Brahmamudi October 25th Episode: దుగ్గిరాల ఫ్యామిలీ కఠిన నిర్ణయం.. కావ్యని కాపాడేందుకు రుద్రాణి స్కెచ్

Photo Courtesy: JioHotstar

ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ కాఫీలు, టీలు ఇస్తూ నవ్వుతూ ఉంటుంది కావ్య. ఇంత పెద్ద నిజం తెలిశాక ఎలా సంతోషంగా ఉంటున్నావని అపర్ణ, ఇందిరలు ఆమెను నిలదీస్తారు. నువ్వు మాకు కావాలి అని అందరూ అడగ్గా.. నాకు మాత్రం నా ప్రాణాల కంటే నా బిడ్డే ముఖ్యమని చెప్పి వెళ్లిపోతుంది కావ్య. ఆ మాటలు విన్న రాజ్.. నేను మీ అందరికీ ఈ నిజం చెప్పనిది ఇందుకే, చెబితే కావ్య ఇలాగే చేస్తుందని నాకు ముందే తెలుసని అంటాడు.

నీ బిడ్డ కోసం మా అందరినీ చీకట్లో వదిలి వెళ్లొద్దని కావ్యకు చెబుతాడు సీతారామయ్య. నీ కోసమే బతుకుతున్న రాజ్ పరిస్ధితి గురించి ఆలోచించమని అంటాడు. మరోవైపు.. కావ్యని అబార్షన్‌కు ఒప్పించాలని దుగ్గిరాల ఫ్యామిలీ నిరాహారదీక్షకు దిగుతుంది. అటు రాహుల్‌ని ఓ అమ్మాయి తన అందంతో ట్రాప్ చేసి ఆస్తి కొట్టేయాలని అనుకుంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 25వ తేదీ ఎపిసోడ్ 861లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial October 25h 2025 Episode 861 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కావ్య మనసు మార్చాలని దుగ్గిరాల ఫ్యామిలీ నిరాహారదీక్ష చేస్తుండగా.. కావ్య వచ్చి అందరికీ ఇష్టమైన ప్రసాదం తెస్తుంది. కానీ ఎవ్వరూ తీసుకోరు. ప్రసాదం తీసుకోకపోతే పాపమని కావ్య అంటుంది. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయమే ఘోరం.. నువ్వు మనసు మార్చుకుని మేం చెప్పినట్లు వినేదాకా నీ చెత్తో పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోమని అంటుంది ఇందిర. ఈరోజు నేను చేసిన పెసరట్టు ఉప్మా, వడలు, పూరీలు చేశానిన టెంప్ట్ చేస్తుంది కావ్య. దాంతో ఇందిరకు నోరూరిపోతుంది.. నువ్వు ఎన్ని చెప్పినా ఇక్కడ ఎవ్వరూ టెంప్ట్ అవ్వరని అపర్ణ అంటుంది. నువ్వు మారే దాకా, మా మనసు మారే దాకా మా నిర్ణయం మారదని అంటుంది ఇందిర.

నేను కూడా అస్సలు తగ్గేదే లేదని అంటూ వెళ్లిపోతూ.. కావ్య పడిపోతుంది. కానీ ఇదంతా నాటకమని ఎవ్వరూ పట్టించుకోరు. నీ డ్రామాలు ఎవ్వరూ నమ్మరు.. నువ్వు లే అంటారు అపర్ణ, అప్పూ, స్వప్న. కావ్య ఎంతకు లేవకపోవడంతో ఫ్యామిలీ అంతా కంగారుపడుతుంది. దాంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తారు. కావ్యకేం కాదు.. క్షేమంగా ఇంటికొస్తుందని రాజ్‌కి సుభాష్‌ ధైర్యం చెబుతాడు. బీపీ పెరగడం వల్లే ఇలా జరిగిందని, కంగారు పడాల్సిందేం లేదని డాక్టర్ చెబుతుంది. కావ్యకి ఎప్పుడు ఏమవుతుందోనని , ఎన్నాళ్లు భయపడాలని అపర్ణ బాధపడుతుంది. ఎంత చెప్పినా వినిపించుకోదు.. ఏం చేయాలో మనకి అంతు చిక్కదు, దాని మనసు మారదని అంటుంది అపర్ణ.

పరీక్ష పెట్టింది దేవుడే అయినా ప్రశ్నాపత్రం మన చేతుల్లో ఉందని.. దానికి సరైన జవాబు మనమే రాయాలి, ఇప్పుడే రాయాలని అంటుంది. కావ్య ఎలాగూ ఇప్పుడు స్పృహలో లేదు.. మనం ఏం చేస్తున్నామో కూడా తెలుసుకునే పరిస్ధితిలో లేదు కాబట్టి.. పరీక్ష పెట్టిన ఆ దేవుడే మనం కావ్యని కాపాడుకునే అవకాశం ఇచ్చాడని అంటుంది ఇందిర. మనం కావ్యని అబార్షన్‌కి ఒప్పించలేం.. ఆపరేషన్ జరిపించలేమని, అందుకే కావ్య స్పృహలో లేనప్పుడే డాక్టర్‌తో మాట్లాడి అబార్షన్ చేయిద్దామని అంటుంది. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. కావ్యని కాపాడుకోవాలంటే ఇంతకుమించి వేరే ఆప్షన్ లేదని అంటుంది ఇందిర. కావ్య విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వేనని రాజ్‌ని అడగ్గా.. నాకు కావ్య కావాలి, నాకు ఏ అభ్యంతరం లేదని అంటాడు రాజ్.

ఇది జీవితాలా? చిత్తు కాగితాలా? మీ పాటికి మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడుతుంది రుద్రాణి. ఇది కావ్య భర్తగా నా కొడుకు తీసుకున్న నిర్ణయమని అంటుంది అపర్ణ. తను స్పృహలో లేదని అబార్షన్ చేయిస్తారు, రేపు తనకి తెలిసిన మరుక్షణం తన అనుమతి లేకుండా బిడ్డను చంపేశారని కోర్టుకెక్కితే ఏం చేస్తారని అడుగుతుంది రుద్రాణి. ఇన్నిరోజులు నా కోడలు మన కుటుంబం కోసం కష్టపడిందని, మనల్ని కాపాడుతూ వచ్చిందని ఇప్పుడు అన్ని తెలిసి దాని ప్రాణాల్ని కాపాడుకోపోతే మనల్ని మనుషులు అనరని అంటుంది అపర్ణ. రేపటి సంగతి తర్వాత కావ్య బాగుందా లేదా అని చూడాలి, దానిని బతికించుకోవడానికి ఇంటిల్లిపాది జైళ్లో కూర్చోవడానికి కూడా సిద్ధమేనని అంటుంది.

కావ్య మాకు దూరం కాకూడదని, కానీ తనని అబార్షన్‌కి ఒప్పించలేకపోయామని డాక్టర్‌కు చెబుతాడు రాజ్. కావ్య బిడ్డని కనడానికే నిర్ణయించుకుందని, తను స్పృహలో లేదు కదా అందుకే ఇదే సమయంలో అబార్షన్ చేయండి, నా భార్యను బతికించండి అని అడుగుతాడు రాజ్. ఆ మాటలతో డాక్టర్ షాక్ సీరియస్ అవుతుంది. తనను ఒప్పించాలని మా అబ్బాయి, మేము ఎంతో ప్రయత్నించాం.. కానీ కావ్య మాత్రం తన ప్రాణాల్ని పణంగా పెట్టి బిడ్డను కంటానని అంటుందని చెబుతుంది అపర్ణ. అందుకే ఇంతకుమించి మరో మార్గం కనిపించడం లేదని అంటుంది ఇందిర. కానీ ఒక డాక్టర్‌గా ఇలాంటి పని నేను చేయలేనని చెబుతుంది డాక్టర్. అబార్షన్ అనేది అత్యవసర పరిస్ధితుల్లో చేస్తారని, ఇలా తనకు తెలియకుండా, తల్లి పర్మిషన్ లేకుండా అబార్షన్ చేయడం నేరమని అంటుంది డాక్టర్. ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని డాక్టర్ చెబుతుంది.

నేను కూడా అదే చెబుతున్నానని, కానీ వీళ్లు వినడం లేదని అంటుంది రుద్రాణి. కావ్య బిడ్డను కంటే తన ప్రాణాలకే రిస్క్ కదా? అలాంటప్పుడు ఇది కూడా అత్యవసరమేనని అంటాడు రాజ్. నేను చేయను అనడం లేదు, తనకు తెలియకుండా చేయ్యను అంటున్నానని చెబుతుంది డాక్టర్. తన అనుమతి కావాల్సిందేనని, అలా కాకుండా మీరు నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తుంది డాక్టర్. ఇంతలో కావ్య రిపోర్ట్స్ రావడంతో వాటిని చెక్ చేసి రాజ్‌కి కంగ్రాట్స్ చెబుతుంది. మీ వైఫ్ ప్రాణాలకు ప్రమాదమనే కదా మీరు అబార్షన్ చేయించాలని అనుకుంటున్నారు కదా అని అడుగుతుంది. కానీ తనకి ఏ అబార్షన్ చేయించాల్సిన అవసరం లేదని, పాత రిపోర్ట్స్‌లో తన గర్భసంచికి ప్రాబ్లమ్ ఉన్న మాట నిజం.. గర్బసంచి చిన్నదిగా ఉండటం వల్ల నేలలు నిండే కొద్ది బిడ్డ డెవలప్ అవుతున్న కొద్ది తల్లి ప్రాణానికి ప్రమాదం వస్తుందన్నది నిజమని అంటుంది డాక్టర్.

కానీ ఇప్పుడు అదంతా మారిపోయిందని, గర్భసంచిలో డెవలప్‌మెంట్ కనిపిస్తోందని.. మీ వైఫ్ తన బిడ్డను మోయడం వల్ల తన ప్రాణానికి ఎటువంటి ప్రాబ్లమ్ లేదని చెబుతుంది డాక్టర్. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ ఎంతో సంతోషిస్తుంది. కావ్యను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకొస్తారు. ఇన్నిరోజులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికామని అంటుంది అపర్ణ. డాక్టర్ గారి మాటలు విన్నాక.. నా కొడుకుతో నీ ప్రయాణం ఆగిపోయేది కాదు, కలకాలం కలిసి సాగిపోయేదని నమ్మకం కుదిరిందని చెబుతుంది. కడుపులోని బిడ్డ బతకాలంటే కన్నతల్లి ప్రాణాలకే ప్రమాదమని చెబుతుంటే మా ఊపిరి ఆగిపోయినట్లు అనిపించిందని అంటుంది ఇందిర. ఇన్నిరోజులు ఇలాంటి మాటలు వినివిని విసిగెత్తిపోయానని చెబుతుంది కావ్య. ఇకపై మన ఇల్లు ఆనందానికి చిరునామా అవుతుందని సీతారామయ్య అనగా.. రుద్రాణి, రాహుల్‌లు రగిలిపోతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X