Brahmamudi October 4th Episode: విడాకుల దిశగా కావ్య- రాజ్.. సుభాష్‌కి హార్ట్ ఎటాక్, అప్పూ సంచలన నిర్ణయం

Photo Courtesy: JioHotstar

నేను హాస్పిటల్‌కి వెళ్లిన విషయం, డాక్టర్‌ని కలవని విషయం కవిగారికి ఎలా తెలిసింది? అని ఆలోచిస్తుంటుంది కావ్య. ఈ మధ్య తమ వ్యవహారాల్లో కవిగారు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారని, ఆయనను బయటికి తీసుకెళ్లి మాట్లాడుతున్నారని డౌట్ పడుతుంది కావ్య. ఖచ్చితంగా నాకు రాజ్ గారు ఎందుకు అబార్షన్ చేయించాలని అనుకుంటున్నారో కవిగారికి తెలిసే ఉంటుందని అనుకుంటుంది. వెంటనే వెళ్లి నువ్వు, మీ అన్నయ్య కలిసి ఆడుతున్న డ్రామా గురించి నాకు తెలిసిపోయిందని కావ్య అనడంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. అటుగా వెళ్తున్న రాజ్.. కావ్యకి ఏం తెలియదని సైగలు చేయడంతో కళ్యాణ్ అలర్ట్ అవుతాడు.

సుభాష్ ఫ్రెండ్ ఒకరు ఇంటికొచ్చి తన కూతురి శ్రీమంతానికి ఆహ్వానించి.. వెళ్తూ వెళ్తూ కావ్యకి రాజ్ అబార్షన్ చేయించాలని అనుకుంటున్నాడా? అని అడుగుతాడు. బయట అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారని, మీ కుటుంబం పరువు రోడ్డున పడుతుందని జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తాడు. దాంతో సుభాష్, అపర్ణలు రాజ్ మీద కేకలు వేస్తారు.
ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. అక్టోబర్ 4వ తేదీ ఎపిసోడ్ 843లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial October 4th 2025 Episode 843 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

అమ్మమ్మ గారి తైలం గురించి ఎక్కడో ఊరి బయటికి వెళ్లిన మీరు, హాస్పిటల్‌లో డాక్టర్‌ని కలవకుండా ఎందుకు చేశారని రాజ్‌ను నిలదీస్తుంది కావ్య. చివరికి మీరు ఎంతలా దిగజారిపోయారంటే.. నాకు తెలియకుండా జ్యూస్‌లో అని చెప్పబోతూ కావ్య ఆగిపోతుంది. జ్యూస్ ఏంటీ మళ్లీ ఏం చేశాడు వీడు అని అపర్ణ అడుగుతుంది. నా నోటితో నేను చెప్పలేనని అది విని తట్టుకునే శక్తి మీకు లేదని అంటుంది కావ్య. నువ్వేదో నన్ను కాపాడుతున్నట్లు కవరింగ్ ఇవ్వొద్దని జ్యూస్ గ్లాస్‌లో అబార్షన్ టాబ్లెట్స్ నేనే కలిపానని రాజ్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది. ఆ విషయం నీకు చెప్పకుండా తాగించడానికి ప్రయత్నించానని, నువ్వు నా మాట వినకపోవడం వల్లనే నేను అలా చేయాల్సి వచ్చిందని అంటాడు రాజ్.

వినాయక చవితి వరకు మీరు బాగానే ఉన్నారు.. ఎంత గొప్పగా ప్రేమిస్తున్నారో కూడా చెప్పారని గుర్తుచేస్తుంది కావ్య. కానీ ఉన్నట్లుండి ఎందుకిలా మారిపోయారు? ఆ రోజు ఏదో జరిగింది? మీకు ఏదో విషయం తెలిసింది? అప్పటి నుంచి మీలో మార్పు మొదలైంది మా దగ్గర ఏం దాస్తున్నారో నిజం చెప్పమని అంటుంది కావ్య. మన బిడ్డను ఎందుకు వద్దు అనుకుంటున్నారు? ఇప్పటికైనా నిజం చెప్పమని అడుగుతుంది కావ్య. నీకు నచ్చినట్లుగా నువ్వే ఏదో ఊహించుకుని కథలు రాసుకుంటే నేను ఏం చేయలేనని అంటాడు రాజ్. నీతో కలిసి కొంతకాలం సంతోషంగా ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పాను కదా? అయినా పదే పదే అదే అడిగితే నేను ఏం చేయగలనని మండిపడతాడు రాజ్.

నా కారణాలు నాకున్నాయి.. అయినా మాట మారుస్తుంది నువ్వు, నా మాట వినకుండా తప్పించుకుని తిరుగుతుంది నువ్వు అని మండిపడతాడు రాజ్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నాది ఒక్కటే మాట.. నాకు బిడ్డే ముఖ్యమని కావ్య తేల్చిచెబుతుంది. నువ్వు ఈ ఆపరేషన్ చేయించుకోవాలని రాజ్ అడుగుతాడు. అయినా నా బిడ్డను చంపే హక్కు మీకు ఎవరిచ్చారు అని కావ్య అడుగుతుంది. నీ మెడలో మూడు ముళ్లు వేసినప్పుడే నాకు ఆ హక్కు వచ్చిందని అంటాడు రాజ్. మూడు ముళ్లు వేసి, ఏడు అడుగులు నడిచినంత మాత్రాన కన్నబిడ్డను చంపుకునే హక్కుందని మీకు ఏ పురాణంలో చెప్పారని కావ్య నిలదీస్తుంది.

ఆ కృష్ణుడిని చంపాలనుకున్న కృష్ణుడు కూడా బిడ్డ పుట్టాకే చంపాలని అనుకున్నాడు కానీ.. మీలో కడుపులో ఉండగానే చంపాలని ఏ రోజూ అనుకోలేదని, మీరు కూడా రాక్షసుడేనని అంటుంది కావ్య. నన్ను ఏమైనా అనుకో నాకు మాత్రం ఆ బిడ్డ వద్దని తేల్చిచెబుతాడు రాజ్. తాళి కట్టడం వల్లే మీకు ఆ హక్కు ఉందని మీరు అనుకుంటుంటే అసలు ఈ తాళే నాకు అక్కర్లేదని తేల్చి చెబుతుంది కావ్య. మనం కలిసుండటానికి ఈ బిడ్డ నీకు అడ్డు అవుతుందని అనుకుంటే మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్లిపోవడానికి కూడా నేను సిద్ధమేనని కావ్య అనడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.

నా కడుపులో ఉన్న బిడ్డపై కోపంతో ఇంటి పరువును కూడా పణంగా పెట్టేశాడని, ఆయన వల్ల ఎంతమంది బాధపడాలని నిలదీస్తుంది. కళ్లు కూడా తెరవని బిడ్డను చంపాలని మీరు చూస్తున్నప్పుడు, ఆ బిడ్డకు తల్లిగా మిమ్మల్ని వదిలేయడానికి మించి ఏం చేయలేనని కావ్య తేల్చేస్తుంది. నేనంటే ఎంత ఇష్టమని మాటల్లో చెప్పడం కాదు.. చేతల్లో చూపించాలని, మీ నిర్ణయం కోసం ఇంట్లో వాళ్లు ఎదురు చూస్తున్నారని చెబుతుంది కావ్య. నా కొడుకును వదిలేస్తానని చెబుతావా అంటూ కోడలిపై మండిపడుతుంది అపర్ణ.

వాడు ఏం చేసినా క్షమించి, చివరికి ఆ యామిని నుంచి కూడా నీ మొగుడిని కాపాడుకున్నావ్ కదా అని అపర్ణ గుర్తుచేస్తుంది. నేను నిజంగా విడాకులు ఇస్తానని చెప్పలేదని, ఆయన మనసులో ఉన్న నిజం తెలుసుకోవడానికే ఇలా చేశానని చెబుతుంది కావ్య. ఆయన జీవితంలో నేను ఉండనని తెలిస్తే ఎందుకు నిజం చెప్పకుండా ఉంటారని అంటుంది. వాడు కూడా వెళ్లిపోతానంటే అప్పుడు నువ్వేం చేస్తావని అడుగుతుంది అపర్ణ. ఏం జరగకుండా నేను చూసుకుంటానని అత్తగారికి చెబుతుంది కావ్య.

బిడ్డను తీయించడానికి రాజ్ తొందరపడుతుండటం.. కావ్య ఇంట్లో నుంచి వెళ్లిపోతానని చెప్పడంతో రాహుల్, రుద్రాణిలు సంబరాలు చేసుకుంటారు. ఆల్రెడీ మంట రగులుకుందని, నువ్వు దాని మీద పెట్రోల్ పోస్తే చాలని.. ఈ గొడవలు ఇలాగే పెద్దవైపోయి వాళ్లు విడాకులు తీసుకుంటే మన ఆస్తిని మనం దక్కించుకుందామని చెబుతాడు రాహుల్. ఇంట్లో జరుగుతున్న పరిణామాలు, కావ్య విడాకులు తీసుకోవడానికి సిద్ధమవ్వడంతో అప్పూ, కళ్యాణ్‌లు బాధపడతారు. అక్కకి నిజం చెప్పకుండా మనం చాలా పెద్ద తప్పు చేశామని, వాళ్లు విడాకులు తీసుకుంటే ఆ పాపం మనదేనని ఏడుస్తుంది అప్పూ. బావగారు కూడా అక్కకి నిజం చెప్పలేకపోతున్నారని, అందరి చేతా మాటలు పడుతూ మనల్ని కూడా ఆ నిజం చెప్పనివ్వడం లేదని బాధపడుతుంది అప్పూ. వాళ్లు విడిపోకుండా మనమే ఏదో ఒకటి చేయాలని చెబుతుంది.

ఇంట్లో జరుగుతున్న గొడవల్ని తలచుకుని బాధపడుతుండగా సుభాష్‌కి హార్ట్ ఎటాక్ రావడంతో అపర్ణ టైంకి మందులు ఇస్తుంది. మన కుటుంబాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన వాడే, మన కుటుంబ పరువు తీసే పరిస్ధితికి తీసుకొస్తున్నాడని బాధపడతాడు సుభాష్. కావ్య గురించైనా రాజ్ ఎందుకు ఆలోచించడం లేదు.. వాడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో కారణం తెలుసుకోవాలని అనుకుంటాడు. కావ్య దగ్గరికి అప్పూ వచ్చి మీ విడాకుల గురించి మాట్లాడాలని చెబుతుంది. నేను నాటకం ఆడుతున్న విషయం అప్పూకి చెబితే అది కళ్యాణ్‌కి, అక్కడి నుంచి రాజ్ గారికి తెలుస్తుందని చెల్లెలికి నిజం చెప్పదు కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X