Brahmamudi October 29th Episode: స్వప్నకి రాహుల్ విడాకులు.. రాహుల్‌కి బుద్ధి చెప్పనున్న కావ్య
Photo Courtesy: JioHotstar
ఉదయాన్నే యోగాసనాలు వేస్తోన్న కావ్యపై మండిపడతాడు రాజ్. నీకున్న ప్రాబ్లమ్ గురించి తెలిసి కూడా ఈ పిచ్చి పనులేంటీ? అంటూ క్లాస్ తీసుకుంటాడు. అప్పూని వెనుక నుంచి పట్టుకున్న కళ్యాణ్.. ఇకపై ఏ టెన్షన్‌లు లేవని మనం హ్యాపీగా ఉండొచ్చని అంటాడు. ఆఫీస్‌కు వెళ్లడం ఇబ్బందిగా ఉందని, ఇకపై మా వల్ల కాదని సుభాష్, ప్రకాశంలు రాజ్‌కి చెబుతారు. దాంతో కావ్యకి డెలివరీ అయ్యే వరకు ఇంటి దగ్గరే ఉంటానని చెబుతాడు. అయితే రాజ్‌ని కావ్య మార్చి భర్త తిరిగి ఆఫీస్‌కి వెళ్లేలా చేస్తుంది.
తన గర్ల్ ఫ్రెండ్ కుయిలీతో కలిసి కుల్పీలు తింటున్న రాహుల్‌ని స్వప్న- కావ్యలు చూస్తారు. వెళ్లి దానికి నాలుగు తగిలించి రాహుల్‌ను తీసుకొచ్చేయమని స్వప్నకి చెబుతుంది కావ్య. ఇంటికొచ్చాక వాడి సంగతి చెబుతానని అంటుంది స్వప్న. ఇందిర, అపర్ణలు మాట్లాడుకుంటూ ఉండగా.. కావ్య అందంగా రెడీ అయి తిప్పుకుంటూ తిరుగుతుంది. మీ మనవడు అస్సలు ఆగలేకపోతున్నాడని సిగ్గు పడుతుంది కావ్య. దాంతో ఇందర రాజ్‌కి తీసుకుని.. కొద్దిరోజులు నీ ఆకలి తగ్గించుకోవాలని చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 29వ తేదీ ఎపిసోడ్ 864లో ఇంకా ఏం జరిగిందంటే? ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 29వ తేదీ ఎపిసోడ్ 864లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
అందంగా రెడీ అయి పాల గ్లాసుతో నిలబడ్డ కావ్యని చూసి రాజ్ షాక్ అవుతాడు. నువ్వు ఆకలికి తట్టుకో, భోజనం మానేయమని అంటే నానమ్మ చెబితే అర్ధం కాలేదు.. గదిలోకి వచ్చి చూశాక క్లారిటీ వచ్చిందని అనుకుంటాడు రాజ్. అసలు నీకు ఈ ఐడియా ఎందుకొచ్చింది... నువ్విలా రెడీ అయి గదిలోకి వస్తే బయట వాళ్లు ఏమనుకుంటారని నిలదీస్తాడు రాజ్. మనం భార్యాభర్తలం ఏదో ముచ్చట పడ్డామని అనుకుంటారని చెబుతుంది కావ్య. రాజ్ గాడికి సిగ్గు లేదు, కళావతికి బుద్ది లేదని అనుకుంటారని అంటాడు రాజ్. నేను బతికున్నన్ని రోజులూ, నేను ప్రేమించే శ్రీవారితో కలిసి హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నానని అంటుంది కావ్య. శ్రీమతి మాట కాదంటే కళ్లు పోతాయని చెబుతుంది.
నేను నా బిడ్డకు జన్మనిచ్చి ఎగ్జిట్ అయ్యే దాకా.. కాలం ఇలాగే ఆనందంగా గడిచిపోతే చాలని అనిపిస్తుందని అంటుంది కావ్య. కానీ ఆ అవకాశం లేదని చెబుతుంది. ఎగ్జిట్ ప్లాన్ అనే పేరు పెట్టి దాంతో నన్ను టార్చర్ పెట్టడం లేదా? అని మండిపడతాడు రాజ్. అసలు టార్చర్ అంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తానని రాజ్‌ని మంచం మీద పడేస్తుంది కావ్య. మరోవైపు.. రాహుల్‌కు కుయిలీ ఫోన్ చేస్తుంది. నా పెళ్లానికి ఎప్పుడెప్పుడు విడాకులిచ్చి.. ఎప్పుడెప్పుడు నీ ఒడిలో వాలిపోదామా? అనిపిస్తోందని అంటాడు రాహుల్. నాకు కూడా ఎప్పుడెప్పుడు నీతో తాళి కట్టించుకుని లైఫ్ స్టార్ట్ చేద్దామా? అని ఉందని అంటుంది కుయిలీ. నువ్విచ్చిన గడువు, చనువు ఏది మరిచిపోలేదని చెబుతాడు రాహుల్. మనకి టైం లేదని నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, నేను చెప్పిన టైంలో మన పెళ్లి జరిగిపోవాలని అంటుంది కుయిలీ. దానికి రాహుల్ ఓకే అంటూ గదిలోకి వచ్చిన స్వప్నని చూసి షాక్ అవుతాడు.
ఎన్నాళ్ల నుంచి జరుగుతుంది ఈ బాగోతం.. ఆ బజారు దాని మెడలో నువ్వు కొట్టేసిన నా నెక్లెస్ కూడా చూశానని అంటుంది స్వప్న. నీ నెక్లెస్ లాంటి నెక్లెస్ ఒక్కటే ఉంటుందా? ఎవ్వరికీ ఉండదా? అని మండిపడతాడు రాహుల్. మనిషి అన్నాక మార్పు సహజమని సర్దుకున్నాను, నువ్వు ఎన్ని అడ్డమైన తిరుగుళ్లు తిరిగినా ఓర్చుకున్నాను... కానీ నువ్వు మారలేదు, ఇంకా మారవని కూడా అర్ధమైందని అంటుంది స్వప్న. నీకు ఏం హక్కు ఉందని అంత ధైర్యంగా నా నెక్లెస్ తీసుకెళ్లి బజారు దానికి ఇస్తావ్ అని నిలదీస్తుంది. అది బజారుది కాదు.. 5 నిమిషాల్లో హైటెక్ సిటీని కొనేయగలదని, అంత రిచ్.. కోట్లకు కోట్లు డబ్బుంది దాని దగ్గర నీ దగ్గర ఏముందని నిలదీస్తాడు రాహుల్.
నువ్వు ఏం చేసినా నా రూట్ మారదని... దానితో ఉంటే కోట్ల ఆస్తి కలిసొస్తుందని అంటాడు రాహుల్. నీతో ఉంటే నీరసం వస్తుందని, ఈ ఇంట్లో ఇక అవమానాలు పడలేనని అందుకే దానితోనే ఉంటా? దానితోనే తిరుగుతానని తేల్చేస్తాడు. నమ్మించి నా జీవితాన్ని నాశనం చేస్తానంటే చూస్తూ ఊరుకుంటానని అనుకుంటున్నావా? అని స్వప్న రగిలిపోతుంది. ఇన్ని రోజులు పేరుకు డబ్బున్న కుటుంబంలో బతుకుతున్నాను.. అన్నింటికి చేతులు చాచాల్సి వచ్చిందని, ఇకపై అలా కుదరదని అంటాడు రాహుల్. నోట్ల కట్టల గూటికి చేరాను.. దాంతోనే కాపురం, దాంతోనే జీవితమని నీ ఇష్టమొచ్చినట్లు చేసుకోమని చెప్పి వెళ్లిపోతాడు రాహుల్.
యోగా వేసుకోవడానికి కష్టపడుతున్నావని.. నీకోసం జాగింగ్ డ్రెస్ తీసుకొచ్చానని చెబుతాడు రాజ్. ఆ ఫ్యాంట్ షర్ట్ నేను వేసుకోవడం కుదరదని తేల్చేస్తుంది కావ్య. అయితే యోగా మానేయమని రాజ్ అంటాడు. యోగా మానేస్తే కడుపులోని బిడ్డ హెల్దీగా ఎలా ఉంటుందని అడుగుతాడు రాజ్. ఈ డ్రెస్ వేసుకోకుండా ఎక్సర్‌సైజ్ చేస్తే నీకు ఇబ్బందిగా ఉంటుందని చెబుతాడు. నీకు నీ బిడ్డ ముఖ్యం.. నాకు నువ్వు ముఖ్యమని అంటాడు రాజ్. భర్త బలవంతం చేయడంతో తప్పక జాగింగ్ డ్రెస్ వేసుకుంటుంది కావ్య. ఉదయాన్నే అపర్ణ, ఇందిరలు మాట్లాడుకుంటూ ఉండగా.. కావ్యని జాగింగ్ డ్రెస్‌లో చూసి షాక్ అవుతారు. వద్దు వద్దు అంటున్నా మీ అబ్బాయి పట్టుబట్టి మరీ ఈ డ్రెస్ వేయించారని చెబుతుంది కావ్య. నా కోడలు కొత్తగా ఉంది.. ఇదే కంటిన్యూ చేయమని అంటుంది అపర్ణ. చీరలో యోగా చేస్తే ఏం బాగుంటుంది.. ఈ డ్రెస్ అయితే నీకు కంఫర్ట్‌గా ఉంటుందని అంటుంది అపర్ణ.
ఈ డ్రెస్ నీకు చాలా బాగుందని అప్పూ కూడా మెచ్చుకుంటుంది. ముందు భార్యను ఎలా చూసుకోవాలో భార్యను చూసి నేర్చుకోమని చెబుతుంది. ఇన్నాళ్లు బెడ్ రూంలో ఈవిడ గారిని ప్యాంట్, షర్ట్‌లోనే చూడాల్సి వచ్చింది.. చీరలో చూసే అదృష్టం వచ్చేసరికి అమ్మగారికి కడుపు వచ్చిందని అంటాడు కళ్యాణ్. తన చెల్లెళ్లు వారి భర్తలతో సంతోషంగా ఉండటం చూసిన స్వప్న బాధపడుతుంది. ఇలాంటి సమయంలో నా బాధను నా చెల్లెళ్లకు చెప్పి ఇబ్బంది పెట్టలేనని అనుకుంటుంది. యోగా చేస్తోన్న అప్పూ, కావ్యలకి రాజ్, కళ్యాణ్‌లు బలవంతంగా జ్యూస్ తాగిస్తారు.
ఒంటరిగా బాధపడుతున్న స్వప్నని కావ్య చూసి ఏం జరిగిందని అడుగుతుంది. ఏం లేదని స్వప్న చెప్పగా.. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో చిన్నప్పటి నుంచి చూస్తున్నానని అంటుంది కావ్య. రాహుల్‌తో ఏమైనా గొడవపడ్డావా అని అడుగుతుంది. ఒకప్పుడు రాహుల్ జులాయిగా తిరిగేవాడని, నేను తిట్టగానే మళ్లీ దారిలోకి వచ్చేవాడు. కానీ ఇప్పుడు మొండిగా ప్రవర్తిస్తున్నాడని.. ఆ అమ్మాయితో నా ఇష్టం నేను తిరుగుతానని అంటుంది. నాకు తనతోనే ఉంటే సంతోషంగా ఉంటుందని, నువ్వు నచ్చడం లేదని అంటున్నాడని చెబుతుంది స్వప్న. ఇప్పుడిప్పుడే గొడవలన్నీ సర్దుకుని అందరం సంతోషంగా ఉంటున్నారని.. మళ్లీ నా వల్ల అది దూరమవుతుందని బాధగా ఉందని అంటుంది కావ్య.
నేను చేసిన తప్పుకి ఆ దేవుడు వేసిన శిక్ష. ఎప్పుడైతే రాహుల్‌ని నమ్మి పెళ్లి పీటల నుంచి వెళ్లిపోయానో మీ అందరినీ చాలా బాధపెట్టాను. ఆ క్షణం అమ్మానాన్నల పరువు గురించి కానీ, నా వెనుక ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు, వారి జీవితం ఏమవుతుందని గానీ నేను ఆలోచించలేదని బాధపడుతుంది స్వప్న. అందుకే ఆ దేవుడు ఇలాంటి వాడిని నాకు భర్తగా చేశాడని అంటుంది. నేను చేసిన తప్పుకి నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టి ఎన్నో అవమానాలు పడ్డావు, నువ్వు పడిన కష్టాలకీ, కార్చిన కన్నీళ్లకు ఆ దేవుడు లెక్కకట్టి నాకు తిరిగి ఇచ్చేస్తున్నాడని అంటుంది స్వప్న. మన జీవితంలోకి ఎవరొస్తారో ముందే నిర్ణయించబడి ఉంటుందని చెబుతుంది కావ్య. ఇంత మంచి కుటుంబం, అలాంటి భర్త నాకు దొరికాడంటే నీ వల్లేనని అంటుంది. నేను రాహుల్‌తో మాట్లాడతానని కావ్య అంటుంది. నేనే ఒకసారి రాహుల్‌తో మాట్లాడతానని స్వప్న వెళ్లిపోతుంది. టిఫిన్ తినకుండా బాధపడుతున్న కావ్యని ఏం జరిగిందని అడుగుతాడు రాజ్. ఆ రాహుల్ వల్లే ప్రాబ్లమని చెబుతుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










