Brahmamudi September 16th Episode: స్పృహ కోల్పోయి కిందపడిన కావ్య.. టెన్షన్‌లో రాజ్, కుటుంబ సభ్యులు

Photo Courtesy: JioHotstar

రుద్రాణి చీటిల గేమ్‌లో భాగంగా స్వప్న - రాహుల్‌‌, కళ్యాణ్ - అప్పూ డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత రాజ్‌తో కావ్యకి ప్రపోజ్ చేయిస్తారు. ఈ సందర్భంగా కళావతి మీద తన ప్రేమను బయటపెడతాడు రాజ్. ఇప్పటి వరకు కావ్యను ఏడిపిస్తూనే ఉన్నానని, కానీ భవిష్యత్‌లో ఆమెకు కన్నీరు అంటే తెలియని ప్రపంచాన్ని ఇస్తానని చెబతాడు. నేను మొదటగా చూసి ఇష్టపడింది, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నది నిన్నే అన్నమాట అంటాడు రాజ్.

ఈ డ్యాన్స్ సమయంలోనే రేవతి ముసుగు తీయాలని ప్లాన్ చేసిన రుద్రాణి.. ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఈ గ్యాప్‌లో ముసుగు లాగేసింది. దాంతో ముసుగు వెనుకాల రేవతి ఉండటంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. రాధ పేరు చెప్పుకుని ఇంతసేపు నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నావా? అని ఫైర్ అవుతుంది. దాంతో రాజ్, ఇందిరలు మండిపడతారు. రేవతి తన ప్రేమని పెద్దవాళ్లకు చెప్పకుండా పెళ్లి వరకు తీసుకెళ్లింది ఎవరు? రేవతి ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం ఎవరు? అని ఇందిర నిలదీస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 16వ తేదీ ఎపిసోడ్ 827లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial September 16th 2025 Episode 827 Here is Today s full story

ముసుగు వేసుకొని రాధ పేరుతో ఇంటిలోకి వచ్చిన మహిళ తన మనవరాలు రేవతి అనే విషయం తెలిసిన తర్వాత రుద్రాణిని తన నానమ్మ కడిగి పడేసింది. తెలియని వయసులో తప్పుడు సలహాలు ఇచ్చి మాయ మాటలు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణమైంది ఎవరు? నువ్వు కాదా? అని నిలదీసింది. అయితే అప్పుడు ప్రేమించిన వాడు దక్కకపోతే చచ్చిపోతానంటే.. ఏదో ధైర్యం చెప్పడానికి అంటూ ఏదో చెప్పబోతే.. రుద్రాణి నోరు మూయించింది ఇంద్రాణి. ఇప్పుడు మాట్లాడాల్సింది నేను, నువ్వు కాదు అపర్ణ అంటూ గట్టిగా చెప్పింది. దాంతో కన్నీళ్లు పెట్టుకొంటున్న అపర్ణ ఎమోషనల్ అయింది. అయితే రేవతి ఇంటికి రావాలని కుటుంబ సభ్యులంతా కోరుకొంటున్నారు. అలాంటప్పడు ఆ విషయంలో నిర్ణయాన్ని, మనసును మార్చుకోవాల్సింది అపర్ణ అంటూ ఇంద్రాణి చెప్పింది.

అప్పుడెప్పుడూ తప్పు చేసిందని రేవతికి ఇప్పుడు శిక్ష వేయడం కరెక్ట్ కాదమ్మా. అక్క పెళ్లి చేసుకొనే సమయానికి నేను చిన్న పిల్లవాడిని. అక్క వెళ్లిపోతుంటే ఆపాలనే విషయం తెలియని వాడిని. కానీ మీరు ఎందుకు ఆపారు? మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పే. దానికి ఇంత శిక్ష వేయాలా? ఎవరైనా తప్పు చేస్తే క్షమించాలని నువ్వే చెప్పావు అమ్మా.. కానీ అక్క విషయం వచ్చే సరికి ఇంత మొండిగా ఎందుకు ఉంటున్నావమ్మా.. కుటుంబంలోని సభ్యుడిని కోల్పోవడం నీ 50 ఏళ్ల వయసులో అవసరమా? అందరం ఉండి కూడా అక్క అనాథగా బతకాలా? తన బిడ్డకు ఎవరు లేరని చెప్పుకోవాల్సిన ఖర్మ ఏమిటి? అంటూ రాజ్ తన బాధను వ్యక్తం చేశాడు. అత్తమ్మ.. తన తప్పు తాను తెలుసుకొన్నది. తన తప్పుకు మీరు పడుతున్న బాధను తెలుసుకొన్నది. తల్లి ప్రేమను తిరిగి పొందాలని ఆశపడుతున్నది. ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి అంటూ కావ్య కూడా నచ్చ జెప్పే ప్రయత్నం చేసింది. ఒక్కసారి అక్కను చూసి తన బాధను అర్ధం చేసుకొని తనను క్షమించండి అమ్మా అంటూ రాజ్ వేడుకొన్నాడు.

అయితే అంతా ఎమోషనల్‌గా మాట్లాడుతుంటే.. ముసుగేసుకొని వచ్చిన తర్వాత కూడా ఆమెను క్షమించాలా? అంటూ రుద్రాణి ఏదో అనబోతుంటే.. ముసుగులో ఉన్న ఆమె రేవతి అనే విషయం నాకు తెలుసు అని తల్లి అపర్ణ అనగానే.. అందరూ షాక్ అయ్యారు. నా కూతురును నేను గుర్తుపట్టలేనా? మొదట్లో తను చేసి పనికి కోపం వచ్చినా.. ఆ తర్వాత నా కూతురు దూరమైందనే బాధ నన్ను వెంటాడుతున్నది. గతంలో ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు అది చేసిన తప్పు మళ్లీ గుర్తుకు వచ్చి.. ఆ కోపాన్ని అదుపు చేసుకోలేక అరిచాను. ఎప్పటికీ క్షమించకూడదని అనుకొన్నా. కానీ ఒకరోజు నా మనవడిని తీసుకొని దాని ఇంటికి వెళ్లాను అని అని ఫ్లాష్ బ్యాక్ చెప్పింది. ఆ సందర్బంగా స్వరాజ్‌ మరిచిపోయిన వాటర్ బాటిల్‌ను ఇవ్వడానికి వెళ్లిన సమయంలో నా ఫ్రెండ్ నా మనవడే అని తెలుసుకొన్నాను అని చెప్పింది. ఆ సందర్భంగా రేవతి పడిన బాధ, ఆవేదన కళ్లారా చూశాను. తాను తప్పు చేశానని బాధపడటం నన్ను మార్చేసింది. 18 ఏళ్లు పెంచిన తర్వాత ఏ బిడ్డైనా ఇలా చేస్తే ఏ తల్లికి ఎంత బాధ ఉంటుంది? నేను చేసిన పనికి ఆమె వేసిన శిక్షకు నేను అర్హురాలిని అని రేవతి పడిన బాధను కుటుంబ సభ్యులతో చెప్పింది.

నా కూతురు పశ్చాత్తాపం నాలోని కోపాన్ని తగ్గించింది. రేవతి బాధను చూసి నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలిసింది అని అపర్ణ బాధపడింది. కానీ కన్నతల్లికి చెప్పకుండా పెళ్లి ఎలా చేసుకొంటుంది అనే కోపంలో దూరంగా వెళ్లమని శిక్ష వేశాను అని అపర్ణ అంది. పిల్లల తప్పును క్షమించడానికి నాలోని అహం అడ్డొచ్చింది. అందుకే ఇంటికి తీసుకు రాలేకపోయాను. తన ఇంటికి వెళ్లి చూసినప్పటి నుంచి నా కూతురు తిరిగి ఎప్పుడు వస్తుందని ఎదురు చూశాను. తను వస్తే.. గుండెల్లొ పెట్టుకొని చూసుకోవాలని ఎదురు చూశాను అని అపర్ణ కన్నీళ్ల పర్యంతమైంది. రేవతి.. నీవు ముసుగు వేసుకొని వస్తే.. గుర్తుపట్టలేనా? నీ ఊపిరి తగిలినా నేను గుర్తు పడుతాను అని అంది. ఆ ముసుగు తీసి అమ్మా అని ఎప్పుడు పిలుస్తావని ఎదురు చూశాను అని అపర్ణ అనగానే.. నన్ను క్షమించు అమ్మా అంటూ రేవతి అంది. అయితే ఇన్నాళ్లు అందరూ ఉన్నా స్వరాజ్‌ను ఎవరూ లేని వాడిలా పెంచినందుకు మీరంతా నన్ను క్షమించాలి అని అంది.

అపర్ణ మాటలు విన్న కావ్య స్పందిస్తూ.. అమ్మో.. మీరు మామూలు మనిషి కాదు. నాటకం ఆడుతుంది మేమే అనుకొన్నాం. కానీ ఇంత పెద్ద నాటకం ఆడుతున్నది మీరని అనుకోలేదు అని అంది. అయితే ఒక్క మాట చెబితే.. నేనే ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేదాన్ని కదా అని నానమ్మ అంది. రేవతి నా కూతురు అని తెలిసిన తర్వాత మమ్మల్ని కలుపాలని చూసింది నువ్వే.. అందుకు నీకే థ్యాంక్స్ చెప్పాలి అని కావ్యతో అపర్ణ అంది. అనుమానించినా.. అవమానించినా నువ్వే గెలిచావు అని తల్లి అంటే.. అక్కను తీసుకు వచ్చింది నేనైతే.. క్రెడిట్ కావ్యకు ఇస్తున్నావా? అని రాజ్ అంటే.. నీ రక్త సంబంధం.. రేవతిని తీసుకొచ్చే బాధ్యత నీదే అని రాజ్‌ను తండ్రి మందలిస్తే.. మీరంతా రక్త సంబంధం.. నేనే పరాయిదానినా అని కావ్య సెటైర్ వేసింది. దాంతో తల్లి.. ఇప్పడే నా కూతురు కలిసిన ఆనందంలో ఉన్నాం.. మళ్లీ రాద్దాంతం చేయకే..నీకు దణ్ణం పెడుతాను అని కావ్యను చూస్తూ అపర్ణ చేతులు జోడించింది. సరే అత్తయ్యా.. ఏం చేస్తాం.. మామయ్య గారి మాట విని వదిలేస్తా అని కావ్య అంది. ఆ తర్వాత స్వరాజ్‌, రేవతిని దగ్గరకు తీసుకొని అపర్ణ సంతోషంలో మునిగిపోయింది. రుద్రాణి కోపంతో ఊగిపోయింది.

అయితే పెద్దమ, రేవతి కలిసి పోవడంతో ఆనందంలో తల్లిని చేరిన బిడ్డ అనే కథను రాస్తా అని కవి కిరణ్ అంటే.. తల్లిని వీడిన మరో బిడ్డ అనే క్యాప్షన్‌తో మరో కథ కూడా రాయి అని అప్పు అంది. దాంతో కవి షాక్ అయి.. ఏంటి? అంటే.. రేవతి తల్లిని చేరిందని సంతోష పడుతున్నావు. కానీ మా అక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ చనిపోతుందని తెలియదు. ఆమెకు ఆ విషయం తెలియదు. అంతా గందరగోళంగా ఉందని అప్పు బాధపడింది.

ఇదిలా ఉండగా.. తాజా ప్రోమోలో నా కడుపులో బిడ్డ ఎవరు? నాకు ఎవరు పడుతారో చెప్పు అని అప్పును కావ్య అడిగితే. నీకు ఎవరు పుట్టరు. ఆ బిడ్డ పుడితే.. నీవు చనిపోతావు. నీవు బతకాలి అంటే బిడ్డను వదులుకోవాలి అని సమాధానం చెప్పింది. అయితే అప్పు మాటలకు షాకైన కావ్య.. నా ప్రాణం పోయినా బిడ్డను వదులుకోను అంటూ స్పృహ తప్పి పడిపోయింది. దాంతో రాజ్, అపర్ణ, ఇంటి సభ్యులందరూ షాక్ తిన్నారు.

Photo Courtesy: JioHotstar

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X