Brahmamudi October 27th Episode: డాక్టర్ మోసాన్ని తెలుసుకున్న రాజ్... భర్త ముందు దోషిలా కావ్య
Photo Courtesy: JioHotstar
కావ్య మనసు మారి, ఆమె అబార్షన్ చేయించుకునే వరకు కళావతి చేతితో ఏం ఇచ్చినా తీసుకోకూడదని దుగ్గిరాల ఫ్యామిలీ నిర్ణయించుకుంటుంది. ఉదయాన్నే కావ్య పూజ చేసి వచ్చి ప్రసాదం ఇస్తుండగా ఎవ్వరూ తీసుకోరు. అయితే పెసరట్టు ఉప్మా, వడలు, పూరీలు మొత్తం నేనే తినేస్తానని కావ్య చెప్పడంతో ఇందిర, ప్రకాశంలు టెంప్ట్ అవుతారు. దాంతో అపర్ణ వాళ్లని కంట్రోల్ చేస్తుంది. వాళ్లు వద్దు అంటున్నారు కదా మాకు పెడితే మొత్తం తినేస్తామని కావ్యతో రుద్రాణి, రాహుల్ అంటారు. కుటుంబ సభ్యులు చాలా కోపంగా ఉండటంతో మీరు తగ్గే వరకు నేను కూడా తగ్గేదే లేదని వెళ్లిపోతూ కావ్య ఉన్నట్లుండి కళ్లు తిరిగి పడిపోతుంది. తొలుత ఆమె నాటకాలు వేస్తుందని ఎవరూ పట్టించుకోరు.. అయితే ఎంతకీ కావ్య లేవకపోడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతుంది.
ఇంతలో రాజ్ వచ్చి కళావతిని ఆసుపత్రిలో చేరుస్తాడు. బీపీ ఎక్కువ కావడం వల్లే ఇలా జరిగిందని చెబుతుంది డాక్టర్. కావ్యను కాపాడుకోవాలంటే అబార్షన్ ఒక్కటే మార్గమని ఇందిర చెప్పడంతో రాజ్‌తో పాటు కుటుంబం మొత్తం ఓకే అంటుంది. కావ్య స్పృహలో లేనప్పుడే అబార్షన్ చేయమని డాక్టర్‌ను కోరగా.. ఆమె ససేమిరా అంటుంది. ఇంతలో కావ్య రిపోర్ట్ చూసిన డాక్టర్.. ఇకపై కళావతికి ఏం జరగదని, ఆమె హ్యాపీగా బిడ్డను కనొచ్చని చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 27వ తేదీ ఎపిసోడ్ 862లో ఇంకా ఏం జరిగిందంటే?

కావ్యకు ప్రమాదం తప్పిపోవడంతో దుగ్గిరాల కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలి, జ్యూస్ తాగాలని జాగ్రత్తలు చెబుతారు. భార్యను తీసుకుని రాజ్ బెడ్ రూమ్‌లోకి వెళ్తాడు. ఇంట్లో వాళ్లంతా నాకేదో అయిపోతుందని కంగారు పడ్డారు కదా అని అంటుంది కావ్య. మొదటిసారి ఈ విషయం తెలిసినప్పుడు ఎంతలా భయపడిపోయారో? మీరు చేస్తున్న ప్రయత్నాలే చెబుతున్నాయని అంటుంది. నా కోసం మన బిడ్డను కనొద్దు అనుకునేంత ప్రేమ ఉందా అని రాజ్‌ని ప్రశ్నిస్తుంది కావ్య. మీరు మొండిగా ఎందుకు ఉంటున్నారా? అని నాకు చాలా కోపం వచ్చిందని, నేను అలిగి పుట్టింటికి వెళ్లిపోయినా నన్ను కాపాడటం కోసం వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు? నా కోసం రోడ్డు మీద కూర్చొన్నారు... ఇంటి పరువును కూడా పక్కనపెట్టారని చెబుతుంది కావ్య.
ప్రమాదం నుంచి బయటపడ్డానని, ఇప్పుడు మీ గుండెల్లో ఉన్న బాధ తీరిపోయిందా? అని అడుగుతుంది కావ్య. మీరు చేసిన ప్రయత్నాలకు ఆ దేవుడే కరిగిపోయి నన్ను బతికించినట్లుగా ఉన్నాడని అంటుంది. నాతో పోరాడాల్సిన పనిలేదు.. కొన్ని నెలల్లోనే మన వారసుడు వస్తాడని చెబుతుంది కావ్య. మీ అమ్మ బతికుందంటే తనొక ఫైటర్ అని చెబుతానని అంటుంది కావ్య. డాక్టర్ గుడ్ న్యూస్ చెప్పగానే సంతోషంతో పొంగిపోతారనుకుంటే ఇంత డల్‌గా ఉన్నారేంటీ? అని అడుగుతుంది. అబద్ధం ఎందుకు చెప్పావు? డాక్టర్ చేత ఎందుకు అలా చెప్పించావని నిలదీస్తాడు రాజ్. మీరు డాక్టర్‌తో రూమ్‌లో మాట్లాడేటప్పుడు నేను స్పృహలో లేను కదా అంటుంది కావ్య. నేను గదిలో డాక్టర్‌తో మాట్లాడిన విషయం నేను నీకు చెప్పలేదు కదా అని అంటాడు రాజ్. నువ్వు డాక్టర్‌తో మాట్లాడేటప్పుడు నేను విన్నానని రాజ్ చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది.
దాంతో రాజ్ జరిగినది గుర్తుచేసుకుంటాడు. నా ప్రాణం ఎప్పుడు పోతుందని డాక్టర్‌ని అడుగుతుంది కావ్య. నేను పోవడం ఖాయం, మీరు నా మీద జాలిపడొద్దని.. నా పరిస్ధితి ఏంటో చెప్పండి అని అడుగుతుంది కావ్య. ఈరోజు కూడా మళ్లీ టెస్టులన్నీ చేశామని, గర్భసంచిలో ఎటువంటి మార్పు లేదు, ఏ డెవలప్‌మెంట్ లేదని చెబుతుంది. నెల క్రితం నువ్వు ఒప్పుకుని ఉంటే అబార్షన్ చేసే అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. దాంతో కావ్య చాలా మంచి మాట చెప్పారని డాక్టర్‌కి థ్యాంక్స్ చెబుతుంది. అబార్షన్ చేయించి నన్ను కాపాడుకోవాలని నా భర్త ఎన్నో ప్రయత్నాలు చేశాడని... ఆయన్ని చాలా బాధపెట్టానని అంటుంది కావ్య. ఈరోజుకి నాకు అబార్షన్ చేయించాలని, నన్ను కాపాడుకోవాలనే చూస్తున్నారని కానీ మీరు ఆ అవకాశం కూడా లేదని చెప్పారు కాబట్టి ఇక ఏ ప్రయత్నం చేయరు, నా బిడ్డను కనడానికి అడ్డు చెప్పరని అంటుంది కావ్య.
మీరు నాకు ఓ సాయం చేయాలని.. నేను చనిపోతానని మా అత్తారింటి వారు దినదినగండంలా బతుకుతున్నారని చెబుతుంది కావ్య. నేను బిడ్డను కనేవరకు వాళ్లంతా నన్ను జాలిగా చూడటం నాకు నచ్చడం లేదని అంటుంది. ఇకపై నాకు ఏ సమస్య లేదని, నా ప్రాణానికి ఏ ప్రమాదం రాదని, నేను నా బిడ్డ క్షేమంగా ఉన్నామని చెప్పాలని అడుగుతుంది కావ్య. దానికి డాక్టర్ ఒప్పుకోదు.. నా భర్త కోసం నాకు ఈ సాయం చేయమని కావ్య అడగటంతో డాక్టర్ చివరికి సరేనని అంటుంది. ఈ నిజం ఇంట్లో వాళ్లకి చెప్పొద్దని రాజ్‌కి చెబుతుంది కావ్య. బిడ్డకు జన్మనివ్వడం తప్పించి మనకి మరో దారి లేదని, ఆ నిజాన్ని చెప్పి ఇంట్లో అందరినీ ఏడిపించాలా? అని అడుగుతుంది కావ్య.
దీనికి నేనొక ఎగ్జిట్ ప్లాన్ ఆలోచించానని చెబుతుంది కావ్య. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, నేను అబద్ధం చెప్పడం వల్ల ఇంట్లో వాళ్లకి వారసుడు రాబోతున్నాడని, అందరూ ఆనందంగా ఉంటారని అంటుంది కావ్య. మీ అందరి చేతుల మీదుగా సీమంతం చేయించుకుని, ఒక బిడ్డకు ప్రాణం పోసి మీ అందరికీ ఆనందం కావడం కంటే కావాల్సింది ఏం లేదని చెబుతుంది కావ్య. నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదని, నీ జ్ఞాపకాలతో ఎలా బతకగలనని బాధపడతాడు రాజ్. కావ్య గురించి ఆలోచిస్తూ గార్డెన్‌లో బాధపడతాడు రాజ్. భర్తను నవ్వించి గోరుముద్దులు తినిపిస్తుంది కావ్య.
బీరువాలో ఉండాల్సిన నెక్లెస్ కనిపించకపోవడంతో రాహుల్‌పై మండిపడుతుంది స్వప్న. మర్యాదగా నా నెక్లెస్ నాకు తీసుకొచ్చి ఇచ్చేయమంటుంది స్వప్న. అసలు బీరువాలో పెట్టిన సంగతే నాకు తెలియదు, ఇలా ప్రతిసారి నా మీద నిందలు వేస్తే నాకెంత అవమానం అని అడుగుతాడు రాహుల్. 24 గంటల్లో నా నెక్లెస్ నాకు తీసుకొచ్చి ఇవ్వకపోతే నీ తాళిని నీకే కట్టి ఉరేస్తానని వార్నింగ్ ఇస్తుంది స్వప్న. ఉదయాన్నే నిద్రలేచి యోగా చేస్తుంది కావ్య. అది చూసిన రాజ్.. తన భార్యతో కలిసి వేస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Click it and Unblock the Notifications