Brahmamudi October 7th Episode: రాజ్‌ని టార్చర్ చేస్తోన్న కావ్య.. ధాన్యలక్ష్మీకి రుద్రాణి బ్రెయిన్ వాష్
Photo Courtesy: JioHotstar
బావగారికి విడాకులు ఇచ్చే విషయం గురించి ఒకసారి ఆలోచించమని కావ్యకి నచ్చచెబుతుంది అప్పూ. విడాకులు అనేది నేను ఆడిన నాటకమని తెలిస్తే రాజ్ నిజం చెప్పడని భయపడ్డ కావ్య.. చెల్లెలిని తిట్టి పంపేస్తుంది. భోజనం చేయకుండా ఆలోచిస్తున్న అప్పూని డిన్నర్‌కి పిలుస్తుంది ధాన్యలక్ష్మీ. నేను తర్వాత తింటానని చెప్పడంతో ఆమె వెళ్లిపోతుంది. డైనింగ్ టేబుల్ వద్దకు అప్పూ లేకుండా ఒంటరిగా వచ్చిన ధాన్యలక్ష్మీని చూసి ఏం జరిగిందని ఇందిర అడుగుతుంది.
అప్పూని కావ్య తిట్టిందని అందుకే ఆమె అలిగి భోజనం చేయకుండా వెళ్లిపోయిందని రుద్రాణి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇది నిజమేనా? అని అపర్ణ అడగ్గా కావ్య అవును అని సమాధానం చెప్పడంతో ధాన్యలక్ష్మీ శివతాండవం చేస్తుంది. అప్పూకి కళ్యాణ్ భోజనం తీసుకెళ్లి తినిపిస్తాడు. ఇంటి పరువు విధిలో పడుతుండటంతో రాజ్‌కి సీతారామయ్య క్లాస్ పీకుతాడు. రాజ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడంతో ఏ ఒక్కరూ భోజనం వడ్డించరు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 7వ తేదీ ఎపిసోడ్ 845లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కావ్యకి అబార్షన్ చేయించడానికి నా కారణాలు నాకున్నాయని అంటాడు రాజ్.. అయితే నీకు భోజనం వడ్డించకపోవడానికి కూడా మా కారణాలు మాకుంటాయని అంటుంది అపర్ణ. నువ్వు పెట్టకపోతే ఏంటీ నాకు మా నాయనమ్మ ఉందని ఇందిరను భోజనం వడ్డించమని అడుగుతాడు రాజ్. అయితే ఇందిర కూడా వడ్డించనని చెబుతుంది. అయినా పెళ్లాన్ని పక్కపపెట్టుకుని మమ్మల్ని అడుగుతావేంటీ? నీ పెళ్లాన్నే అడుక్కోమని అంటుంది ఇందిర. నా బిడ్డే నచ్చనప్పుడు నేను వడ్డించే అన్నం మాత్రం ఏం నచ్చుతుందని సెటైర్లు వేస్తుంది కావ్య. దాంతో తనే వడ్డించుకుని తింటాడు రాజ్.
నిద్రపోవడానికి బెడ్‌రూంలోకి వచ్చిన రాజ్‌కి దిండు దుప్పటి ఇచ్చి బయటికి వెళ్లమంటుంది కావ్య. ఇంత పెద్ద గది ఉంది, ఇందులో ఏసీ ఉంది నేనెందుకు బయటికి వెళ్లాలని రాజ్ ప్రశ్నిస్తాడు. ఈరోజు నుంచి మీ పడక గది హాల్‌లో సోఫానే అంటుంది కావ్య. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. నా జీవితంలో నుంచి వెళ్లిపోవడానికి ఫిక్స్ అయ్యారు కదా.. ఇక గదిలో నుంచి వెళ్లలేరా? అని నిలదీస్తుంది కావ్య. నా బిడ్డను చంపుకోమ్మని చెప్పింది ఎవరు? నేను కావాలో? నా బిడ్డ కావాలో తేల్చుకోమని చెప్పింది ఎవరు? అని కావ్య ప్రశ్నిస్తుంది. నేను ఆ మాట అనలేదని రాజ్ చెప్పగా.. ఎవరంటే ఏంటీ నా నోటితో నేను అనేలా చేసింది మీరేనని అంటుంది కావ్య. కొద్దిరోజుల్లో మీరు కోరుకున్నట్లే విడాకులు ఇచ్చేస్తానని చెబుతుంది కళావతి.
ఇక్కడ పడుకుంటే ప్రాబ్లమ్ ఏంటీ? అని రాజ్ అడగ్గా.. కలిసుండాలి, కలిసి బతకాలని ఆశపడ్డవారు ఒక్కటిగా పడుకోవాలని అనుకుంటారని.. కడుపులో బిడ్డను చంపుకోవాలని అనుకునేవారు ఒంటరిగానే పడుకుంటారని చెబుతుంది కావ్య. నేను కడుపులో బిడ్డను చంపుకోమని అన్నందుకు నా భార్యకు చచ్చేంత కోపం వచ్చి నన్ను బయటికి గెంటేసిందని చెప్పమని అంటుంది కళావతి. నలుగురు మనల్ని చూసి నవ్వుకోకూడదని అంటే నా కడుపులోని బిడ్డను ఎందుకు చంపేయాలని అనుకున్నారో నిజం చెప్పాలని ప్రశ్నిస్తుంది. ఆ మాట వినగానే దిండు, దుప్పటి తీసుకుని బయటికి వెళ్లిపోతాడు రాజ్.
తనపట్ల చేస్తున్న తప్పులకి నాకు నేను వేసుకుంటున్న శిక్ష అనుకుంటానని రాజ్ తన మనసుకి సర్ధిచెప్పుకుంటాడు. నువ్వు నా మనసు ఎంత నొచ్చుకునేలా మాట్లాడినా? నీకు నేను నిజం చెప్పలేనని, నాకు నువ్వు కావాలి? నిన్ను బ్రతికించుకోవడానికి ఎంత కష్టమైనా పడతానని అనుకుంటాడు రాజ్. కొడుకు సోఫాలో పడుకోవడం చూసిన అపర్ణ... వీరి మధ్య దూరం పెరగనివ్వడం అంత మంచిది కాదని అనుకుంటుంది. కావ్య ఆడుతున్నది నాటకమే అయినా వాడికి కోపం వస్తే ఏదైనా ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉందని టెన్షన్ పడుతుంది. అలా జరగకూడదంటే రాజ్ మీద ఒత్తిడి పెంచాలని అనుకుని నిద్రపోతున్న సుభాష్ దగ్గరికి వెళ్లి లేపుతుంది.
అసలు మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతుంటే మీకసలు నిద్ర ఎలా పడుతుంది అని ప్రశ్నిస్తుంది. బయటికి వెళ్లిపోండి అని మండిపడుతుంది. ఈ టైంలో ఎక్కడికి వెళ్లను, నీకు ఏమైనా కావాలా? అని సుభాష్ ప్రశ్నిస్తాడు. కావాల్సింది నాకు కాదు.. మీ పుత్రరత్నానికి అని చెబుతుంది అపర్ణ. రాజ్ సోఫాలో పడుకున్నాడు.. మీరు వెళ్లి కంపెనీ ఇవ్వండని అంటుంది. వాడు మనసు మార్చుకుని కావ్యతో సఖ్యతగా ఉండే వరకు మీకు కూడా ఈ బెడ్‌రూంలో స్థానంలో లేదని అంటుంది. రాజ్ ఎన్ని రోజులు సోఫాలో పడుకుంటే అన్ని రోజులు మీరు కూడా సోఫాలో పడుకోవాలని చెబుతుంది అపర్ణ. ఆమె మాటలకు సుభాష్ షాక్ అవుతాడు.
నువ్వు చేసిన పనికి నాకు కూడా జాగారమేనని రాజ్‌తో అంటాడు సుభాష్. నువ్వు కావ్యని టార్చర్ పెడుతున్నావ్.. అది చూసి మీ అమ్మ నన్ను టార్చర్ పెడుతోందని, ఈరోజు నేను కూడా ఇక్కడే పడుకుంటానని చెబుతాడు సుభాష్. నీకు, కావ్యకు జరుగుతున్న గొడవలు సర్దుమణిగే వరకు నాకు బెడ్‌రూంలో ఎంట్రీ లేదని నన్ను కూడా మీ అమ్మ గెంటేసిందని చెబుతాడు సుభాష్. మీరు అటు పడుకోండి? నేను అటు పడుకుంటానని రాజ్ అంటుండగా.. మరి నేను ఎక్కడ పడుకోవాలని అడుగుతాడు ప్రకాశం. దాంతో రాజ్, సుభాష్‌లు షాక్ అవుతారు. నిన్ను కూడా పిన్ని గెంటేసిందా? అని రాజ్ అడగ్గా.. చీపురు తిరగేసి కొట్టడం ఒక్కటే తక్కువని చెబుతాడు ప్రకాశం.
నువ్వు చేసిన పనికి మమ్మల్ని బలి చేస్తున్నారని, ఆ నిజమేంటో చెబితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని చెబుతాడు ప్రకాశం. ఆ నిజాన్ని నేను చెప్పలేనని రాజ్ అనడంతో నీ వల్ల రోజూ గొడవలు జరిగితే, అనవసరంగా అందరినీ బాధపెడితే నీకు సంతోషంగా ఉంటుందా? అని మండిపడతాడు సుభాష్. ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేదని, దుగ్గిరాల వారి ఇల్లు అంటే బృందావనంలా ఉండేదని, కేరాఫ్ హ్యాపీనెస్ అన్నట్లుగా ఉండేదని నీ పుణ్యమా అని అందరికీ కన్నీళ్లే మిగులుతున్నాయని అంటాడు ప్రకాశం. నా కారణాలు నాకున్నాయని రాజ్ చెప్పడంతో నీ భార్యను వదలుకునేంత పెద్ద కారణాలా? అని ప్రశ్నిస్తాడు సుభాష్. ఇప్పటికైనా బంధాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయ్.. బంధమంటే బాధను పంచుకోవాలని, ఇలా పెంచుకోవద్దని కొడుక్కి చెబుతాడు. దాంతో రాజ్ తన గదిలోకి వెళ్తానని కోపంగా వెళ్లిపోతాడు.
రాజ్ స్నానం చేస్తూ పాట పాడుకుంటూ ఉంటాడు. అది విన్న కళావతి.. నాకు నిజం చెప్పకుండా నన్ను ఏడిపిస్తూ మీరు హ్యాపీగా పాటలు పాడుకుంటారా? అని మండిపడుతుంది. దాంతో వాటర్ కనెక్షన్ ఆఫ్ చేయడానికి వెళ్తుంది కావ్య. ఇంతలో ఇందిర ఎదురుకావడంతో మీ మనవడు నిజం చెప్పాలంటే వాటర్ కనెక్షన్ ఆఫ్ చేయాలని చెబుతుంది. కనెక్షన్ ఎక్కడుందో నాకు తెలుసు.. నేను వాటర్ ఆపేస్తాను, నువ్వు నిజం రాబట్టమని అంటుంది ఇందిర. స్నానం చేస్తుండగా వాటర్ అయిపోవడంతో మోటర్ వేయమని కావ్యకి చెబుతాడు రాజ్. నేను వేయనని, అసలు వాటార్ ఆపిందే నేనే కాబట్టి అని చెబుతుంది కావ్య.
మీ చేత నిజం చెప్పించడానికి నేనే ఇలా చేశానని అంటుంది కావ్య. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా నేను నిజం చెప్పనని అంటాడు రాజ్. దాంతో రాజ్ అలాగే బాత్‌రూంలో నుంచి వచ్చేస్తాడు. అక్క జీవితం గురించి అప్పూ బాధపడుతూ ఉండగా రుద్రాణి చూస్తుంది. ఆ ధాన్యలక్ష్మీని తీసుకొచ్చి ఈ పొట్టిదాన్ని చూపిస్తే ఇంట్లో గొడవ ఖాయమని అనుకుంటుంది. వెంటనే ధాన్యలక్ష్మీ దగ్గరికి వెళ్లి లాక్కొస్తుంది. నీ కోడలు ఇప్పుడేమైనా నార్మల్‌గా ఉందా? కడుపుతో ఉంది.. కడుపుతో ఉన్నవాళ్లు ఎంత హ్యాపీగా ఉండాలి, కానీ నీ కోడలు ఎలా ఉందని ప్రశ్నిస్తుంది. ఆ కావ్య - రాజ్‌ల ఎఫెక్ట్ నీ కోడలి మీద పడుతుందని కానీ నువ్వు నా మాట వినలేదని.. ఇప్పుడు వాళ్ల కారణంగా అప్పూ కన్నీళ్లు పెట్టుకుంటుందని చెబుతుంది రుద్రాణి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










