Brahmamudi October 9th Episode: ధాన్యలక్ష్మీ వేరు కాపురం.. దుగ్గిరాల కుటుంబానికి శత్రువులా రాజ్

Photo Courtesy: JioHotstar

కావ్య - రాజ్‌ల మధ్య గొడవల కారణంగా డల్‌గా ఉన్న అప్పూని ధాన్యలక్ష్మీకి చూపిస్తుంది రుద్రాణి. నువ్వు జాగ్రత్త పడకుంటే అప్పూకి అబార్షన్ అయిపోతుందని హెచ్చరిస్తుంది. దాంతో కళ్యాణ్‌ని పిలిచి అప్పూని బయటికి తీసుకెళ్లమని చెబుతుంది ధాన్యం. తల్లి మాట ప్రకారం అప్పూ రాను అంటున్నా వినకుండా ఆమెకు బయటికి తీసుకెళ్తాడు కళ్యాణ్. రాజ్ మనసులో నిజం రాబట్టాలని విడాకులకు ఏర్పాట్లు చేయమని లాయర్‌తో ఫేక్ కాల్ మాట్లాడుతుంది కావ్య. అది విన్న అప్పూ బాధపడుతూ లోపలికి వెళ్లిపోతుంది. అప్పూని చూసిన ధాన్యలక్ష్మీ.. తిరిగి వెనక్కి వచ్చేయడంతో ఏం జరిగిందని అడుగుతుంది. కావ్య ఎదురవ్వడంతో అప్పూ బాధపడుతూ వచ్చేసిందని చెబుతుంది రుద్రాణి.

విడాకుల గురించి రాజ్- కావ్యల మధ్య గొడవ జరుగుతుంది. విడాకులు ఇచ్చేస్తానని, ఎక్కడ సంతకాలు పెట్టాలో చెబితే పెట్టేస్తానని రాజ్ తెగేసి చెప్పడంతో అప్పూ కళ్లు తిరిగి కిందపడిపోతుంది. నీ వల్లే అప్పూకి ఈ పరిస్ధితి వచ్చిందని, కావ్యను పక్కకు నెట్టేస్తుంది ధాన్యలక్ష్మీ. అప్పూకి స్ట్రెస్ బాగా పెరిగిపోయిందని ఈసారి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్పడంతో కళ్యాణ్, ధాన్యలక్ష్మీలు షాక్ అవుతారు. నా వల్లే అప్పూకి ఈ పరిస్ధితి వచ్చిందని కళ్యాణ్‌కు రాజ్ క్షమాపణలు చెబుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక అక్టోబర్ 9వ తేదీ ఎపిసోడ్ 847లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial October 9th 2025 Episode 847 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

రాజ్‌కి డాక్టర్ ఫోన్ చేసి కావ్యకి ఎప్పుడు నిజం చెబుతారని అడుగుతుంది. అంత క్లారిటీగా చెప్పినా పరిస్ధితి ఎందుకు అర్ధం చేసుకోవడం లేదని డాక్టర్ నిలదీస్తుంది. నాక్కూడా చెప్పాలనే ఉందని, చెప్పాక కళావతి ఎక్కడ ఒప్పుకోదో అని భయంగా ఉందని చెబుతాడు రాజ్. మీరు ఇలా భయపడితే కావ్య గారికి ఐదో నెల వచ్చేస్తుందని, ఒక్కసారి 5 నెల వస్తే అబార్షన్ చేయడం కుదరదని తేల్చేస్తుంది డాక్టర్. ఆ తర్వాత తల్లిని, బిడ్డని ఇద్దరినీ కోల్పోతారని ... వీలైనంత త్వరగా కావ్య గారికి ఈ విషయం చెబుతారో లేదో ఆలోచించుకోమ్మని వార్నింగ్ ఇస్తుంది డాక్టర్. ఇప్పటికైనా నిజం చెప్పమని రాజ్‌తో కళ్యాణ్ చెప్పినా.. నిజం చెప్పడానికి రాజ్ ఒప్పుకోడు.

కావ్య - రాజ్‌ల పరిస్ధితిపై కలగన్న అప్పూ ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. పరిస్ధితులు చూస్తుంటే గొడవలు రోజు రోజుకు పెద్దవి అయిపోతున్నాయని, నేను అక్కతో మాట్లాడాలని అనుకుంటుంది. ఇంతలో ధాన్యలక్ష్మీ జ్యూస్‌ తీసుకుని వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. అక్క దగ్గరికి వెళ్తున్నానని అప్పూ చెప్పడంతో ఇప్పుడేం అక్కర్లేదని అంటుంది ధాన్యలక్ష్మీ. జ్యూస్ ఇచ్చినా తాగకపోవడంతో అప్పూపై ధాన్యం మండిపడుతుంది. ఇలా వద్దు అంటూనే పరిస్ధితిని ఇక్కడి దాకా తీసుకొచ్చావ్, ఇంత జరిగాక కూడా మళ్లీ అక్కడికే వెళ్తానంటావా అంటూ రగిలిపోతుంది. నా కళ్ల ముందే అక్క జీవితం ముక్కలవుతుంటే తట్టుకోలేనని అంటుంది అప్పూ.

మీ అక్క గురించి ఆలోచిస్తూ, నీ కడుపులోని బిడ్డని నిర్లక్ష్యం చేస్తావా? నన్ను విసిగించొద్దని మండిపడుతుంది ధాన్యం. అత్తగారి దెబ్బకి జ్యూస్ తాగి, టాబ్లెట్ వేసుకుంటుంది అప్పూ. బయటికి వస్తుండగా ధాన్యానికి రుద్రాణి ఎదురై.. ఇలాంటి పరిస్ధితి వస్తుందని నేను ముందే వార్నింగ్ ఇచ్చానని అంటుంది. నీకు కొంచెం కూడా బాధ్యత లేదని.. నీకు మనవడో, మనవరాలో కావాలా? వద్దా? అని నిలదీస్తుంది రుద్రాణి. నాకు వారసుడు కావాలని ధాన్యం చెప్పగా.. నీ మనవడు ఆరోగ్యంగా పుట్టాలని లేదా? నీ కోడల్ని సంతోషంగా ఉంచాల్సిన ఉద్దేశం లేదా? అని రెచ్చగొడుతుంది. ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతుంటే సైలెంట్‌గా ఉంటావా? అని మండిపడుతుంది.

ఒంటరిగా బాధపడుతున్న కావ్యని ఇందిర, అపర్ణలు ఓదారుస్తారు. అప్పూకి ఈ పరిస్ధితి రావడానికి కారణం నేనే, నా బిడ్డను ఆయన వద్దు అన్నప్పటి నుంచి ఈ ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయని అంటుంది. నా జీవితం ఎక్కడ పాడైపోతుందోనని అది బెంగ పెట్టుకున్నట్లుగా ఉందని, నా గురించి ఆలోచిస్తూ టైంకి సరిగా తినకుండా ఈ పరిస్ధితి తెచ్చుకుందని, నేను ఆయనకి విడాకులు ఇస్తానని చెప్పిన దగ్గరి నుంచి అప్పూలో భయం ఇంకా పెరిగిందని అంటుంది కావ్య. ఇదంతా నాటకమని చెప్పేద్దామని అనుకున్నానని, ఆయనకి ఇది తెలిసిపోతుందని చెప్పకుండా ఆగిపోయానని అంటుంది కళావతి. ఈ నిజాన్ని దాయడం వల్ల ఇంత జరుగుతుందని తెలిస్తే అప్పుడే అప్పూకి నిజం చెప్పేసేదాన్నని అంటుంది కావ్య.

ఇప్పటికైనా అప్పూకి నిజం చెప్పేస్తానని కావ్య వెళ్లబోతుండగా ఇందిర అడ్డుకుంటుంది. నా మనవడు ఇప్పుడిప్పుడే కాస్త భయపడుతున్నాడని, ఇలాంటి టైంలో నువ్వు అప్పూకి నిజం చెబితే వాడికి కూడా తెలుస్తుందని భయపడుతుంది. తెలిసినా పర్లేదని నా కారణంగా, నా చెల్లెలు ఇలా అయిపోతుంటే చూస్తూ ఉండలేనని అప్పూ దగ్గరకి వెళ్తుంది. ఇంతలో ధాన్యలక్ష్మీ ఎదురై నువ్వు ఏం చేయాలనుకుంటున్నావ్? నీ ఉద్దేశం ఏంటో చెప్పమని అంటుంది. ఇంట్లో జరుగుతున్న అన్ని గొడవలకు కారణం రాజ్ - కావ్యలేనని, వీరి వల్ల ఎవ్వరికీ మనశ్శాంతి లేదని, నా కోడలి ఆరోగ్యం పాడు కావడానికి కారణం వీల్లేనని మండిపడుతుంది ధాన్యం. నా కోడలు, నీ కోడలు అని వేరు చేస్తూ ఎందుకు మాట్లాడుతున్నావని అపర్ణ ఫైర్ అవుతుంది.

ఇదంతా మన కుటుంబం అనుకున్నానని.. నా కోడలి పరిస్ధితి చూశాక నాకు ఆ నమ్మకమే పోయిందని అంటుంది ధాన్యలక్ష్మీ. ఇప్పుడు నీకు ఏం కావాలి పిన్ని అని రాజ్ అడుగుతాడు. మళ్లీ మన ఇంట్లో ఇలాంటి గొడవలు జరగవన్న నమ్మకం కావాలి? ఇవ్వగలవా? అని ధాన్యం నిలదీస్తుంది. నీ మాటే నెగ్గాలని నువ్వు, తన బిడ్డ తనకు కావాలని కావ్య.. ఇది ఎప్పటికీ తేలుతుంది, కానీ ఈరోజు ఇప్పుడే తేలిపోవాలని అంటుంది. రేపటి నుంచి ఈ ఇంట్లో ఏ గొడవలు జరగడానికి వీల్లేదని, నాకు మాత్రం నా కోడలు, దాని బిడ్డే ముఖ్యమని తేల్చేస్తుంది ధాన్యం. అప్పూకి అలా జరగడం ఇంట్లో అందరికీ బాధగానే ఉందని, కానీ ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేననని చెబుతాడు రాజ్.

మీరు పెద్దవాళ్లు కొంచెం అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించమని రాజ్ బతిమలాడతాడు. మీరు మీ నిర్ణయం చెప్పకపోతే.. నా నిర్ణయం నేను తీసుకుంటానని అంటుంది ధాన్యలక్ష్మీ. నా కోడలి గురించి, దాని కడుపులోని బిడ్డ గురించి పట్టింపు లేనప్పుడు మనం ఈ ఇంట్లో ఎందుకు ఉండాలని అంటుంది ధాన్యం. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. అప్పూని, కళ్యాణ్‌ని తీసుకుని బయటికి వెళ్లిపోదామని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే.. మమ్మల్ని ఉండమంటావా? వెళ్లిపోమంటావా? అని రాజ్‌ని నిలదీస్తుంది ధాన్యలక్ష్మీ. కావ్య తన మాట వినడం లేదని రాజ్ చెప్పగా.. పోనీ నువ్వు తన మాట వినమని అంటుంది ధాన్యం. అది జరగని పని అని రాజ్ చెప్పగా.. అయితే నేను కూడా ఈ ఇంట్లో ఉండటం కూడా జరగని పని అని తేల్చేస్తాడు రాజ్.

నీకు సమస్య వస్తే దానిని ఎలా పరిష్కరించుకోవాలో నువ్వే ఆలోచించుకో, అంతేకానీ నా విషయంలో మాత్రం జోక్యం చేసుకోవద్దని మండిపడతాడు రాజ్. మేం ఇంట్లో నుంచి వెళ్లిపోతామన్నా.. నీ మొండితనం వదులుకోవా? అని ధాన్యం నిలదీస్తుంది. నేను వదులుకోలేనని, నా కారణాలు నాకున్నాయని చెబుతాడు రాజ్. అంటే మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని చెబుతున్నావా? అని ధాన్యం అడగ్గా.. మీ నిర్ణయం అదే అయితే నేను అడ్డుపడనని అంటాడు రాజ్. ఆ మాటలతో సీతారామయ్య మండిపడుతూ.. రాజ్‌ని లాగి పీకుతాడు. వీళ్లని ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెబుతావా? ఈ ఇంటిని ముక్కలు చేయాలని చూస్తున్నావా? అని మండిపడతాడు. నీ మాట వినకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని చెప్పావ్.. నువ్వు చేస్తున్న పని తప్పు, నువ్వు వెళ్తున్న దారి తప్పని ముందు నుంచి చెబుతూనే ఉన్నానని అంటాడు సీతారామయ్య.

తప్పుని సరిదిద్దుకోవడం మానేసి ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నావా? నా ప్రాణాలు ఉన్నంత వరకు దుగ్గిరాల కుటుంబం అంటే అందరూ ఒకే ఇంట్లో ఉండాలని చెబుతాడు సీతారామయ్య. కుటుంబం అన్నాక వాళ్లకి నచ్చనివి జరుగుతుంటే గొడవలు చేస్తారని, ఇంటి బాధ్యతలు తీసుకున్న నువ్వు వాళ్లకి నచ్చే విధంగా ప్రవర్తించాలి, లేకపోతే వాళ్లని ఒప్పించాలని అంటాడు. ఏ చిన్న గొడవ జరిగినా ఎవరి పాటికి వాళ్లు వెళ్లిపోతే.. ఇక కుటుంబం అన్న పదానికి అర్ధం ఏంటీ? నువ్వు చేస్తున్నది తప్పని అందరూ అంటున్నారు దానికి నీ సమాధానం ఏంటీ అని సీతారామయ్య ప్రశ్నిస్తుంది. కడుపు తీయించుకోమంటే ఏ ఆడది ఒప్పుకుంటుంది? ఈ ఇంట్లో అందరి కోసం ఎంతో కష్టపడ్డానని, ఇంత మంది వద్దు అంటున్నా నేను ఇలా ఎందుకు ఉన్నానో ఎవరూ అర్ధం చేసుకోవడం లేదని అంటాడు రాజ్. నాకు ఇప్పట్లో ఏ బిడ్డా వద్దని, కళావతిని మీరే ఒప్పించాలని చెప్పి వెళ్లిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X