Brahmamudi October 23rd Episode: కావ్యకు అండగా రుద్రాణి... రాజ్ కాళ్లుపట్టుకున్న కృష్ణమూర్తి, కనకం
Photo Courtesy: JioHotstar
కావ్య కోసం తయారు చేయించిన క్రాకర్స్‌ని అప్పూ కలుస్తుండటంతో రాహుల్ - రుద్రాణి షాక్ అవుతారు. రాజ్‌ని రెచ్చగొట్టి కావ్యని బయటికి తీసుకొచ్చేలా చేస్తుంది. రాజ్ లోపలికి వెళ్లి కిచెన్‌లో వంట చేస్తున్న కావ్యని బయటికి రమ్మని చెబుతాడు. నా కడుపులో బిడ్డను ఎందుకు తీసేయమన్నారో చెబితేనే పండగ చేసుకుంటాను, మీతో పాటు ఇంటికి వస్తానని చెబుతుంది కావ్య. చెప్పేవాడినే అయితే ఎప్పుడో చెప్పానని అంటాడు రాజ్. రుద్రాణి తీసుకొచ్చిన క్రాకర్స్ దెబ్బకి అప్పూ కళ్లు తిరిగి కిందపడిపోతుంది.
ఆమెను పరీక్షించిన డాక్టర్.. క్రాకర్స్‌లో రసాయనాలు భారీగా కలిశాయని, ఏమాత్రం తేడా వచ్చినా కడుపులో బిడ్డ దక్కేది కాదని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇదే అదనుగా రుద్రాణి రెచ్చిపోతూ రాజ్‌ని అందరి ముందు దోషిని చేస్తుంది. కడుపులో బిడ్డను తీసేయడానికి నాకు సీక్రెట్‌గా అబార్షన్ చేయించాలని అనుకున్నారు, జ్యూస్‌లో టాబ్లెట్స్ కలిపారు, ఇప్పుడు క్రాకర్స్‌తో బిడ్డను చంపాలని అనుకుంటున్నారా? అంటూ రాజ్‌ని నిలదీస్తుంది కావ్య. ఇదంతా ఎందుకు చేశారని రాజ్ కాలర్ పట్టుకుని అడుగుతుంది. దాంతో నువ్వు ప్రాణాలతో ఉండాలనే అలా చేశానని రాజ్ అనడంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 23వ తేదీ ఎపిసోడ్ 859లో ఇంకా ఏం జరిగిందంటే?

రాజ్ కాలర్ పట్టుకుని కావ్య నిలదీస్తుండటంతో అప్పూ బయటికి వచ్చి ఇప్పటికైనా రహస్యం చెప్పమని బావగారితో అంటుంది. ఆ రహస్యం ఏంటీ? అని కావ్య అడగ్గా.. నువ్వు బిడ్డను కంటే చచ్చిపోతావని అంటుంది అప్పూ. నేను, అప్పూ మొదటిసారి డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు ఈ నిజం మాకు తెలిసిందని కళ్యాణ్ చెబుతాడు. బావగారికి నిజం చెప్పేసి మా గుండెల్లో భారాన్ని దించుకున్నామని, కానీ ఆ క్షణం నుంచే నీతో నిజం చెప్పలేక, నీ ప్రాణాల్ని కాపాడుకోవడం ఎలాగో తెలియక ఆయన నరకం అనుభవించారని చెబుతుంది అప్పూ. నీకు నిజం చెప్పమని అన్నయ్యని ఎంతగానో బతిమలాడామని, కానీ నీకు నిజం తెలిస్తే.. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు విలువ ఇస్తావని.. నీ ప్రాణాలు కూడా లెక్కచేయవని భయపడ్డాడని చెబుతాడు కళ్యాణ్.
అందరూ బావగారిని తిడుతున్నా మౌనంగా భరించారు.. నిన్ను కాపాడుకోవడం కోసం, నీ కడుపులో పెరుగుతున్న తన వారసుడిని కూడా వదులుకోవాలని నిర్ణయించుకున్నారని చెబుతుంది అప్పూ. ఆఖరికి నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసినప్పుడు కూడా మేమిద్దరం నీకు నిజం చెప్పేయాలని అనుకున్నామని, కానీ అప్పుడు కూడా అన్నయ్యని చూసి మేం మౌనంగా ఉండిపోయామని అంటాడు కళ్యాణ్. బావగారు నిన్ను మోసం చేశారు.. బలవంతంగా అబార్షన్ చేయించాలని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు, జ్యూస్‌లో టాబ్లెట్స్ కలిపారని.. కానీ ఇదంతా చేసింది నీ ప్రాణాలు కాపాడటం కోసమని చెబుతుంది అప్పూ. తనకు వారసులు కావాలని భార్యలని టార్చర్ చేసే ఎంతో మంది మగాళ్ల మధ్యలో.. తన భార్య ప్రాణమే ముఖ్యమన్న బావగారు బంగారమని అంటుంది.
బిడ్డ దూరమైతే వదిన నిన్ను క్షమించదు, నిన్ను శత్రువులా చూస్తుందని చెప్పినా... అది నన్ను అసహ్యించుకున్నా పర్లేదు, ప్రాణాలతో ఉంటే చాలని అన్నాడని చెబుతాడు కళ్యాణ్. ఇప్పుడు కూడా బావ నీకు నిజం చెప్పేవాడే కాదని, ఆవేశంలో నోరుజారాడని.. నీకు ఎప్పటికీ నిజం చెప్పేవాడు కాదని అంటుంది అప్పూ. ఇప్పుడు కూడా నిన్ను ఎలా కాపాడుకోవాలా అని మదనపడుతున్నాడని అంటాడు కళ్యాణ్. కన్నవాళ్లం అయ్యుండి కూడా, నువ్వంటే తెలిసి కూడా నిన్ను నిందించామని అంటాడు సుభాష్. మీ తాతయ్య గారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదని బాధపడే దానిని, కానీ నా మనవరాలిని కాపాడుకోవం కోసం దోషిగా నిలబడ్డావని, దుగ్గిరాల ఇంటి నిజమైన వారసుడు అనిపించుకున్నావని మెచ్చుకుంటుంది ఇందిర. నేను నానామాటలు అంటున్నా, బయటికి నవ్వుతూ ఎలా ఉన్నావని ప్రశ్నిస్తుంది అపర్ణ.
నువ్వు బాధపడుతున్న బాధను గుర్తించలేకపోయా, భార్యను అర్ధం చేసుకోలేని మూర్ఖుడివి అనుకున్నానని నిన్ను చూసి గర్వపడుతున్నానని అంటాడు సీతారామయ్య. అందరి మాటలు విన్న కావ్య.. ఏడుస్తూ బయటికి వెళ్లిపోతుంది. జరగాల్సిన దారుణం జరిగిపోయిందని బాధపడతాడు రాజ్. ఒంటరిగా కూర్చొని భర్త తన కోసం చేసిన పనులను గుర్తుచేసుకుంటుంది కావ్య. ఇంతలో రాజ్ అక్కడికి రావడంతో కన్నబిడ్డను కూడా వదులుకునేంత ప్రేమ ఉందా నా మీద అని అడుగుతుంది కళావతి. నిన్ను రక్షించుకోవడం కోసం ఆ దేవుడిని ఎంత ప్రార్ధించానో నీకు తెలియదంటూ రాజ్ కిందపడిపోతాడు.
ఈ ట్విస్ట్ నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదని, రాజ్ ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి మూర్ఖుడిలా బిడ్డను వద్దు అంటుంటే వాడికి పిచ్చి పట్టిందని అనుకున్నానని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. మనం వారసుడిని చంపాలని అనుకుంటుంటే, ఆ కావ్య తలరాతలో ఏకంగా పైకి పోవాలని రాసుందని అంటాడు రాహుల్. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదని, ఇప్పటి వరకు బిడ్డను దూరం చేయాలని అనుకున్నాం, కానీ ఇకపైన కాపాడాలని అంటుంది రుద్రాణి. రాజ్ చెప్పిన అస్త్రమే కావ్యను చంపేస్తుందని, ఇప్పటి వరకు రాజ్ భయపడినది నిజం చేద్దామని చెబుతుంది. కావ్యకి నిజం తెలిసింది కాబట్టి తప్పకుండా అబార్షన్ చేయించుకుంటుందని అంటాడు రాహుల్.
నువ్వు కావ్యని పూర్తిగా అర్ధం చేసుకోలేదు.. తన పుట్టింటి పరువు కాపాడటం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఈ ఇంటికి కోడలిగా వచ్చిందని, తన ప్రాణం కోసం ఈ ఇంటి వారసుడిని వదిలేసుకుంటుంది అనుకుంటున్నావా? అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. అది చచ్చినా బిడ్డను కంటాననే అంటుందని చెబుతుంది. తను ఎంత త్యాగమూర్తయినా మనిషే కదా ప్రాణమంటే తీపి ఉండదా అని అంటాడు రాహుల్. నువ్వు మగాడివి కాబట్టి.. ఆడదాని మనసు తెలుసుకోలేకపోతున్నావ్.. ఏ తల్లి కూడా తన బిడ్డను చంపాలని కోరుకోదు, కావ్య లాంటిది అస్సలు ఒప్పుకోదని అంటుంది రుద్రాణి. ఇంట్లో వాళ్లు చూస్తూ ఊరుకోరు కదా అని చెబుతాడు రాహుల్. ఇప్పటి వరకు శత్రువుల్లా చూసిన కావ్యను సపోర్ట్ చేయడం మొదలు పెట్టాలని అంటుంది రుద్రాణి. ఈ ప్రపంచాన్నే చూడని పసికందుని చంపేస్తామంటే ఏం చేయాలో తెలియక అందరూ కుమిలికుమిలి ఏడుస్తారని అంటుంది.
ఒంటరిగా బాధపడుతున్న రాజ్ దగ్గరికి కృష్ణమూర్తి, కనకం వచ్చి మాట్లాడతారు. మీ బిడ్డను దూరం చేసుకుని, నా బిడ్డ ప్రాణాల్ని కాపాడుతున్నారని తెలుసుకోలేకపోయామని అంటారు. మీరు కోపంగా చూస్తేనే తెల్లారిపోయే బతుకులు మావి, అలాంటిది మీరు మాకు ఎన్నోసార్లు సాయం చేసి మా జీవితాల్ని నిలబెట్టారని అంటుంది కనకం. మా అమ్మాయిని మీ ఇంటి మహారాణిని చేస్తే... మిమ్మల్ని మా ఇంటి గడప ముందు కూర్చోబెట్టామని అంటాడు కృష్ణమూర్తి. మేం ఏమిచ్చి రుణం తీర్చుకోగలమని కాళ్లు పట్టుకోబోతారు కనకం, కృష్ణమూర్తి. మీ అమ్మాయి ప్రాణాలను కాపాడాలనుకున్నాను.. కానీ ఈరోజు ఓడిపోయి నిలబడ్డానని చెబుతాడు రాజ్. కళావతి అంటే నాకు ప్రాణమని, తను లేకుండా నేను బ్రతకలేనని... తనను బాధపెట్టయినా కాపాడుకోవాలని అనుకున్నానని అంటాడు. ఇప్పుడు మీ అమ్మాయి తనకు తన బిడ్డే ముఖ్యమంటే నేను ఏం చేయాలి అని ప్రశ్నిస్తాడు రాజ్. తనతో పాటు చావడం తప్పించి నాకు వేరే దారే కనిపించడం లేదని చెబుతాడు. ఆ మాటలతో కనకం, కృష్ణమూర్తి షాక్ అవుతారు.
అన్ని ప్రయత్నాలు చేసేశాం... కళావతిని కాపాడాలంటే తన కడుపులోని బిడ్డను చంపాల్సిందేనని చెబుతాడు రాజ్. ఇంతలో కావ్య వచ్చి మనింటికి వెళ్దామని అంటుంది. నేను ఇక్కడికి వచ్చింది ఆయన మనసులో ఉన్న నిజాన్ని తెలుసుకోవడం కోసమని, అది తెలిసిపోయిందని ఇక నేను ఉండాల్సిన పనిలేదని చెబుతుంది కావ్య. ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ బాధపడుతుండగా అందరికీ కాఫీలు, టీలు తీసుకొచ్చి ఇస్తుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










