Brahmamudi September 10th Episode: కావ్యపై విషం కుట్ర ఫెయిల్.. మరో కుతంత్రానికి తెర తీసిన రుద్రాణి
Photo Courtesy: JioHotstar
మీరు పిల్లల్ని కని ఇంటికి వారసుల్ని తెస్తారా? ఈ పౌడర్ తాగితే... ఈ కడుపులో పెరిగే వారసులు కళ్లు తెరవకుండానే పరలోకానికి వెళ్లిపోతారు అంటూ చేతిలో విషాన్ని పట్టుకొని డైలాగ్స్ కొట్టింది. సో.. ఇంటికి వారసురాలు.. నా మనవడే అవుతాడు అని రుద్రాణి ఛాలెంజ్ చేసింది. ఆ తర్వాత పూజ చేయడానికి సిద్దంగా ఉన్న పూజారిని అక్కడి నుంచి పంపించేసి.. తీర్థంలో విషం కలిపేందుకు ప్లాన్ వేసింది. అయితే మీరు త్వరగా విగ్రహాన్ని తీసుకు రండి అంటూ రుద్రాణికి పూజారి ఆర్డర్ వేయడంతో చేసేది ఏమీ లేక.. మరో ప్లాన్ వేసింది.
పూజారికి ఫోన్ చేసింది. అతడు ఫోన్ ఎత్తి హలో హలో అంటే.. ఇక్కడ సిగ్నల్ రాదు అని అతడిని బయటకు పంపించి.. తీర్థంలో పౌడర్ కలిపేసింది. ఆ తర్వాత వెనక్కి చూడగా.. తన వెనుకే కనకం, స్వరాజ్ సీరియస్‌గా చూస్తూ ఉండిపోవడంతో.. పౌడర్ కలపడం వీరు చూశారా? అని మనసులో కంగారు పడిపోయింది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 10వ తేదీ ఎపిసోడ్ 822లో ఇంకా ఏం జరిగిందంటే?

కావ్య, అప్పు ప్రెగ్నెన్సీని పడగొట్టడానికి తీర్థంలో విషం కలిపిన రుద్రాణి వైపు స్వరాజ్, కనకం చూస్తుంటూ.. ఆమె వణికిపోయింది. కొంపదీసి నేను విషం కలుపుతుంటే చూశారా అని మనసులో అనుకొంటూ భయపడింది. చివరకు ధైర్యం తెచ్చుకొని ఏంటి? అలా చూస్తున్నారు అంటే.. నీవు చేసిన పనికి అంటూ కనకం జవాబిచ్చింది. తప్పు చేశావని భయమేసిందా? ఏం చేస్తున్నావు? అని స్వరాజ్ నిలదీశాడు. నేనేం చేశాను అంటూ.. ఈ ఇంటి వారసుడు జ్యూస్ అడిగితే.. ఇవ్వకుండా ఖాళీగా తిరుగుతున్నావు అని స్వరాజ్ అనగానే.. హమ్మయ్య అసలు విషయం తెలియలేదు అంటూ రుద్రాణి ఊపిరి పీల్చుకొన్నది. చెప్పిన పని చేయాలని తెలియదా? అని స్వరాజ్ మళ్లీ అంటే.. ఏంటిరా? నా ఇష్టం. నా ఇల్లు. నాకు చేయాలనిపిస్తే చేస్తాను. లేదంటే లేదు. అయినా నీవేమైనా ఓనర్ అనుకొంటున్నావా? నీవు చెప్పిన పని చేయడానికి అని రుద్రాణి ప్రశ్నించింది.
దాంతో అవును.. వాడు ఓనరే.. నా డార్లింగ్ అంటూ కనకం అంటే.. అవును నా డార్లింగ్ అంటూ స్వరాజ్ కూడా అన్నాడు. మీరు ఏమని పిల్చుకొంటే నాకేం సంబంధం లేదు అని రుద్రాణి అంటే.. వెళ్లి జ్యూస్ తీసుకు రా అని స్వరాజ్ ఆర్డర్ వేశాడు. దాంతో నేనేమైనా పని మనిషినా? నీకు జ్యూస్ తెచ్చి ఇవ్వడానికి అంటూ రుద్రాణి కసురుకొన్నది. అయితే చేస్తావా? నా ఫ్రెండ్‌కు చెప్పాలా? అని స్వరాజ్ బెదిరిస్తే.. వెంటనే చేస్తాను. జ్యూస్ తెచ్చి ఇస్తాను అంటూ వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా, రాజ్ తన సోదరులతో కలిసి వినాయకుడిని తీసుకు రావడంతో పూజారి గణపతిని ప్రతిష్టించాడు. ఇంటి సభ్యుల ఆనందోత్సహాల మధ్య పూజ నిర్వహించారు.
దూరంగా ముసుగులో ఉన్న రేవతిని చూసి.. అక్కా రాజ్ పిలుస్తూ.. హారతి తీసుకోమన్నాడు. తల్లిని కూడా పిలువు అంటూ చెప్పడంతో రేవతి పూజకు దగ్గరగా వచ్చింది. అపర్ణ హారతి ఇస్తుండగా.. హారతి ఇచ్చినా ముసుగు తీయరా? అని అంటే.. ఇంటి సభ్యురాలు వెళ్లి బలవంతంగా ముసుగు తీసేందుకు రుద్రాణి ప్రయత్నించారు. దాంతో పక్కనే ఉన్న వ్యక్తి మీ శవయాత్రకు అన్ని ఏర్పాట్లు చేసుకోండి అని అరిచాడు. దాంతో ఆ ప్రయత్నాన్ని మానుకొన్నారు. అలా పూజ కార్యక్రమం ముగిసింది. అందర్నీ తమ మనసులో ఉన్న కోరికలను వినాయకుడికి చెప్పి కోరుకోండి అంటూ ఒక్కొక్కరు తమ మనసులోని కోరికలను చెప్పుకొన్నారు. స్వరాజ్ చాలా సేపు కోరుకొంటే.. అపర్ణ ఏం కోరుకొన్నావు అంటే.. జీవిత కాలం నన్ను ఈ ఇంటిలో ఉండేలా చూడమని కోరుకొన్నాను అంటే.. ఏం అమ్మా.. స్వరాజ్‌ను మా ఇంట్లో వదిలేస్తావా? అని అపర్ణ అడిగింది. దాంతో రాజ్ అమ్మమ్మ అడ్డు పడుతూ.. ఏం మాట్లాడుతున్నావు.. వాళ్లు ఏమని అనుకొంటున్నారు అంది.
దాంతో రేవతి ఎమోషనల్ ఏడ్చింది. రాజ్ ఊరడించే ప్రయత్నం చేశారు. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. మీ అందరితో కలిసి ఈ ఇంటిలో ఈ ఆనందాన్ని పంచుకొంటానని ఊహించుకోలేదు అని రేవతి అంటే.. రాజ్ ఓదార్చాడు. ఇంట్లో జరిగిన విషయాలు చూసి రుద్రాణి రగలిపోయింది. తన కొడుకు తల్లిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఏదో తేడా ఉంది.. కనిపెట్టాలి అని రుద్రాణి అంటే.. ఇంతకు విషం తీర్థంలో కలిపావా? లేదా? అంటే.. ఎప్పుడో కలిపాను. కాసేపట్లో కడుపులోకి వెళ్లి పోతుంది అని తల్లి అంటే.. టాబ్లెట్స్ సరిగా కలిపావా? అంటే.. ఒకటి కాదు రెండు కలిపాను అని రుద్రాణి అంది. అయితే మనం చేసేది చెడ్డపని కదా.. ఈ విషయంలో దేవుడు సహాయం చేస్తాడా? అని కొడుకు అడిగిన ప్రశ్నకు రుద్రాణి అదో రకంగా నవ్వుతూ.. చేయించేది.. చేసేది అంతా పైవాడే.. మనం నిమిత్తమాత్రులం అనే విధంగా డైలాగ్ కొట్టింది. దాంతో కొడుకు నీకు చాలా తెలుసు అంటూ కామెంట్ చేశాడు.
ఇక పూజారి అందరికి తీర్థం ఇస్తుంటే.. రుద్రాణి, తన కొడుకు ఇద్దరు టెన్షన్ చూస్తుండిపోయారు. చివరకు కావ్య వద్దకు రాగానే టెన్షన్ మరింత పెరిగింది. తీర్థం కావ్య చేతిలోపోయగానే.. వారికి టెన్షన్ డబుల్ అయింది. అంతలోనే స్వరాజ్ వచ్చి.. తీర్థం నాకు అంటూ వచ్చి పూజారిని తాకాడు. దాంతో తీర్ణం అంతా కిందపడిపోయింది. దాంతో రుద్రాణి తన ప్లాన్ పాడైందని, కోపంతో ఊగిపోయింది. స్వరాజ్‌పై అరిస్తే.. రేవతి నానమ్మ ఆపు.. ఇంటికి వచ్చిన అతిథులపై అరుస్తావా? సారీ చెప్పు అంటూ గద్దించింది. వీడు నా ఫ్రెండ్.. వీడిని ఎవరు ఏమీ అనడానికి వీల్లేదు అంటూ అపర్ణ తెగేసి చెప్పేసింది. ఆ సమయంలో ఈ రుబ్బు రోలుకు సరిగా ఉండమని చెప్పండి అని స్వరాజ్ అంటే.. ఏంటిరా నాకే పేర్లు పెడుతావా? చిన్నా పెద్దా లేదా? అంటూ రుద్రాణి అరిచింది. దాంతో ఏంటి రుద్రాణి.. చిన్న పిల్లాడితో కూడా మాట పడుతావా? అని కనకం అంది. అయితే గొడవను ఆపేందుకు ప్రయత్నిస్తూ.. ఎలాంటి విఘ్నాన్ని ఆపడానికి స్వరాజ్ చేత ఈ పని చేయించి ఉంటాడో అని ఇంటి పెద్ద అన్నాడు. అలా పూజ ముగిసింది. ఆ తర్వాత పూజారితోపాటు అందరికి భోజనాలు ఏర్పాటు చేసే పనిలో కావ్య పడింది. అయితే ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయినందుకు రుద్రాణి, ఆమె కొడుకు ఇద్దరు చర్చించుకొన్నారు. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే.. మరోసారి గట్టిగా ప్రయత్నించాలని టైమ్ చెప్పింది.
ఇక వంటింటో ఉన్న కావ్యతో రాజ్ సరసాలు, రొమాన్స్ చేస్తుంటే.. నానమ్మ వచ్చి అసలు బాగుండదు అంటూ కామెంట్ చేసింది. అయితే గారెలు సరిగా కాల్చుతుందా? లేదా అని చూస్తున్నాను అని అంటే.. అవి గారెలు కావు.. బూరెలు అని చమత్కరించింది. దాంతో రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో ఈ వారం ఎపిసోడ్ ముగిసింది.
ఇక తదుపరి ఎపిసోడ్‌లో రుద్రాణి మరోసారి తన కుట్రలకు పదునుపెట్టింది. అయితే ఫోన్లో మాట్లాడుతుండగా రేవతిని రుద్రాణి చూసింది. దొంగతనంగా ఇంట్లోకి వచ్చిన వారిపై దొంగతనం ఆరోపణ చేస్తే.. వాళ్లే బయటపడుతారు అని తన కొడుకుతో అంది. ఇంట్లో విలువైన ఆభరణం తీసి రేవతి బ్యాగులో వేసింది. ఆ తర్వాత నా నెక్లెస్ కనిపించడం లేదు అని కావ్య అంటే.. ఇంట్లోకి వచ్చిన కొత్తవాళ్లే తీసి ఉంటారేమో అని రుద్రాణి అంది. ఇక నెక్ట్స్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
Photo Courtesy: JioHotstar


Click it and Unblock the Notifications











