Brahmamudi October 24th Episode: ప్రాణాలైనా వదిలేస్తా.. బిడ్డే కావాలన్న కావ్య, షాక్‌లో రాజ్

Photo Courtesy: JioHotstar

నువ్వు బిడ్డను కంటే చనిపోతావని కావ్యకు అసలు నిజం చెబుతుంది అప్పూ. నిన్ను కాపాడుకోవడం కోసం తన వారసుడిని సైతం చంపుకోవడానికి బావ సిద్ధపడ్డాడని, ఇంట్లో అందరి చేతా మాటలు పడ్డాడని చెబుతుంది అప్పూ. మేం ఎన్నోసార్లు నిజం చెప్పాలని అనుకున్నామని కానీ అన్నయ్య కష్టం చూసి ఆగిపోయామని కళ్యాణ్ అంటాడు. రాజ్ గొప్పతనం తెలియడంతో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం అతనిని మెచ్చుకుంటుంది. ఇన్నాళ్లు నేను చేసినదంతా వృథా అయిపోయిందని, నా భార్యను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదని అంటాడు రాజ్.

కావ్య తన ప్రాణాలైనా ఇస్తుంది కానీ .. బిడ్డను మాత్రం చంపుకోదని ఇక నుంచి మనం కావ్యకే సపోర్ట్ చేయాలని, ఆమె బిడ్డను కాపాడాలని రాహుల్‌తో చెబుతుంది రుద్రాణి. కావ్య చనిపోయాక మనకు అడ్డొచ్చేవారు ఎవరూ లేరని అంటుంది. రాజ్ చేసిన త్యాగానికి కృష్ణమూర్తి, కనకంలు ఎంతో బాధపడుతూ అల్లుడి కాళ్లు పట్టుకోబోతారు. ఇక మనం మనింటికి వెళ్లిపోదామని రాజ్‌తో కావ్య అంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 24వ తేదీ ఎపిసోడ్ 860లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial October 24h 2025 Episode 860 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ కాఫీలు, టీలు ఇస్తుంది కావ్య. అంత పెద్ద ప్రాబ్లమ్ పెట్టుకుని ఆమె నవ్వుతుండటంతో ఇంట్లో వాళ్లు మండిపడతారు. నీ నటనతో ఏదైనా సాధించగలవని స్వప్న ఫైర్ అవుతుంది. అంతటి భయంకరమైన నిజం తెలిసి, నువ్వు ఏ పరిస్ధితుల్లో ఉన్నావో కళ్లారా చూసి ఏం చేయాలో అర్ధం కావడం లేదని బాధపడుతుంది అపర్ణ. ఇన్నాళ్లు ఆ నిజం తెలియక దిగులు పడ్డానని, మీ అబ్బాయి ఎందుకలా ప్రవర్తించారో నాలో నేనే సతమతం అయ్యానని అంటుంది కావ్య. కానీ ఆయన ఎందుకలా చేశారో, ఆయన ప్రవర్తనకు కారణం ఏంటో నాకు స్పష్టంగా తెలిసిపోయిందని, ఇంక బాధపడటం ఎందుకు అని ప్రశ్నిస్తుంది కావ్య.

ఓ పక్కన నీ ప్రాణం పోతుందని అపర్ణ అనగా.. నా కడుపులోని ప్రాణం నిలబడుతుందని అంటుంది కావ్య. బిడ్డను మోస్తే నీ ప్రాణాలు పోతాయంటే నీకు సరదాగా ఉందా? అని మండిపడుతుంది ఇందిర. ఉరుముల్ని, వర్షాన్ని పోయే ప్రాణాన్ని ఎవ్వరూ ఆపలేరని అంటుంది కావ్య. నన్ను నేను బతికించుకోవడం కోసం అమ్మ అనే మాటకున్న అర్ధాన్ని చంపేయమంటారా? అని ప్రశ్నిస్తుంది కావ్య. ఆడదానికి అమ్మ అనే పిలుపే ఒక వరమని, ఆ వరం నన్ను అందుకోకుండా, నా బిడ్డ స్వరాన్ని కడుపులోనే నొక్కేయమంటారా? అని నిలదీస్తుంది. బిడ్డ ఊపిరి తీసి తను బతకాలని అనుకోవడం అనర్ధమని, అలాంటి పని నేను చేయడం లేదని అంటుంది కావ్య. ఇంతలో రుద్రాణి వచ్చి హ్యాట్సాఫ్ అంటుంది.

ఒక అమ్మ బిడ్డ కోసం ఎలా తపన పడుతుందో? ఈ ప్రపంచాన్ని చూపించేందుకు ఎంత ఆరాటపడుతుందో? ఈరోజు నిన్ను చూశాక తెలిసిందని అంటుంది రుద్రాణి. జిల్లేడు చెట్టుకి మల్లెపూలు పూసినట్లు తమరిలో ఇంత మార్పు ఏంటో అని సెటైర్లు వేస్తుంది స్వప్న. కళ్ల మందు కావ్య కోపంలో మంచితనం కనిపిస్తోందని చెబుతుంది రుద్రాణి. ఇన్నిరోజులు నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నానని, నీది ఎంత పెద్ద మనసో ఇప్పుడే అర్ధమైందని అంటుంది. మేం మాత్రం నీ మాట వినడానికి సిద్ధంగా లేమని, మా అందరికీ నీ ప్రాణమే ముఖ్యమని దుగ్గిరాల ఫ్యామిలీ చెబుతుంది. కానీ నాకు మాత్రం నా బిడ్డ ప్రాణమే ముఖ్యమని తేల్చేస్తుంది కావ్య.

ఇంతలో రాజ్ వచ్చి నేను నిజం ఎందుకు చెప్పలేదో ఇప్పటికైనా తెలిసిందా? అని అడుగుతాడు. నిజం కావాలి? నిజం కావాలి అని అందరూ నా మీద ఎగబడ్డారు కదా? నేను నేరం చేసినట్లు దోషిలా చూశారని అంటాడు. ఇప్పుడు నిజం తెలిసింది.. కళావతి ఎంత కఠినంగా ఉందో చూశారు కదా అని మండిపడతాడు. నిజం తెలిస్తే కళావతి ఇలాగే మాట్లాడుతుందని నిజం చెప్పకుండా నేను అన్నిరోజులు ప్రవర్తించానని చెబుతాడు. ఇప్పుడు కళావతిని ఎలా ఒప్పిస్తారో? కళావతికి అబార్షన్ ఎలా చేయిస్తారో? నా భార్యను ఎలా బతికిస్తారో మీరే ఆలోచించండి.. కానీ నా భార్య నిండు నూరేళ్లు ఆయుష్సుతో నాకు కావాలని అంటాడు రాజ్.

ఒంటరిగా బాధపడుతున్న సీతారామయ్య దగ్గరికి కావ్య వస్తుంది. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టడానికి ముందు ఈ కుటుంబంలో కనిపించని లోపాలు ఉండేవని చెబుతుంది. నువ్వు ఈ ఇంటి కోడలిగా వచ్చి ఇంట్లో వాళ్లందరినీ తిరిగి మనుషుల్ని చేశావని చెబుతాడు. అంత చేసిన నీకు కృతజ్ఞతగా ఏమీ ఇవ్వలేకపోయానని, నీ గొప్పతనానికి విలువ కట్టలేకపోయానని, నా మనవడితో నువ్వు సంతోషకరమైన జీవితం పొందాలని అనుకున్నానని అంటాడు. నిండు నూరేళ్లు వాడి బతుకులో జతగా నువ్వు ఉండాలని అనుకున్నానని.. కానీ ఆ దేవుడు నా ఆశను ఆవిరి చేయడానికే నిర్ణయించుకున్నాడని బాధపడతాడు పెద్దాయన. నీకు నీ ప్రాణం మీద మమకారం కంటే.. నీ బిడ్డ మీద మమకారం పెంచుకున్నావని అంటాడు.

బిడ్డ మీద తల్లి మమకారం ఏ దేవుడు పెంచక్కర్లేదని, అది ఆడజన్మ మీద పేగు మీదే రాసుంటుందని చెబుతుంది కావ్య. ఆ రాతని చెరిపివేసుకునే అవకాశం ఉండి కూడా మా అందరికీ ఇంతటి కోతను మిగులుస్తావా అని బాధపడతాడు సీతారామయ్య. ఇంత జీవితాన్ని చూసిన మీకు నా నిర్ణయం తప్పని అనిపిస్తుందా అని ప్రశ్నిస్తుంది కావ్య. నా ప్రాణానికి కావాల్సింది జ్ఞాపకాలు.. నా మనవడు వాడి ఆనందానికి, ఈ ఇంటికి అదృష్టానివి నువ్వే.. మీ ఇద్దరి ప్రేమకు ప్రతిరూపమైన బిడ్డ నాకు ఎంతో అపురూపమని అంటాడు సీతారామయ్య. కానీ నీ ప్రసవమే.. నీకు ప్రమాదం అవుతుందని అనుకుంటే నాకు ఏ జ్ఞాపకం అక్కర్లేదని.. నువ్వు, నా మనవడు నేను బతికున్నన్ని రోజులు సంతోషంగా ఉంటే చాలని చెబుతాడు. నీ బాధ్యత కన్నా రాజ్ బతుకు ముఖ్యమని నీకు అనిపించడం లేదా అని ప్రశ్నిస్తాడు సీతారామయ్య. నువ్వు తల్లివై ఈ ఇంటికి ఒక వారసుడిని ఇవ్వడం కంటే ఇల్లాలిగా ఈ ఇంటికి దీపంలా ఉండటమే మాకెంతో ఆనందాన్ని ఇస్తుందని, లేదంటే ఈ ఇల్లే చీకటైపోతుందని బాధపడతాడు పెద్దాయన.

మరో అమ్మాయిని రాహుల్ ట్రాప్ చేస్తాడు. ఆమె మూడు రోజుల్లో స్వప్నకి విడాకులిచ్చి నన్ను పెళ్లి చేసుకోమని డెడ్‌లైన్ పెడుతుంది. ఇంతలో ఆమె భర్త వచ్చి గతంలో నువ్వు అరెస్ట్ అయినప్పుడు బెయిల్ కోసం చేసిన అప్పులు, వాడి ముందు మనం రిచ్ అని చూపించుకోవడం కోసం చేసిన అప్పులు పెరిగిపోతున్నాయని అంటాడు. ఆ రాహుల్ నా ట్రాప్‌లో ఎప్పుడో పడిపోయాడని.. స్వప్నని తప్పించి వాడి వెనకున్న ఆస్తిని లాగేసుకుంటానని చెబుతుంది. కావ్యని అబార్షన్‌కి ఎలా ఒప్పించాలో తెలియక దుగ్గిరాల ఫ్యామిలీ టెన్షన్ పడుతుంటుంది. కావ్య ఏం తప్పు చేసింది? తనకు ఎందుకు అడ్డుపడుతున్నారని అంటుంది రుద్రాణి. కావ్యని దారిలోకి తీసుకురావడానికి ఆమె చేతితో ఏం ఇచ్చినా, ఏం పెట్టినా తినకూడదని అంటుంది అపర్ణ. ఇంతలో కావ్య వచ్చి దేవుడి ప్రసాదం ఇవ్వగా అందరు వద్దు అంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X