Brahmamudi September 17th Episode: కావ్య ఆరోగ్యంపై రాజ్ టెన్షన్.. అక్క కోసం అప్పూ కంటతడి

Photo Courtesy: JioHotstar

రేవతికి తప్పుడు సలహాలు ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చేశావంటూ రుద్రాణిపై ఇందిర మండిపడుతుంది. అక్క తెలిసి తెలియక చేసిన తప్పుని క్షమించాలని తల్లిని అడుగుతాడు రాజ్. అందరం ఉండి కూడా అక్క అనాథలా బ్రతకాలా? ఎవరైనా తప్పు చేస్తే క్షమించాలని చెప్పావని అంటాడు. రేవతి గారు తల్లి ప్రేమను తిరిగి పొందాలని ఆశపడుతున్నారని కావ్య కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. ముసుగు వేసుకుని వచ్చి మోసం చేయాలని చూస్తే క్షమించాలా? రుద్రాణి మండిపడుతుంది.

ముసుగులో వచ్చింది రేవతి అనే విషయం ముందే నాకు తెలుసని అపర్ణ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. మొదట్లో తను చేసిన తప్పుకు కోపం వచ్చినా, తర్వాత కూతురు దూరమైందని బాధపడ్డానని చెబుతుంది అపర్ణ. రేవతిని క్షమించడానికి నాలోని అహం అడ్డొచ్చిందని, తనను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని అంటుంది. ఆ మాటలతో తనను క్షమించాలని తల్లిని అడుగుతుంది అపర్ణ. ఆ తర్వాత స్వరాజ్, రేవతిని దగ్గరికి తీసుకుని మురిసిపోయింది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 17వ తేదీ ఎపిసోడ్ 828లో ఇంకా ఏం జరిగిందంటే?

కావ్య అక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ చనిపోతుందనే బాధ కలుగుతుంది. అక్కకు ఆ విషయం ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు. అక్క పరిస్థితి ఎంత క్రిటికల్‌గా మారుతుందోననే భయం వెంటాడుతున్నది. అంతా గందరగోళంగా ఉంది అంటూ కల్యాణ్‌తో అప్పు అంది. అంతలోనే ఫోన్ వస్తే ఎత్తకుండా వదిలేస్తే.. ఫోన్ ఎవరి నుంచి అంటే.. డాక్టర్ వద్ద నుంచి అంటూ సమాధానం ఇచ్చింది. అయితే ఎందుకు ఎత్తడం లేదని అడిగితే.. కావ్యకు ఈ విషయం చెప్పారా? అని అడుగుతుంది. నేను ఎప్పటికీ చెప్పలేనని ఎలా చెప్పాలి అని అప్పు అంది. ఈ విషయం గురించి నువ్వే చెప్పు అంటే.. ఈ సారి ఫోన్ వస్తే.. డాక్టర్‌నే చెప్పమని చెప్పు అంటూ ఫోన్ ఎత్తింది. దాంతో మీ అక్కకు ఈ విషయం చెప్పారా? అంటే లేదు అంటే.. ఎందుకు చెప్పలేదు. చాలా సీరియస్ విషయం అది అని డాక్టర్ అంటే.. పండగ కదా? అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ సమయంలో వారికి ఈ వార్త చెప్పి అందరి మూడ్ స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు అని అప్పు అంది.

మీరు ఇలాంటి విషయాన్ని చెప్పకుండా జాప్యం చేస్తున్నారా? ఎంత సీరియస్ అవుతుందో మీకు తెలియదు. జీవితంలో ఓడిన పోయిన వారిని అడగండి.. వారు ఏం చెబుతారో చూడండి. ఒక ప్రాణం విలువ తెలిసిన డాక్టర్ కాబట్టే.. ఈ విషయం గురించి నేను ఒత్తిడి చేస్తున్నాను. ప్రాణం పోతే తిరిగిరాదు. పండగ పోతే తిరిగి వస్తుంది. నేను చెప్పాల్సింది మీకు చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం అంటూ డాక్టర్ ఫోన్ పెట్టేసింది. ఆ తర్వాత అప్పు, కల్యాణ్ బాధపడ్డారు. అక్కను చూస్తూ ఈ విషయం చెప్పడం నా వల్ల కాదు అని అప్పు అంటే.. ఏ రోజైనా ఈ విషయం అక్కకు చెప్పాల్సిందే కదా అంటే.. నా మనసు చంపుకొని ఈ విషయం చెప్పలేను అని అప్పు బాధను వెళ్లగక్కింది. అయితే నేనే చెప్పేస్తాను. ఎవరో ఒకరు చెప్పకపోతే మోసం చేసిన వాళ్లం అవుతాం. కాబట్టి వెళ్లి మనం ఈ విషయం చెబుదాం అని అప్పును తీసుకొని కల్యాణ్ కావ్య వద్దకు వెళ్లాడు.

రేవతి ఇంట్లోకి వచ్చిన విషయంతో అందరు హ్యాపీగా ఉన్నారు. కానీ రుద్రాణి మాత్రం చాలా బాధగా ఉంది. రుద్రాణి తీరును అందరూ తప్పు పడుతుంటే.. మనవడు స్వరాజ్ మాట్లాడుతూ.. రుద్రాణి ఇక నుంచి రుబ్బు రోల్ అంటీ కాదు.. అబద్దాల ఆంటీ అంటే.. అందరూ కలిసి రుద్రాణిని ఆటపట్టించారు. స్వరాజ్‌ను అందరూ ప్రేమగా చూస్తూ ఆనందంలో మునిగిపోయారు. స్వరాజ్‌ను ప్రేమగా చూస్తుంటే.. రేపు కొడుకు, కూతురు పుడితే.. ఎలా చూసుకొంటావో అని నానమ్మ అంటే.. నా ప్రాణం కంటే గొప్పగా చూసుకొంటాను. నాకు కచ్చితంగా కూతురే పుడుతుంది. కచ్చితంగా అమ్మాయే పుడుతుంది. ఇన్ని రోజుల తర్వాత కళావతి నాకు ఇవ్వబోతున్న బహుమతి. అలాంటి కూతుర్ని మహారాణిగా చూసుకొంటాను. కావ్య, నా కూతురు కాళ్లను కింద పెట్టకుండా చూసుకొంటాను. వాళ్లిదరి సంతోషం కోసం ఏదైనా చేస్తాను అని రాజ్ అన్నాడు. ఆ సమయంలో అప్పు, కల్యాణ్ అక్కడికి వచ్చారు. రాజ్, కుటుంబ సభ్యులు మాట్లాడుకొంటున్న తీరు చూసి ఎమోషనల్ అయ్యారు.

అప్పు రావడంతో కావ్య సంతోషపడి.. పుట్టబోయే బిడ్డ గురించి రాజ్ పడుతున్న ఆనందం గురించి మాట్లాడుతూ.. బావ అనుకొన్నట్టు నా కూతురు పుడుతారా? కొడుకు పుడుతాడా? చెప్పు అప్పు అని కావ్య అంటుంటే.. మౌనంగా ఉండిపోయింది. నాకు ఎవరు పుడుతారు అని కావ్య అడిగితే.. నీకు ఎవరు పుట్టరు అక్కా అంటూ బాంబు పేల్చింది. ఏంటి అప్పు.. ఎవరు పుట్టరేంటి అని రాజ్ ఆందోళనగా అడిగాడు. కడుపులో పెరుగుతున్న బిడ్డ పుడితే.. నీవు చనిపోతావు అని కావ్యకు అప్పు అసలు విషయం చెప్పింది. నీవు బతకాలి అంటే.. గర్బంలో నుంచి తీసేయాలి. నీవు బతకాలంటే.. బిడ్డను వదలుకోక తప్పదు. లేకపోతే ఇద్దరు చనిపోతారని డాక్లర్లు చెప్పారని అప్పు అంటే.. నేను వదులుకోను అని కావ్య సృహ తప్పి పడిపోయినట్టు అప్పు కల కన్నది. వెంటనే తన అక్క వద్దకు వచ్చి గట్టిగా కౌగిలించుకొని ఎమోషనల్ అయింది. అయితే వారిద్దరని చూసి.. రేవతిని ఇంటికి తీసుకొచ్చామని ఆనందంలో కంటతడి పెడుతుందని రాజ్ చెప్పాడు. అలా ఆనందంలో అందరూ మునిగిపోయారు.

కావ్యకు నిజం చెప్పలేకపోవడంపై అప్పును కల్యాణ్ ప్రశ్నిస్తూ.. ఏమైంది పొట్టి ఎందుకు నిజం చెప్పలేదు అని కల్యాణ్ అంటే.. నా వల్ల కావడం లేదు అని చెప్పింది. దాంతో ఎన్నాళ్లు నిజం చెప్పకుండా దాచి పెడుతాం. ఇలా దాచి పెడితే.. నిజం అబద్దం కాదు కదా? అని కల్యాణ్ అన్నాడు. దాంతో మంచి వాళ్లకే ఎందుకు ఈ పరీక్ష. ఎంతో మంది అనాథలు పెరుగుతున్నారు. అక్కకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతుంటే.. ఈ నిజాన్ని కావ్యకు చెప్పొద్దు.. వదినకు కాకుండా అన్నయ్యకు చెబుదాం అని కల్యాణ్ అంటే.. బావ ఈ నిజాన్ని విని తట్టుకోగలడా? పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కంటున్నాడు.. నిజాన్ని తట్టుకోలేడు అని అప్పు అంటే.. అన్నయ్యకు చెబితే.. తట్టుకోగలడు. ఈ రోజు ఏదో సమయం చూసి నిజం చెప్పేస్తాను. నీవు ధైర్యంగా ఉండు అని అప్పుకు సర్ది చెప్పాడు.

అన్నయ్యకు నిజం చెప్పాలని కల్యాణ్ వెళితే.. ఎదురుగా కొన్ని గిఫ్టు ప్యాక్స్ తీసుకొని వచ్చాడు. ఏంటది అంటే.. కొన్ని నెలల్లో మనకు పిల్లలు పుట్టబోతున్నారు కదా. అందుకే వారికి కొత్త బట్టలు తీసుకొచ్చాను. వాస్తవానికి నా బిడ్డకే తెచ్చుకొందామని అనుకొన్నాను. కానీ నీవు బాధపడుతావని నీ బిడ్డకు కూడా తీసుకొచ్చాను. కలర్ విషయం గొడవ పడకూడదని ఇద్దరికి ఒకే కలర్ తీసుకొచ్చాను అని రాజ్ అన్నాడు. దాంతో ఏందిరా కన్నీళ్లు పెట్టుకొంటున్నావు అని అంటే.. నీకు ఒక విషయం చెప్పాలి బయటకు వెళ్లి చెప్పుకొందాం అని రాజ్‌ను కల్యాణ్ బయటకు తీసుకెళ్లాడు.

ఇక తదుపరి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలో.. కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి గురించి రాజ్‌కు కల్యాణ్ వివరించే ప్రయత్నం చేశారు. డాక్టర్లు చెప్పిన విషయాన్ని చెబుతూ..గర్బంలో ఉన్న బిడ్డను తొమ్మిది నెలలు మోస్తే.. తల్లికి బిడ్డకు ఇద్దరికి ప్రమాదేమే. కాబట్టి గర్బాన్ని తీసేయాలి. ఆ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు. నేను ఆ విషయం చెప్పలేను అని కల్యాణ్ అంటే.. నువ్వే చెప్పాలి అని రాజ్ అన్నాడు. ఈ సమస్య వచ్చింది అప్పుకు కాదు.. కావ్యకు అంటూ కల్యాణ్ అసలు విషయం చెప్పడంతో రాజ్ షాక్ అయ్యాడు.

Brahmamudi Serial September 17th 2025 Episode 828 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X