Brahmamudi September 19th Episode: కావ్య కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైన రాజ్.. ఆస్తి కోసం రాహుల్ కొత్త కుట్ర

Photo Courtesy: JioHotstar

అన్నయ్య నీతో పర్సనల్‌గా మాట్లాడాలని రాజ్‌ని తీసుకుని కళ్యాణ్ బయటికి వెళ్లబోతుండగా కావ్య అడ్డుకుని ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. కళ్యాణ్ ఏదో మాట్లాడాలని అంటున్నాడని అందుకే బయటికి వెళ్తున్నామని చెబుతాడు రాజ్. అదేదో ఇక్కడే మాట్లాడుకోవచ్చు కదా అని కావ్య చెప్పగా.. చాలా ఇంపార్టెంట్ అని కళ్యాణ్ అంటాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి కారులో వెళ్తూ.. ఓ చోట ఆగుతారు. అప్పూ గర్భసంచికి ప్రాబ్లమ్ ఉందని, తను 9 నెలలు బిడ్డను మోయలేదని కళ్యాణ్ చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. తనను కాపాడాలంటే అబార్షన్ చేయించాల్సిందేనని, లేదంటే అప్పూ చనిపోతుందని ఏం చేయాలో అర్ధం కావడం లేదని చెబుతాడు కళ్యాణ్.

అప్పూని కాపాడాల్సిందేనని, ఆమెకు నిజం చెప్పాల్సిందేనని అంటాడు రాజ్. అయితే వదినకి నువ్వే చెప్పమని కళ్యాణ్ అనడంతో రాజ్‌కి అర్ధం కాదు. ప్రాబ్లమ్ అప్పూలో కాదని, వదినలో ఉందని కళ్యాణ్ చెప్పడంతో రాజ్ కుప్పకూలిపోతాడు. అన్నయ్యని ఓదార్చి కళ్యాణ్ ఇంటికి తీసుకెళ్తాడు. ఈ నిజాన్ని కావ్యకి ఎలా చెప్పాలో అర్ధం కాక దేవుడి దగ్గరికి వెళ్లి బాధపడతాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 19వ తేదీ ఎపిసోడ్ 830లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial September 19th 2025 Episode 830 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

బావగారికి నిజం చెప్పావా? ఏం అన్నారని కళ్యాణ్‌ని అడుగుతుంది అప్పూ. మనం నిజం చెప్పి తొందరపడ్డామేమోనని బాధపడతాడు కళ్యాణ్. ఏం జరగబోతుందో తెలియడం లేదని.. ఒకరికి కూతురు పుట్టబోతుందన్న ఆరాటం, మరొకరికి తల్లి కాబోతున్నానన్న సంతోషమని చెబుతాడు. మా అన్నయ్య కూతురు పుట్టబోతోందని చాలా ఆశపడ్డాడని, ఆ కూతురే పుట్టకూడదని చెప్పేసరికి తట్టుకోలేకపోతున్నాడని చెబుతాడు కళ్యాణ్. తను ప్రాణంగా చూసుకుంటున్న బిడ్డని తీసేయాలంటే ఏ తండ్రి మాత్రం తట్టుకోగలుగుతాడని ప్రశ్నిస్తాడు. కానీ వదినని కానీ, తన కడుపులోని బిడ్డను కానీ వదులుకోవడానికి అన్నయ్య ఇష్టపడటం లేదని చెబుతాడు కళ్యాణ్.

ఆ బిడ్డ వల్ల అక్క ప్రాణానికే ప్రమాదమని చెప్పలేదా? అని అప్పూ నిలదీస్తుంది. డాక్టర్‌ని కలిసి ఏ చిన్న అవకాశం ఉన్నా వదిలేయొద్దని అంటున్నాడని చెబుతాడు కళ్యాణ్. ఇలా ఆలస్యం చేస్తే రిస్క్ పెరుగుతుందని, అక్కకి ఎప్పుడు చెప్పాలి? తను ఎప్పుడు ఒప్పుకోవాలని అడుగుతుంది అప్పూ. ఒకవేళ మన అదృష్టం బాగుండి వదిన, బిడ్డ ఇద్దరూ దక్కే ఛాన్స్ ఉంటే మనకి అంతకంటే ఏం కావాలి చెప్పు అని అంటాడు కళ్యాణ్.

హాయిగా నిద్రపోతున్న కావ్యని చూస్తూ రాజ్‌ బాధపడతాడు. తల్లి ప్రేమను, బాధను ఎప్పటికీ అర్ధం చేసుకోలేమని.. కానీ నువ్వు చూపించిన ప్రేమకి, నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను సమాధానం చెప్పాలని అంటాడు రాజ్. డాక్టర్లు చెప్పినా, ఆ దేవుడే చెప్పినా నిన్ను, నీ కడుపులో బిడ్డని నేను కాపాడతానని చెబుతాడు. ఈ దారిలో నేను ఒంటరిగానే పోరాడాలి, ఒకవైపు భయంగా ఉన్నా.. మరోవైపు నీ ప్రేమే నాకు ధైర్యాన్ని ఇస్తుందని, అయినా చివరి క్షణం వరకు పోరాడతానని అంటాడు. ఆ విధి రాతను ఎదిరించే ప్రయత్నంలో నా ప్రాణం పోతున్నా సరే, నా బిడ్డను నీ చేతుల్లో పెట్టయినా సరే శ్వాసను వదులుతానని అంటాడు. నీకు, మన బిడ్డకు ఏ ప్రమాదం రానివ్వనని మాటిస్తాడు రాజ్.

రాజ్ అక్కడి నుంచి లేచి వెళ్తుండగా కావ్య తన చేతిని పట్టుకుని.. ఎక్కడికి వెళ్లిపోతున్నారు, నాతోనే ఉండండి అని నిద్రలో కలవరిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక గొడవ వల్ల నాకు దూరంగా వెళ్లిపోతూనే ఉన్నారని, ఇక నుంచి అలా వెళ్లిపోవద్దని, మన బిడ్డ పుట్టేవరకు నా దగ్గరే ఉండండి అని చెబుతుంది కావ్య. ఎప్పుడూ నీతోనే, నీ పక్కనే ఉంటానని మాటిస్తాడు రాజ్. ఉదయాన్నే రాహుల్, రుద్రాణిలు నిద్రలేచి కాఫీ తీసుకురమ్మని చెబుతారు. ఇంతలో అందరూ నిద్రలేచి కిందకి వస్తారు. కొత్తింట్లో నిద్ర పట్టిందా అని స్వరాజ్‌ను అపర్ణ అడగ్గా.. ఎందుకు పట్టదు ఇది కూడా నా ఇల్లేనని చెబుతాడు.

ఇంతలో రేవతి భర్త జగదీష్ రావడంతో అంతా షాక్ అవుతారు. ఇంట్లోకి రాకుండా జగదీష్ గుమ్మం దగ్గరే ఆలోచిస్తుండగా.. ఇంటి వరకు వచ్చి అక్కడే ఆగిపోయావేంటీ? లోపలికి రా అని ఇందిర ప్రశ్నిస్తుంది. ఎలా వస్తాడు? ఒకప్పుడు ఇదే ఇంటికి డ్రైవర్‌గా పనిచేశాడు కదా? ఇప్పుడు అల్లుడి హోదాలో ఇంటికి రావడం ఇబ్బందిగానే ఉంటుందని సూటిపోటి మాటలు అంటుంది రుద్రాణి. మనింటి బిడ్డను దొంగతనంగా పెళ్లి చేసుకున్నాడు కదా? మళ్లి ఎవరు? ఏమంటారోనని భయపడుతున్నాడని చెబుతుంది.

అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదని, నార్మల్‌గా అయితే ఈ ఇంట్లో అడుగుపెట్టే అర్హత నీకు లేదని.. కానీ మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావ్ కాబట్టి సిగ్గులేకుండా లోపలికి రావొచ్చని అంటుంది రుద్రాణి. ఆయన రేవతి గారిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి అల్లుడి హోదా తెచ్చుకున్నాడని, కానీ ఇక్కడ చాలా మంది అసలు ఏ అర్హత లేకుండానే ఈ ఇంటి మనిషినని చెప్పుకుని తిరుగుతున్నారని స్వప్న కౌంటర్ వేస్తుంది. ఇంటికొచ్చిన మనిషితో ఎలా మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి? అనేది తెలియదు నువ్వు అర్హతల గురించి మాట్లాడుతున్నావా అని ఫైర్ అవుతుంది ఇందిర.

ఆరోజు మీ ఇద్దరే.. రేవతి, జగదీష్‌లను ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని చెప్పారు.. అందుకే ఆ అబ్బాయి గుమ్మం దగ్గరే ఆగిపోయాడని చెబుతుంది ఇందిర. ఇప్పుడు మీ ఇద్దరు పిలిస్తేనే కానీ లోపలికి రాడని అంటుంది. దాంతో అపర్ణ, సుభాష్‌లు గుమ్మం దగ్గరికి వెళ్లి.. జరిగినదంతా ఓ పీడకలగా భావించి లోపలికి రమ్మని అంటుంది అపర్ణ. ఇప్పటికే మా వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారని చెబుతాడు సుభాష్. ఆ రోజు నేను చేసిన తప్పువల్ల ఇన్నేళ్లుగా మీ అమ్మాయిని మీకు దూరం చేశానని, తననే కాకుండా మిమ్మల్ని కూడా బాధపెట్టానని అందుకే లోపలికి రావడానికి ఇబ్బందిగా ఉందని అంటాడు జగదీష్.

ఒకప్పుడు నేనే మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాను, ఇప్పుడు నేనే రమ్మంటున్నానని సుభాష్ చెప్పడంతో అందరూ సంతోషిస్తారు. జగదీష్ అన్నయ్య కూడా వచ్చేశాడు కాబట్టి.. ఇక అందరం కలిసిపోయినట్లేనని అంటుంది కావ్య. మీ అన్నయ్య వచ్చింది ఇక్కడ ఉండటానికి కాదని, నన్ను తీసుకెళ్లడానికి అంటుంది రేవతి. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇక నుంచి మీరంతా ఇక్కడే ఉండాలని మీ అమ్మ చెప్పింది కదా అని ఇందిర అంటుంది. నువ్వింకా జరిగినది మరిచిపోలేదా? ఎందుకు వెళ్లిపోవాలని అనుకుంటున్నావ్ అని ప్రశ్నిస్తుంది అపర్ణ. ఆడపిల్ల అత్తారింటిలో ఉండటమే తనకు గౌరవమని చెబుతుంది రేవతి.

సెలవులకి, పండగలకి వస్తూనే పోతామని అంటుంది రేవతి. ఇప్పుడైనా అందరం కలిసే ఉందామని చెబుతాడు సుభాష్. నువ్వు ఇక్కడే ఉంటే ఆడపడుచుతో రోజూ గొడవలు పడొచ్చని అనుకున్నానని, కానీ నువ్వు వెళ్లిపోతున్నావని కావ్య సెటైర్లు వేస్తుంది. మా అమ్మ రాకపోయినా నేను లాక్కొస్తానని చెబుతాడు స్వరాజ్. వెళ్తూ వెళ్తూ కావ్య, స్వరాజ్‌లకి థ్యాంక్స్ చెబుతుంది రేవతి. అందరూ వెళ్లిపోయిన తర్వాత రుద్రాణి మీద కోప్పడతాడు రాహుల్. ఈ దుగ్గిరాల కుటుంబానికి నేనే వారసుడినని చెప్పావ్, అవన్నీ నువ్వే చెప్పి , నువ్వే ఆశలు కల్పించి నన్ను ఆకాశంలో కూర్చోబెట్టావని రగిలిపోతాడు.

చచ్చాడనుకున్న రాజ్ మళ్లి తిరిగొచ్చి, కావ్యని తల్లిని చేశాడు. ఎప్పటికీ రాదనుకున్న ఆ రేవతిని రాజ్ గాడు ఇంటికి తీసుకురావడమే కాకుండా అపర్ణ అత్తయ్యతో కలిపేశాడని, ఇలా వెళ్లిపోయిన వాళ్లంతా తిరిగి వచ్చేస్తే వాళ్ల వాటాలు వాళ్లు తీసుకుంటే మనకేం మిగులుతుందని నిలదీస్తాడు రాహుల్. నీ మీద ఉన్న నమ్మకం పోయిందని.. ఇక ఇంట్లో ఎవరూ నిన్ను నమ్మరని నాకు క్లారిటీ వచ్చేసిందని అంటాడు. నేను మంచివాడిగా నటించి ముందు అందరి చేత మార్కులు కొట్టేసి, తర్వాత ఆస్తులు కొట్టేస్తానని చెబుతాడు రాహుల్. సడెన్‌గా నమ్మితే నీ పెళ్లామే నమ్మదు, ఇక ఇంట్లో వాళ్లు నమ్ముతారా? అని రుద్రాణి ప్రశ్నిస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X