Brahmamudi October 2nd Episode: కావ్యకి దొరికిపోయిన కళ్యాణ్.. రాజ్ భవిష్యత్తు తమ్ముడి చేతుల్లో

Photo Courtesy: JioHotstar

రాజ్ జ్యూస్ గ్లాస్ మార్చిన విషయాన్ని పసిగట్టిన కావ్య.. అందులో ఏం కలిపారో తెలుసుకోవడానికి ల్యాబ్‌లో టెస్ట్ చేయిస్తుంది. జ్యూస్‌లో అబార్షన్ టాబ్లెట్స్ కలిపారని ల్యాబ్ టెక్నీషియన్ చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. అబార్షన్ టాబ్లెట్స్ కలిపినా తనకు గ్లాస్ ఎందుకు ఇవ్వలేదని కావ్య ఆలోచించి డాక్టర్ దగ్గరే అసలు నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది. రాజ్ ఉంటే తనను ఆసుపత్రికి వెళ్లనివ్వడని గ్రహించిన కావ్య.. ఇందిర ద్వారా తన భర్తను ఊరికి దూరంగా ఉన్న ఫాంహౌస్ వద్దకు పంపుతుంది.

ఉదయాన్నే కావ్య ఆసుపత్రికి బయల్దేరిన విషయం తెలుసుకున్న కళ్యాణ్.. వెంటనే ఈ విషయాన్ని రాజ్‌కి చెబుతాడు. దాంతో షాకైన రాజ్.. వెంటనే ఆసుపత్రికి బయల్దేరతాడు. కావ్యకి అబార్షన్ గురించి చెప్పొద్దని డాక్టర్‌ను రిక్వెస్ట్ చేసినా రాజ్ మాటలను కావ్య పట్టించుకోదు. ఇంతలో హాస్పిటల్‌లో పనిచేసే నర్స్.. రాజ్‌కి ఫోన్ చేసి కావ్య మేడం వచ్చిన విషయం చెబుతుంది. దాంతో కావ్యను డాక్టర్‌తో కలవకుండా ఆపమని రాజ్ అడుగుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. అక్టోబర్ 2వ తేదీ ఎపిసోడ్ 841లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial October 2nd 2025 Episode 841 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కావ్యని ఆపి ఓ చోట కూర్చోబెడుతుంది నర్స్. ఇంతలో ఆమెకు డాక్టర్ ఫోన్ చేసి కావ్య అనే పేషెంట్ వచ్చారా అని పిలిచి అడుగుతుంది. వచ్చారని కానీ వేరే పేషెంట్స్ కూడా వచ్చారని చెబుతుంది నర్స్. అందరినీ ఒకేసారి నేను చూడలేను కదా? ముందు కావ్య గారిని పంపించమని అంటుంది డాక్టర్. కుదరదు మేడం కావ్య గారిని లోపలికి పంపించలేనని ఆవిడ వాష్ రూమ్‌కి వెళ్లారని అంటుంది. వేరే పేషెంట్స్‌ని ముందు పంపించమని చెబుతుంది డాక్టర్. నువ్వేందుకు అంతలా టెన్షన్ పడుతున్నావ్.. చెమటలు పడుతున్నాయని అడుగుతుంది డాక్టర్.

బయటికి వెళ్లి వేరే పేషెంట్స్‌ని నర్స్ లోపలికి పంపిస్తుంది నర్స్. కావ్య దగ్గరికి వెళ్లి మీరు ఏసీ గదిలో కూర్చోండి.. మీరు మా మేడం ఫ్రెండ్ కదా అని అంటుంది నర్స్. నేను ఇక్కడే కూర్చొంటానని చెబుతుంది కావ్య. నా పేరు మీకు ఎలా తెలుసని కావ్య అడగ్గా.. అప్లికేషన్‌లో మీ పేరు చూశానని చెబుతుంది. కావ్య గారిని అతి కష్టం మీద ఆపానని అంటుంది నర్స్. మీ వైఫ్‌ని ఆపడం నా వల్ల కావడం లేదు.. ఎక్కడ ఉన్నారని రాజ్ అడగ్గా పటాన్ చెరులో ఉన్నానని చెబుతాడు రాజ్. మీ డాక్టర్ అత్తగారి ఇల్లు ఈ పటాన్ చెరు ఏరియాలోనే ఉందా అని రాజ్ అడగ్గా.. నర్స్ అవును అని ఆన్సర్ ఇస్తుంది.

మీ మేడం అత్తగారి ఇంటి అడ్రస్ పెట్టమని నర్స్‌ని అడుగుతాడు రాజ్. డాక్టర్ నేను చెబితే వినలేదు, వాళ్ల అత్తగారు చెబితే వినరా? అని రాజ్ కొత్త ప్లాన్ వేస్తాడు. ఆసుపత్రిలో పేషెంట్స్ ఎంతో మంది వస్తుంటారు, వెళ్తుంటారు అది చూసిన కావ్య.. నర్స్ మీద మండిపడుతుంది. నా కంటే ఆలస్యంగా వచ్చిన వారిని ముందు పంపిస్తున్నారు అని ఫైర్ అవుతుంది. నేను కూడా డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నాను, డబ్బులు కూడా ఇస్తున్నానని నర్స్‌తో గొడవకు దిగుతుంది. నేను కావాలని మిమ్మల్ని ఆపినట్లుగా మాట్లాడుతున్నారని.. వాళ్లు మీకంటే ముందే అపాయింట్‌మెంట్ తీసుకున్నారని, ఏదో ఫోన్ వచ్చి బయటికి వెళ్లారని చెబుతుంది నర్స్. మాకు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదని తేల్చి చెబుతుంది నర్స్.

ఇంతలో రాజ్ నేరుగా డాక్టర్ గారి అత్తగారింటికి వెళ్లి తలుపు తీస్తాడు. దాంతో డాక్టర్ అత్తగారు.. ఎవడ్రా నువ్వు, ఇంట్లో నేనుండగా, నా పర్మిషన్ల లేకుండా తలుపులు బద్ధలు కొట్టుకొచ్చావ్ అని మండిపడుతుంది. నాకు మీరే కావాలి, మీరు లేకపోతే నేను లేనని కబుర్లు చెబుతాడు రాజ్. నువ్వు ఎందుకు వచ్చావో చెప్పకపోతే అప్పడాల కర్రతో నీ తల బద్ధలు అవుతుందని వార్నింగ్ ఇస్తుంది డాక్టర్ అత్తగారు. ఈ డేరింగ్ అండ్ డాషంగ్ గురించి అందరికీ చెబితే ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అంటాడు. నేనెంతో డేరింగ్ పర్సన్‌ అనేది చనిపోయిన మా ఆయన్ని అడిగితే తెలుస్తుందని చెబుతుంది డాక్టర్ అత్తగారు.

మీరెంత ఫైర్ బ్రాండ్ అనేది మన కాలనీలో అందరికీ తెలియాలి? కోడలి పేరెత్తితే వణికిపోయి పేలని బాంబు అంట అని ఉన్నవి లేనివి చెబుతాడు. మీ కోడలి పర్మిషన్ లేకుండా అడుగు కూడా బయట పెట్టలేరట, ఆవిడ డబ్బులు ఇవ్వనిదే మీరు జంతికలు కూడా కొనుక్కోలేరట అంటాడు. అయితే ఒక్కొక్కడి తాట తీస్తానని చెబుతుంది డాక్టర్ అత్త. దానికి మీరు అంతగా టెన్షన్ పడొద్దని నా దగ్గర ఓ ఐడియా ఉందని చెబుతాడు రాజ్. నేను దొంగనని మిమ్మల్ని కట్టేసి ఇంట్లో వస్తువుల్ని దోచుకోవడానికి వచ్చానని మీ కోడలికి ఫోన్ చేయమని చెబుతాడు. మీరు ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వస్తే మీకు మీ కోడలు భయపడుతున్నట్లు అని అంటాడు రాజ్. ఐడియా బాగుందని రాజ్‌తో కట్లు కట్టించుకున్న అత్తగారు వెంటనే కోడలికి ఫోన్ చేస్తారు.

ఇంతలో కావ్యని లోపలికి పంపమని నర్స్‌కు చెబుతుంది డాక్టర్. ఇక చేసేది లేక కావ్యని లోపలికి పంపిస్తుంది నర్స్. ఆ రోజు మా ఆయన చేసిన పనికి నేను సారీ చెబుతున్నానని అంటుంది కావ్య. అసలు మా ఆయన అబార్షన్ ఎందుకు చేయించాలని నిర్ణయం తీసుకున్నారని అడుగుతుంది. మీరే నాకు నిజం చెప్పాలని డాక్టర్‌ను రిక్వెస్ట్ చేస్తుంది కావ్య. డాక్టర్ నిజం చెప్పబోతుండగా ఆవిడ అత్తగారి నుంచి ఫోన్ వస్తుంది. నువ్వు త్వరగా రాకపోతే ఈ దొంగ నన్ను చంపేస్తాడని అంటుంది. దాంతో డాక్టర్ కంగారుగా ఇంటికి బయల్దేరుతుంది. ఇంటికి వచ్చేసరికి అత్తగారితో రాజ్ ఉండటం చూసి షాక్ అవుతుంది డాక్టర్.

ఇతను మిమ్మల్ని పిచ్చిదానిని చేసి తన అవసరానికి వాడుకున్నాడని చెబుతుంది డాక్టర్. నేను చేసింది తప్పే అయినా నా భార్య కోసమే ఇలా చేశానని, మిమ్మల్ని ఆపడానికి నాకు వేరే దారి కనిపించలేదని అంటాడు రాజ్. మరింత ఆలస్యం చేస్తే కావ్య ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ మండిపడుతుంది. నీరసంగా ఇంటికొచ్చిన కావ్య మన ప్లాన్ వర్కవుట్ కాలేదని ఇందిరకు చెబుతుంది. ఎప్పటికైనా నిజం దానంతట అదే తెలుస్తుంది. ఇంతలో కళ్యాణ్ తైలం తీసుకుని వస్తాడు. నేను మీ అన్నయ్యకి చెబితే నువ్వెందుకు తీసుకొచ్చావని కళ్యాణ్‌ని ప్రశ్నిస్తుంది.

అన్నయ్యకి ఏదో అర్జెంట్ పని ఉండటంతో నన్ను తీసుకురమ్మని చెప్పాడని ఎవరు తీసుకొస్తే ఏంటీ అని అంటాడు. వదిన మీరు అంత డల్‌గా ఉన్నారు, డాక్టర్ గారిని కలవలేదు కదా అని అడుగుతాడు కళ్యాణ్. ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది. నేను హాస్పిటల్‌కి వెళ్లిన విషయం మీకెలా తెలుసు అని ప్రశ్నించడంతో కళ్యాణ్ ఉలిక్కిపడతాడు. స్వప్న చెప్పిందని తప్పించుకుంటాడు. నేను ఆసుపత్రికి వెళ్లిన విషయం స్వప్న అక్క చెప్పింది ఓకే.. కానీ నేను డాక్టర్‌ను కలవలేదన్న విషయం ఎలా తెలుసని అడుగుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X