Brahmamudi October 3rd Episode: బిడ్డ కోసం కావ్య కఠిన నిర్ణయం.. రాజ్‌కి విడాకులు, షాక్‌లో దుగ్గిరాల ఫ్యామిలీ
Photo Courtesy: JioHotstar
హాస్పిటల్‌కి వెళ్లిన కావ్యను రాజ్ చెప్పినట్లే చాలాసేపు వెయిట్ చేయిస్తుంది నర్స్. తనకంటే వెనుక వచ్చినవారు ముందుగానే డాక్టర్‌ని కలవడంతో కావ్యకు కోపమొచ్చి నర్స్‌ను నిలదీస్తుంది. దాంతో కావ్యతో నర్స్ గొడవపడి వెంటనే రాజ్‌కు ఫోన్ చేస్తుంది. కావ్య మేడంని ఆపలేకపోతున్నానని త్వరగా రమ్మని చెబుతుంది. నేను పటాన్ చెరుకి దగ్గరలో ఉన్నానని రాజ్ చెప్పడంతో మా డాక్టర్ గారి అత్తారింటికి దగ్గరలో ఉన్నారని నర్స్ టెన్షన్ పడుతుంది. దాంతో రాజ్‌కి ఓ ఐడియా వచ్చి వెంటనే డాక్టర్ గారి అడ్రస్ తీసుకుని అక్కడికి వెళ్తాడు.
డాక్టర్ గారి అత్తగారి దగ్గరికి వెళ్లి మీ కోడలు మీ మాట వింటుందో లేదో తెలుసుకోవడానికి టెస్ట్ పెడుతున్నానని అంటాడు. ఆమెను కట్టేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్పమని అంటాడు. కావ్యకి డాక్టర్ నిజం చెప్పబోతుండగా అత్తగారి నుంచి ఫోన్ వస్తుంది. దీంతో ఆమె తన అత్తగారికి ఏదో ప్రమాదం జరగబోతోందని భయపడి పరుగు పరుగున బయల్దేరుతుంది. అత్తగారింటిలో రాజ్‌ని చూసి షాక్ అవుతుంది. హాస్పిటల్‌లో డాక్టర్ గారు నిజం చెప్పకపోవడంతో నీరసంగా ఇంటికి వస్తుంది కావ్య. ఇంతలో కళ్యాణ్ వచ్చి వదిన డాక్టర్‌ని కలవలేదు కదా అని అంటాడు.. అది విని కావ్య షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. అక్టోబర్ 3వ తేదీ ఎపిసోడ్ 842లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
హాస్పిటల్‌ను తాను వెళ్లిన విషయం కళ్యాణ్‌కి ఎలా తెలిసిందో అర్ధం కాక జుట్టు పీక్కుంటుంది కావ్య. నేను హాస్పిటల్‌లో డాక్టర్‌ని కలవలేదన్న విషయం ఎలా తెలుసని నిలదీయడంతో కళ్యాణ్ బిక్కమొహం వేస్తాడు. నన్ను ఫాలో అవుతున్నారా? అని కావ్య అడుగుతుంది. నేను అలాంటి పనులు చేయనని, అయినా నేను ఆయిల్ కోసం అంత దూరం వెళ్లితే.. మిమ్మల్ని ఎలా ఫాలో చేస్తానని అడగుతాడు కళ్యాణ్. హాస్పిటల్‌కి వెళితే.. టెస్టులు, రిపోర్టులు అని చాలా సేపు పడుతుంది కదా? నువ్వు ఇంత ఫాస్ట్‌గా వచ్చేసరికి డాక్టర్ లేరేమో గెస్ చేశానని చెబుతాడు కావ్య.
కవిగారు అంత ఖచ్చితంగా డాక్టర్‌ని కలవలేదు కదా అని ఎందుకు అన్నారు? ఆయన్ని తైలం తీసుకురమ్మని చెబితే కవిగారు ఎందుకు తీసుకొచ్చారు? ఆయనకి అంత అర్జెంట్ వర్క్ ఉంటే ఆ విషయం అమ్మమ్మగారికి ఫోన్ చేసి ఆ తైలం తర్వాత తీసుకొస్తానని చెప్పేవారు కదా? కవిగారికి చెప్పడం ఏంటీ? అంటే నేను హాస్పిటల్‌కి వెళ్తున్న విషయం ఆయనకి తెలిసిందా? నేను హాస్పిటల్‌కి వెళ్తున్న విషయం స్వప్నక్క.. కవిగారికి చెప్పింది. మరి ఆయనకి ఎవరు చెప్పుంటారు? కవిగారే చెప్పుంటారా? ఈ మధ్య కవిగారు మా విషయంలో బాగా ఇన్వాల్వ్ అవుతున్నారని తనని తాను ప్రశ్నించుకుంటుంది కావ్య.
కవిగారికి నా అబార్షన్ గురించి అన్ని తెలుసు? అందుకే ఏం మాట్లాడాలన్నా ఆయనని బయటికి తీసుకెళ్లి మాట్లాడుతున్నాడు అనుకుంటుంది. బిడ్డను ఆయన ఎందుకు వద్దు అనుకుంటున్నారని అడిగేస్తానని ఫిక్స్ అవుతుంది. ఒకవేళ కవిగారికి నిజం తెలియకపోతే.. నేను ఆయనని అవమానించానని బాధపడే ఛాన్స్ ఉందని అనుకుంటుంది కావ్య. కానీ ఈ నిజం ఎలా తెలుసుకోవాలా అని ఆలోచిస్తూ.. అంత తెలిసిపోయినట్లుగా చీకటిలో బాణం వేయాలని ఓ నిర్ణయానికి వస్తుంది. తనకి నిజం తెలిస్తే బయటపడే ఛాన్స్ ఉందని కావ్య అనుకుంటుంది.
మీరు నా దగ్గర దాచిన నిజం, ఇంకా దాస్తున్న నిజం గురించి చెప్పమని నిలదీస్తుంది కావ్య. మీరు చెప్పకపోయినా నాకు నిజం తెలిసిపోయింది, మీ అన్నయ్య, మీరు కలిసి ఆడుతున్న డ్రామా తెలిసిపోయిందని కావ్య చెప్పడంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. ఇంత పెద్ద నిజాన్ని నాకు తెలియకుండా దాచారని గట్టిగా నిలదీస్తుంది కావ్య. ఈ మాటలు విన్న రాజ్.. కావ్యకి ఏం తెలియదని నిజం తెలుసుకోవడానికి చీకట్లో బాణం వేస్తుందని భయపడతాడు. నీకు ముందే చెబుదామని అనుకున్నానని, అన్నయ్యే చెప్పొద్దు అన్నాడని అనడంతో రాజ్ షాక్ అవుతాడు. ఆయన చెప్పొద్దు అంటే మీరు ఆగిపోతారా? మీరు ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంటారు కదా? మరి ఈ విషయం చెప్పడానికి ఏమైంది? అని నిలదీస్తుంది.
కళ్యాణ్ నిజం చెప్పబోతుండగా.. కావ్యకి ఏం తెలియదని రాజ్ సైగలు చేయడంతో అతను అలర్ట్ అవుతాడు. మేం ఇద్దరం సెకండ్ షో సినిమాకు వెళ్లామని ఆ విషయాన్ని మీ దగ్గర దాచామని అంటాడు. మీరు ఇద్దరు నాకు నిజం చెప్పడం లేదని అది తెలిసిన రోజున మీ సంగతి చెబుతానని కావ్య కోపంగా వెళ్లిపోతుంది. ఆ వెంటనే రాజ్ వచ్చి తమ్ముడిపై కోప్పడతాడు. తను చీకటిలో బాణం వేసి చూసిందని మండిపడతాడు. ఏదో ఒక రోజు తనకు నిజం తెలిసేలోపు.. మనం అనుకున్నది జరిగిపోవాలని చెబుతాడు రాజ్.
సుభాష్, అపర్ణలు మాట్లాడుకుంటూ ఉండగా.. సుభాష్ ఫ్రెండ్ హరీశ్ వచ్చి తన కూతురు శ్రీమంతం ఉంది.. దానికి ఇన్వైట్ చేస్తాడు. మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ.. మీ ఇంటి విషయాలు బయటికి వస్తున్నాయని అతను చెబుతాడు. కావ్యకి రాజ్ అబార్షన్ చేయించాలనుకుంటున్న విషయం ఊరంతా తెలిసిపోయిందని హరీశ్ అంటాడు. రాజ్‌ని అడుగుదామని అనుకున్నానని కానీ కరెక్ట్ కాదనిపించింది, మీ ఇంటి పరువు రోడ్డున పడకుండా చూసుకోండి అని వార్నింగ్ ఇస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన భర్త అబార్షన్ ఎందుకు చేయించాలని అనుకుంటున్నాడో తెలుసుకోలేకపోతున్నానని కృష్ణుడి ముందు బాధపడుతుంది కావ్య. ఓ చివరి ప్రయత్నం చేయాలని అనుకుంటున్నానని, అందుకే ఆయనకి విడాకులు ఇచ్చేస్తానని అనుకుంటుంది. నా బిడ్డను కాపాడుకోవాలంటే ఈ పని చేయక తప్పడం లేదని అంటుంది కావ్య.
హరీశ్‌తో చెప్పించి ఇంట్లో గొడవ చేస్తానని చెప్పావు కదా అని రాహుల్‌పై మండిపడుతుంది రుద్రాణి. ఇంతలో సుభాష్, అపర్ణలు వచ్చి రాజ్‌పై మండిపడతారు. రాజ్ అబార్షన్ విషయం గురించి బయట జనం మాట్లాడుకుంటున్నారని.. నీకు బాధ్యతలు అప్పగించే వరకు ఈ ఇంటి పరువును జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చామని కానీ ఇది నీ వల్ల గంగలో కలిసిపోయిందని కోప్పడతాడు సుభాష్. మీ నాన్నగారు ఒకరికి సలహాలు ఇవ్వడమే తప్ప, ఎప్పుడూ ఒకరితో మాటలు పడలేదని అంటుంది రుద్రాణి. మేం ఇంకా ఎన్ని అవమానాలు పడాలి? ఎంతమందితో మాటలు పడాలి? అని అపర్ణ ఫైర్ అవుతుంది.
దీనికి ఏదో ఒక పరిష్కారం ఈరోజే జరిగిపోవాలని సుభాష్ చెప్పగా.. నేను ఎప్పుడో నా నిర్ణయం చెప్పేశానని, ఇక ఆలోచించుకోవాల్సింది మీ కోడలేనని అంటాడు రాజ్. ఎందుకు అబార్షన్ చేయించాలని అనుకున్నారు? అమ్మమ్మ గారి తైలం కోసం బయటికి వెళ్లిన మీరు హాస్పిటల్‌లో డాక్టర్ గారిని కలవకుండా ఎందుకు చేశారు? అని నిలదీస్తుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










