Brahmamudi September 20th Episode: కావ్య హెల్త్‌పై డాక్టర్ షాకింగ్ న్యూస్.. రాహుల్ బుట్టలో పడ్డ స్వప్న

Photo Courtesy: JioHotstar

బావగారికి నిజం చెప్పావా? లేదా అని కళ్యాణ్‌ని అడుగుతుంది అప్పూ. చెప్పానని, కానీ అన్నయ్య డాక్టర్‌ని కలిసి ఏదైనా ఛాన్స్ ఉందేమో కనుక్కుంటానని చెప్పాడని అంటాడు కళ్యాణ్. మన అదృష్టం బాగుంటే వదినని, బిడ్డని కాపాడుకోవచ్చని చెబుతాడు కళ్యాణ్. ఉదయాన్నే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటూ ఉండగా.. రేవతి భర్త జగదీష్ ఇంటికి వస్తాడు. గతంలో జరిగిన అవమానం గుర్తొచ్చి గుమ్మం దగ్గరే ఆగిపోతాడు. ఇందిర సలహా మేరకు జగదీష్‌ని అల్లుడిగా అంగీకరించిన సుభాష్, అపర్ణలు అతనిని లోపలికి ఆహ్వానిస్తారు.

నేను ఇక వెళ్లొస్తానని, నా భర్త ఎక్కడుంటే అక్కడే ఉంటానని తల్లిదండ్రులకు చెప్పి బయల్దేరుతుంది రేవతి. ఇంట్లో వాళ్లంతా సంతోషంగా ఉండటంతో తట్టుకోలేకపోతాడు రాహుల్. వెంటనే తల్లి దగ్గరికి వచ్చి ఇన్నాళ్లు నువ్వు చేసిన పనులు మనకి కలిసి రాలేదని, ఇకపై నేను రంగంలోకి దిగుతానని చెబుతాడు. మంచివాడిగా నటించి మార్కులు కొట్టేసి, వాళ్ల ఆస్తుల్ని కూడా కొట్టేస్తానని అంటాడు రాహుల్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 20వ తేదీ ఎపిసోడ్ 831లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial September 20th 2025 Episode 831 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

కళ్యాణ్‌తో కలిసి డాక్టర్‌ను కలుస్తాడు రాజ్. నా బిడ్డను తీసేయకుండా, కాపాడటానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పమని అడుగుతాడు రాజ్. నాతో పెళ్లయిన దగ్గరి నుంచి అన్ని కష్టాలే పడిందని, కాదు.. నేనే పెట్టానని అంటాడు. తను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచే ఎంతో సంతోషంగా ఉందని ఇప్పుడు బిడ్డను చంపేస్తానంటే ఎలా అని బాధపడతాడు రాజ్. మీ బాధను నేను అర్ధం చేసుకోగలను, కానీ ఈ విషయంలో వేరే ఆప్షన్ లేదని అంటుంది డాక్టర్. కావ్య గర్భసంచి చాలా వీక్‌గా ఉందని తను ఎక్కువ రోజులు బిడ్డను క్యారీ చేస్తే తన ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తుంది. దాంతో రాజ్, కళ్యాణ్‌లు షాక్ అవుతారు.

ప్రతి ప్రాబ్లమ్‌కి ఏదో ఒక సొల్యూషన్ ఉన్నట్లే, దీనికి కూడా ఉంటుందని అంటాడు రాజ్. అబార్షన్ కాకుండా మరేదైనా పర్లేదని, అది ఎంత కష్టమైనదైనా పర్లేదని.. నాకు కళావతితో పాటు తన బిడ్డ కూడా కావాలని అడుగుతాడు. కళావతికి అబార్షన్ చేయడం తప్పించి వేరే ఆప్షన్ లేదని, అది కూడా ఇప్పుడే చేయాలని.. మీరు ఇలాగే డీలే చేస్తూ పోతే అబార్షన్ కూడా చేయలేమని కోప్పడుతుంది డాక్టర్. మీకే ఒక తండ్రి పడే బాధ అర్ధం కావడం లేదని, మనిషి చంద్ర మండలం మీదకి వెళ్తున్నాడని మీరు మాత్రం అప్‌డేట్ అవ్వరా అని రాజ్ మండిపడతాడు.

ఒక తల్లిని, బిడ్డని డెలివరి టైం వరకు కాపాడలేరా? నా బిడ్డను కాపాడటానికి ఆప్షన్ ఎందుకు లేవు? అని డాక్టర్‌ని నిలదీస్తాడు. ఆప్షన్స్ లేక కాదు.. మీకు నా బిడ్డను కాపాడటం చేతకావడం లేదని ఫైర్ అవుతాడు. మీ హాస్పిటల్ పేరు ఎక్కడ పోతుందోనని అబార్షన్ అనే రూట్‌ని వెతుక్కున్నారా? అని మండిపడతాడు. నా బిడ్డ బతకదని చెప్పడానికి మీరేం దేవుడు కాదని, మీరు డాక్టర్ చదివి పాసయ్యారా? లేక ఫేక్ సర్టిఫికెట్‌తో ఈ హాస్పిటల్‌ను రన్ చేస్తున్నారో అర్ధం కావడం లేదని నానామాటలు అంటాడు. అక్కడితో ఆగకుండా టేబుల్ మీదున్న వస్తువుల్ని విసిరికొడతాడు. ఈ భూగోళాన్ని జల్లెడ పట్టయినా సరే నా భార్యను, బిడ్డను కాపాడుకుంటానని చెబుతాడు రాజ్.

రాజ్ కోపంగా వెళ్లిపోవడంతో డాక్టర్‌కు కళ్యాణ్ సారీ చెబుతాడు. నేను ఆయన బాధను అర్ధం చేసుకుంటానని, కానీ కావ్య జాగ్రత్త అని అబార్షన్ త్వరగా చేయించమని చెబుతుంది డాక్టర్. మీ వదిన కడుపులోని బిడ్డను తీసేయకపోతే మీ వదిన బ్రతకదట, లేకపోతే ఎవరో ఒక్కరో బ్రతుకుతారట... అంత ఖచ్చితంగా చెప్పడానికి వాళ్లకి ఏమైనా బ్రహ్మంగారిలా కాలజ్ఞానం తెలుసా అని ఫైర్ అవుతాడు రాజ్. ఈ హాస్పిటల్ వేస్ట్ అని వాళ్లకి ఏం తెలియదని మండిపడతాడు. కళావతికి ఈ విషయం చెప్పి తనకు అబార్షన్ చేయించాలా? అని మండిపడతాడు రాజ్.

ఈ హాస్పిటల్ ఈ సిటీలోనే చాలా మంచి పేరున్న హాస్పిటల్ అని, డాక్టర్ కూడా బాగా తెలుసని.. ఏ ప్రాబ్లమ్ లేకపోతే ఎందుకలా చెబుతారని ప్రశ్నిస్తాడు కళ్యాణ్. నాకు తల్లి, బిడ్డ ఇద్దరూ కావాలి.. ఇంత ఆస్తి, పలుకుబడి పెట్టుకుని కూడా కళావతిని, తన కడుపులోని బిడ్డను కాపాడుకోలేనప్పుడు ఇదంతా ఎందుకు? అని నిలదీస్తాడు రాజ్. అవసరానికి పనికిరాని ఆస్తి, ఆపదలో ఆదుకోని పలుకుబడి ఉన్నా లేనట్లేనని నా కళావతిని, బిడ్డని నేను కాపాడుకుంటానని చెబుతాడు రాజ్. నీకు చాలా మంది తెలిసిన డాక్టర్స్ ఉన్నారు కదా వాళ్లందరికీ ఫోన్ చేయ్.. మన ఆస్తి మొత్తం పోయినా పర్లేదని, ఏ చిన్న అవకాశాన్ని వదలొద్దని అంటాడు రాజ్. నేను చాలా ప్రయత్నాలు చేశానని, ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడానని ఈ డాక్టర్ చెప్పిందే వాళ్లు కూడా చెప్పారని అంటాడు కళ్యాణ్.

మంచివాడిగా నటించి స్వప్నని తన బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేస్తాడు రాహుల్. పొద్దున్నే పని చేసి వచ్చానని, షాపులో మూటలు మొస్తే 1000 రూపాయలు ఇస్తానని చెప్పాడంతో పనిచేసి వచ్చానని అంటాడు రాహుల్. కూలీ డబ్బుల్ని స్వప్న చేతుల్లో పెడతాడు. నువ్వేంటీ పని చేయడం ఏంటీ? నాకు నమ్మబుద్ధి కావడం లేదని అంటుంది స్వప్న. ఇన్ని రోజులు వీటి విలువ తెలియలేదు అందుకే కష్టపడలేదు, ఇప్పుడు కష్టపడ్డానని విలువ తెలిసింది, అందుకే నీ చేతుల్లో పెట్టానని అంటాడు రాహుల్. మొదటిసారి ఒక భర్తగా నీకు గౌరవం ఇవ్వాలని అనిపిస్తుందని చెబుతుంది స్వప్న. తన ప్లాన్ వర్కవుట్ అయినందుకు రాహుల్ చాలా సంతోషిస్తాడు. నాలో ఈ మార్పుకు కారణం నా కూతురని, ఆరోజు నా కూతురి బర్త్ డేకి ఒక చిన్న డ్రెస్ కూడా కొనలేకపోయానని బాధపడినట్లుగా నటిస్తాడు.

ఎంత చెబుతున్నా కళ్యాణ్ వినకపోవడంతో రాజ్ తనకు తెలిసిన డాక్టర్‌కి ఫోన్ చేసి విషయం చెబుతాడు. ఆ రిపోర్ట్స్ నాకు పెడితే కనుక్కుని కాల్ చేస్తానని చెప్పడంతో అతనికి వాట్సాప్ చేస్తాడు రాజ్. తప్పకుండా ఏదో ఒక మార్గం ఉంటుందని, ఆ దేవుడు నీకు అన్యాయం చేయడని అంటాడు రాజ్. అసలు దేవుడే లేడని, మనం ప్రతి వినాయక చవితికి వినాయకుడి కథ వింటాం కదా? శివుడు వినాయకుడిని చంపేసి, మళ్లి బతికిస్తాడని విన్నాం కదా అది కూడా అబద్ధమేనని అంటాడు. తన బిడ్డను కాపాడినట్లే నా బిడ్డను కూడా కాపాడొచ్చు కదా అని చెబుతాడు రాజ్. ఇంతలో రాజ్‌కి తన డాక్టర్ ఫ్రెండ్ ఫోన్ చేసి కావ్య వదిన బిడ్డను మోయకూడదని, అలాగే బిడ్డను మోస్తే ఇద్దరినీ కాపాడుకోలేమని చెప్పడంతో రాజ్ కోపంతో ఊగిపోతాడు.

రాజ్ ఆఫీస్‌కి వెళ్లకపోవడంతో సుభాష్ మేనేజర్‌కి కాల్ చేసి చెబుతాడు. ఇంతలో డల్‌గా ఇంటికి వచ్చిన రాజ్‌ని చూసి ఆఫీస్‌కి ఎందుకు వెళ్లడం లేదని అపర్ణ, సుభాష్‌లు నిలదీస్తారు. ఉదయం నుంచి ఆఫీస్ వాళ్లు కాల్ చేస్తున్నారని, నిన్ను అర్జెంట్‌గా ఇంటికి రమ్మంటున్నారని చెబుతాడు. ఎంత చెబుతున్నా వినిపించుకోకపోవడంతో రాజ్‌పై కోప్పడతాడు సుభాష్. నాకు ఇప్పుడు మూడ్ లేదు, నన్ను వదిలేయండి అని అంటాడు రాజ్. ఏంటీ వదిలేసేది వందల కోట్ల ప్రాజెక్ట్ అని, చాలా డబ్బులు లాస్ అవుతామని అంత నిర్లక్ష్యంగా ఎందుకు మాట్లాడుతున్నావని మండిపడతాడు సుభాష్.

ఒకసారి చెబితే మీకు అర్ధం కావడం లేదా అని తండ్రి మీద ఫైర్ అవుతాడు రాజ్. నాకు ఇప్పుడు వెళ్లే మూడ్ లేదంటే వినిపించుకోరా అని మండిపడతాడు. కంపెనీకి లాస్ వస్తే ఏమవుతుంది? మహా అయితే కంపెనీని మూసేస్తాం.. దానికే ఏదో కొంపలు అంటుకుంటున్నట్లు అంత రచ్చ చేస్తారేంటీ? అని అంటాడు రాజ్. కంపెనీ మూసేస్తే దానినే నమ్ముకుని ఉన్న ఉద్యోగులు రోడ్డున పడతారని అంటుంది ఇందిర. పడితే పడనీవ్వండి మనకేంటీ? వాళ్లేమైనా మనకోసం ఫ్రీగా సేవలు చేస్తున్నారా? ఉద్యోగమే చేస్తున్నారని చెబుతాడు రాజ్. అక్కడ అంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండగా.. నేను వెళ్తేనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? అని ఫైర్ అవుతాడు. నేను గతం మరిచిపోయినప్పుడు కంపెనీని బాగానే నడిపించారు కదా? మరి ఇప్పుడేమైందని ప్రశ్నిస్తాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X