Brahmamudi September 23rd Episode: బిడ్డను చంపాలనుకుంటున్న రాజ్.. కావ్య కోసం కఠిన నిర్ణయం
Photo Courtesy: JioHotstar
మీకు డబ్బు పిచ్చి పట్టిందని సుభాష్‌ని నానామాటలు అంటాడు రాజ్. ఎప్పుడూ తండ్రిని వెనకేసుకొచ్చే రాజ్.. ఇలాంటి మాటలు మాట్లాడటంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. రుద్రాణి అయితే ఈ అవకాశాన్నికూడా వాడుకోవాలని అనుకుంటుంది. దాంతో ఎప్పుడూ ఎవరో ఒకరి మధ్య పుల్లలు పెడుతూ ఉంటావా? అంటూ మండిపడుతుంది ఇందిర. రాజ్ కోపానికి కారణం ఏంటీ? ఏం జరిగిందని అందరూ కళ్యాణ్‌ని అడుగుతారు. ఇద్దరం కలిసి ఓ చోటికి వెళ్లామని, అక్కడ అన్నయ్యకి ఓ ఫోన్ వచ్చిందని.. అది మాట్లాడినప్పటి నుంచి అన్నయ్య ఇలా అయిపోయాడని చెబుతాడు కళ్యాణ్.
కావ్యని, తన కడుపులోని బిడ్డను కాపాడుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా అని డాక్టర్‌ని అడుగుతాడు రాజ్. ఆమె కూడా లేదని చెప్పడంతో కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో కావ్య వచ్చి నాకు అంతా తెలిసిపోయింది, కవిగారు మొత్తం చెప్పేశారని అనడంతో రాజ్ షాక్ అవుతాడు. మీరు కారణం లేకుండా మావయ్య గారిని నానామాటలు అన్నారని, ముందు ఆయనకి క్షమాపణలు చెప్పాలని కావ్య అంటుంది. కొడుకు మాటలతో సుభాష్ బాధపడుతుండగా అపర్ణ వచ్చి ఓదారుస్తుంది. తనను క్షమించాలని రాజ్ తండ్రి కాళ్లపై పడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 23వ తేదీ ఎపిసోడ్ 833లో ఇంకా ఏం జరిగిందంటే?

హాస్పిటల్‌లో అబార్షన్ చేయించడానికి ప్రయత్నించాడంటూ ఓ వ్యక్తిపై రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. మరో ప్రాణాన్ని నిలబెడుతానని.. బిడ్డకు జన్మనిస్తానని చెబుతుంటే.. ఆర్థిక పరిస్థితి బాగాలేదని బాధపెట్టి.. ఆ బిడ్డను చంపే హక్కు నీకు ఎక్కడిది? బలవతంగా అబార్షన్‌కు ప్రయత్నిస్తావా? అంటూ ఆ వ్యక్తి కాలర్ పట్టుకొని కొట్టబోయాడు. దాంతో క్షమించండి సార్ అంటూ ఆ దంపతులు వేడుకొన్నారు. నిన్ను పోలీసులకు పట్టిస్తాను అంటూ ఫైర్ అయ్యాడు. అంతలోనే కల్యాణ్ వచ్చి.. ఏం చేస్తున్నావు అంటూ ఆపాడు. వీడు బిడ్డను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. బిడ్డను చంపాలని ప్రయత్నిస్తున్నాడు అంటూ.. నీవు బయటకు వెళ్లూ రాజ్‌ను అక్కడి నుంచి పంపించాడు. మీరు ఏమనుకోవద్దు. మా అన్నయ్య బిడ్డ చనిపోతుబోతున్నాడు. అందుకే ఆ కోపంలో అలా ప్రవర్తించాడు అని నచ్చజెప్పాడు. బిడ్డ వద్దని అనుకొనే అందర్నీ ఇలా కోపం చేస్తావా? ఓ సంఘం పెట్టి వారిని అడ్డుకొంటావా? అని కల్యాణ్ క్లాస్ పీకడంతో.. బిడ్డను వద్దనే మాట వినగానే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. నేను ఏం చేస్తున్నానో తెలుసుకోలేకపోయాను అంటూ రాజ్ బాధపడ్డాడు. అయితే నీది కోపం కాదు.. బాధ. వదినకు నీవు ఏం చేయలేకపోతున్నాననే బాధ. డాక్టర్ చెప్పినట్టు వదినకు అబార్షన్ చేయించు అని కల్యాణ్ అంటే.. ఏంటి? నా బిడ్డను నా చేతులతోనే చంపేయమని చెబున్నావా? ఆ పని చేయలేను. నాకు బిడ్డ కావాలి.. కావ్య కావాలి అంటూ రాజ్ అన్నాడు. దాంతో నాకు ఇద్దరు బతకాలనే ఆశ ఉంది. కానీ జరిగే అవకాశం లేదు.
ఒక దారి మూసుకుపోతే.. మరో దారి తెరుచుకొంటుంది. దాని కోసం వెతుకుదాం అని రాజ్ అంటే.. అన్ని దారులు మూసుకుపోయాయి. అంతా అంధకారమే అని కల్యాణ్.. అంటే.. ఇప్పుడు ఏం చేద్దామని రాజ్ ప్రశ్నించాడు. దాంతో వదినకు అబార్షన్ చేయించడం తప్పా.. మరో ఆప్షన్ లేదు. ఇక చేయడానికి ఏం లేదు. నీవు బాగా ఆలోచించు. బాధగా ఉన్నా.. ఏదో ఒక నిర్ణయం తీసుకో అని కల్యాణ్ సలహా ఇచ్చాడు.
అయితే రాహుల్ అలా అడగడం చూసి.. అసలు నువ్వేనా? వరదలో బురద వచ్చినట్టు.. నీ బుర్రలో ఇంత ఇంటెలిజెన్స్ ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదు అని అంటే.. నువ్వేమీ చేయలేకపోతున్నావు. కాబట్టి నేను ఆలోచించాను. నువ్వు వద్దు.. నేను వెళ్లి రాజ్‌ను కన్విన్స్ చేస్తాను. ఎందుకంటే.. నిన్ను బ్యాడ్ ఎనర్జీగా చూస్తున్నారు. కాబట్టి నేను వెళ్తాను. నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తానని తల్లి రుద్రాణికి చెప్పి రాహుల్.. రాజ్ వద్దకు వెళ్లాడు. రాజ్‌ను కలిసి.. నీతో ఒక విషయం మాట్లాడాలి? అంటే.. దేని గురించి అని అడిగితే.. కంపెనీ గురించి, ఇంటి గురించి అని కల్యాణ్ అంటే.. నాకు ఆ మూడ్ లేదని రాజ్ అన్నాడు. వాటి గురించి నేను ఆలోచిస్తాను. నీవు ఒప్పుకొంటే.. ఆ బాధ్యతలు టెంపరరీగా నేను తీసుకొంటాను. నీవు ఏదో ప్రాబ్లెంలో ఉన్నావు కదా.. ఆ ప్రాబ్లెం సాల్వ్ అయ్యే వరకు నేను చూసుకొంటా అని రాహుల్ అన్నాడు.
దాంతో రాహుల్‌పై మండిపడుతూ.. కంపెనీ బాధ్యతలు అంటే.. చిన్నపిల్లాడికి చాక్లెట్ ఇచ్చాను. ఈ బిజినెస్‌లో పోటీ కంపెనీలకు ధీటుగా నిలబెట్టాను. ఇప్పుడు వచ్చి బాధ్యతలు ఇవ్వమని అడుగుతావా? కంపెనీ నడపాలంటే ప్రతిభ ఉండాలి అంటూ క్లాస్ పీకాడు. అంతలోనే రుద్రాణి వచ్చి.. నీవు కంపెనీ నడుపలేని స్థితిలో ఉన్నావు. రాహుల్ ఆ బాధ్యతలు చూసుకొంటాడు. నాకొడుకు అప్పిషియేట్ చేయకుండా తిడుతావా? ఆ కంపెనీలో నీకు ఎంత బాధ్యత ఉందో.. వాడికి అంతే బాధ్యతలు ఉన్నాయి. దుగ్గిరాల ఫ్యామిలీలో వాడు వారసుడే అని చెప్పింది. రాహుల్‌కు తెలివి తేటలు లేవు. కంపెనీ నడిపే క్వాలిటీస్ ఒక్కటి లేవు. కంపెనీ నడిపే బాధ్యతలు ఒక్కటి లేవు. యూజ్‌లెస్. ఒకసారి వాడు ఏం చేశాడో చూశాడు. మరోసారి ఆ ప్రయత్నం చేయలేం అని రాజ్ అన్నాడు. ఇంటెలిజెన్స్ లేదనే కారణం కాదు.. మీ నానమ్మకు నేను పుట్టలేదని, నాకు రక్త సంబంధం లేదన కదా.. కంపెనీ బాధ్యతలు కట్టబెట్టడం లేదు అని రుద్రాణి అంటే.. నోర్మూయ్ అంటూ తల్లి వచ్చి కోపడ్డింది. నీకు నాకు రక్త సంబంధం లేదనుకొంటావా? నాకు తల్లి, బిడ్డ అనే బంధం ఉంది కదా.. అదే లేదనుకొంటే.. ఎప్పుడో ఈ ఇంటిలో నుంచి బయటకు గెంటేసే దానిని. అయినా కూడా నా ఇంట్లో.. నాతోనే ఎందుకు ఉంచుకొంటున్నాను. బుద్ది లేకుంటే సరే.. పిచ్చిపిచ్చి వాగుడు వాగుతుంటావు. ఇక్కడ నుంచి వెళ్లు.. అని అరిచింది.
రాజ్‌తో నానమ్మ మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్లావు. నీ కోసం కావ్య ఎదురు చూస్తున్నది అంటూ రాజ్‌ను అక్కడి నుంచి పంపించింది. కల్యాణ్‌ను పిలిచి మీరు ఏదైనా దాస్తున్నారా? అని నిలదీసింది. అలాంటిదేమీ లేదు. నాకు నిద్ర వస్తున్నది. గుడ్ నైట్ అంటూ కల్యాణ్ అక్కడి నుంచి హడావిడిగా, కంగారుగా వెళ్లిపోయాడు. దాంతో ఏదో అనుమానం ఆమెను వెంటాడింది.
బాధతో కావ్య వద్దకు వెళ్లి గర్బంపై చేయిపెట్టి.. అమ్మ కడుపులో హాయిగా పడుకొన్నావా? ఏం జరిగినా నాన్న చూసుకొంటాడని అమ్మ చెప్పిన మాటలు నమ్మి హాయిగా పడుకొన్నావా?. కానీ నాన్న వచ్చింది.. నీ నమ్మకాన్ని వమ్ము చేయడానికి.. నీ ప్రాణాల తీయడానికి వచ్చిన నయవంచకుండు. నవమాసాలు ఎప్పుడు నిండుతాయి. ఈ చేతులతో ఎప్పుడు వెతుక్కొంటానని చూసిన నేను.. నిన్ను చంపడానికి వచ్చాను. నీ అమ్మకోసం నిన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నాను. మాలో స్వార్ధం నిండిపోయింది. మేము రాక్షసులం అయిపోయాం. లేకపోతే.. నీ ప్రాణం తీయాలని అనుకొంటాం. మీ అమ్మ ఎంత బాధపెట్టినా.. ప్రేమ చూపించి.. మొత్తం నాకే కావాలని అనుకొన్నాను. నీ తల్లికి ఎప్పుడూ ప్రేమ చూపించలేదు. అయినా నీ రూపంలో నాకు ప్రేమను పంచాలని అనుకొన్నది. కానీ ఆమెకు తెలియకుండానే అబార్షన్ చేయించాలని అనుకొంటున్నాను. ఈ విషయం తెలిస్తే.. ఎన్నటికి క్షమించదు. నాకు మీ అమ్మ కావాలి. ఈ పనికి నీవు క్షమిస్తావు కదూ అంటూ కడుపులో బిడ్డతో మాట్లాడుతూ తనలో తాను అనుకొన్నాడు. రాజ్ బాధపడుతుంటే.. ఎప్పుడు వచ్చావు.. నేను కడుపులో బిడ్డను సరిగా చూసుకొంటున్నానో లేదో..అని బిడ్డను అడుగుతున్నావు కదా.. మరో ఆర్నెళ్లు ఆగు.. నీ చేతిలో బిడ్డను పెడుతాను. బిడ్డ పుట్టినాక.. భార్యపై భర్తకు ప్రేమ తగ్గిపోతుంది. అయినా నీ బిడ్డపైనే ప్రేమను చూపించుకోండి. నా ప్రేమ మాత్రం నీపైనే. నా ప్రేమ అంతా మా ఆయనకే ఇస్తాను అంటూ రాజ్‌తో కావ్య అంది. ఇంకా పూర్తిగా ప్రాణం పోసుకొని బిడ్డపై ప్రేమను పెంచుకోవడం ఎందుకు అని రాజ్ అన్నాడు.
ఇక రేపటి ఎపిసోడ్ గురించి ప్రసారం చేసిన ప్రోమోలో.. నా వైఫ్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి ప్రాబ్లెం వచ్చిందంటే.. అబార్షన్‌కు అంగీకరించదు. బిడ్డను తొలగించడానికి ఒప్పుకోదు అని డాక్టర్‌తో రాజ్ అంటే.. ఒప్పుకోకపోతే.. ఒప్పించేలా చేయాలి. చెప్పకుండా ఎలా ఆపరేషన్ చేస్తాం అని డాక్టర్ అంటే.. ఆమెకు తెలియకుండానే ఆ ఆపరేషన్ జరిగిపోవాలి. కావాలంటే నీ కాళ్లు పట్టుకొంటాను అని రాజ్ అంటుండగా.. కావ్య ఆ గదిలోకి వచ్చి అంతా విన్నది. దాంతో రాజ్, డాక్టర్ షాక్ అయ్యారు. రేపటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయం కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.
Photo Courtesy: JioHotstar


Click it and Unblock the Notifications










