Brahmamudi September 11th Episode: రేవతిపై దొంగతనం నేరం.. ఇంటి ఆడపడుచుపై రుద్రాణి కుట్ర

Photo Courtesy: JioHotstar

పూజారి అందరికి తీర్థం ఇస్తుంటే.. రుద్రాణి, తన కొడుకు చూస్తుండిపోయారు. చివరకు కావ్య వద్దకు రాగానే టెన్షన్ మరింత పెరిగింది. అంతలోనే స్వరాజ్ వచ్చి.. తీర్థం నాకు అంటూ వచ్చి పూజారిని తాకాడు. దాంతో తీర్ణం అంతా కిందపడిపోయింది. దాంతో రుద్రాణి తన ప్లాన్ పాడైందని, కోపంతో ఊగిపోయింది. స్వరాజ్‌పై అరిస్తే.. రేవతి నానమ్మ ఆపు.. ఇంటికి వచ్చిన అతిథులపై అరుస్తావా? సారీ చెప్పు అంటూ ఆర్డర్ వేసింది. వీడు నా ఫ్రెండ్.. వీడిని ఎవరు ఏమీ అనడానికి వీల్లేదంటూ అపర్ణ తేల్చేసిది. ఈ రుబ్బు రోలుకు సరిగా ఉండమని చెప్పండి అని స్వరాజ్ సెటైర్లు వేస్తాడు. నాకే పేర్లు పెడుతావా? చిన్నా పెద్దా లేదా? అంటూ రుద్రాణి ఫైర్ అయ్యింది.

దాంతో ఏంటి రుద్రాణి.. చిన్న పిల్లాడితో కూడా మాట పడుతావా? అని కనకం అంది. అయితే ఎలాంటి విఘ్నాన్ని ఆపడానికి స్వరాజ్‌ చేత ఈ పని చేయించి ఉంటాడో అని సీతారామయ్య అన్నాడు. పూజ ముగిసిన తర్వాత పూజారితోపాటు అందరికి భోజనాలు ఏర్పాటు చేసే పనిలో కావ్య పడింది. తీర్ధంలో విషం ప్లాన్ అట్టర్ ఫ్లాప్ కావంతో రుద్రాణి, రాహుల్‌లు బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఒక ప్లాన్ ఫెయిల్ అయితే.. మరోసారి గట్టిగా ప్రయత్నించాలని టైమ్ చెప్పింది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 11వ తేదీ ఎపిసోడ్ 823లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial September 11th 2025 Episode 823 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

వినాయక చవితి పూజ ముగిసిన తర్వాత వంట పనిచేస్తుంది కావ్య. భార్యతో సరసాలు ఆడుతూ ఇందిరకు దొరికిపోతారు కావ్య- రాజ్. ఇలా మీ ఇద్దరినీ చూడాలని ఎన్నాళ్లుగానో కలలు కన్నానని.. ఏదో ఒక సమస్య వచ్చి మీ ఇద్దరినీ దూరంగా నెట్టేసేదని చెబుతుంది ఇందిర. పెళ్లయి ఈ ఇంట్లో అడుగుపెట్టాక.. రేపు ఏం జరుగుతుందోనన్న భయం లేకుండా ఉన్నది ఇప్పుడేనని చెబుతుంది కావ్య. జీవితం ఎప్పుడూ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందోనని అంటుంది. ఆ రుద్రాణి గారి దిష్టి మా మీద పడకుండా ఉంటే మేం హాయిగా ఉండొచ్చని చెబుతుంది కావ్య.

చిన్న పిల్లలు ఆడుకునే వీడియోలు చూస్తూ నవ్వుకుంటుంది కావ్య. ఇంకో 9 నెలలు పూర్తయితే నీ కడుపులోని పిల్లాడు కూడా బయటికి వస్తాడు కదా? అప్పుడు వాడి అల్లరితో ఏడిపిస్తాడని చెబుతుంది ఇందిర. నాకు కూడా చాలా ఆశగా ఉందని, వాడు నా కడుపులో నుంచి బయటికి వచ్చి నన్ను అమ్మ అని పిలిస్తే నాకు వినాలని ఉందని అంటుంది. ఈ మాటలు విన్న అప్పూ బాధపడుతుంది. ఆ దేవుడు నీకు ఆ అదృష్టాన్ని ఇస్తాడో లేదోనని భయంగా ఉందని అనుకుంటుంది అప్పూ. తల్లి అయ్యే యోగం ఆ దేవుడు అందరికీ ఇవ్వడని, నీ అదృష్టం.. అక్కా చెల్లెల్లు ఇద్దరూ ఒకేసారి తల్లి కాబోతున్నారని మెచ్చుకుంటుంది ఇందిర.

ఇంతలో కావ్య ఫోన్‌కి డాక్టర్ ఫోన్ చేయడంతో అప్పూ లిఫ్ట్ చేస్తుంది. మీ అక్క తన బిడ్డను కడుపులో మోసే ఛాన్స్ లేదని, అబార్షన్ చేయక తప్పదని చెబుతుంది డాక్టర్. ఆ మాటలతో అప్పూ షాక్ అవుతుంది. వెంటనే ఈ విషయం మీ అక్కకి చెప్పాలని డాక్టర్ చెప్పగా.. ఇంట్లో ఈరోజు వినాయక చవితి పూజ జరుగుతోందని, ఈ టైంలో ఈ విషయం అక్కకి చెబితే బాధపడుతుందని అంటుంది అప్పూ. ఇంతలో కావ్య వచ్చి ఏం జరిగిందని అడగ్గా.. కస్టమర్ కేర్ వాళ్లని అబద్ధం చెబుతుంది.

రేవతి ఫోన్‌లో తన భర్తతో మాట్లాడుతుండగా అపర్ణ అటు వైపు రావడాన్ని చూసి రుద్రాణి, రాహుల్‌లు ఆమెను ఆపుతారు. అందరం భోజనాలు చేయాలి కదా? అరిటాకులు కట్ చేసి తీసుకెళ్దామని వచ్చానని చెబుతుంది అపర్ణ. ముసుగు మనిషి రేవతని గుర్తించిన రుద్రాణి షాక్ అవుతుంది. లాస్ట్ టైం వెళ్లినప్పుడే మీ అమ్మ అంత గొడవ చేసింది? ఇప్పుడు మళ్లీ ఆ ఇంటికే వెళ్లావు.. ఈసారి మళ్లీ ఏం గొడవ చేస్తుందోనని చాలా టెన్షన్‌గా ఉందని చెబుతుంది రేవతి. ఆ టెన్షన్, భయం నాక్కూడా ఉన్నాయని.. కానీ వాళ్లు మన అబ్బాయి మీద చూపిస్తున్న అభిమానం, ప్రేమ ముందు ఆ భయం ఎగిరిపోయిందని అంటుంది. ఇక్కడ అంతా మంచే జరుగుతుందని, అమ్మ నన్ను కూతురిగా అంగీకరించి తిరిగి ఈ ఇంట్లోకి రానిస్తే చాలని చెబుతుంది రేవతి. మీ అమ్మ ఖచ్చితంగా నిన్ను కూతురిగా అంగీకరిస్తుందని, మళ్లీ ప్రేమతో ఒక్కటవుతారని చెబుతాడు జగదీష్.

ఈ మాటలు విన్న రుద్రాణి.. నీ సంగతి తేలుస్తానని అనుకుంటుంది. ఇంతలో రాహుల్ రావడంతో.. ఆ ముసుగు గెటప్‌లో వచ్చింది ఎవరో కాదు, అపర్ణ వదిన పెద్దకూతురు రేవతి అని చెబుతుంది. తను రేవతి అన్న విషయం రాజ్‌తోనే చెప్పించబోతున్నానని అంటుంది రుద్రాణి. దొంగతనంగా ముసుగు వేసుకొచ్చిన తన మీద దొంగతనం ముద్ర వేస్తే ఆటోమేటిగ్గా వాళ్లే బయటపడతారని అంటుంది. రేవతితో ఇందిర, కనకం, కావ్యలు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా చూసిన రుద్రాణి మీ పని చెబుతానని అనుకుంటుంది.

ఆ వెంటనే కావ్య గదిలోకి వెళ్లి అపర్ణ కొనిచ్చిన నెక్లెస్‌ని తీసుకెళ్లి ఆ రేవతి హ్యాండ్ బ్యాగ్‌లో పెడితే దాని మీద దొంగ అనే ముద్ర పడుతుందని ప్లాన్ చేస్తుంది రుద్రాణి. ముసుగు వేసుకొచ్చినంత మాత్రాన నేను నిన్ను కనిపెట్టలేనని అనుకున్నావ్ కదా అని అనుకుంటుంది రుద్రాణి. ఇంతలో తన కబోర్డ్ లాక్ చేయడం మరిచిపోయిన కావ్య.. తన గదిలోకి వెళ్తుండగా అపర్ణ పిలుస్తుంది. దాంతో రుద్రాణి టెన్షన్ పడుతుంది. కొట్టేసిన నెక్లెస్‌ని ఎలా రేవతి హ్యాండ్ బ్యాగ్‌లో వేయాలి అని ఆలోచిస్తుంది. స్వరాజ్ వచ్చి నాకు బాగా ఆకలి వేస్తోందని చెప్పడంతో పైన గదిలో నా హ్యాండ్ బ్యాగ్ పెట్టానని అందులో చాక్లెట్స్ ఉన్నాయని తీసుకోమని చెబుతుంది రేవతి.

స్వరాజ్ వెనుకే వెళ్లిన రుద్రాణి.. తన హ్యాండ్ బ్యాగ్‌లో నెక్లెస్ వేసి సంతోషిస్తుంది. ఇంతలో కనకం, రేవతి, స్వరాజ్‌లు అక్కడికి రావడంతో రుద్రాణి టెన్షన్ పడుతుంది. మీ రూమ్ అటు వైపు ఉంది కదా? ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నిస్తుంది కనకం. నేను రేవతి కోసం వచ్చానని రుద్రాణి చెప్పగా.. అంతా అబద్ధమని, ఆమె ఎవరి కోసం వచ్చిందో నాకు తెలుసు అంటాడు స్వరాజ్. ఆ మాటలు విన్న రుద్రాణి టెన్షన్ పడుతుంది. ఆమె నా చాక్లెట్స్ కొట్టేయడానికి అని స్వరాజ్ చెబుతాడు.

నీ చాక్లెట్స్ కొట్టేయడానికి నేను దొంగలా కనిపిస్తున్నానా? అని రుద్రాణి మండిపడుతుంది. నువ్వు పెద్ద గజదొంగలా కనిపిస్తున్నావని, ఆ హ్యాండ్ బ్యాగ్‌లో చాక్లెట్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలని అనుకుంటాడు స్వరాజ్. దాంతో తన ప్లాన్ ఎక్కడ బయటపడుతుందోనని రుద్రాణి టెన్షన్ పడుతుంది. మీ పిల్లాడు అన్నేసి మాటలు అంటుంటే మీరేం పట్టించుకోరా? పెద్దవాళ్లంటే రెస్పెక్ట్ లేదు, ఇలాగేనా పెంచేది అని మండిపడుతుంది రుద్రాణి. నా డార్లింగ్‌కి ఎప్పుడు? ఎక్కడ? ఎలా? బిహేవ్ చేయాలో బాగా తెలుసని అంటుంది కనకం. ఆంటీకి సారీ చెప్పమని రేవతి అనడంతో సారీ చెప్పేసి వెళ్లిపోతాడు.

రుద్రాణి వాలకం చూస్తే తను ఇంకేదో పనిమీద వచ్చినట్లుగా అనిపిస్తోందని రేవతితో అంటుంది కనకం. ఇంట్లో పనుల గురించి ప్రకాశం - ధాన్యలక్ష్మీ, సుభాష్ - అపర్ణలు గొడవపడతారు. వీళ్లది అలుమగల పోరాటం కాదని, ఆకలి పోరాటమని అంటాడు సీతారామయ్య. తన ప్లాన్ ఎలా వర్కవుట్ చేయాలా? అని రుద్రాణి, రాహుల్‌లు ప్లాన్ చేస్తారు. ఇంతలో కావ్య వచ్చి భోజనాలు రెడీ అని చెబుతుంది. కావ్యని చూసిన ధాన్యలక్ష్మీ.. నీ మెడలో నెక్లెస్ ఏమైంది? అని అడుగుతుంది. నీకు ఉదయమే ఇచ్చాను కదా? ఎందుకు వేసుకోలేదని నిలదీస్తుంది అపర్ణ. నువ్వు ఇచ్చిన నెక్లెస్ కావ్యకి నచ్చలేదేమో అని అంటుంది రుద్రాణి. ఇప్పుడే వెళ్లి నెక్లెస్ వేసుకుని వచ్చేస్తానని చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X