Brahmamudi September 1st Episode: కావ్యని కంటికి రెప్పలా కాపాడుతోన్న రాజ్.. రుద్రాణిలో అసూయ

Photo Courtesy: JioHotstar

ఎన్ని ప్లాన్లు వేసినా కావ్య మీద గెలవలేకపోవడం, రాజ్ దక్కకపోవడంతో యామిని రగిలిపోతూ ఇంట్లోని సామాగ్రిని పగులగొడుతుంది. దాంతో ఆమె తండ్రి రఘునందన్.. యామినిపై మండిపడతాడు. రాజ్- కావ్యలది ఎన్ని జన్మలైనా విడిపోని తాళి బంధమని, ఇకనైనా కొత్త జీవితం మొదలుపెట్టమని చెప్పి వెళ్లిపోతాడు. రాజ్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని, మరోసారి ఇలాంటి పరిస్ధితి వస్తే రోగిని కాపాడలేమని దుగ్గిరాల ఫ్యామిలీకి వార్నింగ్ ఇస్తాడు. రాజ్‌ను ఇంటికి తీసుకురాగా.. కావ్య ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతుంది.

కళావతి ఎందుకలా వెళ్లిపోయిందని రాజ్ అడుగుతాడు. కట్టుకున్న భర్తే నిందిస్తే ఏ భార్య అయినా అంతే ఏడుస్తుందని ధాన్యలక్ష్మీ చెబుతుంది. ఆ వెంటనే రాజ్‌కి జరిగిన యాక్సిడెంట్, గతం మరిచిపోవడం, కావ్యతో ప్రేమలో పడటం, ఆమె గర్భవతి అయిన విషయాలను చెబుతుంది అపర్ణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక సెప్టెంబర్ 1వ తేదీ ఎపిసోడ్ 814లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial September 1st 2025 Episode 814 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

ఎప్పుడు నీకు దగ్గరయ్యానో, ఎప్పుడు నీ ప్రేమలో పడిపోయానో తెలియకుండానే ఒక మాయలా నీ ప్రేమలో పడేశావని కావ్యతో అంటాడు రాజ్.అప్పుడు కూడా నేను ప్రేమిస్తున్నానే అనుకున్నానని, కానీ నీ మీద పొగరు చూపిస్తున్నానని గుర్తించలేకపోయానని అంటాడు. నీ ప్రేమ కంటే నా ప్రేమ గొప్పదని, ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా భార్యను గౌరవించాలని, నీ జీవితంలోకి రాబోతున్న భర్తను నేనే అని తెలియకపోయినా.. రెండు కుటుంబాలను కలపడం కోసం తలవంచుకుని తాళి కట్టించుకుని ఈ ఇంటికొచ్చి ఈ కుటుంబంలోని అందరి మనసుల్ని గెలిపించుకున్నావని మెచ్చుకుంటాడు రాజ్. నా కోపాన్ని భరించావ్.. నా మూర్ఖత్వాన్ని సహించావ్.

ఆఖరికి నేను చనిపోయానని కళ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా బతికే ఉన్నానని నమ్మి తిరిగి ఇంటికి తీసుకొచ్చేలా చేసి.. మళ్లీ నీ ప్రేమే గొప్పదని రుజువు చేశావని ప్రశంసిస్తాడు రాజ్. గతాన్ని మరిచిపోయి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎవరికి పుట్టాడని ఏ భర్త వేయకూడని నింద వేసినా కేవలం నా ప్రాణం కాపాడటం కోసం మౌనంగా భరించావని అంటాడు. నీ ఆత్మాభిమానాన్ని నా ప్రాణానికి పణంగా పెట్టేశావని.. కన్నతల్లే నేను నీ మీద వేసిన నిందల్ని భరించలేక నోరు జారి నిజం చెప్పేసినా నువ్వు మాత్రం మౌనంగా నిలబిడ్డావని అంటాడు. ఎందుకు ఇదంతా చేశావ్? నేను నీ కోసం ఏం చేయలేదు కదా అని అడుగుతాడు రాజ్. కొండతల్లి ప్రేమ ముందు నా ప్రేమ అణువంతా చిన్నదిగా మారిపోయిందని, నీ ముందు ఓడిపోయిందని చెబుతాడు. గతంలో నేను చేసిన తప్పుల్ని క్షమిస్తావా? తిరిగి అంతే ప్రేమను నాకు అందిస్తావా? అని రాజ్ అడగటంతో కావ్య ఏడుస్తూ భర్తను హత్తుకుంటుంది.

నువ్వు ఏం చేయమన్నా నేను చేస్తాను.. నువ్వు చేసిన దానికి నీ కాళ్లు పట్టుకోనా అని అడుగుతాడు. అది కూడా నీ ప్రేమ ముందు తక్కువగానే కనిపిస్తుందని, నీ కోసం ఏం చేయను అని ప్రశ్నిస్తాడు. మీకు నా మీద ఎంత కోపం వచ్చినా సరే నన్ను తిట్టండి, కొట్టండి అంతేకానీ నా నుంచి మాత్రం దూరంగా వెళ్లొద్దని నేను చచ్చిపోతానని అంటుంది కావ్య. రాజ్ గతం గుర్తుకు రావడంతో తమ పని అయిపోయిందని రుద్రాని రగిలిపోతుంటుంది. ఇంతలో రాహుల్ బొచ్చె తీసుకొచ్చి కొంచెం ముద్ద ఉంటే వేస్తావా అని అడుక్కుంటూ ఉంటాడు. ఇప్పుడే నాకు పిచ్చ క్లారిటీ వచ్చిందని, ఇంకొన్ని రోజులు ఆగామంటే ఇంట్లో వాళ్లు నీకో బొచ్చే నాకొ బొచ్చే ఇచ్చి ఏ గుడి మెట్ల మీదో అడుక్కోమని గెంటేస్తారని అప్పుడు ఇద్దరం కలిసి ఏం చెక్కా ఆడుక్కోవచ్చని అంటాడు.

మనకి అలాంటి పరిస్ధితి ఎందుకొస్తుంది? నువ్వు ఈ దుగ్గిరాల వారింటికి వారసుడివని.. వందల కోట్ల ఆస్తికి అధిపతివని, సుప్రీమ్‌వి నువ్వు అని అంటుంది రుద్రాణి. ఇలాంటి మాటలే చెప్పి నన్ను ఇలా తయారు చేశావని, చక్కగా ఏ ఆశలు, ఏ కోరికలు లేకుండా ప్రశాంతంగా ఉన్నవాడిని తీసుకొచ్చి ఈ ఇంటికి వారసుడిని చేస్తాను, కంపెనీకి ఎండీనీ చేస్తానని చెప్పావని మండిపడతాడు రాహుల్. కనీసం నన్ను క్లర్క్‌ని కూడా చేయలేకపోయావని, ఇప్పుడు ఏకంగా సుప్రీం అంటున్నావ్? కనీసం సూప్ కూడా తాగలేనని అంటాడు. దేనికైనా టైం రావాలని రుద్రాణి చెప్పగా.. ఎపిసోడ్ 1 నుంచి చూసుకుంటాను అన్నావ్, ఇప్పటికీ 800 ఎపిసోడ్స్ ఎగిరిపోయాయని అంటాడు రాహుల్. ఇన్ని రోజులు రాజ్ లేకపోతేనే ఏం చేయలేకపోయావని, ఇప్పుడు రాజ్‌కి గతం గుర్తొచ్చి ఇంటికి వచ్చాడని, కావ్య కడుపులో తన వారసుడు పెరుగుతున్నాడని సెలబ్రెట్ చేసుకుంటున్నాడని చెబుతాడు రాహుల్. కొద్దిరోజులు పోతే ఆ వారసుడు బయటికొస్తాడు, మనల్ని బయటికి గెంటేస్తాడని వార్నింగ్ ఇస్తాడు.

అప్పటి వరకు రానిస్తే నేను రుద్రాణిని ఎందుకవుతాను.. రాజ్ మళ్లీ ఇంటికొచ్చినా, తన భార్యను మళ్లీ గుర్తుపుట్టినా ఐ డోంట్ కేర్ అని అంటుంది. నిన్ను ఈ ఇంటికి వారసుడిని చేస్తాను.. చేసి చూపిస్తానని అంటాడు. అలా చేస్తే రాజ్ చూస్తూ ఊరుకుంటాడా అని అడుగుతాడు రాహుల్. అందుకే నిన్ను వారసుడిని చేయడానికి ముందే వాడిని ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తానని అంటుంది రుద్రాణి. మెట్లు ఎక్కబోతున్న కావ్యను ఆపిన రాజ్.. కొంచెమైనా బుద్ధి ఉందా, ప్రెగ్నెంట్‌గా ఉన్న నువ్వు ఇలా వెళ్లకూడదని చెప్పి కావ్యను ఎత్తుకుని పైకి తీసుకెళ్తాడు. నిన్ను మెట్లెక్కి కష్టపడకుండా పైకి తీసుకొచ్చాను చూశావా అని అంటాడు రాజ్. నేను రోజుకి 100 సార్లు కిందకి పైకి తిరుగుతానని.. ప్రతిసారి ఇలాగే ఎత్తుకొచ్చి దించుతారా అని అడుగుతుంది. ప్రతిసారి చేయడం కుదరదని అంటుంది కావ్య. మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే.. కిందకి పైకి వెళ్లకుండా ఏదైనా పర్మినెంట్ సొల్యూషన్ ఆలోచించమని అంటుంది.

ఇదంతా చూసిన కళ్యాణ్.. అప్పూలు ఎంతో సంతోషిస్తారు. మెట్లు ఎక్కబోతూ అప్పూ కూడా ఆగిపోతుంది. దీంతో నీకేమైంది? ఎందుకిలా ఆగిపోయావని అడుగుతాడు రాజ్. మా అక్కని బావగారు మెట్లు ఎక్కకూడదని ఎత్తుకుని పైకి తీసుకెళ్లారు అని అంటుంది అప్పూ. అది చూసి నువ్వు నాకు టెస్ట్ పెట్టావా అని మండిపడతాడు కళ్యాణ్. నీవన్నీ కోతలే తప్పించి, చేతలు లేవని అంటుంది అప్పూ. దీంతో చేసేదేం లేక అప్పూని ఎత్తుకుని పైకి తీసుకెళ్తాడు కళ్యాణ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X