Brahmamudi October 30th Episode: సుడిగుండంలో స్పప్న కాపురం... రంగంలోకి రాజ్ - కావ్య

Photo Courtesy: JioHotstar

అందంగా రెడీ అయి వచ్చిన కావ్యని చూసి రాజ్ షాక్ అవుతాడు. నువ్వు ప్రెగ్నెంట్‌వి.. ఇలాంటి పనులు చేయొద్దని వార్నింగ్ ఇస్తాడు రాజ్. నేను ఎగ్జిట్ అయ్యే లోపు ప్రతిక్షణం ఆనందంగా ఉండాలని చెబుతుంది కావ్య. రాహుల్‌కు కుయిలీ ఫోన్ చేసి త్వరగా మనం పెళ్లి చేసుకోవాలని అంటుంది.. ఇంతలో వీరిద్దరి మాటలను విన్న స్వప్న షాక్ అవుతుంది. ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావని ప్రశ్నిస్తుంది. నేను ఇచ్చిన నెక్లెస్ కూడా ఆ బజారు దానికి ఇచ్చావా? అని మండిపడుతుంది స్వప్న. అది బజారుది కాదు.. కోటీశ్వరురాలని, ఇకపై నా జీవితం తనతోనే అని చెబుతాడు రాహుల్.

యోగా చేసుకోవడానికి కష్టపడుతున్న కావ్య కోసం రాజ్ జాగింగ్ డ్రెస్ తీసుకుని వస్తాడు. కావ్య వద్దు అంటున్నా వినిపించుకోకుండా బలవంతంగా వేసుకోమని చెబుతాడు. కళావతిని ఆ డ్రెస్‌లో చూసిన అపర్ణ, ఇందిర, అప్పూలు షాక్ అవుతూ.. ప్యాంట్, షర్ట్‌‌లో బాగున్నావని చెబుతారు. తన చెల్లెళ్లు ఎంతో సంతోషంగా ఉంటే తన జీవితం మాత్రం ఇలా ఉందని స్వప్న బాధపడుతుంది. ఒంటరిటా ఏడుస్తున్న స్వప్న దగ్గరికి కావ్య వచ్చి ఏం జరిగిందని అడగ్గా.. ఆమె మొత్తం చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 30వ తేదీ ఎపిసోడ్ 865లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial October 30th 2025 Episode 865 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాహుల్ ఈ మధ్య మారిపోయాడు, అందరితో బాగానే ఉంటున్నాడని స్వప్న చెప్పింది కదా అని కావ్యని అడుగుతాడు రాజ్. ఎవరినో తగులుకుని దాని వెంటే తిరుగుతూ అక్కని బాధపెడుతున్నాడని చెబుతుంది కావ్య. స్వప్న మాత్రం ఎందుకు ఊరుకుంటుంది.. నాలుగు తగిలించి దారిలో పెట్టేస్తుంది కదా అని అంటాడు రాజ్. ఒకప్పుడు అలాగే చేసేదని, పాప పుట్టాక ఏం చేయాలన్నా ఆలోచిస్తోందని అంటుంది కావ్య. తనతోనే ఉంటాను, తనతోనే తిరుగుతాను.. ఎక్కువ మాట్లాడితే ఇంటికి కూడా రాను అంటున్నాడని.. ఆ రుద్రాణి గారు ఎలాగూ తనకి బుద్ధి చెప్పరని మండిపడుతుంది కావ్య. మా అక్క అలా బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేనని అంటుంది. నువ్వేం టెన్షన్ పడొద్దు.. రాహుల్‌తో నేనే మాట్లాడతానని అంటాడు రాజ్. ఈసారి ఇలాంటి చెత్త పనులు చేస్తే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇవ్వమని చెబుతుంది కావ్య.

స్వప్న బాధపడుతుండగా రాహుల్ వచ్చి... శ్రీమతిగారు రాబోయే కష్టం ముందే కనిపెట్టారా? అని ప్రశ్నిస్తాడు. కట్టుకున్నోడి ఒంట్లో కొవ్వు వస్తే భరించే భార్య కళ్లలో బాధే కనిపిస్తుందని అంటుంది స్వప్న. ఆ కొవ్వుకు నువ్వు సరిపోవడం లేదని అంటాడు స్వప్న. నిన్నటి స్వప్ననే అయితే నీ చిత్తకార్తె బుద్ధికి సరైన గడ్డి పెట్టేదానిని అంటుంది. కథల్లో కానీ సినిమాలలో కానీ పాతివ్రతలు భర్త ఆనందం కోసం ఎంతో చేసేవారని అంటాడు రాహుల్. ఆ రోజు నిన్ను నమ్మి, నీతో రావడం నేను చేసిన తప్పు.. నువ్వు ఇలాంటి పిచ్చి వేషాలు వేసినా నీ చెంప పగలగొట్టకపోవడం నేను చేసిన తప్పేనని అంటుంది స్వప్న. ఈ తప్పులన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి, మనిద్దరి మధ్య తెరదించేద్దామని అంటాడు రాహుల్. ఇకపై మనం కలిసుండటం జరగదని విడాకుల పత్రాలు చేతిలో పెడతాడు. దాంతో స్వప్న షాక్ అవుతుంది.

ఈ డివోర్స్ పేపర్స్ మీద ఒక్క ఆటోగ్రాఫ్ ఇచ్చావంటే నీకు నాకు కచ్చి అంటాడు రాహుల్. నాకు అమాంతం రెక్కలొచ్చి నా కొయిలీ దగ్గరికి వెళ్లిపోతానని చెబుతాడు. ఆ మాటలు విన్న స్వప్న నీ పళ్లు రాలగొడతానని అంటుంది. నీకు విడాకులు ఇవ్వాలని నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాను, నా ఆశని, నా కలని చెరిపేయకు అని చెబుతాడు రాహుల్. నీకు విడాకులు కాదు కాదా.. ఈ పత్రాలు పట్టుకుని బయటికి కూడా వెళ్లనివ్వనని అంటుంది స్వప్న. అసలు నువ్వెవరు నన్ను బయటకు వెళ్లనివ్వకుండా ఆపడానికి అని ప్రశ్నిస్తాడు రాహుల్. మొగుడు విడాకులు ఇస్తానంటే ఎగిరి గంతేసి సంతకం పెట్టాలి కానీ ఇలా కుదరదు అనకూడదు అంటాడు.

నిన్నటి స్వప్ననే అయితే ఈపాటికి సంతకం పెట్టి పేపర్స్ నీ ముఖాన కొట్టేదానిని అంటుంది స్వప్న. నీకు, నాకు మధ్యలో పాప ఉందని, అందుకే సంతకం పెట్టడానికి ఆలోచిస్తున్నానని అంటుంది. నా బిడ్డకు ఏంటీ? ఆస్తి ఉంది.. అంతస్తు ఉందని అంటాడు రాహుల్. కానీ దానికి తండ్రి ఉండడని అంటుంది స్వప్న. నువ్వెంత ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసినా నేను కుయిలీతోనే ఉంటానని, దానినే పెళ్లి చేసుకుంటానని తేల్చేస్తాడు. నువ్వేం చేసినా అది జరగదని స్వప్న చెప్పగా.. బలవంతంగా ఆమెతో సంతకం పెట్టమని వేధిస్తాడు రాహుల్. ఇంట్లో అందరికీ ఈ విషయం చెబుతానని స్వప్న కోపంగా వెళ్లి రుద్రాణి ముందు డివోర్స్ పేపర్స్ పెడుతుంది స్వప్న.

నా ముఖం మొత్తిందట, ఇంకో ఆడదాని మీద మోజు పుట్టిందని స్వప్న చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. కట్టుకున్న భార్యకి విడాకులు ఇవ్వడం ఏంట్రా అని రాహుల్‌ని రాజ్ నిలదీస్తాడు. నా భార్య పోస్ట్ నుంచి రిటైర్ అవ్వమని చెబుతున్నానని అంటాడు రాహుల్. రిటైర్ అవ్వడానికి మా అక్కది ఉద్యోగం కాదు, జీవితం అంటుంది కావ్య. మీ అక్క మీద ఇష్టం చచ్చిందని, నచ్చని మనిషితో కలిసి కాపురం చేయాలని అందుకే విడాకులు అడుగుతున్నానని అంటాడు రాహుల్. నీ బుద్ధులు, వేషాలు అన్ని భరిస్తూ నీతో బతుకుతున్నందుకు మా అక్కకి చేతులెత్తి మొక్కాల్సిందిపోయి విడాకులు కావాలా? అని అప్పూ నిలదీస్తుంది. స్వప్నంటే అంత ఇష్టం లేనప్పుడు ఆనాడు ఎందుకురా కలిసి తిరిగావు.. మోసం చేసి ఓ బిడ్డకు తల్లిని ఎందుకు చేశావని అడుగుతుంది అపర్ణ.

స్వప్న మెడలో నువ్వు కట్టింది గొలుసు కాదు రా, నమ్మకానికి చిరునామా అయిన తాళిబొట్టు అంటాడు రాజ్. విడాకులిస్తే స్వప్న జీవితం ఏం కావాలని అడగ్గా.. అది దాని ఇష్టం, ఏమైనా చేసుకోమనండి అంటాడు రాహుల్. మీ ఇద్దరి మధ్యన ఉన్న పాప గతి ఏంటీ? అని ప్రశ్నిస్తుంది ఇందిర. నాకు తల్లి వద్దు, పిల్లా వద్దు... విడాకులు ఇచ్చేస్తే నా చావు నేను చస్తానని అంటాడు రాహుల్. నీ పుత్రరత్నం మాటలు విన్నావు కదా? ఏం మాట్లాడవేంటీ అని రుద్రాణిని నిలదీస్తుంది అపర్ణ. నీ ముద్దుల కొడుకు అంతగా దిగజారి నీ కోడలి బతుకు నాశనం చేస్తుంటే వాడి చెంపలు వాయించకుండా ఏం చూస్తున్నావని మండిపడుతుంది ఇందిర.

నీ కొడుకు నీకు చెప్పకుండానే ఇదంతా చేశాడా? అని ప్రశ్నిస్తుంది అపర్ణ. నీ కొడుకు వల్ల స్వప్నకు అన్యాయం జరిగితే.. నిన్ను, రాహుల్‌ని క్షమించేది లేదని సుభాష్ వార్నింగ్ ఇస్తాడు. మీరు ఆవేశపడొద్దు, నేను వాడితో మాట్లాడతానని అంటుంది రుద్రాణి. ఇంతలో రాహుల్ బ్యాగ్ సర్దేసి ఎక్కడికో బయల్దేరుతుండగా కొడుకుని లాగిపెట్టి కొడుతుంది రుద్రాణి. నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఇలాంటి షాక్‌లు ఇస్తావా? నేను ఇన్ని అవమానాలు, తిట్లు భరించి ఈ ఆస్తిని నీ చేతుల్లో చెబుదామని అనుకుంటుంటే నువ్వు గాలికి వెళ్లిపోవడానికి కాదని అంటుంది రుద్రాణి. ఈ ఇంటి ఆస్తి విలువ ఎంతో తెలుసా? ఇవన్నీ మరిచిపోయి స్వప్నకి విడాకులు ఇస్తానంటే ఇక నేనెందుకు? నా ప్లాన్స్ ఎందుకు అని ప్రశ్నిస్తుంది.

ఇప్పటి దాకా నువ్వు ఈ ఆస్తి కోసం ఎన్నో ప్లాన్లు వేశావు.. సక్సెస్ అయ్యావా? అని ప్రశ్నిస్తాడు రాహుల్. ఫ్యామిలీలో విలువ లేదు, నా పాకెట్‌లో చిల్లర లేదు.. కళ్ల ముందు ఇంత ఆస్తి ఉన్నా ఓ కాస్ట్‌లీ బ్రాండ్ తాగలేని పరిస్ధితి అని చెబుతాడు. నేను ఇష్టపడిన కుయిలీ మాత్రం మహారాణి.. దానిని పెళ్లి చేసుకుంటే వందల కోట్ల ఆస్తి నా సొంతం అవుతుందని అంటాడు. ఇది నేను పెరిగిన ఇల్లు, నా వాళ్లు, ఆస్తిని ఎలా కాజేయోలా తెలుసని.. కానీ బయటి వాళ్లను నమ్మలేం అంటుంది రుద్రాణి. కుయిలీని పెళ్లి చేసుకున్నాకా నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తానని అంటాడు రాహుల్.

స్వప్న జీవితం గురించి కావ్య బాధపడుతుంది. ఇంతలో రాజ్ వచ్చి ఆ ఇడియట్ రాహుల్ గాడు ఇంతకీ తెగిస్తాడని అనుకోలేదని అంటాడు. రాహుల్ ముందులా లేడు, చాలా మారిపోయాడని నేను చెబుతూనే ఉన్నాను కదా అని అంటుంది కావ్య. వాడు విడాకులు ఇచ్చే వరకు వస్తే వాడికి ఈ ఇంట్లోనే ప్లేస్ ఉండదని చెబుతాడు రాజ్. రాహుల్ ఎప్పటికైనా మారతాడని స్వప్న అనుకుంటూ వస్తోందని అంటుంది కావ్య. రాహుల్ అంత కాన్ఫిడెంట్‌గా భార్యను కాదని మరో ఆడదానిని పెళ్లి చేసుకుంటానని అంత ధైర్యంగా చెబుతున్నాడంటే అది అంత తేలికగా రాదని చెబుతాడు రాజ్. వీడి గురించి ఏం తెలుసని ఓ అమ్మాయి వీడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని ఆలోచిస్తాడు రాజ్. వీడి అట్రాక్షన్‌ని అవకాశంగా తీసుకుని ఎవరో మానిప్యులేట్ చేస్తున్నారని చెబుతాడు. ప్రపంచంలో ఇంతమంది ఉండగా పెళ్లయి, పిల్లలున్న రాహుల్‌ని ఆ అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని కావ్య ప్రశ్నిస్తుంది. రాహుల్‌ని బుట్టలో వేసుకున్న దాని పుట్టుపూర్వొత్తరాలు తెలియాలని చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X