అడుగుతుంది. కళ్లు ఏమైనా కాకులు ఎత్తుకుపోయాయా? బాల్ ఆట ఆడుతున్నాను అని చెబుతాడు బాబు. దాంతో నీకు క్రాకర్స్ కాల్చాలని లేదా? అని అడుగుతుంది? నాకు చాలా ఇష్టమని అంటాడు స్వరాజ్. కారులో ఉన్న క్రాకర్స్ చూసి పిల్లాడు సంతోషిస్తాడు. తన ప్లాన్ వర్కవుట్ అయ్యిందని రాహుల్, రుద్రాణిలు పండగ చేసుకుంటూ ఉండగా.. నాకు ఈ క్రాకర్స్ వద్దు అంటాడు స్వరాజ్. నేను, మావయ్య మార్కెట్‌కి వెళ్లి ఎక్కువ క్రాకర్స్ తీసుకొస్తామని చెబుతాడు.
నువ్వు అర్జెంట్‌గా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్లి జ్యోస్యం చెప్పించుకోమని అంటాడు రాహుల్. మనం ఏం ప్లాన్ చేసినా ఫస్టే ఫ్లాపే అయిపోతోందని అనగా.. ఇది మన మంచికే జరిగిందని అంటుంది రుద్రాణి. ఈ క్రాకర్స్ తీసుకెళ్లి స్వరాజ్ కాల్చి కావ్యకి ప్రాబ్లమ్ అయ్యుంటే అది మన మీదకే వచ్చి ఉండేదని అంటుంది. ఇప్పుడు రాజ్ క్రాకర్స్ తీసుకొస్తాడు. వాటిలో మనం తెచ్చిన క్రాకర్స్ కలిపేస్తే చాలని చెబుతుంది. ప్రాబ్లమ్ కావ్యకి, నింద కావ్యకి.. దాని ఫలితం మనకి అంటుంది రుద్రాణి.
పండగపూట రాజ్ కోసం కొత్త బట్టలు తీసుకొస్తుంది కనకం. కావ్యని పిలిచి అల్లుడిగారికి ఇవ్వమని చెబుతుంది. అది మీరే ఇచ్చుకోండి అని కావ్య వెళ్లిపోతుండగా.. బాబు స్నానం చేస్తున్నాడు, నువ్వే ఇచ్చేయ్ అంటుంది కనకం. బాత్‌రూమ్ దగ్గరికి వెళ్లబోతూ కావ్య ఆగిపోగా.. ఏం జరిగిందని ఇందిర అడుగుతుంది. ఇప్పుడు నీ మనవడు నా మీద కోపంగా ఉన్నాడని, ఇలా డైరెక్ట్‌గా ఇస్తే తీసుకోడని చెబుతుంది కావ్య. దాంతో ఓ ప్లాన్ వేసి రెండు జతల బట్టలు తీసుకొస్తుంది. బట్టల కోసం వెతుకుతున్న రాజ్ దగ్గరికి కావ్య వచ్చి కొత్త బట్టలు ఇస్తుంది. పాత అల్లుడికి కొత్త బట్టలు ఎందుకు అని అడుగుతాడు రాజ్. అల్లుడు పాతవాడని బట్టలు కూడా పాతవే ఇస్తామా అని సెటైర్లు వేస్తుంది కావ్య.
నువ్వు తెచ్చావ్ కాబట్టి అస్సలు ఆ బట్టలు వేసుకోనని తేల్చిచెబుతాడు రాజ్. ఇంతలో ఇందిర, అపర్ణలు వచ్చి మేం బట్టలు తీసుకొచ్చామని ఇస్తారు. ఆ డ్రెస్ చాలా బాగుండటంతో నానమ్మకి ఐ లవ్ యూ చెబుతాడు రాజ్. నువ్వు తీసుకొచ్చిన బట్టలు వేయించుకునేలా చేశావని కావ్యని మెచ్చుకుంటారు ఇందిర, అపర్ణ. వాడు అంత ఖచ్చితంగా నువ్వు తీసుకొచ్చిన బట్టలు తీసుకోడని ఎలా చెప్పావని కావ్యని అడుగుతారు. నా భర్త మనసేంటో నాకు తెలియదా అని అంటుంది కావ్య. అయినా నేను హ్యాపీగా లేనని చెబుతుంది కావ్య. నీ కుటుంబమంతా పండక్కి ఇక్కడే ఉంది, అల్లుడుగారు నువ్వు తెచ్చిన బట్టలే వేసుకున్నారు, అల్లుడుగారిని ఇంట్లోకి కూడా తీసుకొచ్చానని అంటుంది కనకం.
ఆయన మనసులో ఉన్న కారణం తెలియాలని, అది తెలిసేంత వరకు నేను సంతోషంగా ఉండలేనని చెబుతుంది కావ్య. ఆయన నిజం చెబుతారన్న నమ్మకం నాకు లేదని అంటుంది. సాయంత్రానికల్లా నన్ను తీసుకెళ్లిపోతానని ఛాలెంజ్ చేశారు. అన్నయ్య ఆ బిడ్డను ఎందుకు వద్దు అనుకుంటున్నారో నిజం చెబుతాడేమోనని కళ్యాణ్ అంటాడు. ఆయన ఏదో చేయబోతున్నారని టెన్షన్‌గా ఉందని, మళ్లీ అబార్షన్ జరిగేలా ప్లాన్ చేసుంటాడని నాకు అనిపిస్తోందని అంటుంది. వాడు అలా చేయడని, మేమంతా ఉన్నాం కదా అని అంటారు ఇందిర, అపర్ణ. పండక్కి రెడీ అయిన రాజ్‌ని పదే పదే పొగుడుతాడు స్వరాజ్. నీకేం కావాలని అడుగుతాడు రాజ్.. ఈరోజు దీపావళి కాబట్టి నాకు క్రాకర్స్ కావాలని చెబుతాడు పిల్లాడు. క్రాకర్స్ కాల్చడం వల్ల పొల్యూషన్ వస్తుందని, పక్షులు చనిపోతాయని చెబుతాడు రాజ్. దాంతో క్రాకర్స్ కావాల్సిందేనని మారాం చేస్తాడు స్వరాజ్.
మన ఇంటి ముందు కాల్చే బాంబులతో కాలనీ మొత్తం దద్ధరిల్లిపోవాలని స్వరాజ్‌తో అంటుంది కనకం. మీరు అలా చేస్తారనే టపాసులు తీసుకురాలేదని చెబుతాడు రాజ్. దాని వల్ల ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కూడా వస్తుందని అంటాడు. కానీ పిల్లాడికి సర్‌ప్రైజ్ ఇస్తూ టపాసులు తీసుకొస్తాడు రాజ్. అందరూ టపాసులు కాలుస్తుండగా రాహుల్ - రుద్రాణిలు తాము తయారు చేయించిన క్రాకర్స్ మార్చేస్తాడు. ఇంతలో అప్పూ వచ్చి మనం కూడా క్రాకర్స్ కాలుద్దామని రుద్రాణి, రాహుల్‌లు తీసుకొచ్చిన టపాసులు తీసుకుంటారు. అది చూసిన రాహుల్ - రుద్రాణిలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











