Brahmamudi October 28th Episode: కావ్య- స్వప్నలకి దొరికిన రాహుల్.. రాజ్‌ని టెంప్ట్ చేస్తోన్న కళావతి
Photo Courtesy: JioHotstar
కావ్య బిడ్డను కంటే ఎలాంటి ప్రమాదం ఉండదని డాక్టర్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. ఇకపై మన ఇల్లు ఆనందానికి కేరాఫ్ అడ్రస్ కావాలని సీతారామయ్య అంటాడు. మీరు నా కోసం ఎంతో చేశారు, ఎన్నో మాటలు పడ్డారని ఇకపై ఆ బాధ లేదని నేను బిడ్డను సంతోషంగా కనొచ్చని అంటుంది కావ్య. నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావని కావ్యని రాజ్ నిలదీస్తాడు. ఆసుపత్రిలో నువ్వు డాక్టర్‌తో చెప్పిన మాటలు నేను విన్నానని రాజ్ చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. ఇన్నాళ్లు అబార్షన్ చేయిస్తే నేను బతుకుతానన్న ఆశ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదని అంటుంది కావ్య. బిడ్డకు ఊపిరి పోసి నేను హ్యాపీగా వెళ్లిపోతానని చెప్పడంతో రాజ్ ఎమోషనల్ అవుతాడు.
నేను బతికున్న కొద్దిరోజులు ఇంట్లో వాళ్లు బాధతో ఉండటం నాకు ఇష్టం లేదని, వాళ్లంతా సంతోషంగా ఉన్నప్పుడు చూస్తూ చనిపోవాలని అంటుంది కావ్య. భార్య ఎక్కువ రోజులు బతకదని తెలిసిన రాజ్.. గార్డెన్‌లో ఒంటరిగా బాధపడుతూ ఉంటాడు. దాంతో కావ్య వెళ్లి భర్తను లాలించి, బుజ్జగించి అన్నం తినిపిస్తుంది. బీరువాలో ఉండాల్సిన తన నెక్లెస్ కనిపించకపోవడంతో స్వప్న షాక్ అవుతుంది. ఇంతలో రాహుల్ రావడంతో నెక్లెస్ గురించి అడుగుతుంది. నాకు తెలియదని, ప్రతి దానికి నన్ను నిందించొద్దని క్లాస్ పీకుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 28వ తేదీ ఎపిసోడ్ 863లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఉదయాన్నే యోగాసనాలు వేస్తున్న కావ్యని చూసి సీరియస్ అవుతాడు రాజ్. నీ ఆరోగ్యం అసలే బాలేదని ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని మండిపడతాడు. ఇంట్లో వాళ్లకి వినిపించేలా, అందరూ మళ్లీ లబోదిబో అనేలా మైక్ పెట్టి చెప్పండని కోప్పడుతుంది కావ్య. నేనేం చెప్పడం లేదు నువ్వే లౌడ్ స్పీకర్‌లా అరుస్తున్నావని అంటాడు రాజ్. కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటివి చేయాలని, అప్పుడు మన బిడ్డ హెల్దీగా పుడతాడని అంటుంది కావ్య. నేను నీ హెల్త్ గురించి మాట్లాడుతుంటే.. నువ్వు కడుపులో ఉన్న గిలక్కాయ్ గురించి మాట్లాడతావేంటీ అని మండిపడతాడు రాజ్. ఈ కావ్య ఏం చేసినా దానికి ఓ కారణం ఉంటుందని చెబుతుంది.
ఇదంతా నీ ఎగ్జిట్ ప్లాన్‌లో భాగమేనా? అని అంటాడు రాజ్. మీరు జీనియస్ అండి.. అలా ఎలా తెలిసిపోయిందని సెటైర్లు వేస్తుంది కావ్య. భార్య ఎగ్జిట్ ప్లాన్‌ని తెలుసుకుని కోఆపరేట్ చేసే భర్తలు ఎంత మంది ఉంటారని అంటుంది కావ్య. ఇంతలో ఇందిర వచ్చి.. నా మనవడు నీకు దండం ఎందుకు పెడుతున్నాడని అడుగుతుంది. ఏదో ఎగ్జిట్ ప్లాన్ అంటున్నారు? ఏంటీ అని ప్రశ్నిస్తుంది ఇందిర. దాంతో భార్యాభర్తలిద్దరూ ఏం చెప్పాలో తెలియక షాక్ అవుతారు. చాదస్తం అనేది నడుం వంగినప్పుడు వస్తే తప్పు లేదు.. కానీ ఆ లోపే వస్తే చాలా నష్టమని కోపంగా వెళ్లిపోతాడు రాజ్. మీ మనవడు చెప్పింది ఏమైనా అర్ధమైందా? అని కావ్య మెల్లగా జారుకుంటుంది.
అప్పూను వెనుక నుంచి పట్టుకుంటాడు కళ్యాణ్. పొద్దున్నే మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నావ్? ఈరోజు ఎవరో ప్రొడ్యూసర్‌ని కలవాలని చెప్పావు కదా అని అడుగుతుంది అప్పూ. వదినకు డెలివరీ అయ్యే వరకు అన్నయ్య ఇంట్లోనే ఉంటూ తనని చూసుకుంటానని చెప్పాడు కదా? ఈ కళ్యాణ్ కూడా అన్నయ్య అడుగుజాడల్లో నడుస్తాడని చెబుతాడు. అన్ని నెలలు నువ్వు నాతో పాటు కూర్చొన్నావంటే నీ ప్రొడ్యూసర్లు వెరే రైటర్‌ని చూసుకుంటారని చెబుతుంది అప్పూ. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందని ఏ టెన్షన్లు లేవు, దేనికీ భయపడాల్సిన అవసరం లేదని అంటాడు కళ్యాణ్. నిన్నటి వరకు అక్క ఆపరేషన్‌కి ఒప్పుకోకపోతే తనను ఎలా కాపాడుకోవాలా? అని అందరం చాలా కంగారుపడ్డామని .. కానీ ఆ దేవుడు ఏదో వరం ఇచ్చినట్లు సమస్యలన్నీ తీరిపోయానని అంటుంది అప్పూ.
దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటూ ఉండగా.. ప్రకాశం వచ్చి ఆఫీస్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయని సుభాష్‌తో చెబుతాడు. ఒక్కడినే ఎన్ని కాల్స్ అని చూసుకోను అని అడుగుతాడు ప్రకాశం. నీకున్న పనులు, ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి కదా? అని సుభాష్ ప్రశ్నిస్తాడు. ఆఫీస్‌లో చాలా పనులు పెండింగ్‌లో పడిపోయాయని, బాబాయ్ వల్ల కావడం లేదని చెబుతాడు. నువ్వు వెంటనే ఆఫీస్‌కి వెళ్లి ఆఫీస్ పనులు చూసుకోవాలని అంటాడు సుభాష్. ఇన్ని రోజులు నువ్వు ఉన్నా లేకపోయినా అన్ని పనులు మేమే చూసుకున్నామని, ఇక మా వల్ల కావడం లేదని చెబుతాడు ప్రకాశం. పాతికేళ్లుగా మీ నాన్న బాబాయ్‌లు ఆఫీస్‌కే అంకితం అయిపోయారని ఇకనైనా వాళ్లకి రెస్ట్ ఇవ్వాలి కదా అని అంటుంది అపర్ణ.
ఇంకొన్ని రోజులు నేను ఆఫీస్‌కి వెళ్లడం కుదరదని రాజ్ తేల్చేస్తాడు. కళావతి డెలవరీ అయ్యేదాకా నేను ఎక్కడికీ వెళ్లాలని అనుకోవడం లేదు, నేను తనకి తోడుగా ఉండాలని అనుకుంటున్నాని చెబుతాడు రాజ్. నేను బాగానే ఉన్నాను, నన్ను నేను చూసుకోగలనని చెబుతుంది కావ్య. కావ్యని చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా.. నీ పెళ్లాన్ని నీకంటే బాగా చూసుకుంటామని అంటుంది ఇందిర. ఆఫీసు, మీటింగ్ అని మావయ్య, చిన్న మావయ్యలు పరుగులు తీయలేరని వాళ్లను అంత ఇబ్బండి పెడుతూ మీరు ఇంట్లో ఉండి ఏం చేస్తారని అడుగుతుంది కావ్య. మొగుడిని కొంగున కట్టేసుకున్నానని నాకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని... మావయ్య వాళ్లకి పనిభారం తగ్గించడం మీ బాధ్యత అని చెబుతుంది కావ్య. ఇది కూడా నీ ఎగ్జిట్ ప్లాన్‌లో భాగమేనా అని నోరు జారతాడు రాజ్. దాంతో ఎలాగోలా రాజ్‌ని ఒప్పించి ఆఫీస్‌కి పంపించడంతో అంతా సంతోషిస్తారు.
తన గర్ల్ ఫ్రెండ్ కుయిలీతో కలిసి కుల్పీలు తింటాడు రాహుల్. ఫైవ్ స్టార్ హోటల్‌కి తీసుకెళ్తాడని అనుకుంటే నేను రోజు తినే స్ట్రీట్ ఫుడ్ తినిపిస్తాడేంటీ అని రగిలిపోతుంది కుయిలీ. వాళ్లిద్దరినీ కావ్య, స్వప్నలు చూస్తారు. రాహుల్ ఇంకా మారలేదని పెళ్లయి, ఒక పాప పుట్టిన తర్వాత కూడా ఇలాంటి తిరుగుళ్లు తిరుగుతున్నాడని మండిపడుతుంది కావ్య. దాన్ని నాలుగు పీకితే రాహుల్‌ని వదిలి వెళ్లిపోతుందని అంటుంది. ఇప్పుడు వెళ్లి వాడితో గొడవ పెట్టుకోవడం వల్ల మన పరువే పోతుందని స్వప్న అంటుంది. అలా చూస్తూ ఊరుకోవద్దని నేనే వెళ్లి నాలుగు పీకుతానని కావ్య వెళ్తుండగా స్వప్న ఆపి ఇంట్లో తేల్చుకుందామని చెబుతుంది. నా ఫ్రెండ్‌కి పార్టీ ఇస్తానని మాట ఇచ్చావు కదా టికెట్స్ బుక్ చేయమని కుయిలీ చెప్పడంతో రాహుల్ షాక్ అవుతాడు. దారిలో షాపింగ్ ఉందని అనడంతో రాహుల్ ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాడు.
అపర్ణ, ఇందిరలు మాట్లాడుకుంటూ ఉండగా.. కావ్య అందంగా ముస్తాబై కనిపిస్తుంది. మరీ అంతలా తిప్పుతున్నావ్.. నడుం ఊడిపోతుందని అంటుంది ఇందిర. నాకు ఉంది నేను తిప్పుతున్నాను, మీకు లేదు మీరు తిప్పలేరని కౌంటర్ వేస్తుంది కావ్య. ఈరోజు నువ్వు రెడీ అయి గదిలోకి రావాల్సిందేనని ఆర్డర్ వేశాడని చెబుతుంది. వాడు అంత తట్టుకోలేకపోతున్నాడా అని ఇందిర అడుగుతుంది. అది కాబట్టి నా కొడుకుని భరిస్తుంది కానీ ఇంకో ఆడపిల్ల అయితే ఎప్పుడో పారిపోయేదని అంటుంది అపర్ణ. ఇంతలో రాజ్ రావడంతో మనవడిని పిలిచిన ఇందిర... ఇన్నాళ్లు ఆగావ్, ఇంకొన్నాళ్లు ఆగలేవా? అని మండిపడుతుంది. అది కడుపుతో ఉన్నావ్.. అంత ఆకలి మంచిది కాదని చెబుతుంది. రాజ్‌కి ఏం అర్ధం కాక వెళ్లిపోతాడు. లోపలికి వెళ్లేసరికి కావ్య అందంగా రెడీ అయి, పాల గ్లాస్‌తో కనిపించడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










